3, మే 2014, శనివారం

ఇంతకీ మీ ఓటు ఎవరికి?

2014 మే 7 వ తేదీ దగ్గరపడుతుంది. ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోవడం కోసం ఎప్పటికన్నా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారనిపిస్తుంది. దానికి తోడు మనకు తెలుగులో వున్న న్యూస్ పేపర్లు అన్నీ సిగ్గూ,ఎగ్గూలను వదిలేసి పూర్తిగా పార్టీ లతో సంధానమైపోయినట్టు ప్రచారాస్త్రాలను ప్రజలమీదకు ప్రయోగిస్తున్నారు. ఈ మధ్య నేను తరుచూ ఈనాడూ, సాక్షీ పేపర్లను అనుసరిస్తున్నాను. సాక్షి వైయస్సార్ సీపీ కి ప్రచారాన్ని చేసుకుంటుంటే ఈనాడు మాత్రము రెచ్చిపోయి వైయస్సార్ సీపీ కి వ్యతిరేకంగా ప్రచారపాఠాలను గుప్పిస్తుంది. వీటివల్ల ప్రజలలో ఏమాత్రం మార్పు వస్తుందనేది ప్రక్కన పెడితే ఈ రెండు పేపర్లవల్ల తెలుగుదేశం, వైయస్సార్ సీపీలలో లొసుగులు మాత్రం బాగా బయటకు కనిపించేటట్టు చేయడంలో ఈ పత్రికలు సఫలమయ్యాయని చెప్పవచ్చు. ఈనాడైతే మరీ ఒక నెలరోజులనుంచీ వైయస్సార్ సీపీ కి వ్యతిరేకంగా రోజూ ఒక కథనాన్ని వండి వారుస్తుంది. చిత్రమేమిటంటే ఈ పత్రిక తెలుగుదేశానికి అనుకూలంగా కథనాలను ప్రచురించడానికి బదులు ysrcp కి వ్యతిరేకంగా negetive ప్రచారానికి తెరలేపింది. అంటే టి.డి.పి తరపున ప్రచారం చెయ్యడానికి ఏమీ విషయంలేక ysrcp మీద పడిందో లేక పోటీ రెండు పార్టీలమధ్యనే కాబట్టి ఒకదానికి వ్యతిరేకంగా ప్రచారం చేయటం ద్వారా ఓటర్లను ప్రభావితం చేసి టి.డి.పి కి ఓట్లు మళ్ళించడంలో అంతర్భాగంగా వేసిన ఎత్తుగడో తెలియదు కానీ ఈనాడు పేపరు ప్రధాన వార్తలన్నీ ysrcp కి వ్యతిరేకంగా ప్రచురిస్తున్నారు.

ఇక ఓటర్ల విషయానికొస్తే వాళ్ళమనసుల్లో ఓటు ఎవరికి వెయ్యాలో ఇప్పటికే నిర్ణయమైపోయినట్టు కనిపిస్తుంది.నేను తిరిగిన ప్రదేశాలలో ఐతే మాత్రం జనాలు ఈసారికి ysrcp వైపే మొగ్గు చూపిస్తున్నారు. నాకెలాగూ ఓటువేసే సౌకర్యం లేదు కాబట్టి ఇలాంటి పేపర్లు చదువుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నాను. వార్తాపత్రికలల్లో వచ్చే వార్తలను సేకరించి ఇక్కడ వ్రాద్దామని ఒక సంకల్పం చేసుకున్నా కానీ పేపరు నిండా ఇవే వార్తలను చూసి వాటిని మళ్ళీ ఎత్తివ్రాయలేక ఆ సంకల్పాన్ని విరమించుకున్నాను. ఇంతకీ మీ ఓటు ఎవరికి?

2 కామెంట్‌లు:

  1. మీ ఓటు ఎవరికి>?

    హృదయ స్పందనల చిరు సవ్వడి తో దేశాన్ని ఉర్రూత లూగిస్తున్న వారికి !!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. @Zilebi, మీకేమండీ ఓటు వుంది కాబట్టి చూపుడువేలుపై ఎన్ని చుక్కలైనా పెట్టించుకుంటారు :)
    ఇంతకీ మీ ఓటు దేశాన్ని ఉర్రూత లూగిస్తున్న వారికేనంటారు.

    రిప్లయితొలగించండి

Comment Form