15, జూన్ 2012, శుక్రవారం

ఎలక్షన్లలో గెలిసిటోళ్ళు.... YSR Congress Party కి ముందున్న సవాళ్ళు...




ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. దానితో పాటు మమత మరి కాస్త కారాన్ని నూరి వడ్డించింది. YSR party ఇచ్చే షాక్ తో పాటు మమత ప్రియంగా ఇచ్చే కారమూ కలిసి నషాళానికి అంటుకోవాలి. ఇక్కడ ఖచ్చితంగా ఒక విషయం స్పష్టంగా గుర్తు పెట్టుకోవాలి. మొన్న ఎలక్షన్ల ప్రచారంలో జాతీయ నాయకుడని చెప్పుకుంటున్న ఓ సీనియర్ కాంగ్రెస్ నేత జగన్ కాంగ్రెస్ లో వుంటే ఈ పాటికి CM చేసుండేవారమని వచ్చే అర్థంలో మాట్లాడారు. అది విన్న వాళ్ళకి రకరకాల అభిప్రాయాలు కలిగివుండవచ్చు కానీ నాకైతే ఒక రాష్ట్ర CM పదవి ఢిల్లీలో నిర్ణయించబడుతుందన్న విషయం ఎంత సోచనీయమనిపించింది. ఈ ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొనైనా ప్రాంతీయ పార్టీలకు తప్పక మద్దత్తు ఇవ్వాలనిపిస్తుంది. దేశంలో జాతీయ భావాన్ని పెంపొందించి, దేశము మొత్తాన్ని ఒక్క తాటిపై నడిపించడానికి కాంగ్రెస్ అన్న ఒక పార్టీ అవసరమైంది కానీ, రాష్ట్రాల అభివృద్ధికి ఈ జాతీయపార్టీ  సక్సస్ అయిన సందర్భాలు చాలా చాలా తక్కువ. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఐనా కేవలం తన స్వశక్తితో అయ్యాడేకానీ ఢీల్లీ నాయకులను, నాయకరాళ్ళను చూసి  ఓటువేసినట్లు నాకైతే అనిపించలేదు. నిజానికి రాజశేఖర రెడ్డి వల్ల కేంద్రంలో కాంగ్రెస్ కు లబ్ధిచేకూరిందేకానీ, కేంద్రంలో కాంగ్రెస్ వుండడం వల్ల రాజశేఖర రెడ్డి కి కలిగిన వుపయోగం శూన్యం. ఓ రకంగా చెప్పాలంటే 30 మందికి పైగా కాంగ్రెస్ MP లనిచ్చిన ఆంధ్రకు మొండి చెయ్యే మిగిలింది. అన్నింటికంటే బాధాకరమైన విషయమేమిటంటే కొద్ది సంవత్సరాల ముందు వరకూ రాష్ట్రపతి మాత్రమే రబ్బరు ష్టాంపు అనుకుంటూ వుండేవాడిని కానీ ఇప్పుడు సాక్షాత్తు ప్రధానమంత్రి పరిస్థితి కూడా ఇంతకుభిన్నంగా లేదు. దేశాన్ని ఏలే అధికారము రాష్ట్రపతి, ప్రధానమంత్రికి మాత్రమే వుండాలి కాని పార్టీలను నడిపే నాయకులకు/నాయకురాళ్ళకు కాదు. 


ఐనా ఎవరి వల్ల ఎవరు రాజ్యాధికారాన్ని, సుప్రీమ్ పవర్ ను అనుభవిస్తున్నారు? ఆంధ్ర రాష్ట్ర సరిహద్దులు కూడా సరిగ్గా తెలియని రాష్ట్రేతురులు ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ నాయకులకు, ప్రభుత్వానికి సలహా దార్లు. వినటానికి మంత్రులకు ఎలా వుంటుందోకానీ  సామాన్య మానవుడు నిజంగా సిగ్గుపడతాడు. ఈ సలహాదార్లవల్ల ప్రయోజనమేమిటో అడుగులకు మడుగులొత్తే మన నాయకులకే తెలియాలి. ఇంతటితో ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ శకం ముగియనున్నదేమో !!!


ఏ దేశానికైనా జాతీయత ముఖ్యం. ఈ జాతీయత ప్రాంతీయ పార్టీల వల్ల రాదు కానీ, జాతీయ పార్టీలైన కాంగ్రెస్ కానీ, భాజాపా కానీ, కమ్యూనిష్టు పార్టీలు కానీ ఎన్ని సందర్భాలలో దేశానికి సంబంధించిన అంశాలపై వేరే దేశాలలో తమ తమ అభిప్రాయాలను బలంగా వినిపించగలిగారు. రాష్ట్రపతి కానీ, ప్రధానమంత్రికానీ సంవత్సరానికొక్కసారైనా ప్రతిరాష్ట్రాన్ని సందర్శించ గలుగుతున్నారా? దేశ సమగ్రతకై  ఒక ప్రోగ్రామును , విధి విధానాలను సూత్రీకరించి అమలు చేసిన సందర్భమేదైనా, ఒక్కటంటే ఒక్కటన్నా వున్నదా? ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో అంతకంటే పెద్దదైన పార్లమెంటరీ వ్యవస్థలో వున్న మంత్రులు, అధికారులు, సంస్థలు కనీసం సగంరోజులు సక్రమంగా పనిచేస్తే ఎన్ని అద్భుతాలు కనిపిస్తాయో.... కాని అది కలలో కూడా జరగదని నిర్వీర్యమైన మన ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరునికి తెలుసు. తెలిసి ఏమీ చేయలేని పరిస్థితి. 


