ఎటు చూసినా 5 గడులు ఉండే ఆట తెలుసు. పైన చూపిన విధంగా లోపల కూడా X గుర్తు ఉంటే పచ్చీసు ఆట అంటారు. 9x9 ఇలాగే ఇంకొకటి ఉంటుంది. దాన్ని వాడుక భాషలో 'పెద్ద ఆట' అంటారు. పచ్చీసులో 4 కాయలు. పెద్ద ఆటలో 12 కాయలు. ఇక 5x5 తో పచ్చీసు మాదిరి గానే ఇంకో ఆట. దాని పేరు జిగ్గాట. కాకపోతే ఇందులో లోపలి గడులలో X గుర్తు గడులు ఉండవు. జూదగాళ్ళు అరుగుల మీద ఎక్కువగా ఆడే ఆట ఇదే.జిగ్గాట చింతపిక్కలతో ఆడతారు. అదే ఆడవాళ్లు అయితే పచ్చీసు గానీ, పెద్దాట గానీ గవ్వలతో ఆడతారు. 9x9 ఆటలో 4,4,2,2 గా కాయలను పంట వేయాలి. ముందు నాలుగు పిక్కలను బయటి నుంచి రెండో గడిలో(second outer layer) ఉన్న X గుర్తు గదిలోకి తెచ్చి బయట నుంచి next layer చుట్టూ తిప్పి పంట వేస్తారు. ఇలాగే ఇంకో 4,2,2 చేయాలి. ఎప్పుడో చిన్నప్పుడు ఆడాను ఈ ఆటను. లీలగా జ్ఞాపకం ఉంది. అదే జిగ్గాట ఐతే ఇప్పటికీ ఆడుతుంటాము పందేలు కాసి.
ఈ గడులఆటని మా చిన్నప్పుడు అమ్మమ్మ వూర్లో మధ్యాహ్నం బోజనాలు అయ్యాక పెద్దోళ్ళు ఆడుకునేవారు గవ్వలు చింత గింజలు సుద్దముక్క వాడేవారు పచ్చీసు ఆడుకుందామా అని మా అమ్మ పిన్నులు అనుకునేవారు . .అస్సలు ఆట అర్ధం అయ్యేదికాదు చుట్టుకూర్చుని చూస్తున్న మాకు వాళ్ళు సీరియస్ గా ఆడే సమయం లో ఒక్కసారే చెరిపేసి పారిపోయేదాన్ని నా వెనుక నా గ్యాంగ్ పరుగో అమ్మ వాళ్లకి దొరకకుండా ఇప్పటికి ఆ ఆట రూల్స్ తెలీదు .
చాలా సమయం తీసుకుంటుంది ఇంటు ఉన్న గళ్ళల్లో చంపుళ్ళు ఉండవు కుడి నుంచి ఎడమ వైపుకి వెళ్తూ ఉంటాయి మధ్య లో వృత్తం లాటి డి ఒకటి గీసారు కదా , దాని చుట్టూ ఉన్న ఎనిమిది గళ్ళల్లో నాలుగు నాలుగు పావులు చొప్పున కదులుతుంటాయి చస్తే నాలుగు కాయలు పుట్టు గళ్ళలోకి వస్తాయి ఈ ఆట మొత్తం ఆ నాలుగు పావులని చంపడం లో ఉంటుంది మజా సిరి సిరి మువ్వ గారు చెప్పినట్లు చిందర వందర చేస్తాం ఓడిపోతే
మహేక్, మేము కూడా ఈ ఆటను బారాకట్ట అనే అనేవాళ్ళము :-)
అజ్ఞాతా.. అష్టాచెమ్మ పేరు విన్నానుకానీ మా ఊరి వైపు ఆపేరు వాడేవారు కాదు
సిరిసిరిమువ్వగారూ, మీరు ఉన్నోళ్ళండి :)) అందుకు ఆడుకోవడానికి గవ్వలు దొరికాయి. మేము చింతపిక్కలు అరుగుకేసి రుద్ది తయారుచేసుకొని ఆడుకొనేవాళ్ళం. ఏంచక్కా నలుపుకు, తెలుపుకు తేడా సులభంగా కనిపిస్తుందికదా? పడింది "బారా" నా లేక ఒకటా :( ..సులభంగా తెలిసేది. కాకపోతే పందాలు పెట్టి ఆడేవాళ్ళం కాదు.
