17, ఫిబ్రవరి 2009, మంగళవారం
శరదృతు వెన్నెల
ఈ రోజు బాపురెడ్డి గారి గేయ సంపుటి చదువుతుంటే మనసు శరదృతు వెన్నెలలో ఆరు బయట చంద్రుణ్ణి చూస్తున్నంత ఆనందం కలిగింది. ఇంకా చెప్పాలంటే తెలిమంచు పొరలలో తూర్పు సూర్యబింబాన్ని చూస్తున్న ఆనందం తో పాటి మధ్యాహ్న గ్రీష్మ తాపంలో నిండు సెలయేటి ఒడ్డున సేద తీరిన ఆనందం ! అనుభవించాల్సిందే !
చిట్టి పాప నవ్వు ఎంత నిర్మలమో, తల్లి ప్రేమ ఎంత స్వఛ్చమో, ప్రేయసి పిలుపు ఎంత మధురమో, సముద్రము ఎంత నిర్మలమో... అలాగే బాపు రెడ్డి గారి కవితలు అంత హృద్యం... అంత లోతైనవి.
కవులు కల్పనా చక్షువుల తో చూసినవి బాపు గారి కవితలతో నా తనువు పులకించి స్పర్శించింది.
అందులో నుంచి కొన్ని వాక్యాలు
ఉరు జఘనము బిగువు చనులు
సరితూగగ నడిచింది
వేల మన్మధులను కలచి
వేయు శరము విడిచింది
మంచుపొరల వంటి పైట
మరచి జారవిడిచింది
జగతిగోళ అమరగోళ
యుగళము ప్రకటించింది
మెయి వంపులతో వలపుల
మెరుపువోలె మెరిసింది
నాలో ఒక భావ వసం
తమును నాటి పోయింది.
ఇది బాపురెడ్డి గారు 60 వ దశకంలో వ్రాసుకున్నా ఎంత సనాతనమో చూడండి.
సంవత్స్రరమంతా వా
సంతమ్మే శోభిస్తే
పికర సంగీతం క
ర్ణ కఠోరమ్మౌ నేమో ?
కోరినప్పుడెల్లా ఓ
కోమలి కౌగిలి లభిస్తె
ప్రణయ ప్రపంచంలో
పసయేమీ ఉండదేమొ
మరణ రోగముకు పక్కా
మందే కనిపెట్టబడితె
చావడం అనేది గడ్డు
సమస్య అవుతుందేమో?
మరుపు అనే గుణం మనిషి
మనసు నుండి తొలిగిస్తే
చిరస్మృతులు అతని గుండె
చీల్చి కాల్చివేయునేమొ?
నారీ వస్తువునే రచ
నల్లోన నిషెదిస్తే
రచయితలకు అసలు ఉఫ్ఫు
రాళ్ళైనా పుట్టవేమొ?
అధికారాలు లభించే
అవకాశాల్లేకపొతె
వినాయకుల సంఖ్య ఇంత
విపరీతం కాదేమొ?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
బాగుందండి టపా. ముద్రా రాక్షసాలున్నాయి, సరిచేయండి..
రిప్లయితొలగించండి@మురళి గారూ, మీ సూచనకి ధన్యవాదాలు. ఎప్పటికప్పుడు వీటి బారినుంచి బయట పడాలని ప్రయత్నిస్తున్నా చాలావరకు నా అశ్రద్ధ వల్ల, కొన్ని సార్లు తెలుగు ని ఇంగ్లీష్ లో టైపు చేయడము వల్ల ఇవి దొర్లుతూనే వున్నాయి.
రిప్లయితొలగించండి