18, జనవరి 2013, శుక్రవారం

విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు తెలంగాణా రేపే ...........





ఏదో పేపెరోళ్ళ కోసమని మూడు నాలుగు  ప్లాన్లు చెప్పారు కానీ అసలు ప్లాన్లు ఈ క్రిందవని  విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. విశ్వసనీయవర్గాలా? ఎవరయ్యా వాళ్ళు అనుకుంటున్నారా? ఇప్పుడూ... పేపర్లలో మనకు నచ్చింది రాయాల్సివచ్చినప్పుడు ఇలా "విశ్వసనీయవర్గాలను" ఫ్రీగా వచ్చిన ఫినాయిల్ లాగా మిస్టర్ అండ్ మిసెస్ జెఫ్స్ వాడేసుకుంటుంటారు కదా...అలాగే ఇదన్నమాట

విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం ఈ క్రింది ప్లాన్లను పరిశీలిస్తున్నారని తెలిసింది

౧) తెలంగాణా ను విడకొడితే  రానున్న పార్లమెంట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ కు వచ్చే M.P సీట్ల సంఖ్య ఎంత వుండవచ్చని కాంగ్రెస్ మేధో మథనంలో పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తపరచగా ఓ వార్తా స్రంవంతి విలేఖరి మాత్రం "తెలంగాణా ను విడకొడితే" అన్నదాన్ని పట్టుకొని తెలంగాణాను మళ్లీ రెండు ముక్కలు చేస్తారా? అంటూ వేడీ వేడిగా పులిహోర కలిపి వడ్డించడానికి కెమెరామేన్ రాంబాబు వద్ద ట్రైల్స్ వేస్తున్నాడట

౨) ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణా ను విడగొడితే YSRCP ప్రాబల్యం రాయలసీమ, కోస్తా, తెలంగాణాలో  ఎలా వుండబోతుందన్న అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు మా గోచాపి ( గోడచాటు పిల్లి ) విలేఖరి తెలియచేస్తున్నారు. చీకట్లో మా విలేఖరికి ఎవరిగొంతెవరిదో కనిపెట్టలేకపోయారు కానీ లేకుంటే పేర్లతో సహా చెప్పే మొదటి పత్రిక మాదే అయి వుండేది. అయినప్పటికీ ప్రాణాలకు తెగించి మా విలేఖరి చెవులు రిక్కించి మరీ విని పై సమాచారాన్ని సేకరించారు.

౩) హైదరాబాదు ను కేంద్రపాలిత ప్రాంతంగా వుంచాలా లేక తెలంగాణాలో చేర్చాలా అన్న అంశం పై చెప్పులు  విసురుకోవడం వల్ల మా కెమెరామేన్ కు ఓ కన్ను దెబ్బతిన్నది. ఐనా సరే కెమెరా కంటితో చూసి మాకు ఎప్పటికప్పుడు వార్తలను చేరవేశారు. ఐతే ఈ అంశంపై అధిష్టానం మాత్రం కేంద్రపాలిత ప్రాంతానికే మొగ్గు చూపింది. అధిష్టానం చెవు కొరికే మా మెంబరు ఒకరు చెప్పిన దాని ప్రకారం, హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం వల్ల జగన్ ను మరికొంతకాలం చెంచల్ గూడాలోనే వుంచేదానికి మార్గం సుగమం చేసుకోవచ్చని తీవ్ర ఆలోచనల్లో  అధిష్టానం "తానా" అంటే  ప్రక్కనున్న మంత్రుల "తందానా" అనడం మర్చిపోయి "ఆటా" అన్నారని సమాచారం.

౪) ఒకవేళ హైదరాబాదును తెలంగాణాలో చేర్చినా తెలంగాణా వాళ్ళెలాగూ మా రాజ్యాంగం మేము రాసుకుంటామని ఎలాగూ లొల్లి సేస్తరు కాబట్టి జగన్ కేసు మళ్ళీ మొదటికొస్తది అని న్యాయసూత్రాలను వల్లెవేశారాని అంచేతా మాకే హైదరాబాదు కావాలని ప్రశాంతంగా తిట్టుకోవడం మొదలెట్టారని అబిజ్ఞవర్గాల భోగట్టా

౫) పై ప్లాన్లన్నింటిని పరిశీలించిన అధిష్టానం చివరిగా వందిమాగధులను ఓ ప్రశ్న వేశారంట. 2014 లో భారత ప్రధాని ఎవరు కాబోతున్నారంటూ? ముక్తకంఠంగా అందరూ ఒకటే సమాధానం చెప్పడంతో ముసిముసినవ్వులతో సభ ముగించి జై కాంగ్రెస్ అనమనగా సీమాంధ్ర వాళ్ళతో కలిసి తెలంగాణా నుంచి వెళ్ళిన ప్రజానాయకులు కూడా పొరపాటున జై వైయస్సార్ అన్నారని సమాచారం.


