18, నవంబర్ 2016, శుక్రవారం

బ్లాక్ టు బ్లాక్ - శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు...

 కూతురి పెళ్ళికి చేతికి అందని డబ్బు. చిన్నారి జబ్బుకు ఆసుపత్రికయ్యే డబ్బులు లేక ఒక అమ్మ విలవిల. బ్రతకడానికి నిత్యావసర సరుకులు కొనడానికీ చేతులు కట్టేసుకోవాల్సినట్లుంది.మరోవైపు వారాంతాలలో సరదగా బయటకెళ్ళి ఒక్క దమ్ము పీకుదామన్నా చిల్లరకోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఇలాంటి కథనాలు పార్టీలకతీతంగా ప్రతి టీ.వీ ఛానల్ లో ప్రసారమవుతున్నాయి కాబట్టి ఇవి సామాన్యుని నిజమైన కష్టాలుగానే భావించవచ్చు. వీటన్నింటికి పరిష్కారం ఏమిటి? ప్రజలవద్ద, చలామణిలో వున్న డబ్బులో ఐదువందలు,వెయ్యి రూపాయలు అధికంగా వుడటం,భారతదేశంలో అంతగా వాడుకంలో లేని ప్లాస్టిక్ కరెన్సీ, నిత్యావసరాలకు అవసరమయ్యే వస్తు విక్రయమంతా డబ్బుపై ఆధారపడి జరగడమే. 
ఒకవైపు రైతు, సామాన్యుడు బ్రతకలేక చేసిన అప్పులు తీర్చలేక బ్రతుకు బండిని లాగలేక దిక్కుతెలియని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడు. మరోవైపు బడా వ్యాపారులు బ్యాంకులో దాచుకున్న సామాన్యుని డబ్బుతో ఇంద్రవైభోగాలనుభవిస్తూ, వారిని పాలించే పాలకునిగా మంత్రిపదవలనుభవిస్తూ   బ్యాంకులకు ఎగనామం పెట్టి  సమాజంలో దర్జాగా తిరుగుతున్నాడు. ప్రభుత్వం తలుచుకుంటే వీటిని అరికట్టడం పెద్ద సమస్యకాదుకానీ సమస్యల్లా ఆ ప్రభుత్వం మనుగడ సాగించటమే. 

ఇక మోడీ తీసుకున్న నిర్ణయం వల్ల నల్లకుబేరులు ఎంత కష్టపడుతున్నాడో కానీ సామాన్యుడు మాత్రం తనదైనైందిన జీవితంలో అనుభవించే కష్టాలకు తోడు ఇదీ మరొకటనే స్థితికి చేరుకున్నట్లున్నాడు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్లు బ్లాక్ మనీ మార్చుకోవడానికి మరో ఉపాయంతో ముందుకొచ్చిన  వైనం ఈ క్రింది లింకు లో చదువవచ్చు



http://www.sakshi.com/news/state/black-money-converted-to-white-money-in-andhra-pradesh-423505?pfrom=home-top-story

2 కామెంట్‌లు:



  1. ఆహా ! ఏమి ఉపాయం ! వస్తే డబ్బు ! లేకుంటే విడిపించిన బంగారం బడాబాబుల జేబు లోకి బదలాయింపు !

    భారతీయుల బుర్రకి తిరుగే లేదు :)

    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. జిలేబి గారూ, మరి ఇండియా నా మజాకానా :-)

    రిప్లయితొలగించండి

Comment Form