ఎలక్షన్లు అయిపోయాయి. ఇక రాజకీయనాయకులకూ ఇన్ని రోజుల శ్రమనుంచి కాస్త విరామం. ఎండనకా వాననకా రేయింబవళ్ళు ప్రచారం చేసిన అభ్యర్థులకు విరామంతోపాటు టెన్షన్లు కూడా. ఈ ఎలక్షన్ల సందర్భంగా పట్టుపడ్డ కోట్ల రూపాయల ధనాన్ని ఎవరికి అప్పగిస్తారో ఏమిచేస్తారో? అలాగే వేల లీటర్లమధ్యము వుండనే వుంది. నిన్నటిదాకా రెచ్చిపోయిన ఈనాడు పత్రిక కూడా ఒక్కసారిగా అమాయకంగా తనకేమీ తెలియదన్నట్లు మారిపోతుంది.ప్రజలు మాత్రం తాము చెయ్యవలసిందంతా చేసేసి ఎలక్షన్ల రిజల్ట్స్ కోసం ఎదురుచూడడం మొదలు పెడతారు.సర్వే సంస్థలన్నీ తమ సర్వేలు ఎంతవరకూ నిజమో తెలుసుకోవడానికి ఎదురుచూపులు చూస్తుంటాయి. జ్యోతిష్య శాస్త్రవేత్తలు మాత్రం పంచాంగాన్ని ముందుపెట్టుకొని నేను ముందే చెప్పానుగా అనటానికి సిద్ధపడుతుంటారు.ఒకవేళ తము చెప్పింది జరగకపోతే ఏ రాహువో కేతువో ఎలాగూ వుండనే వుంటాడు. ఎలక్షన్ కమిషనర్స్ పుణ్యమా అని ఎక్జిట్ పోల్సపై నిషేదాన్ని విధించారు కాబట్టి ప్రతి ఓటరూ ఎవరికి తోచిన సర్వే వాళ్ళు చెప్పుకుంటుంటారు. ముఖ్యమంత్రి అభ్యర్థులు మాత్రం థూ దీనెమ్మ బ్రతుకు ఏమి ఎండలబ్బా అని తిట్టుకుంటూ ఏ.సీ. రూములకు పరిమితమై పదహారవ తేదీకోసం నిరీక్షిస్తుంటారు. రైతులు ఇప్పటికే పంటకోతకోసి అమ్మేయడం కూడా జరిగిపోయుంటుంది కాబట్టి ఇంటి పట్టునో లేదా రచ్చబండ దగ్గరో కూర్చోని మీసాలు మెలేస్తూ బెట్టింగ్ లకు సిద్ధమైపోయుంటారు.అమ్మలక్కలు పిట్టగోడ దగ్గర చేరి ప్రపంచాన్నంతా ఔపోసన పడుతుంటారు. బ్లాగర్లు ఎప్పటిలాగే బ్లాగులు రాసుకుంటూ కామెంట్లకోసం ఎదురు చూస్తూ వుంటారు. నేను మాత్రం ఈ పోస్టు రాసి ప్రక్కనోడి టపా చదవటానికి పోతా.
అన్నీ చెప్పావు నీ విశ్లేషణేమిటి అనుకునే వాళ్ళకు: నేనూ అందరిలాగే ఓటు వేయకుండా విశ్లేషణలు వ్రాసుకొనే జీవుల ఖాతాలో వుంటాను. నాకు అనిపిస్తున్నదేమిటంటే ఈ ఎన్నికలు ఇరుపార్టీలకూ జీవన్మరణ సమస్య ఐనా ఏదో ఒకపార్టీ గెలవక తప్పని పరిస్థితి. పోటీ హోరాహోరీ జరిగినట్లే అనిపిస్తున్నా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడంకెల నంబరు ను చేరుకొని ప్రభుత్వాన్ని ఏర్పరచవచ్చు.
అన్నీ చెప్పావు నీ విశ్లేషణేమిటి అనుకునే వాళ్ళకు: నేనూ అందరిలాగే ఓటు వేయకుండా విశ్లేషణలు వ్రాసుకొనే జీవుల ఖాతాలో వుంటాను. నాకు అనిపిస్తున్నదేమిటంటే ఈ ఎన్నికలు ఇరుపార్టీలకూ జీవన్మరణ సమస్య ఐనా ఏదో ఒకపార్టీ గెలవక తప్పని పరిస్థితి. పోటీ హోరాహోరీ జరిగినట్లే అనిపిస్తున్నా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడంకెల నంబరు ను చేరుకొని ప్రభుత్వాన్ని ఏర్పరచవచ్చు.
రిప్లయితొలగించండిఆఖరి వాక్యం మా సరిగ్గా చెప్పారు !!
జిలేబి
రిప్లయితొలగించండిఇంతకీ ఈ ఎలచ్చన్ల తరువాయి అయినా హారం మళ్ళీ తెరుస్తారా ?
జిలేబి
Well said.... Keeping fingers crossed... May 16th em jaruguthundo...
రిప్లయితొలగించండి"...నేనూ అందరిలాగే ఓటు వేయకుండా ..."
రిప్లయితొలగించండిఈ ముక్క కరెక్టు కాదు. ఎక్కువమంది ఓటింగులో పాల్గొన్నారు. పాల్గొననివాళ్ళు 20 శాతమే.
జిలేబీ, ఆ ఆఖరివాక్యం మీకు నచ్చినట్టులేదే :).
రిప్లయితొలగించండిహారం ఆపేయడానికి ఎలక్షన్లకు సంబంధం ఏముందండీ. ఐనా బ్లాగులు చూసే మూడొందల,నాలుగొందల మందికోసం హారం అవసరంలేదనుకుంటాను. అప్పట్లో ఏదో క్రొత్త టెక్నాలజీ నేర్చుకోవాలన్న ఆసక్తితో మొదలైంది హారం.
Subba Reddy, me too. Let's wait and see.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిఉత్తరామ్నాయమ్ స్వస్త్యయనమ్
ఇందులో చాలా కరక్టు కాని విషయాలుండవచ్చండీ. ఏదో ఊసుపోక రాసిన టపా ఇది