నా చిన్నప్పుడు మా బాపట్లలో మధ్యాహ్నం పూట వసారాలో పెద్దవాళ్ళంతా బారాకట్ట ని ఆడేవాళ్ళు. నేను పూర్తి ఆటని ఒక్క సారీ చూసిన జ్ఞాపకం లేదు. వసారాలో కింద కూర్చుని కాళ్ళు తిమ్మిరిఎక్కి లేచి వేల్లిపోఎదాన్ని. గెలిచినా వాళ్ళు మటుకు సినిమాకి తీసుకొని వెళ్ళేవారు. కానీ చాలా సేపు ఆడేవారు.
బారాకట్ట అని ఇంకే జిల్లాలోను అనరనుకుంటా, మీ ఊరు అడగవచ్చా భాస్కర్ గారు ? మా అవ్వ (అమ్మమ్మ) వాళ్ళు తిరుమల కి వెళ్ళినప్పుడు ఈ ఆట కోసమని గవ్వలు కొని తెచ్చుకునేవారు. మామూలుగా అయితే పాచికలు, అరగ దీసిన చింత గింజలు (భాస్కర్ గారు చెప్పినట్టు) తో ఆడుతారు.
రజనీకాంత్ అవును.... 7x7 ఆట బారకట్ట నే. 5x5 ఆట మావైపు ఎక్కడోకానీ ఆడేవాళ్ళు కాదు.
అప్పారావు .మీరు చెప్పిన నియమాల్లో సగమే మేము పాటించేవాళ్ళం. మా నియమాలు కొద్దిగా వేరేగా వున్నాయి.. ఆ రూల్స్ వీలైతే తరువాతి టపాలో. అలాగే ఏడుగళ్ళఆట అనేది నేను వినలేదు.
తొలకరి గారూ, ఆట ఆడకుండా ఎంత మజా కోల్పోయారో.... అసలు నలుగురు నాలుగువైపుల కూర్చొని ఆడుతుంటే ఇక ప్రపంచమే పట్టదు కదా.
నిన్న మీటపాలన్నీ చదివాను. మీరు పెంచిన జ్ఞాపకాల తోటలో కాసేపు ఆ విరిసీ విరియని పూల సువాసనల్లో ఎంతసేపు అక్కడే వున్నానో కూడా గుర్తులేదు. ఎన్నో కోల్పాయాము కదా.
Mahek, మాఊరేదని చాలా చిక్కు ప్రశ్నవేసారు :).. నిజంగా ఈ ప్రశ్నవేసినప్పుడు కాసేపు ఏమి చెప్పాలో అర్థం కాదు. సరే ఒక పేద్ద పేరా వ్రాసేస్తా అందులోనుంచి మా ఊరేదో మీరే చెప్పండి :))
మా ముత్తాత వాళ్ళది మైదుకూరు దగ్గర నెల్లూరుకొట్టాలు. అక్కడనుండి ఎందుకు వచ్చేసారో గానీ అప్పటి కర్నూలు/నెల్లూరు జిల్లాల సరిహద్దు గ్రామాల్లోకి చాలామంది వలసలు వచ్చేసారు. ఆరకంగా మేము ఇప్పటి ప్రకాశం జిల్లా జిల్లెళ్ళపాడు లో స్థిరపడ్డాము. మా జేజినాయన, నాయన,నేను ఈ ఊర్లోనే పుట్టాము. కానీ ఉద్యోగ రీత్యా మా నాయన మళ్ళీ అన్నలూరు ( మైదుకూరు ) లో చాలా కాలం పనిచేసారు. అప్పటిదాకా మాఊరు జిల్లెళ్ళపాడు నే. కానీ నేను ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చేస్తుండగా మా గ్రామం, చుట్టుపక్కల నాలుగైదు గ్రామల వాళ్ళు ( అంతా బంధువలనే వేరే చెప్పక్కర్లేదనుకుంటాను :-) ) అప్పటికే గాంధీనగరం లో రాళ్ళభూములు సాగులోనికి తెచ్చుకొని దివ్యంగా జీవిస్తున్నారు. మేమూ వాళ్ళదారిలో జిల్లెళ్ళపాడు వదిలేసి, గుంటూరు జిల్లా గాంధీనగర్ కు వచ్చేసాము. ఇక్కడ దరిదాపు పది సంవత్సరాలున్నాము. అప్పుడు మా ఊరు గాంధినగర్ అనుకున్నాను. కారణం జిల్లెళ్ళపాడు లో ఒక పదెకారాల పొలం తప్ప అప్పటికే ఇల్లు కూడా అమ్మేసాము.
