తెలుగు నిఘంటువు
1) పూర్ణ బిందు స్వరముతో ఇప్పుడు శోధన చేయవచ్చు. అంటే "శైశవం" అనే పదము లేకున్నా శోధించేటప్పుడు ఇలాంటి పదాలను నిఘంటువు "శైశవము" గా గుర్తించి ఆ పదము యొక్క అర్థాన్ని వెతికి తెస్తుంది.
2) Search Functionality : matching top 25 words will be displayed in auto complete text box.
3) If a match exists, first 100 results will be shown to the user.
_________________________________________________________________________________
నాలుగు నెలల క్రితం తెలుగు బ్లాగర్లు ఒక సమూహంగా చేరి మొదలు పెట్టిన తెలుగునిఘంటువు తొలిదశను ఈ రోజు live చేసాము అని చెప్పడానికి మా సమూహంలో ప్రతి ఒక్కరికి ఎంతో ఆనందంగా వుంది. ఈ ఆనందానికి కారణం మేమేదో ప్రపంచంలో అతిగొప్ప పనిని చేసామన్న భావనైతే ఏమాత్రం లేదు కానీ Active గా 5౦౦ మంది కూడా లేని తెలుగు బ్లాగర్లు ఒక చిన్న గ్రూప్ గా మారి ఈ దిన దినముండే ఒత్తిడిలను తట్టుకొని ఈ మహత్కార్య మొదటి దశను పూర్తిచేసారు అని చెప్పడానికి నిజంగా గర్వ పడుతున్నాను. ఈ నిఘంటువు రాబోయే కాలానికి, ఈ ప్రపంచానికి తెలుగు బ్లాగర్లు ఇచ్చే బహుమతిగా చిరస్థాయిగా నిలవాలని మా గుంపు ఆశ,ఆకాంక్ష. ఈ కార్య సాకార్యానికి కలిసి నడుస్తున్న ప్రతిఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ఆర్ధికం గా సహాయం చేసి మాకు అర్ధిక వెసలుబాటును కల్పించిన ప్రతి సహ బ్లాగర్లూ ఇందులో భాగస్వాములే.
ఈ నిఘంటువు మొదటిదశలో వుంది. చాలా పేజీలు ఇంకా నిర్మాణ దశలోనే వున్నాయి.కానీ నిఘంటువుకు కావలసిన శోధనా సౌకర్యము మాత్రం వుంది. ఇందులో ప్రస్తుతానికి సూర్యరాయాంధ్ర నిఘంటువు 8 వ సంపుటి లో అయినంత వరకూ పదాలను చూపిస్తున్నాము. ఇంకా ఈ ఎనిమిదవ సంపుటిలో దరిదాపు 60 పేజీలను టైపు చేయాల్సి వుంది.Data cleaning process is also going on. శోధన చేయగా వచ్చే ప్రతి పదమూ టైపు చేసిన బ్లాగరుతో అనుసంధానమై వుండి, వారి పేరు, వారి బ్లాగుపేరుని కూడా సూచిస్తుంది. స్వచ్చందంగా ముందుకు వచ్చి డిజిటలైజ్ చేసిన, చేస్తున్న వారికి గుర్తింపు నివ్వడానికి ఇంతకంటే మా వద్ద ఏమీ లేదు.
అలాగే ఈ నిఘంటువు సైటు ప్రచారానికి తోడ్పడగోరు సహ బ్లాగర్లు ప్రతి ఒక్కరూ వారి వారి బ్లాగుల్లో ఈ నిఘంటు లింకును చేర్చుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ సైట్ కు ఒక మంచి logo కూడా అవసరం. ఎవరైనా చేసి పంపితే ఈ నిఘంటువుకు సహాయపడిన వారవుతారు.
ఒక్క మాటలో చెప్పాలంటే.. this is a digital dictionary by the bloggers for the rest of the digital world.
తెలుగు నిఘంటువు
ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి అభినందనలు.
రిప్లయితొలగించండిBoss,
రిప్లయితొలగించండి****Don't use rippers... try helping if you can.***
I can do the same...right?
Thank you varudhini garu.
రిప్లయితొలగించండిమౌళి :
రిప్లయితొలగించండిశశాంకమౌళి (విశేష్యము)
సం.వి.ఇ.పుం.
* చంద్రశేఖరుఁడు, శివుఁడు
-----------------
హ్మ్ ..అద్భుత౦ గా ఉ౦ది ..
Mauli, Thanks for using it.
రిప్లయితొలగించండిభాస్కర్ గారు,
రిప్లయితొలగించండినా పేరు 2 అక్షరాల్లో 'మౌళి' అని శోధి౦చినా అర్ధ౦ పెద్దగా మారలేదు మీ నిఘ౦టువు ప్రకార౦..చాలా స౦తోష౦ :)
మౌళి, అసలు పేరు కాదు కాబట్టి Dictionary కూడా పెద్దగా పట్టించుకోలేదేమో లే :P
రిప్లయితొలగించండిYou need to wait for "ma" gunimta words.
రామిరెడ్డి గారు, మీకు మీ టీం కి అభినందనలు
రిప్లయితొలగించండిబాటసారి గారూ, మా టీం అందరి తరపున ధన్యవాదాలు
రిప్లయితొలగించండి