బ్లాగర్లు తలపెట్టిన తెలుగు నిఘంటువు ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి, భిన్నమైన రీతులలో శోధించి పాఠకులకు అందించడానికి తయారైంది.
ఇంతకు ముందు గుడ్డెద్దు చేలో పడినట్టు మనమొక పదము వ్రాస్తే దానికి సంబంధమైన అర్థాలను వెతికి తెచ్చి చూపించేది. కానీ ఈ నయా నిఘంటువు ఇప్పుడు చిన్నగా జోగాడడం నేర్చుకుంది.
ఈ క్రొత్త నిఘంటువులో వచ్చిన మార్పులు చేర్పులు క్లుప్తంగా !
౧) పదము, వాని అర్థాలతో పాటు, ఆ పదానికి వేరే భాషలో ఏమైనా సారూప్యత కలిగిన పదాలున్నాయేమో నని కూడా వెతికి తెస్తుంది. ఈ పదముల ద్వారా భాషల మధ్య నున్న అవినాభావ సంబంధాన్ని ఇట్టే పట్టేయవచ్చు.
ఈ ప్రోగ్రామ్ వ్రాస్తూ పరిశీలుస్తుంటే నాకు తట్టిన ఒక చిన్న విషయం కూడా ఇక్కడ. చాలా వరకూ మనిషికి కావాలసిన నిత్యావసర వస్తువులు, అనగా నిత్యమూ అవసరమయ్యే వర్తక సంబంధమైన మాటలు కన్నడ, తమిళ్, తెలుగు మూడు భాషల్లో బహు కొద్ది మార్పులతో లేదా ఒకే రకంగా కనిపించాయి. దీనర్థం ?? అబ్బో చెప్పాలంటే ఒక పేద్ద పుస్తకమే అవుతుందేమో కాబట్టి అర్థాలు, పరమార్థాలు మీ మీ ఊహలకే !
౨) పదము కు సంబంధించిన రూపాంతరాలనూ సూచిస్తుంది. వీటిద్వారా పద స్వరూపము ఏరకంగా మారుతూ వచ్చిందో కనుక్కోవచ్చు. చాలా పదాలకు పూర్వము పూర్ణ స్వరం వుండి పలుకుబడుల్లో లోపించిన పదాలు కోకొల్లలుగా కనిపించాయి. ఈ నిఘంటువు కొంచెము పాతది కాబట్టి నిండు సున్నలు పూర్వముండి వాడుకలో లోపించిన పదాలకు అరసున్నాలుంచడం మూలంగా చరిత్ర కొంతవరకూ తెలుస్తుంది. ఆ ఇప్పుడు వాడటం లేదు కదా అని వాళ్ళే నిఘంటువునుండి తీసేసి వుంటే ఈ మాత్రమైనా కూడా మనకు ఆ వివరాలు లభ్యమవ్వకపోవునేమో.
ఇలా అరసున్నా వున్న పదాలు చూస్తుంటే నా చిన్నప్పటికి, ఇప్పటికీ తేడా వచ్చిన కొన్ని పదాలు గుర్తుకొచ్చాయి. ఆ వివరాలు ఇవి. ముందుగా చిన్నప్పడు విరివిగా నేను విన్న పదాలను వ్రాసి ఇప్పుడు విరివిగా వింటున్న పదాలను కూడా ఇస్తాను
పండుకోపో ( చిన్నప్పుడు ) == పడుకోపో ( ఇప్పుడు ) ... రెండు పదాల అర్థాలు ఒకటే కదా? ఇలాంటి పదాలకు అరసున్న వాడుతాము. అంటే రాబోవు తరం పిల్లలు ఒకవేళ తెలుగు నేర్చుకొని చదివితే వాళ్ళు ఇలా చదువుకోవచ్చేమో పఁడుకోపో
ఇలాంటివి చాలానే వున్నాయి. మీరూ ఒకసారి చిన్నప్పటి రోజుల్లోకి వెళ్ళి చూడండి :-)
౩) అలాగే సాధ్యమైనన్ని చోట్ల వ్యుత్పత్తి ని కూడా సూచించడం జరిగింది
౪) శాస్త్ర విభాగాన్నీ , అంటే ఆ పదము ఏ శాస్త్రానికి సంబంధించిందో కూడా, వివరాలు వున్నచోట చూపిస్తున్నాము
ఇక అసలు, సిసలైన బహుళ శోధన లోకి వెళితే, రాను రానూ మిగిలిన తెలుగునిఘంటువు సైట్ మొత్తంలో ఏ మార్పులు లేకున్నా, ఈ పుట లో మాత్రము చాలానే పరిశోధనలు జరుగుతాయి. ఇక్కడ ప్రస్తుతానికి రెండు రకాల శోధనా సౌకర్యాలనుంచాను. ఓ సారి చూస్తే మీకే అర్థమవుతుంది.
