తిరుపతికైతే వెళదామనుకున్నాను.వెళ్ళి ఆ మహాసభలలో లబ్థప్రతిష్టులైన కవుల కుంచెలనుంచి జాలువారిన నవరస రసరమ్యమ పదాలను సుశ్రావ్యమైన గళములనుండి విందామని ఆశ పడ్డాను.
సమాచారం క్షణాల్లో చేరవేసే మాధ్యమాలు, విశ్వవ్యాప్తమైన విజ్ఞానాన్ని మధించి చిటికెలో మనముందుంచే వ్యవస్థలు ఇన్ని వుండగా విషయాన్ని తెలుసుకోవడం ఎంతసేపు? ఈ ప్రపంచ తెలుగు మహాసభల గూర్చి వెతుకుతుంటే ఓ వెబ్ సైట్ నాకంట పడింది.
http://www.worldteluguconference.com
కానీ మూడురోజులు తిరుపతి మహాసభలలోనైతే గడపటానికి సమయాభావమడ్డు వస్తుంది.కాబట్టి నచ్చిన కార్యక్రమాలున్న ఏదో ఒకరోజు లేదా ఒకటిన్నరరోజు వుందామని కార్యక్రమాల వివరాలకై చూశాను.కానీ ఏ కార్యక్రమం ఎక్కడ/ఏ హాల్ లో ఏ రోజు జరగబోతున్నదన్న వివరాలు ఎక్కడా కనిపించటము లేదు.
సమావేశ స్థలానికి చేరుకొని వెతుకులాడుకుంటూ చూడాలనుకున్న ఒకటి రెండూ కార్యక్రమాలను కూడా ఈ వెతుకులాట సమయంలో మిస్ చేసుకొనే పరిస్థితి రాకుండా వుండాలంటే కార్యక్రమాల పూర్తి వివరాలను వెబ్ సైట్ లో ప్రచురిస్తే బాగుంటుందేమో.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Comment Form