ఈ యజ్ఞంలో తమ సహాయ సహకారను అందించడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరూ మరో విషయం ఇక్కడ గమనించాలి. మనం తలపెట్టిన పని సులభమైన పని కాదు. అలా అని చేయబూనుకున్న పనికి అసాధారణ తెలివితేటలూ అవసరం లేదు. ఇది పెద్ద బండపని. చేసే పని మీద గౌరవం లేకపోతే మొదటి గంటలోనే బోర్ కొట్టవచ్చు. కారణం మనం చేయబోయేది తొలివిడతగా మనకు అంతర్జాలంలో ఉచితంగా దొరుకుతున్న నిఘంటువులను యూనికోడ్ లో టైపు చేయడమే. అంతర్జాలంలో యూనికోడ్ లో ఇప్పటికే బ్రౌణ్యము, లభ్యమౌతున్నాయి కాబట్టి మనం మరో నిఘంటువుతో పని మొదలెడదాము.
ఇక సూర్యరాయాంధ్ర నిఘంటువు, ఇది చాలా మంచి పుస్తకమని పలువురు చెప్తున్నారు. మొత్తం 6 పుస్తకాలల్లో పుస్తకానికి 6,000 పేజీల చొప్పున మొత్తం 36,000 పేజీలున్న నిఘంటువట. ఈ పుస్తక ప్రతిని ఎవరిదగ్గరైనా దొరుకుతుందేమో చూడాలి. ఒకవేళ దొరికినా అన్ని వేల పేజీలను మనము మాత్రమే టైపు చేయడం సాధ్యంకాదు కాబట్టి ఎవరైనా Dataentry opertators దొరికితే వారి సేవలు వుపయోగించుకొనే మార్గాన్ని అన్వేషిస్తే బాగుంటుందేమో. ఫండ్ రైజింగ్ మార్గాలనీ అన్వేషించవచ్చు.
ఇక మీకు తెలిసి తెలుగు కు ఏవైనా OCR softwares వున్నాయా? లేకపోతే ఇటువంటి software ని develop చేయడానికి కావలసిన పరిజ్ఞానం మనలో ఎవరివద్దనైనా వుందో లేదో తెలియదు. లేకున్నా వారి సమయాన్ని వెచ్చించి తయారు చేయగలిగితే సులభంగా అతి తక్కువ కాలంలో ధనవంతులు కావచ్చు. సరదాకు కాదండోయ్..నిజంగానే చెప్తున్నాను. any takers? దీనివల్ల వుపయోగం ఏంటంటే, ఇప్పడిదాకా scan చేసి పెట్టిన పుస్తకాలన్నింటిని అతి సులభంగా unicode లోకి మార్చేయవచ్చు. అంటే out of the box ఈ OCR 90% convert చెయ్యగలిగినా మన పని చాలా సులభమైనట్లే.
ఇక ఇప్పటిదాకా తమ తమ ఆసక్తిని కనబరుస్తూ వ్యాఖ్యానించిన వారు.
1)హరి
2)ఆ.సౌమ్య
3)భాను
4)ఉష
5)భాస్కర రామి రెడ్డి
6)కొత్త పాళీ
7)..nagarjuna..
8)మంచు
9)Spoorthi
10)Kalpana Rentala
11)ప్రణవ్
12)Gopal Koduri
వీరు వ్యాఖ్యానించారే కానీ వారి సమయాన్ని కేటాయిస్తారో లేదో ఇంకా చెప్పలేదు కాబట్టి విడిగా ఇక్కడ వ్రాస్తున్నాను.
1)ఏక లింగం
2)ఇనగంటి రవిచంద్ర
3)శివరంజని
4)oremuna
5)భైరవభట్ల కామేశ్వర రావు
6)బ్రహ్మానందం
ఇప్పుడు మనకు కావాల్సింది ఒక common platform. ఈ common platform కంటే ముందు ప్రాజెక్టును సమర్థవంతంగా నడుపగల ప్రాజెక్టు మేనేజర్స్. project manager అంటే పెత్తనం చెలాయించడం అనుకొనేరు :-) వీరికి మనకన్నా ఎక్కువ బాధ్యత అన్నమాట. మనం చేసే Dataentry ని చేస్తూ మిగిలిన పనులను చక్కదిద్దడం అన్నమాట.
ఇక పని మొదలు పెట్టటానికి ముందు మనకు ఒక వేదిక అవసరం కదా. నా బ్లాగు దానికి అనువైన చోటు కాదు కాబట్టి ఒక వేదిక కేవలం ఈ ప్రాజెక్ట్ పనులకోసమే మొదలెట్టి అక్కడ దీనికి కావలసిన requirements, project progress మొదలైనవి చర్చిస్తే బాగుంటుంది కదా. ఏమంటారు? మంచి పేరును సూచిస్తే మరొక బ్లాగులో అందరం సభ్యులగా చేరి [ restricted blog] మొదలు పెడదాము. ఇంతకీ group blogging ఎలా చెయ్యాలో నాకు తెలియదు. మీరు మీపేరు కాకుండా వేరే కలంపేరుతోనైనా రావచ్చు.
