27, సెప్టెంబర్ 2010, సోమవారం

ప్రియురాలికి వేడుకోలు - తానన తానన తానననా తన తానన తానన తానననా

ఈ మధ్య ఛందస్సు మీద ప్రయోగాలు చేస్తున్నా కదా. అలా చేస్తూ చేస్తూ గూగుల్ గుంపులో [ జెజ్జాల కృష్ణమోహన రావు గారు ] మానిని కి ఒక లయ చూసాను. ఈ మానిని పద్యానికి వరుసగా ఏడు భగణాలు తరువాత ఒక గురువు వస్తుంది. ఏడు, పదమూడు, పందొమ్మిది అక్షరాలు యతి.

అయితే మనకు ఏకంగా మూడు అక్షరాల యతి వేసే సీను లేదు కాబట్టి ఇలా కానిచ్చేసాను. అందుకని ఈ క్రింద పద్యములో (?) యతి ఏడవాక్షరానికి మాత్రమే సరిపోతుంది. ప్రాస వున్నట్టే వుంది కదా :-). అందుకని ఇది మలినమైన మానిని అన్నమాట.

ప్రేమను పంచిన ప్రేమికవే ఇల ప్రేమకు మారుగ నిల్చితివే
ఆమని కోయిల పాటవులే ఇక కొమ్మగ వచ్చిన చాలునులే
నెమ్మది నెమ్మది నిండితివే మరి నామది నిండుగ నిండితివే
సమ్మత మియ్యవె చంద్రలతా ఇల కమ్మటి మాటను మోదముగా






అయితే ఇదే పద్యాన్ని

1) ప్రేమను పంచిన ప్రేమికవే
ఇల
ప్రేమకు మారుగ నిల్చితివే

2) ఆమని కోయిల పాటవులే
ఇక
కొమ్మగ వచ్చిన చాలునులే

3) నెమ్మది నెమ్మది నిండితివే
మరి
నామది నిండుగ నిండితివే

4) సమ్మత మియ్యవె చంద్రలతా
ఇల
కమ్మటి మాటను మోదముగా


ఇంతకీ ఈ పద్యపు గణాలు 7 భగణాలు 1 గణము ఐనా ఈ క్రింది లయ మాత్రం నాకు తెగ నచ్చేసి పైన పద్యం వ్రాసుకోని asusual ఇలా ఇక్కడ వేడుకోళ్ళు అన్నమాట. అదేలేండి..కామెంటు వేడుకోళ్ళు :-)

తానన తానన తానననా
తన
తానన తానన తానననా

10 కామెంట్‌లు:

  1. ఇంచుమించుగా ఇల్లాంటిదే, కొద్దిపాటి తేడాతో ..
    కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో

    రిప్లయితొలగించండి
  2. కొత్తపాళి గారూ, వ్యాఖ్యకు ధన్యవాదాలు. ఇక వారి ఇంటిపేరు మీరు చెప్పినట్టుగా మార్చాను. ఏమిటో నాలుగు కళ్ళున్నా ఇంకా దృష్టిలోపమేమో :-)

    కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో.. ఇంతకీ ఇది ఏపద్యమండి?

    రిప్లయితొలగించండి
  3. భస్కర రామి రెడ్డి గారు, అది శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం కదండి.

    రిప్లయితొలగించండి
  4. జయ గారూ, సుప్రభాతమని తెలుసుకానీ, అదికూడా ఏదో ఒక లయ ననుసరించిన శ్లోకమే అనిపిస్తుందండి. అది తెలుసుకుందామని అడిగాను. మీరు నా పేరులోంచి గారు తీసేస్తే బాగుంటుందండి.

    రిప్లయితొలగించండి
  5. మానినిపై ప్రేమ కవిత్వమాయె. ఇక "యతు"లెందుకుంటారక్కడ :-)
    బాగుంది పద్యం.

    కమలాకుచ చూచుక - తోటక వృత్తం

    రిప్లయితొలగించండి
  6. @కామేశ్వర రావు గారూ.. మా మధ్యలో మళ్ళీ ఆ "యతు" ల గోలెందుకని వదిలేసాను. అయినా పాద పాదానికి ముగ్గురు "యతులు" చేరి ఇక్కడ అలా చెయ్యాలి అక్కడ ఇలా చెయ్యాలి అంటే ఇంక మాకు ప్రైవసీ ఎక్కడ సార్ ;)

    కమలాకుచ... సందేహ నివృత్తికి ధన్యవాదాలు.

    @కొత్తపాళీ గారూ.. కేక ఒక్కటేనే.. :-) రచ్చ రచ్చ అని కూడా అనాలి :-)

    రిప్లయితొలగించండి
  7. బాగుంది రామి రెడ్డి. గణ విభజన అది తెలియదు కాని రాసిన పద్యం బాగుంది.

    రిప్లయితొలగించండి
  8. భావనా, నచ్చినందుకు బోలెడు ట్యాంకుల నిండా థ్యాంకులు. :-)
    గణ విభజన ఎందుకు ఆ ట్యూన్ పట్టుకోని వ్రాసుకోవడమే.

    రిప్లయితొలగించండి

Comment Form