4, ఏప్రిల్ 2011, సోమవారం

ఉగాది గానాల జుగల్బంది...మత్తుగా సుతిమెత్తగా :-)


ఈ సారి వెరైటీ గా వ్యాఖ్యలద్వారా ఉగాది కి జుగల్ బందీ. జుగల్ బందీ అంటే మరి వ్యాఖ్యలు చేసే వాళ్ళు కావాల కదా. అసలే వ్యాఖ్యలకు గడ్డుకాలం అదీ పండగ పూటంటే మళ్ళీ విప్పిచెప్పాలా? అందుకని ముందు జాగ్రత్త చర్యగా అనానిమస్ వ్యాఖ్యలు కూడా ఎనేబుల్ చేస్తున్నాను. ఎందుకంటే కామెంట్లు తగ్గాయనుకోండి, అప్పుడు అనానిమస్ గా నేనే జిగేల్ జిగేల్ మని వ్యాఖ్యానించుకోవడానికి.


ఇంకో మూడు గంటల్లో శ్రీ ఖరమై మంగతాయారు గారు విచ్చేస్తారు. అప్పడిదాకా సెలవామరి?

48 కామెంట్‌లు:

  1. ముందుగా బ్లాగు పాఠకులకు శ్రీ ఖర నామ ఉగాది శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  2. మీ బ్లాగు ద్వారా అ౦దరికీ శ్రీ ఖర నామ ఉగాది శుభాకాంక్షలు

    - జిగేల్ జిగేల్ :)

    రిప్లయితొలగించండి
  3. సంపంగీ !

    సంపంగి మొగ్గవై సునాద గీతమై
    సుస్వరాల మాలలల్ల మల్లెపూవువై
    లలిత పద శతకములల్ల శబ్ద బ్రహ్మవై
    శ్రీఖర దీవెనల కదిలిరా సౌమనసమా!

    రిప్లయితొలగించండి
  4. పాఠకులకు మరొక విజ్ఞప్తి

    కందము||
    ముదమున ముత్తెపు మాటలు,
    మది రంజిల పదకవితలు, మరువపు వాక్కుల్,
    నదియిది యని ఏమి? మనసు
    కదలించగ పది పలుకులె "ఖరు"నికి చాలున్.

    రిప్లయితొలగించండి
  5. టక్ టక్ ఠక్

    వచ్చేశా నేనొచ్చేశా
    సోదర పాఠకులకు ఖరనామ సంవత్సర సందర్భముగా సోదరి మంగతాయారు శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  6. పచ్చదనమై పల్లవించు
    మావికోమ్మై చిగురించు
    వేపపువ్వై పుష్పించు
    నువ్వే వసంతమై హాసించు

    ఉగాది కోయల వత్సరమంతా
    నీ హృదిలోనే వసించు

    రిప్లయితొలగించండి
  7. లేత మావి పిందెల పిండి పాలు త్రాగు సుతులు
    భారతావని నిండ భవిష్య నిర్మాతలైరి!
    పల్లవించి చిగురించ పచ్చదనము ఖరము పాలు
    శ్రీ ఖరమా , ఖరముల శిర ఖండనలె నీదు గమ్యం

    రిప్లయితొలగించండి
  8. మరొక ఉదయం
    మరొక రేపు
    మరొక చిరునవ్వు
    మరొక చైత్రం
    మరొక సంవత్సరం...మళ్ళీ మొదలు !!

    రిప్లయితొలగించండి
  9. తెల్లారింది
    పొద్దుగుంకింది
    అలసిపోయాం
    నిద్రపోయాం
    మరొక పండగ మళ్ళీ మామూలే ;-)

    రిప్లయితొలగించండి
  10. ద్వారానికి ఫల పుష్ప హారాలు,
    అందాలు చిందే తోరణాలు...
    అలంకరణల నడుమ గృహాలు
    ఆనందమయ వేడుకల విడిదులు.
    ఉగాది కావాలి సకల శుభప్రదం
    మమతానురాగాలు మిగలాలి ఎల్లకాలం

    రిప్లయితొలగించండి
  11. ప్రభాత వేళల వసంత కోకిల
    పాడుచున్నది లయతప్పని గీతములు
    వీనుల విందుగ హృది పొంగగ
    మనసు నిండుగ మది మరులు పొందగ
    శ్రీఖరమా ఏమి నీ అదృష్టము!