ఇక టెక్నికల్ గా సహాయపడటానికి ముందుకు వచ్చినవారు ఒక పది నిఘంటువులను పరిశీలించి Data Stuctures, Database design లాంటివానికి శ్రీకారం చుడితే బాగుంటుంది. వెబ్ లో మనకు ఉచితంగా internet archive అనే సైటులో చాలా వరకు నిఘంటువులు దొరుకుతున్నాయి.Download చేసిన కాపీలు నావద్ద కొన్ని వున్నాయి. అవన్నీ క్రొత్తగా రాబోయే వేదికలో వుంచుతాను.
ఇక మన project వాడకపు దార్లు ప్రజలే కాబట్టి, అసలు ఈ నిఘంటువు ఎలా వుండాలని మీరు కోరుకుంటున్నారు. అసలు నిఘంటువులో ఒక పదానికి వుండవలసిన లక్షణాలు ఏమిటి? అంటే భాషాభాగం, దాని వాడుక, ఎక్కడెక్కడ సాహిత్య లేదా ప్రజా వాడకంలో ఎలా వాడారు ఇలాంటివన్నమాట. మనలో పెద్దపండితులు లేరు గనక ఇప్పుడు లభ్యమవుతున్న నిఘంటువులను పరిశీలించి మన సొంత Data Stuctures వ్రాసుకోవడమే మేలని నా అభిప్రాయం.
చివరిగా సూర్యరాయాంధ్ర నిఘంటువు ఎవరిదగ్గరైనా లభిస్తుంటే దయచేసి వివరాలను నాకు e-mail చేయగలరా? నా మైల్ ఐ.డి. ramireddy@haaram.com.
విజ్ఞానాన్ని దాచి వుంచుకొని పలువురికి ప్రదర్శిస్తూ, గొప్పగా ఫీల్ అవుతూ అది వేరే వారికి ధారాదత్తం చేస్తే తమ కీర్తి ప్రతిష్టలకు ఎక్కడలోపమనో ఏమో కానీ మనకు భారతావనిలో లభించే బొచ్చెడు విజ్ఞానం ఇప్పుడు ఎవరికీ అర్థంకాని దుస్థితికి చేరుకొని మరణశయ్యపై విగతజీవిగా పడివుంది. కనీసం ఇప్పుడు మనకున్న ఈ తెలుగు సంపదనన్నా ఇలా పదిమంది వుంచాలన్న ఆశ తప్పించి ఇందులో ఇంకే విధమైన దురాశ లేదు.
ముందు సహాయం చేయాలా వద్దా అని సంశయించిన వారు కూడా అలోచించి సహకరించాలనుకుంటే చేరండి. అలాగే ఆవేశంలో సహాయం చేయడానికి ముందుకువచ్చిన వారు కూడా :-)
ముందుగా లక్ష్యాల సాధనకై అందరికీ అనువైన ఓ వేదికని
రిప్లయితొలగించండిగూగులు గుంపులలో ప్రారంభించండి.. (మోడరేటెడ్ గ్రూప్)
మా ఇంట్లో, మా నాన్న గారి వద్ద మీకు శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువులు ( మొత్తం 8 భాగాలు అనుకుంటా) మీకు లభిస్తాయి. వివరాలకై నన్ను సంప్రదించండి...
రిప్లయితొలగించండి--శ్యాం--
మనవాణి, రాత్రికి google group create చేసి పోస్టు update చేస్తాను
రిప్లయితొలగించండిశ్యాం మీ e-mail id ని ఇవ్వగలరా? మీరు శ్యాం పుల్లెల గారా?
లేదండీ...నన్ను శ్యాంకందాళ అంటారు.. నన్ను మీరు shyamkandala@gmail.com లో సంప్రదించవచ్చు.
రిప్లయితొలగించండిభా.రా.రె గారూ,
రిప్లయితొలగించండిమంచి ప్రయత్నము. టపా సావకాశముగా మళ్ళీ చదివి నా వ్యాఖ్యలు తరవాత పెడతాను. అప్పటి వరకు నన్ను కూడా ఆ మొదటి లిష్టులో ఉంచండి.
శ్యాం, మీ మైల్ చూసి నిజంగా ఉత్సాహం వచ్చిందండి. ఇలాంటి సహాయం ఇంత త్వరగా రాగలదని నేను కలలో కూడా అనుకోలేదు.
రిప్లయితొలగించండితెలుగు యాంకీ, తప్పకుండా మీ సహాయ సహకారలుంటాయనే ఆసిస్తున్నాను.
రిప్లయితొలగించండిఇంద్ర, మీనుంచి రెండూ తీసుకుంటాము లేండి :). టెక్నికల్ మరియు ఆర్ధిక సహాయం రెండూనూ.
