What a speech!!! Love the confidence and your vision of America Mr President Obama.
దేశము, దేశానికి నాయకత్వం, నాయకునికి వుండవలసిన ముందు చూపు, సామాన్య ప్రజలపట్ల మమకారం, విద్యార్థులు వాళ్ళ భవిత, అమెరికాకు కావలసిన సాంకేతిక విజ్ఞానాన్ని మళ్ళీ పట్టాలపైకెక్కించటం, భూమి పై పొల్యూషన్ పెరగకుండా చేయవలసిన బాధ్యత, కర్మాగారాల అవసరం, Export import policy, విదేశాంగ విధానం ఒక్కటేమిటి మీరు ప్రసంగించిన ప్రతి అంశం ప్రతిదేశానికి ఎంత అవసరమో కనీస జ్ఞాన మున్న ఏ పౌరునికైనా అర్థమవుతుంది.
ఈ ప్రసంగం విన్న తరువాత నాకు అనిపించిన నాలుగు వాక్యాలు.
భారతదేశంలో ఇలాంటి రాజకీయనాయకులు ఎందుకు పైకి రావడంలేదు? అసలు మన రాజకీయాలకు అమెరికా రాజకీయాలకు ఎందువల్ల ఇంత వ్యత్యాశం. మన ప్రజల ఆలోచనా సరళిలో వున్నదా లేక మన స్వార్థంలో వున్నదా? ముందు రాజకీయాలపట్ల విశ్వాసం సామాన్య మానవునికి ఎందువల్ల సన్నగిల్లింది? రాష్ట్రాలను ప్రక్కనపెట్టి దేశరాజకీయాలను చూసినా నాకెప్పుడూ ఇలాంటి వక్త ఓ బహిరంగ సభలో కనిపించలేదు. ఎంతసేపూ ఎదుటి వాడిపై బురద చల్లడం, కులాల వారిగా రిజర్వేషన్లు పెంచుతామని మభ్యపెట్టటం లేదా ప్రాంతీయ ద్వేషాగ్ని ని రగిలించడం లాంటి విశేషాలే కనిపించాయి కానీ ఎప్పుడైనా
మూతపడుతున్న చిన్న పరిశ్రమల గురించి కానీ, పెరుగుతున్న రోగాల గురించి కానీ, నాణ్యత లోపిస్తున్న విద్యా విధానాల గురించి కానీ, అరడుగు లోతున గుంతలపడ్డ రోడ్ల గురించికానీ, స్వయం సమృద్ధికి కావలసిన పాలసీల గురించి కానీ, విద్యుత్, మంచినీరు, ఆహార కొరత ఇలాంటి వాటిపై ఓ జాతీయ విధానాన్ని రూపొందించి ఎలా అమలు చేస్తారో కనీసం ముచ్చటించనైనా ముచ్చటించరు. ప్చ్
"Made in America" When I heard this sentence in Obama speech (while speaking on industry policy) , ప్రతి శ్రోత కి రోమాలు నిక్కపొడుచుకొని వుంటాయి. What a great feeling !!!. మన దేశంలో మనమెప్పుడైనా Made in India అనే పదాలకోసం వెతుకుతామా? నిజం చెప్పాలంటే దానిపైన " Made in USA" అని ముద్ర వుందా లేదా అని చూస్తాము. దానర్థం మనము నాణ్యతగల వస్తువులు ఉత్పత్తి చేయలేమనే కదా? what a shame !!!
ఇలా చెప్పుకుంటూ పోతే ఈనాటి ప్రసంగంలో ప్రతి వాక్యము కూడా ఓట్లు వేశే ప్రతి పౌరుడూ విని ఆలోచించుకోవలసిన ప్రసంగం. నాయకులు ఎలాగూ మారరు....కాదు కాదు వాళ్ళని మార్చే దివ్య మంత్రం ఓటరుదే.

yesterday bill clinton speech was also very motivating, any one listened to his speech definetly vote for Obama. I am waiting for mitt romney counter speech for these :-)
రిప్లయితొలగించండిNice post!! I loved his speech yesterday.
రిప్లయితొలగించండిమనకు దేశం గురించి ఆలోచించే రాజనీతిజ్ఞులు రావాలి .నైస్ పోస్ట్.
రిప్లయితొలగించండి