చాలా సార్లు మనం ఏదైనా కవితో,కథనో లేదా వర్ణనో , లేదా పద్యమో వ్రాస్తున్నప్పుడు కొన్ని మంచి పదాలు చప్పున స్ఫురణకు రావు. వాటి పర్యాయ పదాలేమై వుంటాయబ్బా అని అప్పుడప్పుడైనా ఆలో చిస్తుంటాము కదా !. ఈ పేజి ముఖ్య వుద్దేశ్యము ఇలాంటి పర్యాయ పదాలను కనిపెట్టి చెప్పడమే.
ఇక్కడ search reverse లో జరుగుతుంది. అంటే, మనకు "శివుఁడు" అర్థమిచ్చే అన్ని పదాలూ కావాలనుకున్నప్పుడు dictionary hard copy ఐతే ఏంచేస్తాం? కూర్చొని రోజంతా వెతుకుతాం.లేదా పర్యాయపద నిఘంటువు అని మరో పుస్తకాన్ని కొనాల్సిన అవసరమూ రావచ్చు. కానీ ఇక్కడ మీకు కావలసిన అర్థాన్నిచ్చే "మాట" ను ఈ పేజి లో Textbox లో type చేసి Search చేయండి.
చేసారా? కావలసినన్ని పదాలు కదా :-). మరో మాట To avoid abusing search, only first 200 words will be shown on any search availble in telugunighantuvu.com.
ఈ search ఇంకా అరసున్న, "ము" కారము బదులు "పూర్ణ బిందువు" ను గుర్తించలేదు.
అంటే చక్రం, చక్రము ఒకటికాదు. అలాగే శివుఁడు, శివుడు ఒకటి కాదు. రాబోయే రోజుల్లో ఇవి చేరుస్తాను.
మీరు ఆ పేజీని , అదే బహుళశోధన పేజీని చూసి వుంటే ఇప్పటికే మరోటి మీ కంట్లో పడుండాలి కదా? అదే పద్యాల శోధన. కనిపించిందా? go and enjoy. here is the link
తెలుగు నిఘంటువు
సలహాలు ఇవ్వగోరు వారికి వ్యాఖ్యాన పెట్టంతా మీదే ;-)
రామ్ గారు,
రిప్లయితొలగించండిఇలాంటి వ్యాసం రాయాలంటే ఇంత వివరంగా చెప్పడం తెలీక ఊరుకున్నాను. ఇప్పటికి రాశారు. సంతోషం.
అన్నింటికన్నా నాకు బాగా నచ్చింది బహుళశోధన. అది డిజిటల్ నిఘంటువు యొక్క అసలైన ముఖ్యమైన ఉపయోగం ఇది.
అందుకోండి, అభినందనా సుమాలని.
[వ్యాఖ్యాన పెట్ట కాదు, పెట్టె, :)]
ఇన్స్క్రిప్ట్ పని చెయ్యటంలేదు
రిప్లయితొలగించండిమందాకిని గారు, వ్యాఖ్యాన పెట్టి కి బదులుగా వ్యాఖ్యాన పెట్ట అని వాడితే తప్పు కాని.. ఈ సందర్భంలో తప్పు లేదేమొ అని అనిపిస్తుంది నాకు.. 'వ్యాఖ్యాన పెట్టి అంతా' అని అనడానికి.. 'వ్యాఖ్యాన పెట్టంతా' అనే ప్యయోగం సరైనదే అని నా భిప్రాయం..
రిప్లయితొలగించండి>>>>>>>>మందాకిని గారూ, సెర్చ్ ఇంకా మొదటి దశ లోనే వుంది. మన దగ్గర పదాలు చేరే కొద్దీ improve చేస్తాను.
రిప్లయితొలగించండివ్యాఖ్యాన పెట్ట :-)
ఇలాంటి పదాల మీద ఒక భాషా పండితులిచ్చిన ఒక వ్యాసం నావద్ద వుంది. దాన్ని ఎప్పుడోఒకసారి వ్రాస్తాను చదువుకోండి :-)
>>>>>>>>>>>మునా గారూ, inscript support ఇప్పట్లో లేదు.
>>>>>>>>>>>జయశంకర్ గారూ, కరక్టే నండి. కాకపోతే ఇలాంటివి పలుకడానికి మనవద్ద అక్షరం లేదు. మందాకిని గారు సరదాగా వ్రాసినట్టున్నారు.
నిజంగా, మీరు రాసినంత విశదీకరించి రాయలేకే నేనూ పోస్ట్ పెట్టలేదు....చక్కగా అన్నీ విడమర్చి చెప్పారు...బావుంది.
రిప్లయితొలగించండివ్యాఖ్యకు, మీ పొగడ్త కు విడి విడిగా రెండు ధన్యవాదలు సౌమ్యా :)
రిప్లయితొలగించండి