ఆ తరువాత ఉద్యోగరీత్యా పూనా, ముంబాయి తిరుగి, ఛల్ , ఇవన్నీ మనకు పడవనుకొని హైదరాబాద్ లో స్థిరపడ్డాను. అంటే ఓ ఇల్లు కొనుక్కున్నాను. వైద్యావసరాలు బాగుంటాయని అమ్మను,నాయనని హైదరాబాద్ తీసుకువచ్చాము. మరి వీళ్ళు హైదరాబాద్ వస్తే గాంధీనగర్ లో ఎలా? అందుకని కొంతపొలము, ఇల్లు అమ్మేసాము.అప్పుడు మా ఊరు హైదరాబాద్ అనుకున్నాను.
కానీ ఎందుకో అమెరికా విద్యావిధానం చూసాక పిల్లల్ని అమెరికాలో చదివించాలని బుద్ధిపుట్టింది. ఫలితం నాయన ను అక్క వాళ్ళ వద్ద ఉంచి, పిల్లలు,భార్య, నేను అమెరికా వచ్చెసాము. హైదరాబాదు లో ఇల్లైతే ఉందికానీ అక్కడ ప్రస్తుతము నా అన్న వాళ్ళు ( అంటే చుట్టాలు కాదండి. మా కుటుంబం వాళ్ళు ) ఎవరూ లేరు. కాబట్టి ఇప్పుడు మా ఊరు న్యూయార్క్ అనుకోవాలి. కానీ అనుకోలేక పోతున్నాను :-)
భాస్కర్ గారు, ఇంతకీ మీ ఊరేదో తెలీలేదండి :) నాది కూడా ఇలాంటి సమస్యే :( అజ్ఞాత గారు...అవును , అనంతపురం లో కూడా అంటారు...మా అమ్మా వాళ్ళది కడప, నాన్నా వాళ్ళది అనంతపురం...కానీ అనంతపురం లో ఈ ఆట ఆడడం చూడలేదు నేను. మా అవ్వ (కడప) వాళ్ళు మాత్రం ఎండా కాలం సెలవుల్లో మేము పోయినప్పుడు ప్రతి రోజు మధ్యాహ్నం ఆడేవాళ్ళు. గవ్వలతో ఆడేటప్పుడు భలే మోసం చేసేవాళ్ళు :)
మేమీ ఆటని "బారాకట్ట" (కడప) అంటాము :) రూల్స్ కూడా తెలుసు.
రిప్లయితొలగించండిAsta chemma!
రిప్లయితొలగించండిసింపుల్గా గవ్వలాట. మా ఊళ్లల్లో ఇప్పటికీ ఆడుతుంటారండి. అబ్బో ఈ ఆటలో యుద్ధాలు..పల్నాటి యుద్ధాన్ని మరిపిస్తాయి.
రిప్లయితొలగించండిమా ఇంట్లో పిల్లల చిన్నప్పుడు బాగా ఆడేవాళ్ళం. ఓడిపోతేనా..అసలు ఓడిపోతే కదా! ఒకవేళ ఓడిపోతున్నామనుకుంటే పావుల్ని చిందరవందర చేసెయటమే:)
అష్టచమ్మ ఆట కదా. చిన్నప్పుడు చింత పిక్కలు అరగదీసుకుని ఆడేవాళ్ళం. దొరికితే గవ్వలతో ఆడేవాళ్ళం.
