రాత్రి 11 గంటలు. నిద్రపోదామని పండుకోని కూడా " ఆ రేపు శనివారమే కదా అప్పుడే ఏమి పండుకొంటాములే" అనిపించి తలగీక్కోవడం మొదలు పెట్టాను. జిల పుట్టి కాదులేండి. ఏంచేయాలా అనుకుంటూ.....
ఈ మధ్య నాకు నా ఆన్లైన్ డైరీ మీద బొత్తిగా భయమూ భక్తీ తగ్గినట్టనిపిస్తుంది.దీని మొఖం చూడక కొన్ని సంవత్సరాలైపోయినట్టుంది. Office లో చూస్తేనేమో పగలేకాదు ఈ మధ్య రాత్రులు కూడా Applying Crossapply on over a billion records - Fingers crossed అన్నట్టైపోయింది నాపని. ఎదవగోల ఎప్పుడూ పనిగోలేనా? ఇంట్లో పెళ్ళాము ఆన్లైన్లో second setup ( బ్లాగేలేండి విపరీతార్థాలు తీయక్కరలేదు :-)) ఎదురుచూస్తున్నాయన్న జ్ఞానమేమన్నా వుందా అంటూ Table మీదున్న కంప్యూటర్ కన్నుగొట్టి మరీ అడిగింది.
అసలు ఏమి రాసి బ్లాగు కాగితాన్ని నలుపుచేద్దామా అని ఒకటే ఆలోచన. కాగితమంటే గుర్తుకొచ్చింది. ఈ మధ్య అసలు పెన్నుపట్టి తెలుగు వ్రాసి ఎన్ని రోజులైంది? రోజులేనా? ఏమో నెలలే ఐనట్లుంది. చేతివ్రాత అని ఆలోచనరాగానే నాకు ఇంకుపెన్నే గుర్తుకొస్తుంది. అందులో కూడా ప్రసాద్ ఇంకు పెన్ను. అబ్బో దీనికొక పేద్ద కథ వుందిలే... ఈ పెన్నులు పోవడం నాకు వీపు విమానంమోత మోగడం... అస్సలు ఏ తబలా, మద్దెలకూడా నా అంత మధురంగా ఏడ్చుండవు.
ఇంతకీ ఏమివ్రాద్దామని ఈ వ్యాసమంటారా? నీ బండబడ మౌస్ తో నాలుగు పిచ్చిగీతలు అక్షరాల రూపంలో గియ్యగానే వ్యాసమైపోద్దా?? పోదా? ...దు కదా??? అందుకని మళ్ళీ నెత్తిగీరుకోని.......
హ్మ్.... ఇప్పుడు దెయ్యాలు తిరిగేవేళయ్యింది. బయట చిమ్మచీకటి. అర్థరాత్రి 12:14AM. కిటికీలోంచి అట్టాచూశానో లేదో బయట.... ఊఊఊఊఊఊఊహూఊఊఊఊ... యాఆఆఆఆఆ.....అన్న శబ్దం. అమ్మో .... తల బయటపెట్టలేదు కానీ ..పెట్టుంటేనా....కసుక్కున కొరికేసి పండగరోజు అనుకోనుండేదేమో.... ఆ దెబ్బతో భయమేసి గబగబ కిటికీమూసేసి మళ్ళీ నాలుగు గీతలు బరుకుదామని ఇట్టొచ్చా
నాకు కుడి వైపుగా ఫ్యాన్ తిరుగుతుంది. అవును చాలా వేగంగా తిరుగుతుంది. నాకు శబ్దము కూడా వినిపిస్తుంది. చాలా స్పష్టంగా వినిపిస్తుంది. నీకేమన్నా పిచ్చంటరా ఫ్యాన్ తిరుగుతుంటే, ఆహా ఎంత చల్లగాలి, పిల్లగాలి అని వర్ణించుకుంటూ రాసుకోక శబ్దాల గొడవేందివయ్యా అని కచ్చితంగా అనుమానము రావాల కదా? .... వచ్చిందా?...... ఆ... ఈ ఫ్యాను వల్ల గాలి మనదాకా వస్తేకదా పిల్లగాలిని వర్ణించడానికి. అప్పుడర్థమయిందేందయ్యా అనుకుంటుంటే... మన ఇంద్రియాలకు అందనిది మనము వర్ణించలేమని.
ప్రక్కన విక్స్ డబ్బా... తీసి కొద్దిగా తలకు రాసుకున్నా... వ్యాసం వ్రాస్తున్న నాకే ఇంత తలనొప్పిగా వుంటే చదువుతున్న మీకు ఇంకెంతుండాలి? మీ గూట్లో పెట్టిని ఝండూబామ్ ని తీసి నాకోసం మీరుకూడా వ్రాసుకోండి. ఛత్... ఎనకటికెవడో చదవంగ చదవంగ "పెసలు" ను కాస్తా పిసలు పిసలు అనడం మొదులు పెట్టాడంట. అట్లావుంది నాయవ్వారం. లేకపోతే "ఝండూబామ్ ని తీసి నాకోసం మీరుకూడా వ్రాసుకోండి" ఏందది? వ్రాసుకోండా..రాసుకోడి అనా? ఏదో ఒకటిలే ఏది రాసుకున్నా శిరోభారం తగ్గడమే కదా అంటారా? నచ్చినది వ్రాసుకున్నా శిరోభారం తగ్గిపోద్దికదా? మరి ఇప్పుడు నేనేమనాలి? వ్రాసుకోండి అని అనాలా లేక రాసుకోండి అని అనాలా?
ఊంగా ఊంగా అని మంచి ఊపున్న పాట వస్తుంది. ఉండండి నేను కూడా మాంచి ఫిల్టర్ కాఫీ తెచ్చుకోని మళ్ళీ వ్రాయడం మొదలుపెడతాను.....
బుద్ధిగా కడుపునిండా పెరుగన్నం తిని బాగా నిద్రపోండి. తెల్లారాటప్పటికి అంతా మామూలైపోతుంది. ఒకప్పుడు మీరు నాకిచ్చిన సలహానే:))))
రిప్లయితొలగించండిఏంటో అంతా విష్ణు మాయ లా వుంది మీరేం రాసారో నేనేమి చదివానో..
రిప్లయితొలగించండి