M.Tech కెమికల్ ఇంజనీరింగ్ లో నా స్పెషలైజేషన్ పెట్రోలియం రిఫైనింగ్ అండ్ కెమికల్స్. రెండు సెమిస్టర్లయిపోయి మూడవసెమిస్టర్ ప్రాజెక్ట్ వర్క్ చేసేటప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూలు జరిగేవి. అందులో భాగంగా రిలయన్స్ మా కాలేజీకి క్యాంపస్ ఇంటర్వ్యూ కు వచ్చింది. టెస్ట్ పెట్టారు. వ్రాశాను కానీ సెలక్ట్ కాలేదు. ఆ సందర్భంగా అప్పుడు నా డైరీ లో వ్రాసుకున్న ఆనాటి నా భావాలు :) ఇప్పుడు చదువుతుంటే నిజంగా ఆరోజుల్లో ఉద్యోగం కోసం ఎంత మధనపడ్డానో అని అనిపిస్తుంది :) . డైరీలో ఇంగ్లీష్ లో వున్నదాన్ని తెలుగులో వ్రాస్తున్నాను.
ఉద్యోగాలొచ్చేవాళ్ళందరూ నాకంటే మెరుగైన వాళ్ళా? కాదని కచ్చితంగా చెప్పగలను. మరి దేవుడెక్కడున్నాడు? అసలు నిజంగా వున్నాడా?లేక అదృష్టమే దేవుడా? మరప్పుడు పాపానికి పుణ్యానికి గీత ఎక్కడ? అదృష్టమనేది పుణ్యాత్ములనే వరిస్తుందనుకొంటే మరి నేనంత పాపాత్ముడనా? తప్పకుండా కాదు. మరప్పుడు నాకు ఉద్యోగమెందుకు రాలేదు? నా గతానుభావాల దృష్ట్యా నేనంత అదృష్టవంతుడిని కాదు. తప్పకుండా కాదు. కాబట్టి దేవుడు నావైపు లేడు. కాబట్టి నేను మరింతకష్టపడి ఈ అదృష్టవంతులనెదుర్కోవాలి. ఇది నేను చెయ్యగలనా? చెయ్యాలి.తప్పకుండా చెయ్యాలి.
ఇది నాచెతుల్లో వుందా? ఏమో? లేదు నాచేతుల్లో లేదు.ఈ లోకంలో నేనే దురదృష్టవంతుడినా?దేవుని దృష్టిలో అసలు నాకు స్థానమేలేదా?నేనంత నైపుణ్యములేని వాడనా?లేక మరేదైనానా?
నా జీవితమెటుపోతుంది? అసలు నేనెక్కడవున్నాను.నాకు సక్సస్ అనేది వస్తుందా? నా గమ్యాన్ని నేను చేరుకోగలనా? ఏమిటినాగమ్యం? నాకసలు గమ్యమంటూ వుందా? అసలు అందరిగురించి నాకెందుకు? వదిలేయి. నా గమ్యాన్ని చేరుకోవడానికి నేనేంచెయ్యాలి? అదేమైనా కానీ ఇప్పుడు సమయమాసన్నమైంది. ఏమి చేయాలో విశ్లేషించుకోవాలి.జాగ్రత్తగా గమనించాలి.లోతులకెళ్ళి ఆలోచించాలి. ఇప్పుడు నాముందున్న మార్గాలు రెండు
౧) నాపై చల్లని చూపు చూడమని దేవుని ప్రార్థించడం
౨) గమ్యం చేరడానికి పనిచెయ్యి..పనిచెయ్యి......పనిచెయ్యి
ఈ రెండింటిలో ఏది మంచిది? అసలు నావైపు లేని దేవుడిని ప్రార్థించడమెందుకు?
work.....work..............work
అదండీ సంగతి.అప్పటి డైరీని తిరగేస్తుంటే అనుకోకుండా కళ్ళబడి మోముపై చిరునవ్వు తెప్పించిన పేజీ ఇది. ఇది 1994 నవంబరు 9 వతేదీనాటి నా మనఃస్థితి :)
అదృష్టమంటే "కౌన్ బనేగా కరోడ్ పతీ" లో కోటి రూపాయలు గెలుచుకోవడం కాదు... మీ దగ్గర రూపాయి కూడా లేనపుడు కోట్లు విలువ చేసే స్నేహితు(రాలు)డు నీ ప్రక్కన నిలబడడం అని ఒక సామెత !
