ఈ మధ్య ఆంధ్రా అన్నా హజారే అవ్వాలని తెగ తాపత్రయంతో కనిపించిన బడిలోనల్లా దూరి నీతిమంతుడంటే నాలా వుండాలని మైకు విరగ్గొడుతున్న శ్రీ నారాచంద్రబాబు నాయుడు గారు ఎట్టకేలకూ తమ ఆస్థులను తమంతట తామే, స్వయంగా, ఎవరి ఒత్తిడులు లేకుండా నిజాయితీగా నిక్కచ్చిగా తను ఎంతగానే ప్రేమించే ప్రజల సాక్షిగా తను తృణపాయంగా ఎంచే ముఖ్యమంత్రి సీటు సాక్షిగా తన ఆస్థులను ఈనాడు వారికి వివరించారు.సారీ సారీ ఆంధ్రా ప్రజలకు వివరించారు. పేదవాడికి ప్రతిరూపమంటే నేనే, పేదలను ఎత్తుకొని సాకగలిగేది నేనే, ఆంధ్రాలో అవినీతి అధికారులను నిద్రకూడా పోనివ్వకుండా పనిచేయించగల నాయకుడిని నేనే నా లాంటి నాయకుడు దొరకడమ్ మీరు ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టం అని ఆయన చెప్పకపోయినా, తమంతట తామే ఆస్థులను వెల్లడించి ఎంతో మంది MLA లకు మార్గం చూపించిన వ్యక్తిగా గౌరవ దర్శకరత్న అవార్డు కూడా ఇవ్వవచ్చేమో. వారు తీసుకోవడానికి మొహమాటపడతారు.ఐనా మీలాంటి నాయకుడు మాకు దొరకడం మా అదృష్టం కాబట్టి మీకు తప్పక దర్శకరత్న అవార్డునిచ్చుకోవాలి. కాదంటారా?
మీలా నిజాయితీతో తమ ఆస్థులను ప్రకటించిన నాయకులెంతమంది చెప్పండి? తుదకు మీమామగారు కూడా మీలా ధైర్యంగా ఆస్థులను ప్రకటించలేక పోయారు. ఐనా మీ ఆస్థులన్నీ కలిపి వందకోట్లు కూడా లేవంటే నాకో దుర్బుద్ధి పుట్టింది. మా ఊర్లో దగ్గరున్న షాపుకెళ్ళి రోజూ ఒకకోటు కొనుక్కున్నా, ఓ వందరోజుల్లో మీకంటే ధనవంతుడినైపోతాను. అప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి నాకంటే బికారి అని చెప్పుకోవడానికి నాకెలాంటి సిగ్గువుండదు. మాజీ ముఖ్యమంత్రులు మీరే ఇంత బిచ్చగాళ్ళైనప్పుడు ఇక నాకు సిగ్గెందుకు చెప్పండి? అందుకే ముఖ్యమంత్రిగా మీరు సంపాయించినదేమీ లేదని ప్రఘాడంగా మీరు నమ్మి, మీకు ప్రజాక్షేమమే ముఖ్యమని మీరు చెప్పగా నమ్మిన వాళ్ళలో ప్రధముడిని నేను. కాబట్టి మీరే మా ఆంధ్రా అన్నా హజారే......
మీకు గుర్తుందోలేదో ఆ రోజుల్లో బాబుగారు "నేను కేవలం ఒక్కరూపాయిమాత్రమే వేతనంగా తీసుకుంటున్నాను" అనేవారు. ఆప్రకారం ఆ వందకోట్లుమాత్రం ఎలా వచ్చాయో మరి?
రిప్లయితొలగించండిఇండియన్ మినర్వా గారూ.. వారు నిజాయితీగానే చెప్పారు. వారి నిజాయితీ శంకించకూడదు. కాకపోతే మీకే అందులో ఆంతర్యం తెలియలేదేమో. వారు తీసుకుంటానన్న వేతనం రోజుకు ఒక బంగారు రూపయి మాత్రమే ( బరువెంతో మరి? ) :-).
రిప్లయితొలగించండి:-)
రిప్లయితొలగించండిlakshala kotlu dochukunna syamuel reddy ni,aa dora gaari biddadini evaru emi anaru...chandra babu emi chesinaa daani lo maatram adhikaara kankshe kanipistundi kadandi meeku......
రిప్లయితొలగించండి@రెండవ అజ్ఞాత గారు
రిప్లయితొలగించండిమనదగ్గర ఇదే ప్రాబ్లం అండి. బాబు గారిని అంటే రెడ్డి గారిని అనలేదంటారు. రెడ్డి గారిని అంటే బాబు గారిని అనలేదు అంటారు. అందరు దొంగలే అన్న విషయాన్ని మనం ఎప్పుడు గుర్తిస్తామో!!!!!
అడగకుండా చేసే ఆస్తుల ప్రకటన - అభాసుపాలే గువ్వల చెన్నా !
రిప్లయితొలగించండిమొదటి అజ్ఞాతా నవ్వినందుకు ధన్యవాదాలు :)
రిప్లయితొలగించండిరెండవ అజ్ఞాతా లక్షల కోట్లు దోచుకున్నారని ఎదురుదాడి చేసినంత మాత్రాన శ్రీ బాబు గారు నిక్కచ్చిగా చెప్పిన నిజాలు అసత్యాలైపోతాయా? అయినా ఈ మాత్రం దానికి అజ్ఞాత రూపమెందుకండీ?
రిప్లయితొలగించండి@mmd, that's the point. :-) అందుకే ఇక్కడ నేను బాబుగారి నిజాయితీకి పొంగిపోయి ప్రేమగా రాసుకున్నా
రిప్లయితొలగించండిలలిత గారూ, అడగకుండానే చెప్పిన నిజాయితీ ఆస్తి వివరాలవి. పోనీ మీరడిగి చూడండి ఏమైనా అసత్యాలు చెప్తారేమో :)
రిప్లయితొలగించండిఒకరి పై ఒకరు వేలెత్తి చూపడం కంటే, ముందు ఇలా ఆస్తులు ప్రకటించే వారిని అభినందించాలి, ఆధారాలు మన దగ్గర లేనందున ముందు జరిగిన అవినీతి ని పట్టుకోలేము. అలాగే ఇప్పటి నుంచి వారి అవనీతి సంపాదన మీద నిఘా ఉంచాలి. ఒక సారి సులభంగా డబ్బులు దోచుకోనడానికి అలవాటు పడ్డవారు దొరక్క పోతారా?
రిప్లయితొలగించండిaravam , వేళ్ళూ కాళ్ళూ ఏమీ లేవండీ, దొరికినోడినే కాదు దొరకనోడిని కూడా బొక్కలో ఏస్తే సగం దరిద్రమొదులొద్ది దేశానికి.
రిప్లయితొలగించండిపాలనలో లాగానే ఆస్థుల ప్రకటనలోనూ ఓ కొత్త ఒరవడి సృష్టించారు!!
రిప్లయితొలగించండిహ హ మురళీ నిజమే పాలనలో ఎంత పారదర్శకత్వమో...ప్రతి గంటా జనం కోసం పోరాటమే :-). అలాగే ఆస్థుల ప్రకటనలో కూడా పొరపాటున MLA లు ఎక్కడ అసత్య ఆస్థులు ప్రకటిస్తారోనని ముందుగానే సత్య శోధన చేసి ఆస్థులు ఎక్కడెక్కడివీ అన్నీ తవ్వి తీసి ప్రకటించి ఒక కొత్త వొరవడి తీసుకొచ్చారు.
రిప్లయితొలగించండి