4, ఏప్రిల్ 2014, శుక్రవారం

విషయమేమీ లేకుండా కూడా టపా వ్రాయవచ్చు :)



ఈ మధ్య చాలారోజుల తరువాత మళ్ళీ నాబ్లాగు రమ్మని పిలిచింది. ఇంతకాలం ఏదో ఇరగదీసే పనులున్నాయనుకుంటే అది పొరపాటే. గూగుల్ ప్లస్,ఫేస్ బుక్ లకు జనాలు వలస పోయిన తరువాత బ్లాగులు రాసేవాళ్ళూ తగ్గిపోయారు కదా! పాతనీరు పోయి క్రొత్తనీరు బ్లాగుల్లో ఏమన్నా ప్రసరిస్తుందేమో కానీ నా విషయానికొస్తే వ్రాయాలన్న ఉత్సాహం తగ్గిపోవడమే. అటు ఆంధ్రదేశమంతా రాజకీయ మాయగాళ్ళతోటి అట్టుడికి పోతుంది. ఆవేడికి వసంతకాలంలోనే ఎండలు బాగా ముదిరిపోయాయని వార్తలు వస్తున్నాయి.ఆ వేడీ ఈ వేడీ కలిసి జనాలకు ఉక్కపోత మరీ ఎక్కువైందట. ఇన్ని బాధలను ఎలా భరిస్తున్నారో ఏమో చూద్దామని నేనూ ఈ ఏప్రిల్ మాసంలో తెలంగాణా/ఆంధ్ర ప్రాంతాలను దర్శించుకోవాలని బయలుదేరుతున్నాను.రెండు రాష్ట్రాలుగా విభజన జరగడానికి ఇప్పుడు ఏమీ అడ్డంకులు లేవు. తెలంగాణా ఈ నెలరోజుల్లోనే బాగా అభివృద్ధిచెంది ఉరకలేస్తుందేమో నన్న కోరిక బలంగా కూడా వుంది :-) .అసలే ఇప్పుడు మేము తెలంగాణా వాసులమయ్యేము.ఇంక ఆంధ్రప్రాంతంలో వున్నవాళ్ళంతా మాకు చుట్టాలే. వాళ్ళ రాష్ట్రం వేరు మా రాష్ట్రం వేరు :)

ఎలాగూ ఎలక్షన్ల టైం కాబట్టి ఎవరైనా నాక్కూడా ఫ్రీ ఆఫర్లు తలుపుతట్టి ఎమన్నా ఇస్తారేమో చూడాలి. ఒకవేళ అలాంటి ఆఫర్లతో ఫ్రీగా ఇస్తామని మీదగ్గరకు ఎవరన్నా వచ్చినా మాయింటికి కూడా పంపించండి. ఊరకే ఇస్తామంటే ఎవరన్నా వద్దంటారా ఏమిటి?

ఇకపోతే హైదరాబాదులో డ్రైవరు లేకుండా కార్లు అద్దెకిచ్చే పద్ధతి ఏమన్నా వుందా లేకపోతే కారు కావాలంటే డ్రైవరూ మనతోటి వుంటాడా?అమెరికా లో లాగా కార్లు రెంట్ కు ఇస్తే ఏంచక్కా ఆ ఊరూ ఈవూరూ తిరిగిరావచ్చు.లేదంటే ఈ ఎండల్లో బస్సుల్లో పడి తిరగాలంటే సగం జీవితం అక్కడే ఖర్చయిపోతుంది.

ఇదే విషయమేమీ లేకుండా టపా కట్టడమంటే. అక్కడనుంచి వచ్చాక మళ్ళీ బోలెడన్ని కబుర్లతో మీముందుంటాను. అంతదాకా ఎండాకాలానికి భయపడుతూ ప్రయాణానికి సన్నద్ధమౌతా...

4 కామెంట్‌లు:

  1. చాల్రోజులకు కనిపించారు! ఈ మధ్య చాలా బ్లాగులు విషయం లేకుండానే నిండి కనిపిస్తున్నాయి లెండి

    మాదీ తెలంగాణాయే ఇప్పుడు.

    హైద్రాబాదు లో కార్లు అద్దెకు దొరుకుతాయి. మంచి ఏసీ కార్లు, మంచి మేక్స్ కూడా. పిండి కొద్దీ రొట్టె!

    డ్రైవర్ మనతోనే ఉంటాడు.నాలుగు గంటలు లేదా 40 కిలో మీటర్లు, ఏది ముందు కంప్లీట్ అయితే ఆ లెక్కన డబ్బులు తీసుకుంటారు. లేదా 80 కిలోమీటర్లు/8 గంటలు.

    రేట్ ఇప్పుడు ఎంత ఉందో తెలీదు. ఎందుకంటే నేనూ మీ నైబర్ నే ఇప్పుడు.టెక్సాస్ లో :-)

    రిప్లయితొలగించండి
  2. మన నుంచి విడివడి
    మీ మా గా మారటం

    ఆ వేపు చుట్టాలు...
    ఈ వేపు చుట్టాలు...
    గా...
    మార్చేసిన చట్టాలు...

    యెంత బాధాకరం ...

    రిప్లయితొలగించండి
  3. సుజాత గారూ మంచి సమాచారాన్ని అందించారు. నాకు, ఇక్కడ లాగా కార్ ను రోజుకింత లెక్కకింద ఇస్తారేమో అనుకున్నాను.అలాకాకుండా 40 km/80km అంటే నేను తిరిగే తిరుగుడికి చాలా ఖర్చయిపోతుంది.
    మీరూ తెలంగాణానే నా? సరిపోయింది. ఇక ఆంధ్రప్రదేశ్ కు వెళ్ళాలంటే రాష్ట్ర సరిహద్దులు దాటాల్సిందే మరి.

    మీరు టెక్సాస్ కు ఎప్పుడు వచ్చారు? మీరెప్పుడైనా ఇటువైపు కొచ్చినప్పుడు వీలైతే మా ఇంటికి కూడారండి.

    రిప్లయితొలగించండి
  4. nmraobandi గారూ , మీ కవిత బాగుంది. పరవాలేదులెండి మారింది పుస్తకాల్లో ముద్రించే పటాలే అనుకుంటే సుఖంగా వుంటుంది.

    రిప్లయితొలగించండి

Comment Form