8, నవంబర్ 2008, శనివారం

చంద్ర యానం - నా ఆత్మ కథ.



నా పేరు చంద్రయనం -1. ఇంతకీ నాకేపేరు ఎందుకు పెట్టారో తెలుసా? హిందూ దేశం నుండి చంద్ర మండలానికి ప్రయాణించే మొదటి ఉపగ్రహాన్ని నేనే. నాకు చాలా గర్వంగా వుంది మన బంధువుతో (ఎంతైనా మామ కదా, పిల్ల నిస్తాడని ఆశ) కబుర్లు చెప్పుకోవాలని. ఎప్పుడూ పురణాళ్ళో చందమామ నవ్విందనో , శివుడి ప్రియురాలనో, వినాయకుని శాపమనో వినడమే తప్పించి చూసింది లేదాయె.

సరే ఇంక విషయానికి వస్తే, మా ముత్తాతలు (ఆర్యభట్ట,భాస్కర,యాపిల్), అమ్మమ్మలు (రోహిణి, స్రాస్ -- కాసేపు స్రవంతి అనుకొండీ) మా తాతలు ( ఇన్సాట్,ఐ ఆర్ యెస్) యిలాంటి ప్రయాణాలు చెశారు. ఇంతెందుకు ఈమధ్యే మా అన్నయ్య కార్టొశాట్,ఐ యెం యెస్) కూడా క్షేమంగా వెళ్ళారు. ( పేర్లు కొంచెం విచిత్రంగా ఉన్నయా... కలి కాలమండి..ముత్తాతలు, అమ్మమ్మ పేర్లు లాగా లెవు కదా? ఐనా నాకు మంచి పేరే పెట్టారు కదా?). మరి యింతమంది వెళితే నాకు భయమెందుకనా మీ ప్రశ్న? సరే చెబుతా వినండి. వీళ్ళందరు భూమికి దగ్గరగానో(>500 కి.మీ) భూమధ్య రెఖ చుట్టూరా,ఉత్తర దక్షిణ ధ్రువాల చుట్టురా ( పోలార్ ఆర్బిట్స్) లేక కొంచెము దూరంగానో (౩6000 కి.మీ - జియో సింక్రొనస్ ఆర్బిట్) ప్రయాణించారే తప్ప నా లాగా వెరే ఊరికని ఎగేసుకుంటూ 3,84,403 కి.మీ ఎవరూ వెళ్ళళేదు. సరే ఈ ప్రయాణ రహదారుల గురించి తీరిగ్గా ఇంకొసారి మాట్లాడుకుందాము ముందు నేను ఎలా పుట్టానో వినండి.

అసలు నా పుట్టుకే చాలా సంక్లిష్ఠం. నేను పుట్టక ముందే మన శాస్త్ర వేత్తలు నా జీవిత కాలము 2 సంవత్సరాలని నిర్ణయించారు.దానికి తోడు నేను అమితమైన వేగాన్ని,వేడిని,నీలలొహిత కిరణాల్ని తట్టుకునేట్టు నా శరీరాన్ని మల్చారు.నా జీవిత కాలంలో నేనేమేమి చెయాలో కూడా ముందే నిర్దేశించారు.నా ప్రయాణనికి కావలసిన ఆహారాన్ని(ఘన,ద్రవ ప్రొపెల్లెంట్ ), నేను ఏ దిశలో చందమామ దగ్గరకి వెళ్ళాలో అన్నీ వాళ్ళే దగ్గరుండి మరీ చూసుకున్నారు.

మీ కందరికీ ఒకటే మెదడైతే నాకు 11. ఇందులో 5 మన శాస్త్ర వేత్తలవి. 4 ఐరోపా వాళ్ళవి, 1 బల్గేరియ,2 అమెరికావి.వాటి వివరాలివిగో ఓపిక వుంటే చదవండి... లేకపొతే వెళ్ళిరండి.

భరత బిడ్డలు.
---------------
టి.యం.సి : నా పని చంద్రుని చుట్టూ తిరుగుతూ చంద్ర గొళాన్ని 3-డి చిత్రాలుగా చిత్రించడము.నా నయనాలు చలా సూక్షం.నేను అతి దగ్గరగా ను ( 5 మీ దూరం నుంచి ), అతి దూరంగాను (20 కి.మీ) బొమ్మలు చిత్రంచి భూమికి ఎప్పటికప్పుడు చేరవేస్తుంటాను.నా బరువు భూమి మీద 6.3 కె.జి.

