19, నవంబర్ 2017, ఆదివారం

పదవరోజు జగన్ పాదయాత్ర. జిలేబికి కంద గడ్డలతో సవాల్ :)

జగన్ పదవరోజు పాదయాత్ర చేస్తుండగా కోవెలకుంట్లకు చెందిన ఓబులేసు వచ్చి తనకుమారునికి "మాట" సాయంచేయమని అర్థించాడు. దాని తాలూకూ సాక్షిలో వచ్చిన క్లిప్పింగ్ యిది.  దాని క్రింద ఆ వార్తకు నా పద్య రూపం. జిలేబీ కి  కందాల సవాల్ తో :)




ప్రాయము జూడారేండ్లు స
హాయము గోరొచ్చితిమి మహాత్మ పలుకులే
దాయె కుమారునికి ప్రజా
నాయక పలు చోట్ల తిరిగినామిఫలురమై

ఆరోగ్యశ్రీ  చెల్లదు
నోరార పిలిచిన పల్క నోపడె మాఱే
డారున్నొక్క లకారము
గోరెన్వైద్యులు చికిత్స కోసమె ఘనుడా


అదివినిన జగన్ విచలిత
వదనమున చికిత్స చేయు ప్రక్రియ సాగిం
ప దయన సోదరుని పిలిచి
కొదకొని యీ పని వదలకు కొండా యనియెన్

7 కామెంట్‌లు:


  1. అన్నా ! నీవు గదయ్య అండ! జనమంతా కావుమన్నా యనన్
    ఉన్నాడండగ పాదయాత్రలని వూరూరన్ సదా సేవలో,
    కన్నీరుల్ వడ గళ్ళు గా జగనుడే కాపాడ వచ్చే నయా
    చిన్నారిన్ గని సాక్షి పత్రికయటన్ చిందింప బాక్సైటమున్
    కన్నారీ సయి భాస్కరన్న పదముల్ గాదే జిలేబీయమై !


    కందోత్సవ శార్దూలోత్సవ ...

    జిలేబి :)

    రిప్లయితొలగించండి


  2. అబ్బోడి వైద్యమునకై
    డబ్బులు దండిగ వలయును రక్షించన్నా !
    గప్పున చూడ్రా కొండా
    చప్పున డాక్టరును, ఖర్చు "జమిలి కటారీ" :)

    జిలేబి

    రిప్లయితొలగించండి


  3. అండగ నీవే గద మా
    కండబ లమునీవుగాద! కష్టము లోనన్
    నిండా కాపాడు మయా
    దండిగ ఖర్చులు! జగనుడ! దావంతమయా !

    రిప్లయితొలగించండి


  4. కొండా రెడ్డీ రారా
    అండగ పోరా జిలేబు లన్వేసెదరౌ
    నిండుగ సాక్షి యదేరా
    మెండుగ సాయమ్ముగాన మెత్తురు జనులున్ :)

    రిప్లయితొలగించండి

  5. వైయస్సారు కుమారుడా ! జగనుడా ! వైవిధ్యమైనట్టిదౌ
    నీయాత్రన్ జను లెల్ల మేలు గనగా నిక్కమ్మెలక్షన్లలో
    చేయూతల్ జను లివ్వటమ్ము ,పదవిన్ చేబట్ట గానన్, భళా
    ఓయబ్బో! తనయుండుమించె జనకున్ ఓటేసి నామే యనన్ :)

    రిప్లయితొలగించండి


  6. నిండాడబ్బులుకావలెన్ కరుణ తో నిండంగ గుండెల్ భళా
    కొండారెడ్డినిబిల్చె! అండ గనుమా కొండంత బిడ్డోడికై!
    జండాబట్టుదురెల్లరున్ననుజ ! భాజాయింత్రుమేళమ్ములన్
    అండాదండగయబ్బవోలె మనకున్ ఆంధ్రప్రజానీకముల్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. అమ్మో జిలేబి గారు ఇన్ని పద్యాలా? బాగు బాగు :)

    రిప్లయితొలగించండి

Comment Form