రిప్లయితొలగించండిఎటు చూసినా 5 గడులు ఉండే ఆట తెలుసు. పైన చూపిన విధంగా లోపల కూడా X గుర్తు ఉంటే పచ్చీసు ఆట అంటారు. 9x9 ఇలాగే ఇంకొకటి ఉంటుంది. దాన్ని వాడుక భాషలో 'పెద్ద ఆట' అంటారు. పచ్చీసులో 4 కాయలు. పెద్ద ఆటలో 12 కాయలు. ఇక 5x5 తో పచ్చీసు మాదిరి గానే ఇంకో ఆట. దాని పేరు జిగ్గాట. కాకపోతే ఇందులో లోపలి గడులలో X గుర్తు గడులు ఉండవు. జూదగాళ్ళు అరుగుల మీద ఎక్కువగా ఆడే ఆట ఇదే.జిగ్గాట చింతపిక్కలతో ఆడతారు. అదే ఆడవాళ్లు అయితే పచ్చీసు గానీ, పెద్దాట గానీ గవ్వలతో ఆడతారు. 9x9 ఆటలో 4,4,2,2 గా కాయలను పంట వేయాలి. ముందు నాలుగు పిక్కలను బయటి నుంచి రెండో గడిలో(second outer layer) ఉన్న X గుర్తు గదిలోకి తెచ్చి బయట నుంచి next layer చుట్టూ తిప్పి పంట వేస్తారు. ఇలాగే ఇంకో 4,2,2 చేయాలి. ఎప్పుడో చిన్నప్పుడు ఆడాను ఈ ఆటను. లీలగా జ్ఞాపకం ఉంది. అదే జిగ్గాట ఐతే ఇప్పటికీ ఆడుతుంటాము పందేలు కాసి.
రిప్లయితొలగించండిpedda Asta chemma!laeka gavvalaaTa!!
రిప్లయితొలగించండిఅష్టాచెమ్మ
రిప్లయితొలగించండిఇవన్నీ చిన్నప్పుడు బాగుంటాయి కానీ ప్రొఫెషన్‌లో స్థిరపడిన తరువాత టైమ్ చాలదు.
రిప్లయితొలగించండిఈ గడులఆటని మా చిన్నప్పుడు అమ్మమ్మ వూర్లో మధ్యాహ్నం బోజనాలు అయ్యాక పెద్దోళ్ళు ఆడుకునేవారు గవ్వలు చింత గింజలు సుద్దముక్క వాడేవారు పచ్చీసు ఆడుకుందామా అని మా అమ్మ పిన్నులు అనుకునేవారు . .అస్సలు ఆట అర్ధం అయ్యేదికాదు చుట్టుకూర్చుని చూస్తున్న మాకు వాళ్ళు సీరియస్ గా ఆడే సమయం లో ఒక్కసారే చెరిపేసి పారిపోయేదాన్ని నా వెనుక నా గ్యాంగ్ పరుగో అమ్మ వాళ్లకి దొరకకుండా ఇప్పటికి ఆ ఆట రూల్స్ తెలీదు .
రిప్లయితొలగించండి5*5 గదుల ఆటని అస్టాచెమ్మ అని, 7*7 గదుల ఆటని బారకష్ట అని అనే వాళ్ళం
రిప్లయితొలగించండిచాలా సమయం తీసుకుంటుంది
రిప్లయితొలగించండిఇంటు ఉన్న గళ్ళల్లో చంపుళ్ళు ఉండవు
కుడి నుంచి ఎడమ వైపుకి వెళ్తూ ఉంటాయి
మధ్య లో వృత్తం లాటి డి ఒకటి గీసారు కదా , దాని చుట్టూ ఉన్న ఎనిమిది గళ్ళల్లో నాలుగు నాలుగు పావులు చొప్పున కదులుతుంటాయి
చస్తే నాలుగు కాయలు పుట్టు గళ్ళలోకి వస్తాయి
ఈ ఆట మొత్తం ఆ నాలుగు పావులని చంపడం లో ఉంటుంది మజా
సిరి సిరి మువ్వ గారు చెప్పినట్లు చిందర వందర చేస్తాం ఓడిపోతే
ఏడు గళ్ళ ఆట అంటాం
రిప్లయితొలగించండిమహేక్, మేము కూడా ఈ ఆటను బారాకట్ట అనే అనేవాళ్ళము :-)
రిప్లయితొలగించండిఅజ్ఞాతా.. అష్టాచెమ్మ పేరు విన్నానుకానీ మా ఊరి వైపు ఆపేరు వాడేవారు కాదు
సిరిసిరిమువ్వగారూ, మీరు ఉన్నోళ్ళండి :)) అందుకు ఆడుకోవడానికి గవ్వలు దొరికాయి. మేము చింతపిక్కలు అరుగుకేసి రుద్ది తయారుచేసుకొని ఆడుకొనేవాళ్ళం. ఏంచక్కా నలుపుకు, తెలుపుకు తేడా సులభంగా కనిపిస్తుందికదా? పడింది "బారా" నా లేక ఒకటా :( ..సులభంగా తెలిసేది. కాకపోతే పందాలు పెట్టి ఆడేవాళ్ళం కాదు.
