29, అక్టోబర్ 2010, శుక్రవారం

తెలుగు మహారాజపోషకులారా ఇది మీకోసమే

[Post updated with mail ID ]

రెండువారాల క్రితం కొంతమంది బ్లాగర్లము కలిసి తెలుగులో ఒక సరిక్రొత్త నిఘంటువుకు శ్రీకారం చుట్టిన విషయం మీకు తెలిసేవుంటుంది. తెలియని వారు ఈ క్రింది టపాల్లో చూడవచ్చు.

http://chiruspandana.blogspot.com/2010/10/blog-post_13.html
http://chiruspandana.blogspot.com/2010/10/2.html

మొదలు పెట్టిన పని నిర్విఘ్నంగా ముందుకు సాగుతుంది. సాధ్యమైనంత త్వరలో ఈ నిఘంటువును మీముందుకు తీసుకురావడానికి చాలామంది చాలా రకాలుగా తమ సహాయసహకారాలను అందిస్తున్నారు. ఇప్పటికే సభ్యులందరూ తమతమ ఖాళీసమయాల్లో ఈ పనిలో నిమగ్నమై వున్నా చేస్తున్న పని చాలా పెద్దది కాబట్టి తొంభైశాతం టైపింగ్ పనిని outsourcing ద్వారా రాబట్టడానికి ఆర్థిక వనరుల సమీకరణ చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి బీజం ఇక్కడే పడింది కాబట్టి మొదటిగా కావలసిన వనరుల సేకరణ ఇక్కడినుంచే మొదలు పెడుతున్నాము. ఎంత ఇవ్వాలి అనే సందేహాలకు తావులేకుండా ఎంత చిన్నమొత్తానైనా చందాగా స్వీకరిస్తున్నాము. మీవిరాళాలను వ్యాఖ్యద్వారా తెలియచేస్తూ మీ మైల్ ఐడితో ramireddy.mvb@gmail.com కు ఒక మైల్ పంపితే మిమ్మల్ని సంప్రదిస్తాము.

13 కామెంట్‌లు:

  1. మంచి ప్రయత్నము. నా చందా వివరాలు మీకు విడిగా email లో పంపుతున్నాను.

    రిప్లయితొలగించండి
  2. తెలుగు యాంకీ గారు తెలుగుభాషా మహారాజపోషకులుగా $ 50 ప్రకటించారు.

    రిప్లయితొలగించండి
  3. విరాళాలు ఇచ్చిన వారి పేర్లనన్నింటిని వారినుంచి అనుమతి లేకపోవడంతో ఇక్కడ వ్యాఖ్యగా వ్రాయలేకున్నాన్ను. వారికి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. ఆకెళ్ళ సత్తిబాబు గారు $100 విరాళంగా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. కానీ నాకు వీరి బ్లాగు ఏదో తెలియదు :(

    రిప్లయితొలగించండి
  5. ఇక నా విరాళం ప్రస్తుతానికి $516.
    రేపు కొంతమంది ఫ్రెండ్స్ అనుమతి వస్తే పోస్టును తిరిగి అప్డేట్ చేస్తాను.

    రిప్లయితొలగించండి
  6. భ.రా.రె. నా వంతు $1116 నిజానికి ఈ విరాళం నా తెలుగుబడి [ఒక్కతే పంతులమ్మ నడిపే బడి] తరఫున అనుకోండి. నేను ప్రతిక్లాసుకీ తీసుకునే కొద్దిపాటి రుసుం [దబాయించి తీసుకునే గురుదక్షిణ] ఇంతవరకు మా జన్యా సంస్థ కార్యక్రమాలకి తరలించాను. మొదటిసారిగా ఇతరత్రా విద్యా/భాషా సంబంధిత కార్యక్రమానికి ఇస్తున్నాను. మిగిలిన వివరాలు మెయిల్లో ఇస్తాను.

    భాషాభిమానులందరి సహాయసహకారాలతో ఈ ప్రయత్నం మరింత విజయవంతంగా సాగాలని మనసారా అభిలషిస్తూ...

    రిప్లయితొలగించండి
  7. తెలుగు భాషాభిమానిగా మరువం ఉష నిఘంటువేదికలో తమ సమయంతో పాటు $1116 ఇవ్వడం చాలా స్ఫూర్తినిస్తుంది. వారికి నిఘంటు వేదిక తరపున ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  8. మనసున్న బ్లాగరి మనస్వి జయ గారు తమ విరాళంగా 10,000 రూపాయలనివ్వడానికి ముందుకు వచ్చారు. వారికీ నిఘంటువేదిక మనసారా ధన్యవాదాలు తెలుపుతుంది.

    రిప్లయితొలగించండి
  9. మరో సుప్రసిద్ధ బ్లాగరు గారి విరాళం $100. వారికి నిఘంటువేదిక తరపున ధన్యవాదాలు. వారి పేరును,బ్లాగును అనివార్యకారణాలవల్ల చెప్పలేకున్నాను.

    రిప్లయితొలగించండి
  10. ఇలాగే మరికొంతమంది పేరును గానీ,బ్లాగును గానీ చెప్పవద్దని కోరారు. వారి విరాళాలు ఇవి

    Donor 1 : Rs 10,000

    Donor 2 : Rs 2,000

    Donor 3 : $25

    రిప్లయితొలగించండి
  11. భా.రా.రె గారూ మీ యజ్ఞానికి నా విరాళం 2500 రూపాయలు

    రిప్లయితొలగించండి
  12. మా జిల్లా బ్లాగరి [ ఏదో లెండి మీది బందరే మాది బందరే అన్న ఫీలింగ్ :)) ] మరొకరు 2000 రూపాయలు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. వారికీ మా నిఘంటు వేదిక తరపున ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.

    రిప్లయితొలగించండి

Comment Form