14, ఫిబ్రవరి 2012, మంగళవారం

అరవిచ్చిన ప్రభాత వేళలో....చెలి వెచ్చని పలుకులు



అరవిచ్చిన ప్రభాత వేళలో
చెలి వెచ్చని పలుకులు
పరువాల పసిడి కొమ్మనోట
మురిపాల ముద్దు పలుకులు

పలుకుపలుకొక శిశిర గానం
నవవసంత రసరాగ మధురం
వెలుగునీడల జీవన వనవాసం
ప్రణయ కలహ సామ్రాజ్యం

కాంతిరేఖల పార్శ్వాన దాగిన
అజరామర ప్రేమ కవితా ఝరి
నీ భావజ్యోతిలోన కలసి
నే కరిగి చిరుదీపమవ్వనా?
మందస్మిత బృందావనిలో
హరిత రేణువునై నిను చేరనా?


ప్రియా

సుమరాగ రంజితా
సుమన: సుమనమా
దీప్తకిరణ మయూఖ
అభినందన మాలయిదే!

6 కామెంట్‌లు:

  1. అమ్మో! ఈ పలుకులన్నీ ప్రేమసుమాలేనా?:-)

    రిప్లయితొలగించండి
  2. చాలా బాగుంది. బాగా స్పందించి వ్రాసినట్లు ఉన్నారు. భావానికి చకని పదాల అల్లిక సమకూరినది.

    రిప్లయితొలగించండి
  3. రెడ్డి సామ్రాజ్యాధిపతులు కదా! ఎక్కడైనా విహరించ గలరు.(వెన్నెల లాంటి చిరునవ్వు)

    రిప్లయితొలగించండి

Comment Form