రిప్లయితొలగించండిఈ మధ్య ఏది చెప్పినా సభ్యతగా సామెతల్లోనే చెప్పమంటున్నారు.
చిన్నప్పుడు చదివిన ఒకటిన్నర స్నేహితులు కథ గుర్తుకు తెస్తునారు మీరు.
తొలగించండినీహారిక గారూ, ఈ సామెత ఎప్పుడూ విన్నట్టు గుర్తులేదు కానీ నిజమే కదా. జీవితంలో ఏమీ లేనప్పుడు మన వైపు నిలబడే ఒక్క స్నేహితుడున్నా చాలు మరి
తొలగించండివావ్ .. సరిగ్గా నాకు కలిగిన అనుభవం లాంటిదే ఇది.. కాకపొతే మీరు చివర్న చెప్పిన రెండు మార్గాలూ క్రమంతప్పక పాటించాను నేను. ఆ రెండు మార్గాలూ కలిస్తేనే లక్ష్యం చూపుతాయని నమ్ముతాను.
రిప్లయితొలగించండిశ్రీనివాస్ గారూ, అప్పట్లో ఇప్పటికంటే కొంచెం దైవభక్తి మెండేమో. కానీ రాను రానూ అది ఆధ్యాత్మికత వైపు మళ్ళిందేమో ననిపిస్తుంది.దేవుడు వరమిచ్చినా ఇవ్వకున్నా మన కృషి మనం చేస్తే ఎప్పటికో ఒకప్పటికి మనమనుకున్నది నెరవేరుతుంది.
తొలగించండి
రిప్లయితొలగించండి1970 నించి 1994 కి ఇంత లాంగ్ జంప్ చేస్తే ఎట్లా గండీ బాబు !
జీవన యానం అంటూ రాయటం మొదలెడితే ఓపిగ్గా సీరియల్ గా రాయాలి కదా ?
జిలేబి
జిలేబి గారూ, అదంతే :) అసలే లాంగ్ జంప్ లో నేను స్కూల్ ఫస్టు :)
తొలగించండిఎక్కడికో వెళ్లాలని అనుకుంటాము. మనం రోడ్డు మీద డ్రైవ్ చేసుకుంటూ పోతాము. అనుకోని అడ్డంకులు వస్తాయి. గమ్యం చేరటానికి తప్పించుకుంటూ ముందుకు పోవడమే ప్రధానం . అక్కడే detour అనే బోర్డు కూడా కనపడుతుంది మనం గమనిస్తే. ఎవరో వచ్చి ఉద్దరించాలని అనుకోకుండా ముందుకి సాగారు కాబట్టే మేము దానిని గురించి వింటున్నాము.నిజంగా చెప్పాలంటే మనమందరం ఆ బోటు లోనే ఉన్నాము.
రిప్లయితొలగించండిలక్కరాజు రామకృష్ణారావు గారూ, చక్కని ఉదాహరణ నిచ్చారు.
తొలగించండిబాగుందీ అప్పటి మీ స్థితి ...ఉద్యోగం కోసం ప్రయత్నించేప్పుడు కలిగే సహజ స్థితి ....జీవనయానాం లాంగ్ జంప్ చేసేసారు ;-)
రిప్లయితొలగించండిజీవనయానం నెలకొకటి రాయడానికి ప్రయత్నిస్తానండి. సమాచార సేకరణ కు సమయం పడుతుంది కదా. ఈ పోస్టు మధ్యలో పిట్టకథలాంటిది:)
తొలగించండి