హృదయమే శూన్యమై, శూన్యమే సంపూర్ణమై
ఆలపిస్తున్నా నేనీ ఆలాపనా... నే నీ ఆలాపనా !! హృ||
అరుణకిరణ సమయమిది, జననమరణ భూతమది
నింగినేగు మేఘమది, మలయమారుత పవనమిది
వికసించిన మొగ్గయది, నేలరాలిన పుష్పమది
జనన మరణముల మధ్య గాలివాటు గమనమిది
నువ్వా నేనంటూ సాగే పయనంలో
ముందో వెనకో నేనూ నువ్వూ చేరే గమ్యం ఒకటేలే
రక్తీ ముక్తీ, ప్రేమా ద్వేషం
వాడీ వేడీ, వాడూ వీడూ అన్నీ నేనూ నువ్వేలే
అంతా మూణ్ణాళ్ళ ముచ్చటేలే ! !! హృ||
కణకణమూ రగిలే రంగులబంతి కణములోపలి విష్ఫోటనము గని
కనులు మూసిన నిలిచేనా నువ్వూ నేనూ !
అహరహం రగిలే అగ్నిజ్వాలలే సమస్తావనికీ మూలాధారం
అది మింటికి రాజైనా, నువ్వైనా, నేనైనా !! హృ||
ఆలపిస్తున్నా నేనీ ఆలాపనా... నే నీ ఆలాపనా !! హృ||
అరుణకిరణ సమయమిది, జననమరణ భూతమది
నింగినేగు మేఘమది, మలయమారుత పవనమిది
వికసించిన మొగ్గయది, నేలరాలిన పుష్పమది
జనన మరణముల మధ్య గాలివాటు గమనమిది
నువ్వా నేనంటూ సాగే పయనంలో
ముందో వెనకో నేనూ నువ్వూ చేరే గమ్యం ఒకటేలే
రక్తీ ముక్తీ, ప్రేమా ద్వేషం
వాడీ వేడీ, వాడూ వీడూ అన్నీ నేనూ నువ్వేలే
అంతా మూణ్ణాళ్ళ ముచ్చటేలే ! !! హృ||
కణకణమూ రగిలే రంగులబంతి కణములోపలి విష్ఫోటనము గని
కనులు మూసిన నిలిచేనా నువ్వూ నేనూ !
అహరహం రగిలే అగ్నిజ్వాలలే సమస్తావనికీ మూలాధారం
అది మింటికి రాజైనా, నువ్వైనా, నేనైనా !! హృ||
Meeru raasaaraa? Baagundandee :)
రిప్లయితొలగించండిహృదయం సంపూర్ణం అయితే, శూన్యం అవుతుంది. మొదటే శూన్యమయితే ఇక సంపూర్ణ మెట్లా ?
రిప్లయితొలగించండిఅహరహం రగిలే అగ్నిజ్వాలలే సమస్తావనికీ మూలాధారం
...అగ్ని మీళే పురోహితం !
చీర్స్
జిలేబి.
ప్రియా, మీకు మంచి మంచి సందేహాలొస్తాయండి :-). నచ్చినందుకు థ్యాంక్స్
రిప్లయితొలగించండిజిలేబి గారూ, హృదయం సంపూర్ణం అయితే, శూన్యం అవుతుంది. ఎలా?
అంటే అదీ.. పాట లా రాశారు కదా.. మీకిష్టమైన పాటని ఇలా షేర్ చేసుకున్నారో లేక మీరే రాశారో అర్ధం కాక అలా అడిగాను. చెబితే "ఇంత మోద్దువేంటి ప్రియా" అనేస్తారేమోనని పైకి అనడం లేదు కాని ఇంకా నా సందేహం తీరలేదు భాస్కర్ గారు.. :(
రిప్లయితొలగించండిపై పాటకు అన్ని రకాల కాపీరైట్లు నావేనండి.
రిప్లయితొలగించండిWooww... :)
తొలగించండిఅంతా ఒక్క పదార్థమే అన్న పరమ తత్త్వాన్నే చెప్పేస్తిరి.
రిప్లయితొలగించండిబాగా రాసినారు.
లక్ష్మీదేవి గారూ పాట నచ్చినందుకు ధన్యవాదాలండి.
రిప్లయితొలగించండి