28, సెప్టెంబర్ 2010, మంగళవారం

అనుకూలవతి నా ఈ మానిని :-)

మరొక మానిని. ఈ మానిని నాకు కొంచెం అనుకూలవతి. అందుకని నిన్నటిలాగా మరీ బెట్టు చేయకుండా 7 వ అక్షరం తో పాటుగా 13 వ అక్షర యతికి కూడా ప్రమోషన్ ఇచ్చింది. కానీ పూర్తిగా ఇంకా దరిచేయనీయ లేదు. ఇంకా "పొందుదుగా" దగ్గరే ఆపేసింది :-) మానిని పద్యం. [ ఆ ఒక్కటి తప్ప. అదేలేండి 19 వ అక్షరం యతి తప్ప. :-) ] వేకువ ఝామున వెన్నెలలో కను విందుగ పూసిన పువ్వులలో రేకుల పువ్వుల రేణువులో చెల రేగిన వెన్నెల కాంతులలో తాకిన మన్మధ తాపముతో తన దాపున వెచ్చని కోరికతో ఆకుల మాటున మోదముగా చెలి చక్కని అందము పొందుదుగా నిన్నటిలాగే పాదాలను విడమరిచి వ్రాస్తే ఇలా వేకువ ఝామున వెన్నెలలో కను విందుగ పూసిన పువ్వులలో రేకుల పువ్వుల రేణువులో అల రేగిన వెన్నెల కాంతులలో తాకిన మన్మధ తాపముతో తన దాపున వెచ్చని కోరికతో ఆకుల మాటున మోదముగా చెలి చక్కని చందము చూచెదగా /కాంచుదుగా/పొందుదుగా లయ మాత్రం నిన్నటిదే ...... తానన తానన తానననా తన తానన తానన తానననా

5 కామెంట్‌లు:

  1. చాలా బాగుందండి. చిన్న సవరణ. మొదటి పాదంలో "ఝామున" అని ఉండాలనుకుంటాను. ఆఖరి పాదంలో మీకన్నీ యతులు కావాలనుకుంటే ఇలా రాయొచ్చేమో - ఆకుల చాటున చోద్యముగా చెలి చక్కని చెలువము చూచెదగా

    రిప్లయితొలగించండి
  2. "ఆకుల చాటున చోద్యముగా చెలి చక్కని చెలువం చూచెదగా"

    రిప్లయితొలగించండి
  3. కేకే గారూ మీరు చెప్పిన విధంగా "ఆకుల చాటున చోద్యముగా చెలి చక్కని చెలువం చూచెదగా" మారిస్తే గణం తప్పుతుందండి.

    రిప్లయితొలగించండి
  4. సారీ..గమనించలేదు..."చెలి చక్కని చందము చూచెదగా" అంటే ఎలా ఉంటుంది?

    రిప్లయితొలగించండి

Comment Form