రమణ మీకు వివరంగా ఒక టపానేవ్రాస్తానుండండి :)
రిప్లయితొలగించండిమిగిలిన వ్యాఖ్యలు కూడా సాయంకాలం ఇంటికొచ్చాక వ్యాఖ్యానిస్తాను.
నా చిన్నప్పుడు మా బాపట్లలో మధ్యాహ్నం పూట వసారాలో పెద్దవాళ్ళంతా బారాకట్ట ని ఆడేవాళ్ళు. నేను పూర్తి ఆటని ఒక్క సారీ చూసిన జ్ఞాపకం లేదు. వసారాలో కింద కూర్చుని కాళ్ళు తిమ్మిరిఎక్కి లేచి వేల్లిపోఎదాన్ని. గెలిచినా వాళ్ళు మటుకు సినిమాకి తీసుకొని వెళ్ళేవారు. కానీ చాలా సేపు ఆడేవారు.
రిప్లయితొలగించండిబారాకట్ట అని ఇంకే జిల్లాలోను అనరనుకుంటా, మీ ఊరు అడగవచ్చా భాస్కర్ గారు ?
రిప్లయితొలగించండిమా అవ్వ (అమ్మమ్మ) వాళ్ళు తిరుమల కి వెళ్ళినప్పుడు ఈ ఆట కోసమని గవ్వలు కొని తెచ్చుకునేవారు. మామూలుగా అయితే పాచికలు, అరగ దీసిన చింత గింజలు (భాస్కర్ గారు చెప్పినట్టు) తో ఆడుతారు.
దీన్ని బారాకట్ట అనే మా అనంతపురంలో అంటారు.
రిప్లయితొలగించండిసునీతగారూ, మీరుకూడా అష్టాచెమ్మ అంటారా???
రిప్లయితొలగించండిఅజ్ఞాతా, మీ ఓటు అష్టాచెమ్మలో వేసేసాను :)
ప్రవీణ్.. బ్లాగు సమయాన్ని ఎలావాడాలో తెలిస్తే అన్నింటికీ టైమదే దొరుకొద్ది
చిన్ని.. ప్చ్..ఆడితేకదా మజా తెలిసేది... ఏంటి చెరిపేసి పారిపొయ్యేదానివా? పట్టుకోని ఎవరూ పీకలేదా :))
రిప్లయితొలగించండిరజనీకాంత్ అవును.... 7x7 ఆట బారకట్ట నే. 5x5 ఆట మావైపు ఎక్కడోకానీ ఆడేవాళ్ళు కాదు.
అప్పారావు .మీరు చెప్పిన నియమాల్లో సగమే మేము పాటించేవాళ్ళం. మా నియమాలు కొద్దిగా వేరేగా వున్నాయి.. ఆ రూల్స్ వీలైతే తరువాతి టపాలో. అలాగే ఏడుగళ్ళఆట అనేది నేను వినలేదు.
తొలకరి గారూ, ఆట ఆడకుండా ఎంత మజా కోల్పోయారో.... అసలు నలుగురు నాలుగువైపుల కూర్చొని ఆడుతుంటే ఇక ప్రపంచమే పట్టదు కదా.
రిప్లయితొలగించండినిన్న మీటపాలన్నీ చదివాను. మీరు పెంచిన జ్ఞాపకాల తోటలో కాసేపు ఆ విరిసీ విరియని పూల సువాసనల్లో ఎంతసేపు అక్కడే వున్నానో కూడా గుర్తులేదు. ఎన్నో కోల్పాయాము కదా.
Mahek, మాఊరేదని చాలా చిక్కు ప్రశ్నవేసారు :).. నిజంగా ఈ ప్రశ్నవేసినప్పుడు కాసేపు ఏమి చెప్పాలో అర్థం కాదు. సరే ఒక పేద్ద పేరా వ్రాసేస్తా అందులోనుంచి మా ఊరేదో మీరే చెప్పండి :))
రిప్లయితొలగించండిమా ముత్తాత వాళ్ళది మైదుకూరు దగ్గర నెల్లూరుకొట్టాలు. అక్కడనుండి ఎందుకు వచ్చేసారో గానీ అప్పటి కర్నూలు/నెల్లూరు జిల్లాల సరిహద్దు గ్రామాల్లోకి చాలామంది వలసలు వచ్చేసారు. ఆరకంగా మేము ఇప్పటి ప్రకాశం జిల్లా జిల్లెళ్ళపాడు లో స్థిరపడ్డాము. మా జేజినాయన, నాయన,నేను ఈ ఊర్లోనే పుట్టాము. కానీ ఉద్యోగ రీత్యా మా నాయన మళ్ళీ అన్నలూరు ( మైదుకూరు ) లో చాలా కాలం పనిచేసారు.