హెచ్.వై.సి : చందమామ దగ్గర మణీ,మాణీక్య, మరకత రత్నాలున్నయని వాళ్ళు వీళ్ళూ చెపితే వినడమే కానీ, మీకు నాకు ఖచ్చితంగా తెలియదు కదా! నేనా పని లో సిద్ధ హస్తురాలిని. నా బరువు భూమి మీద 2.5 కె.జి.

యెల్.యెల్.ఆర్.ఐ: నేను లేకుండా నా ( ఉపగ్రహ) శరీరము చంద్రుని చుట్టూ తిరగడము కష్టం.నేను ఎప్పటికప్పుడు చంద్ర కక్ష లో ఎంత ఎత్తులో వున్నానో చెప్పక పొతే చంద్రుడు నన్ను తనలో కలిపేసు కుంటాడు (గ్రావిటీ వల్ల ఉపగ్రహము కూలి పొతుంది).నా బరువు భూమి మీద 11.37 కె.జి

హెచ్.యి.యెక్స్: నేను చందమామ మీద ఏమైనా ఘన మంచు వుందేమో అని విశ్లేషిస్తాను.నా బరువు 14.4 కె.జి.

యెం.ఐ.పి: నేను దురదృష్ట ( అదృష్ట) జాతుకు రాలిని. వెళ్ళీ వెళ్ళగానే నన్ను ఉపగ్రహము లో నుంచి నెట్టి వేస్తారు (హత్య చేస్తారు) . మొదటిగా చంద్రుని మీద కాలు పెట్టేది నేనే.నా పని భవిష్యత్తు లో ఉపగ్రహము చంద్రుని మీద ఎక్కడ ఎలా దిగలో విశ్లేషించడము.నా బరువు 35 కె.జి. అన్ని మెదడుల లోకి బరువైన దాన్ని నేనే.

ఐ.రో.పా పుత్రికలు
--------------------
సి1.యెక్స్.యెస్ : నేను బహు విచిత్ర మైన దాన్ని.నాపని చంద్రుడు ఎలా పుట్టాడో కని పెట్టడమే.నా బరువు 5.2.కె.జి

యెస్.ఐ.ఆర్-2 : నేను చందమామ తలాన్ని క్షుణ్ణంగా పరీక్షిస్తాను.చందమామ మీద అలజడులు అన్నీ నేను చూసి మీకు చెప్తాను.

సారా: నా పేరుకు తగ్గట్టే ( సారా (యి)) నేను పైవేవి కాకుండ సూర్య రస్మి చంద్రుని మీద ఎలా ప్రభావము చూపుతుందో ( సోలార్ విండ్స్ ) కని పెట్టి మీకు చెప్తాను. నా బరువు 4.5 కె.జి.

బల్గేరియ బిడ్డ
---------------
రా.డం: నేను చంద్రుని మీద రేడియేషన్ [ తెలుగు పదము ?] ఎంత, ఏ క్రమంలో వుంటుందో ఎప్పటికప్పుడు సమా చారము చేరవేస్తాను.నా బరువు 160 గ్రా.

ఎ.బి.సి.డీ (అమెరికన్ బోర్న్ క న్ ఫ్యూ జ్డ్ దేసి)
-------------------------------------
మిని.సార్ : చంద్రుని మీద కొన్ని ప్రదేశాలు ఎప్పుడూ నీడలోనే వుంటాయి.అలాంటి చోట పై పొరల్లో ఘన మంచు గడ్డలు ఏమైనా ఎవరైనా పారేసుకున్నరో ఏమో అని ఆశగా వెదకడమే నా పని.నా బరువు 8.77 కె.జి.

యెం 3: నా పని చంద్ర గొళ వుపరితలాన్ని దాని స్వరూప స్వభావల్ని ద్రిష్టిలో వుంచుకుంటూ ఖనిజాల పటాలని తయారు చెయడము.నా బరువు 8.2 కె.జి.

హమ్మయ్య,నా మెదడూ గురంచి చెప్పడానికే చాలా టైం పట్టింది.ఇంక నా ప్రయాణ విషయాలు,నేను ప్రయాణించిన మార్గము, అసలు అలాగే ఎందుకు వెళ్ళలో చెప్పలంటే చాలా చాలా వుంది. కాని నాకు ఇప్పుడు చెప్పే తీరికా లేదు మీకు వినే వోపిక లేదు. మళ్ళీ రెండు,మూడు రోజుల్లో కలుద్దాం.


( చంద్రయాన్ లునార్ ఆర్బిట్ లో చంద్రునికి దగ్గర అయిన సందర్భం గా )

1 కామెంట్‌:

  1. మీరు ఈ టపా కట్టిన రోజే బాగుంది అనుకున్నాను. కానీ వ్యాఖ్యానించలేదు.

    రిప్లయితొలగించండి

Comment Form