9, ఆగస్టు 2009, ఆదివారం

మిగతాది రేపు... ఆ రేపు ఎప్పుడు వచ్చునో





మనసు రాగానికి
హృదయ నాదానికి
కొమ్మపై కోకిలమ్మ
గొంతెత్తి పాడింది.

ఉషోదయ సమయాన
శాంతిలేని మదిలోన
మొలచిన దొక చిరు మొలక

మరిగే రక్తం పాదరసమై
కొమ్మ కొమ్మన క్రమ్ముకుంటే
విరిగిన మనసే రెమ్మలుగా
చైతన్య కీలలె కొమ్మలుగా
హృదయ జ్వాలలె ఊడలుగా
ఎదిగిందొక మహా వృక్షం.

ఓ ప్రభాత సమయాన...

గుండె వేగమెక్కి
నరాలు పగులగొట్టి
క్షణాన మదిని దాటి

నదులపై నడయాడి
అలలపై నాట్యమాడి
మైదాన రహదారుల
వడి వడిగ నడచి

చిట్టడవుల చీకటి చీల్చి
అగ్ని కీలల చెరను దాటి
వేలగొంతుల వెర్రి కేకల మధ్య
విచ్చుకత్తుల రాక్షస చూపుల మధ్య
చేరిందొక మానవ వాసం
చూసిందొక అలజడి రాజ్యం.


కనిపించే ప్రేమ చాటున
కనిపించని కారు మబ్బులు.
వెన్న పూసిన మాటల నడుమ
మెత్తని చురకత్తులు.


శాసించే వ్రేలును చూసి
మ్రుక్కలైన బ్రతుకులెన్నో
నిందించే చూపులలో
పగిలిన గుండెలెన్నో..

విర్రవీగే మనుషుల జూసి
వంగి నడిచే మనసులు చూసి
దిక్కు మాలిన బ్రతుకుల మధ్య
బండబారిన గుండెల జూసి
చిక్కిన మానవ శిలాజాల
చిందింన రక్తం జూసి

నక్షత్ర మేడల్లో
కాంక్షన కాగే కాంతలు
అంగడి కొట్టుల్లో
ఆకలిన రగిలే రంభలు.

నిందించే చూపుల దాటి
నిద్రించే మనసుల దాటి

.
.
.



గొంతు గొంతులో ప్రతిధ్వనించదా
నర నరాన పొంగి పారలదా?

అడవి దాటి నడవదా కోకిల గానం.
వనము విడిచి పారదా కాంతి తరంగం.




మిగతాది రేపు. ఆ రేపు ఎప్పుడు వచ్చునో :-)

అందుకని చదువరులు ... దగ్గర ఎవరికి తోచింది వారు వ్యాఖ్యల రూపంలో పూరించుకోండి. ;)

6 కామెంట్‌లు:

  1. నా తరఫున పూరింపు శ్రీ శ్రీ భా.రా.రె గారికి outsource చేయటమైనది. ;) "హృదయ జ్వాలలె ఊడలు, మానవ శిలాజాల.." ఇంకెన్నో అరుదైన అద్భుత ప్రయోగాలు. వెల్లువైన జలపాతం మాదిరి ఈ కవితావేశం. అమోఘం.

    రిప్లయితొలగించండి
  2. శ్రీ శ్రీ భా.రా.రె గారు ప్రస్తుతానికి Insource పనులతోనే ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇంక outsource గీతకలు కూడానా ? :)

    రిప్లయితొలగించండి
  3. ‘fill up the blanks’ పూరించడంలో మా చరిత్ర అంత బాగాలేదే

    రిప్లయితొలగించండి
  4. అలా అసంపూర్తిగా ఆ మూడు చుక్కలు వదిలితే మేం ఒప్పుకోము ......

    రిప్లయితొలగించండి
  5. మీ హృదయ స్పందనల నుండి వెలువడిన కవితామాధుర్యాన్ని ఆస్వాదించక, మరల దాన్ని పూరించ సాహసము చేయనేల చెప్పండి?...:)

    రిప్లయితొలగించండి
  6. వ్యాఖ్యాతలందరికీ ధన్యవాదాలు.ఏంటో ఒక్కరు కూడా పూరీలు ఖాళీ చేయకుండా ఒగ్గేసినారు.;౦)

    రిప్లయితొలగించండి

Comment Form