అప్పటిదాకా మాఊరు జిల్లెళ్ళపాడు నే. కానీ నేను ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చేస్తుండగా మా గ్రామం, చుట్టుపక్కల నాలుగైదు గ్రామల వాళ్ళు ( అంతా బంధువలనే వేరే చెప్పక్కర్లేదనుకుంటాను :-) ) అప్పటికే గాంధీనగరం లో రాళ్ళభూములు సాగులోనికి తెచ్చుకొని దివ్యంగా జీవిస్తున్నారు. మేమూ వాళ్ళదారిలో జిల్లెళ్ళపాడు వదిలేసి, గుంటూరు జిల్లా గాంధీనగర్ కు వచ్చేసాము. ఇక్కడ దరిదాపు పది సంవత్సరాలున్నాము. అప్పుడు మా ఊరు గాంధినగర్ అనుకున్నాను. కారణం జిల్లెళ్ళపాడు లో ఒక పదెకారాల పొలం తప్ప అప్పటికే ఇల్లు కూడా అమ్మేసాము.
ఉండండి. అప్పుడే అవలేదు. :-)
ఆ తరువాత ఉద్యోగరీత్యా పూనా, ముంబాయి తిరుగి, ఛల్ , ఇవన్నీ మనకు పడవనుకొని హైదరాబాద్ లో స్థిరపడ్డాను. అంటే ఓ ఇల్లు కొనుక్కున్నాను. వైద్యావసరాలు బాగుంటాయని అమ్మను,నాయనని హైదరాబాద్ తీసుకువచ్చాము. మరి వీళ్ళు హైదరాబాద్ వస్తే గాంధీనగర్ లో ఎలా? అందుకని కొంతపొలము, ఇల్లు అమ్మేసాము.అప్పుడు మా ఊరు హైదరాబాద్ అనుకున్నాను.
రిప్లయితొలగించండికానీ ఎందుకో అమెరికా విద్యావిధానం చూసాక పిల్లల్ని అమెరికాలో చదివించాలని బుద్ధిపుట్టింది. ఫలితం నాయన ను అక్క వాళ్ళ వద్ద ఉంచి, పిల్లలు,భార్య, నేను అమెరికా వచ్చెసాము. హైదరాబాదు లో ఇల్లైతే ఉందికానీ అక్కడ ప్రస్తుతము నా అన్న వాళ్ళు ( అంటే చుట్టాలు కాదండి. మా కుటుంబం వాళ్ళు ) ఎవరూ లేరు. కాబట్టి ఇప్పుడు మా ఊరు న్యూయార్క్ అనుకోవాలి. కానీ అనుకోలేక పోతున్నాను :-)
చివరి అజ్ఞాతా అవును బారాకట్ట అనే అంటాము
రిప్లయితొలగించండిభాస్కర్ గారు, ఇంతకీ మీ ఊరేదో తెలీలేదండి :) నాది కూడా ఇలాంటి సమస్యే :(
రిప్లయితొలగించండిఅజ్ఞాత గారు...అవును , అనంతపురం లో కూడా అంటారు...మా అమ్మా వాళ్ళది కడప, నాన్నా వాళ్ళది అనంతపురం...కానీ అనంతపురం లో ఈ ఆట ఆడడం చూడలేదు నేను. మా అవ్వ (కడప) వాళ్ళు మాత్రం ఎండా కాలం సెలవుల్లో మేము పోయినప్పుడు ప్రతి రోజు మధ్యాహ్నం ఆడేవాళ్ళు. గవ్వలతో ఆడేటప్పుడు భలే మోసం చేసేవాళ్ళు :)
మహేక్ గారూ, మా ఊరేదో నాకే తెలియడం లేదు :(. ఇక మీకు తెలియకపోవడంలో వింతేముందిలెండి :))
రిప్లయితొలగించండిబారగడి అంటారు. అది ఈ ఆటా న.
రిప్లయితొలగించండి