రిప్లయితొలగించండిఇక ఇక్కడ చర్చను ఆపేసి మన వేదికలో మాట్లాడుకుందాము. మీరు, మీరు రోజూ చూసే మైల్ ఐ.డి లను ఇస్తే ఆహ్వానం పంపిస్తాను. If you have any concerns about your identity, please feel free to create seperate mail IDs for this purpose.However we are going to discuss who does what and plan accordingly.
రిప్లయితొలగించండిthe group url is http://groups.google.com/group/telugunighantuvu . This is a restricted group.
పేరైతే ప్రస్తుతానికి "తెలుగు నిఘంటు వేదిక" అని పెట్టాను.
మరో మాట, ఇక్కడ public గా మీ mail ID తో కామెంట్ వ్రాయడం కన్నా, మీ email ID లను ramireddy@haaram.com కి పంపిస్తే మంచిదేమో.
రిప్లయితొలగించండిI remember seeing a Telugu etymological dictionary published over several years (up to 90's or so) in nine volumes by Andhra University. It may be useful
రిప్లయితొలగించండిThere is one by Digavalli Sivarao available at google books. It is an old one focussing on technical terms.
రిప్లయితొలగించండిA google search shows that two volumes of Telugu Vyutpatti Kosam are available on the net:
రిప్లయితొలగించండిhttp://groups.google.com.bd/group/telugublog/msg/fd6aeb3a85052488
గద్దె స్వరూప్ గారు, మంచి సమాచారం ఇస్తున్నారు. చాలా ధన్యవాదాలు మీకు.
రిప్లయితొలగించండిభాస్కర రామి రెడ్డి గారు,
రిప్లయితొలగించండిసూర్యరాయాంధ్ర నిఘంటువు 6,7,8 భాగాలు డిజిటల్ లైబ్రరీ లో దొరుకుతాయి.
వరుసగా 900,520,535 పేజీలు కలిగి ఉన్నాయి.
http://www.new.dli.ernet.in/cgi-bin/test1.pl?next=1&path1=/data_copy/upload/0061/842&first=1&last=900&barcode=2990100061837&button=Go
http://www.new.dli.ernet.in/cgi-bin/test1.pl?next=1&path1=/data/upload/0051/802&first=1&last=520&barcode=2990100051797&button=Go
http://www.new.dli.ernet.in/cgi-bin/test1.pl?next=1&path1=/data_copy/upload/0061/840&first=1&last=535&barcode=2990100061835&button=Go
ఇవే కాకుండా ఇతర నిఘంటువులు కూడా అందులో ఉన్నాయి.
రమణ గారూ సరైన సమయంలో సరైన లింకులు ఇచ్చారు. Thanks alot.
రిప్లయితొలగించండిCheck also
రిప్లయితొలగించండిhttp://teluguthesis.com/index.php?showforum=20
for many reference works
ఈ విజయదశమికి ఆ జగజ్జనని మీకు సకల శుభాలు అందించాలని కోరుకుంటూ............
రిప్లయితొలగించండి- SRRao
శిరాకదంబం
good luck.
రిప్లయితొలగించండిwaiting for the నిఘంటువు as a user!
స్వరూప్ గారూ, సమాచారమిచ్చినందుకు ధన్యవాదాలు
రిప్లయితొలగించండిSRRao గారూ మీకు కూడా విజయదశమి శుభాకాంక్షలు
a2zdreams గారూ, అబ్బో వాడడానికి ఇంకా చాలా కాలమే పడుతుందండి.
భాస్కర్ గారూ,
రిప్లయితొలగించండిసూర్యరాయాంధ్ర నిఘంటువు హైదరాబాద్ లో మా అత్తగారింట్లో ఉంది. కానీ.. ఆ ఇల్లు ప్రస్తుతానికి తాళం వేసి ఉంది. దీపావళి వెళ్ళాక కానీ, నాకు దాన్ని ఆక్సెస్ చేయటం కుదరక పోవచ్చు. ఇంకెక్కడా.. ఈ లోపల మీకు దొరకక పోతే.. నాకు ఈ మెయిల్ చేయండి..
కృష్ణప్రియ.
భాస్కర్ గారూ,
రిప్లయితొలగించండిమీ ప్రొజెక్ట్ ఎంతవరకూ వచ్చింది?
ఆంధ్ర భారతి వారికి తెలుగు విశ్వవిద్యాలయం వారు నిఘంటువు ఆన్‌లైన్ పెట్టడానికి అనుమతి ఇచ్చారట.
http://www.andhrabharati.com/dictionary/index.php
మీరూ వారితో కలిసి పని చేయచ్చు.
జాజర గారూ, it is going live tomorrow and we do not need anybody's permission to digitalize it. We did enough ground work before starting the project.
రిప్లయితొలగించండిRegarding working together.. definitely we can think of it if they share data with us.
Thanks for your comment.