9, సెప్టెంబర్ 2013, సోమవారం

ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర్యం వచ్చిన అరవై ఏళ్ళ తరువాత డాష్ డాష్ ఐపోవడానికి సిద్ధంగా వుంది.


ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, ఒకవేళ తీసుకోకపోయినా డాష్ డాష్ ఐపోవడానికి సిద్ధంగా వుంది. రాజకీయ చైతన్యంలేని ప్రజలూ, మాయమాటలతో మభ్యపెట్టే పార్టీలూ, దేశ సమగ్రత పై కానీ, స్వేచ్ఛా స్వాతంత్ర్యా ల పై ఏమాత్రమూ అవగాహన లేని రాజకీయనాయకులూ, స్వప్రయోజనాలు తప్ప నియోజకవర్గ అభివృద్ధి అంటే ఏమిటో తెలియని నేతలూ, వారి వంది మాధిగలూ రాజదర్పంతో  పదవులను అనుభవించడం తప్ప కనీసం వారి బాధ్యతలు కూడా తెలియని సామంత రాజులూ ఐకమత్యంగా ఆంధ్రప్రదేశ్ ను కుడిపించేసారు.

పోయిన సారి ఇండియా వెళ్ళినప్పుడు మరో విషయాన్ని కూడా గమనించాను. పొరపాటున ఎవరైనా ఏదైనా సహాయం చేయడానికి సోంత డబ్బుతో చేతి చమురు వదిలించుకుంటున్నాడనుకోండి, ప్రక్కన ఓ నలుగురు వీడిపై ఓకన్నేసి వుంచుతారన్నమాట. వీడికి దీనివల్ల ఎలాంటి లాభం లేకుండా ఈ మంచి పనులు ఎందుకు చేస్తున్నాడని!!!.అలావున్నాయి ఈ నాటి ఆంధ్రప్రదేశ్  సగటు ప్రజల మనస్తత్వాలు.

మన తెలుగువారికి వాడూ వీడూ అని లేకుండా ఓ దుర్గుణం కూడా వుందండోయ్.... అదేంటంటే నేను **** బీప్*** ఐపోయినా పర్లేదు కానీ నా ప్రక్కనోడు మాత్రం నాకంటే గొప్పవాడవడానికి వీల్లేదు. వాడు కష్టపడి ఎలాగో ప్రయత్నించినా నేను మాత్రం నా శాయశక్తులా ప్రయత్నించి వాడు మట్టికొట్టుకు పోయేదాకా నిద్రపోను. అవసరమైతే పరాయివాడి సహాయాన్నైనా తీసుకొని వాడిని దరిద్రుడిని చేసేదాకా నిద్రపోను. మన తెలుగువారికి మన సామాజిక బాధ్యతకంటే మన స్వప్రయోజనాలే ముఖ్యం. 


మన దేశంలో ఏనాడైతే ఓ అభ్యర్థి వారి నాయకుల భజనలు మాని, కేవలం తాను చేసిన అభివృద్ధిని ప్రజలలోకి తీసుకెళ్ళి ఆ అభివృద్ధిద్వారా తనకాళ్ళపై తాను నిలబడి గెలవగలడో ఆరోజే నిజమైన ప్రజాస్వామ్యం వచ్చినట్లు. ఆ రోజే ఒక ఎం.యల్.ఏ గా ముఖ్యమంత్రి ముందు గానీ ప్రధాన మంత్రి ముందుగానీ, రాజ్యాంగేతర నేతల ముందు కానీ తల ఎత్తుకొని మాట్లాడగలడు. అవసరమైతే ఈనాడు తీసుకొన్న నిర్ణయాలవంటివి తీసుకున్నప్పుడు తనకున్న సవాలక్ష వెంట్రుకల్లో ఓ వెంట్రుకను పీకి మొఖాన కొట్టి రాగల ధైర్యమూ వుంటుంది. అంత వరకూ ఒంగి ఒంగి నమస్కారాలు చేయక తప్పదు.

 ఈనాడు ప్రజల్లో మొదలైన ఈ అలజడి అలాంటి చైతన్యానికి దారితీస్తుందేమో చూడాలి!!!

1 కామెంట్‌:

Comment Form