    రిప్లయితొలగించండి
  12. వికృతి చేసిన విలయతాండవాన్ని మరిపించి
    ఆనందతాండవం చేయించడానికి విచ్చేసిన
    శ్రీ ఖర నామ సంవత్సరానికి సాదర స్వాగతం పలుకుతూ ........

    రిప్లయితొలగించండి
  13. నీరాక సూచనాన్ని ముందుగానే సూచిస్తూ
    భారతావనికి విశ్వవిజేత పట్టమునందించిన
    శ్రీఖరమా సాదర స్వాగతం...

    రిప్లయితొలగించండి
  14. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఇవే నా శుభాకాంక్షలు

    సాటి 'ఖరములకి' ఇవే నా అభినందనలు .పండగ పూట నన్ను ఎవరు ఏమి అనరని ఆశిస్తున్న !!

    రిప్లయితొలగించండి
  15. భరత ఖరమా ఖర్మ దినాన శుభాకాంక్షలేల
    ఖరముల ఓండ్రింపు వ్యాఖ్యల ఖర్మ మాకేల :-)

    రిప్లయితొలగించండి
  16. కోకిలమ్మల కూతలతో

    మావికొమ్మల పూతలతో

    వచ్చేసింది ఉగాది

    మీకు తెచ్చేందుకు సంతోషాల నిధి.

    శ్రీ ఖర నామ ఉగాది శుభాకాంక్షలు..

    రిప్లయితొలగించండి
  17. మామిడితోరణాలు, తుమ్మెద ఝంకారాలు
    చైత్ర కోకిల మృదుమధుర మంజుల గానాలు
    తొలి ప్రొద్దు పసిడి కిరణ హారాలు
    మహేశ్వర విరచిత వర్ణమాలా మాలికలు
    ఓంకార నాద నాదస్వరాలు
    ఖరమా... రమ్య గీతికల్ వినంగ
    వేగమె రావేల రాచ మార్గమున

    రిప్లయితొలగించండి
  18. కష్టమున్నప్పుడే సుఖం విలువ తెలిసేది...
    చేదు ఉన్నప్పుడే తీపి రుచి పెరిగేది...
    కష్టాల్ని అర్థంచేసుకుని, చేదుని భరించగలిగితేనే జీవితం మధురమయ్యేది.
    మీ జీవితంలో చేదు, కారం, వగరు నిండిన బాధల్ని అవగాహన చేసుకోగలిగే సమన్వయాన్ని ఈ ఉగాది మీకు అందించాలని
    మనస్ఫూర్తిగ కోరుకుంటూ...

    రిప్లయితొలగించండి
  19. కష్టాల్లో సుఖం
    చేదులో తీపి
    తెలుసుకుంటే జీవితానికి రాజమార్గమదే!!
    కష్టం, సుఖం, తీపి, చేదు
    కారం, వగరు ఉగాది రుచులా?
    మమకార జీవిత మారురూపాలా?

    రిప్లయితొలగించండి
  20. రామి రెడ్డి గారికి పండగ శుభాకాంక్షలు !!



    యుగాలనిరీక్షనంటేనే
    ఇషమైన నాకు
    క్షణమొక తీయని
    యుగంగా గడిచేది.
    మరి ఉప్పుడు,
    ఓ కొత్త యుగాది! (ఉగాది)
    -సత్య

    రిప్లయితొలగించండి
  21. సత్యా సత్యకాలంనుంచి
    నేటికాలందాకా
    మరో తెలియని కాలమొచ్చినా...

