నవంబరు ఎనిమిదవ తేదీ యధావిధిగా ఎనిమిది గంటలకు లేచి అబ్బా ఆఫీసుకు వెళ్ళాలా అనుకుంటూ తయారై ఆఫీసుకు వెళ్తూ mobile లో All India Radio పెట్టుకొని వెళ్తూ ఆంగ్లవార్తలు వింటూ కారు నడుపుతున్నాను.ముఖ్య వార్తల్లో 1000 రూపాయలు, 500 రూపాయల ను రద్దు చేస్తున్నట్లు వినగానే రోమాలు ఒక్కసారి నిక్కబొడుచుకున్నాయి. ఈ దెబ్బతో బడాబాబులదగ్గరున్న బ్లాక్ మనీ అంతా దిబ్బలో వేసుకోవడమే నని ఆనంద పడ్డాను.భారత ఆర్థిక వ్యవస్థలో కరక్షన్ వచ్చి స్థాలాలు,ఇళ్ళ రేట్లు మిగిలిన ధరవరలు తగ్గుతాయని ఆనంద పడ్డాను.పేదప్రజల నోళ్ళు కొట్టి సంపాదించిన లంచావతారాలు ఈ సమస్యను ఎలా అధిగమిస్తారా అని ఆలోచనతో ఆఫీసుకు చేరుకున్నాను.
సాయంకాలం ఇంటికి రాగానే వివిధ వార్తాచానళ్ళు పెట్టుకొని వార్తలు వింటూ సామాన్య ప్రజల ఇక్కట్లను చూస్తూ గడిపాను. భారతదేశాన్నుంచి వస్తూ నేను ఆరువేల రూపాయలు తెచ్చుకున్నాను. అన్నీ ఐదువందలు వెయ్యి రూపాయలనోట్లు. వాటిని ఇక్కడ మార్చుకొనే వెసలు బాటు లేదు కాబట్టి వాటిపై ఆశ వదలుకొన్నాను. ఐనా ఇంత మంచి నిర్ణయం తీసుకొన్న మోడికి మనసులో అభినందనలు తెలుపుకుంటూ ఆరోజు గడిపాను.
ఓ రెండు మూడు రోజులు గడిచిన తరువాత సామాన్యులకష్టాలు సర్దుకుంటాయని ఆశించాను.కానీ చిత్రంగా దరిదాపు పదిరోజులౌతున్నా బ్యాంకుల ముందు జనాల బారులు తగ్గటంలేదు.దీనితో పాటు బడాబాబుల దొడ్డిదారి వ్యవహారాలు చదివాను. చూస్తుంటే రాజకీయనాయకులందరూ మొదటి రెండు మూడు రోజుల్లోనే బ్యాంకు మేనజర్లతో కుమ్మక్కై రెండు వేల రూపాయల కాగితాల్ని మళ్ళీ బ్లాక్ మార్కెట్ కు తరిలించినట్టున్నారు. ప్చ్...
ఇన్ని దొడ్డిదారి వ్యవహారాలు జరుగుతున్నా ఏదో ఒక ఆశాదీపం. కనీసం 50 శాతం బ్లాక్ మనీ ఐనా తగ్గదా అని. అక్రమాలకు పాల్పడుతున్న బ్యాంకు సిబ్బందిని, వారిద్వారా లబ్ఢిపొందిన నల్ల కుబేరులను చిత్తసుద్ధితో శిక్షిస్తారని కోరుకుంటూ....

Good post. Definetyly action will be taken against the culprits. A seriesof actions to follw infuture,in real estate,Gold,silver and diamonds etc, really blackies will be sleepless, suppose so, let us wait and see, how the political parties react.
రిప్లయితొలగించండి@అజ్ఞాత, Hope for the best
తొలగించండిI have a strange feeling the above anon is none other than Modi himself. Now that he has assured us that action will be taken (how certain he has sounded!!) we could rest in peace :-)
రిప్లయితొలగించండి@అజ్ఞాత, LOL :-)
తొలగించండిమీరు వ్రాసిందంతా అక్షరం .. అక్షరం ... వాస్తవం! అయితే, ఈ విషయం గుజరాత్ లో చాల మందికి, యూ.పీ, బెంగాల్ బి.జె.పి. అధ్యక్షులకు ముందే లీక్ అవడం; ఇంకా .. ఈ టైంలో విజయమాల్యాకు 1201 కోట్ల రుణమాఫీ చేయడం - మోడీ నిబద్ధతపై కొత్త సందేహాలకు తావిస్తుంది.
రిప్లయితొలగించండిబాంక్ లో వేవ్ ఆఫ్ కి రిటన్ ఆఫ్ కి తేడా తెలీకుండా,ఇది గో పులి అంటే అదిగో తోక అని రాస్తున్నావు. పాటలు పద్యాలు రాసే వాళ్లకి డాక్టరేట్ ఇస్తే మీలాగే అఘోరిస్తారు ఆచార్య ఫణీంద్ర.
తొలగించండిఫణీంద్ర గారూ, వస్తున్న వార్తలను బట్టి అలానే అనుకోవాలి. కానీ ఎవరికీ తెలియకుండా చేసి వుంటే ఈ పాటికి సొంత పార్టీలోనే తిరుగుబాటు వచ్చుండేది.
తొలగించండిఅజ్ఞాత, మోడీ నిబద్ధతను ప్రశ్నిస్తే మీకెందుకండీ అంత కోపం? మీ వ్యాఖ్య వ్యక్తిగత దూషణ క్రింద వస్తుంది.
తొలగించండి