చదువుతూనే వుండండి నిరంతర వార్తా స్రవంతి.

P.S : I am neither supporting nor opposing the process of creating new states.

10 కామెంట్‌లు:

  1. భాస్కర రామిరెడ్డిగారూ, యెందుకండీ కొరివితో తలగోక్కుంటారూ?
    మీలాంటి నాలాంటి వాళ్ళు చదివి సంతోషించినా అధికులు గోలచేసే ప్రమాదం ఉంది సుమండీ.

    ఒకవర్గం వారికి sense of humor లేదు.
    మరొక వర్గం వారికి humor sense లేదు.
    వారెవరూ యెవరేమి వ్రాసినా రగడ చెయ్యక వదిలేదు లేదు!

    ఎందుకొచ్చిన తలనొప్పి చెప్పండి?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్యామలీయం గారూ, ఎందుకొచ్చిన తలనొప్పి అనుకుంటే అసలు బ్లాగే వ్రాయలేమోమో కదా? ఎవరో గోల చేస్తారని వ్రాయడం మానుకుంటే తెలుగులో ఒక్క బ్లాగు కూడా మిగలదేమో కదా? రగడచేసేవాళ్ళు ఎలాగూ చేస్తూనే వుంటారు.

      తొలగించండి
  2. "I am neither supporting nor opposing the process of creating new states"

    మూడేళ్ళలో మనసు మార్చుకున్నారా సార్ (I am neither supporting nor opposing your right to have any opinion or change it any number of times.)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Jai Gottimukkala,

      >> మూడేళ్ళలో మనసు మార్చుకున్నారా సార్??

      Jai Gottimukkala సార్ గారూ, మూడేళ్ళ క్రితం నా మనసు ఎలా వుండేదో తెలిసిన మీరు బ్లాగు టపాల లింకులో, వ్యాఖ్యల లింకులో ఇస్తే బాగుండేదేమో కదా?

      >> your right to have any opinion or change it any number of times

      లేకపోతే నా అభిప్రాయాలను కూడా మీరే నిర్ణయిస్తారా ఏమిటి :-)? show me a post or comment where I supported or opposed the *process* of creating new states.

      తొలగించండి
    2. ఇవండీ ఆధారాలు. ఒకవేళ నేను మిమ్మల్ని సరిగ్గా అర్ధం చేసుకోలేదేమో?
      ===========================================================
      Blogs titled "రోషమున్న ప్రజానాయకులారా అందుకోండి నా నినాదం' and "ఆంద్రోడు పోయిండంట - తెలంగోడు వచ్చిండంట"

      Some comments:
      ===========================================================
      భాస్కర రామి రెడ్డి10 డిసెంబర్ 2009 11:53 PM
      విమలా వ్యాఖ్య కు ధన్యవాదాలు.

      భావన గారూ ఎందుకు సిగ్గుపడడం. ఐక్యతా రాగం నచ్చలేదా మీకు?
      ===========================================================

      భాస్కర రామి రెడ్డి10 డిసెంబర్ 2009 11:55 PM
      :) I know dear.. lets be unite and lets AP unite


      తొలగించండి
  3. అధిష్టానం "తానా" అంటే ప్రక్కనున్న మంత్రుల "తందానా" అనడం మర్చిపోయి "ఆటా" అన్నారని సమాచారం. LOL.....

    రిప్లయితొలగించండి
  4. @Sri Ayyagari Surya Nagendra Kumar Sharma

    @రిషి
    @laddu

    post మిమ్మల్ని నవ్వించింది కదా :-). I guess I achieved my goal on posting this article.

    రిప్లయితొలగించండి
  5. AP ni mottam 4 raashtraalugaa vidagodite samasyalu undavu

    1) hyderabad state
    2) telangana state
    3) raayala seema state
    4) andhra state

    రిప్లయితొలగించండి

Comment Form