రోజూ హాయిగా బాక్స్ పెడితే మధ్యాహ్నము ఆఫీసుకెళ్ళి బాక్స్ తీసేదాకా అందులో ఏముందో తెలిసేది కాదు. రోజుకొక వంటకంతో ఫుల్లుగా లాగించేసి మీటింగులు గట్రా వుంటే కాసేపు కునుకు కూడా తీసేవాడిని. కానీ ఈ మధ్య హోం మినిష్టర్ గారూ ఏదో పనుల్లో పడటం వల్ల ప్రొద్దున్నే బాక్స్ లో ఏదో కుక్కేస్తుంటే నేనేమో పొట్టలో కుక్కేసేవాడిని
ఉదాహరణకు
చపాతి
పూరి
పాస్టా
ఇడ్లీ
ఏదో ఇలాంటివయితే లొట్టలేసుకుంటూ తినేసి " అసలు రుచి పచి లేకుండా ఏంటా చెయ్యడమని " కాసింత బెట్టుకూడా చూపించొచ్చు
కానీ ఈ రోజు నాకు ఏదైతే నచ్చదో అదే బాక్సులో పెట్టింది. అదేనండీ గోధుమరవ్వ ఉప్మా ! .. బాక్స్ లో ఉన్నది ఉప్మా అని తెలియగానే చెత్తకుండీలో వేసి చెయ్యి కడిగేసుకొని హాయిగా హోటల్ కెళ్ళి ఫుల్లుగా లాగించేసా.
అన్నట్టు చాలా మంది ఋషులకున్నట్టు ఈ ఉప్మా కొక పూర్వాశ్రమ చరిత్ర కూడా వుందట కానీ అసలు నాకు నచ్చని ఒకే ఒక టిపినీ ఉప్మా అయ్యాక ఇక మళ్ళీ చరిత్ర అవసరమా?
ఉప్మా ఎవరి లిస్టులో అయినా లీస్టులోనే ఉంటుందండీ! మీకు బోల్డు మంది తోడు. పెసరట్టుతో పాటు బొంబాయి రవ్వ ఉప్మా....అదీ నెయ్యి,జీడిపప్పు, అల్లం,కరేపాకు బాగా ఎక్కువ వేసి చేసిందైతే ఓ మాదిరిగా...తినొచ్చు! పెసరట్టుంటేనే! లేకపోతే అది ఇంకా బోరు!
రిప్లయితొలగించండికానీ పాత కాలం పెళ్ళిళ్ళలో చేసే ఉప్మా మాత్రం, అందులో నూనె,కరివేపాకు తప్ప ఇంకేమీ లేకపోయినా ఏవిటో మహా రుచిగా ఉంటుంది.ఎంచేతో గానీ!
చాల మంచి పనిచేశారు.
రిప్లయితొలగించండిగోధుమ రవ్వ ఉప్మా అంటే గుర్తొచ్చింది.... నేను చిన్నప్పుడు హాస్టల్ లో ఉన్నప్పుడు వారానికి రెండు మూడు సార్లు ఈ ఉప్మా చేసేవారు...అందుకని ఈ ఉప్మాకి మేమంతా ముద్దుగా పెట్టుకున్న పేరు హాస్టల్ ఉప్మా. ఆ ఉప్మా చేసిన రోజు ఎవరూ మెస్ కి వెళ్ళేవారు కాదు... అందరూ మా హాస్టల్ పక్కనే ఉన్న సుబ్బారావు హోటల్ లో ఇడ్లీ లేక దోస లాగించేవారు....!!!
రిప్లయితొలగించండిసుజాత గారూ, ప్చ్.... లాభంలేదు.
రిప్లయితొలగించండిమీ లిస్టులో లీస్ట్ ఐనా మీకు అప్పుడప్పుడైనా చెయ్యక తప్పదేమో. కానీ నాకా శ్రమలేదు.
వినయ్ రెడ్డి, అవును. నచ్చనిది తినలేము కదా.
రిప్లయితొలగించండిసుబ్బారెడ్డి, వారంలో మూడుసార్లు ఉప్మానా :-౦?? నీ అనుభవం బాగుంది.
రిప్లయితొలగించండిలోకం లో ఉప్మా, కిచడీ నచ్చని వారు వుంటారా !
రిప్లయితొలగించండిమరీ చోద్యమే !!
జిలేబి.
LOL :)
రిప్లయితొలగించండిWhy cheers is missing?
BTW.... work on something useful to you and society.