ఈ ఎలక్షన్లను ప్రజలు తమకివ్వబోతున్న ప్రసాదాన్ని  నైవేద్యంగా Y.S.R. పార్టీ స్వీకరించాలి. అలసత్వానికి గురై మరణశయ్యపైనున్న ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను ఓ గాటను పెట్టడానికి, జవసత్వాలనందించి ప్రజాస్వామ్య వ్యవస్థ కు జీవంపోయాలి. సామాన్యునికి నిత్యావసరాలైనందించే ప్రతి వ్యవస్థనూ ప్రక్షాళించి వేగంగా నాణ్యమైన సర్వీసును అందించగలగే ఏర్పాట్లపై వుద్యమించాలి. వాటిపై ప్రజలలో సరైన అవగాహన కల్పించి రాబోయే సార్వత్రిక ఎన్నికలలో తాము అధికారంలోకి వస్తే ఏరకంగా వాళ్ళజీవితాలు బాగుపడతాయో చాలా వివరంగా ప్రజలలోకి తీసికెళ్ళగలగాలి. 




 మనిషి బ్రతకడానికి కనీసావసరాలనందించే సంస్థలనైనా విచ్చలవిడి అవినీతికి దూరంగా వుంచి సామాన్యునికి ప్రభుత్వము పై నమ్మకాన్ని కల్పించాల్సిన అవసరం Y.S.R party తన భుజాలపైనెత్తుకొని ప్రచారాన్ని, అవగాహానను కల్పించవలసిన బాధ్యత ఎంతైనా వుంది. వున్న ప్రతి ప్రభుత్వవ్యవస్థను సూక్ష్మంగా పరిశీలించి దాని లోపాలను ఎత్తి చూపుతూ ప్రజలకు దగ్గరగా తీసుకువెళ్ళటానికి  Y.S.R party  ఏరకంగా "ప్రజలకోసం ప్రభుత్వమనే" భావాన్ని ప్రజల దగ్గరకు తీసుకువెళ్ళగలదనే అంశంపైనే సార్వత్రిక ఎన్నిక ఫలితాలు ఆధారపడి వుంటాయి. 


ఇప్పుడంటే వుపఎన్నికలు కాబట్టి, YSR party  అధికారంలో లేదుకాబట్టి వీళ్ళేమి చేస్తారో చెప్పకపోయినా సరిపోయింది. ఓ రకంగా చెప్పాలంటే ఇప్పటి ఎలక్షన్లు జరగడానికి కారణం నిజానికి Congress party, CBI.


  రానున్న సార్వత్రిక ఎన్నికకు ఇంకా సమయముంది కాబట్టి  ఈ సారి వై.యస్సా.ర్ ప్రజా సంక్షేమ పథకాలతోపాటు తాము ఏమి చెయ్యగలరో స్పష్టంగా చెప్పవలసిన బాధ్యత YSR party పైన వుంది. 

7 కామెంట్‌లు:

  1. sir! namaste. a good idia was given by you .

    thanks for the same.

    రిప్లయితొలగించండి
  2. కొద్ది సంవత్సరాల ముందు వరకూ రాష్ట్రపతి మాత్రమే రబ్బరు ష్టాంపు అనుకుంటూ వుండేవాడిని
    Sir ee comment koncham correct cheyelemo anukuntaa..
    Kalaam gari valla president post goravam perigindhi ani naa abipryaam
    yeekibhavistar ..?

    రిప్లయితొలగించండి
  3. కొద్ది సంవత్సరాల ముందు వరకూ రాష్ట్రపతి మాత్రమే రబ్బరు ష్టాంపు అనుకుంటూ వుండేవాడిని
    Sir ee comment koncham correct cheyelemo anukuntaa..
    Kalaam gari valla president post goravam perigindhi ani naa abiparyaam
    yeekibhavistaraa ..?

    రిప్లయితొలగించండి
  4. సుబ్బారావు గారు, వ్యాఖ్యకు ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  5. వంశీ గారూ, Dr APJ abdul kalam గారిని రాజకీయాలకు అతీతంగా చూడవలసిన వ్యక్తి. ఆయన ఏ పార్టీ తరపున పోటీ చేసినా ఓ పౌరునిగా నామద్దత్తు తప్పక వుంటుంది. అటువంటి వారు దేశానికి చాలా అవసరం కూడా.

    రిప్లయితొలగించండి

Comment Form