    యుగాలు మారినా, ఉగాదు లెన్ని వచ్చినా
    మనిషీ ఏదీ నీకు మనిషిపై ప్రేమ?
    క్షణమొక యుగమై కరాళ కాల నృత్య
    పదఘట్టనల మధ్య నలిగే ఉగాదులెన్నో
    బ్రతుకుతూ చస్తున్న మనుష్యులెందరో

    రిప్లయితొలగించండి
  22. బ్లాగర్లకు, జీవని సభ్యులకు తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ
    పండుగ రోజు విరిసిన ఆనందాలు కలకాలం మీ ఇంట నిలిచిపోవాలని. మీకు,
    మీ కుటుంబ సభ్యులకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని
    కోరుకుంటూ....
    మీ అందరి ఆశీస్సులతో బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటున్న,

    మీ,
    జీవని పిల్లలు.

    రిప్లయితొలగించండి
  23. పసివాడని మొగ్గలం
    పసిడి బుగ్గల చిన్నారులం
    కల్మష మెరుగని చిన్నారులం
    భావి భారతనావికులం

    మీకివె ఖరనామ వత్సర వందనములు.

    రిప్లయితొలగించండి
  24. శ్రీ ఖర నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!!!!
    అందరూ బాగుండాలి....

    రిప్లయితొలగించండి
  25. అందరూ బాగుండాలి
    కాలం కలిసిరావాలి
    కడుపు చల్లగుండాలి
    కలం కదం తొక్కాలి.

    రిప్లయితొలగించండి
  26. ఖర నామ వత్సరంబున
    చిర సుఖ సంపదలు గల్గి జీవితము శుభా
    కరమై విలసిల్లఁగ మన
    సారఁగఁ గాంక్షించు శంకరాభరణ మిదే!

    రిప్లయితొలగించండి
  27. శంకర పద్యసుమము నీ
    కంకిత మయ్యెకదరా నికన్ మాకు సుఖ
    మ్మంకిత మివ్వగ రావా?
    కంకణ ధారీ, జనహిత ఖరనామకరా

    రిప్లయితొలగించండి
  28. వ్రాయలేను తప్పులే లేకుండా పద్యమైనా
    పాడలేను పల్లవైనా భాష రాని దానను
    వేయలేను తాళమైన లయనేనెరుగను
    తోచింది చెప్పాలని ఎదుటికొచ్చి నిలుచున్నా
    తోచిన మాటలనే వరుసపెట్టి అంటున్నా....
    నిండైన తెలుగుతనపు యుగాది శుభాకాంక్షలివిగో...

    రిప్లయితొలగించండి
  29. జయా

    చిరునవ్వులు చిందించే చిన్నారి భాషేది?
    పరవశాన పాడు కోకిలమ్మకు పదమేది?
    మనస్వీ, మనస్విని రూపమేది?

    నిండైన తెలుగింటి ఇల్లాలు
    మురిపెంగ మాలలల్లిన
    తెలుగుదనపు ముత్యాలు
    శ్రీఖరమా.. స్వీకరించుమా

    జయ గారూ మీకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  30. ఖర నామ స౦వత్సరాది ను౦డి కావాలి శ్రేయస్
    కర౦ అ౦దరికీ.వస్తూ తెచ్చిన జగతి పాత్ర ఆన౦ద
    కర౦.వెళుతూ ఇవ్వాలి అక్షయ పాత్ర పాడి ప౦టల
    తో.అ౦దరికీ స౦వత్సరాది శుభాకా౦క్షలు

    రిప్లయితొలగించండి
  31. ఖర౦ లొ ఈ హార౦ ఎగరాలి

    బ్లాగుల్లో జిగేల్ జిగేల్ మని ;-)

    రిప్లయితొలగించండి
  32. $భాస్కర రామి రెడ్డి గారు
    :: శ్రీఖరనామ ఉగాది నూతనసంవత్సర శుభాకాంక్షలు. ::

    $మౌళి గారు
    పాపం వారు ట్రైన్లో ఉన్నట్లుంది.. మీరేమో ఎగరమంటున్నారు! ;)
    మీకూ
    :: శ్రీఖరనామ ఉగాది నూతనసంవత్సర శుభాకాంక్షలు. ::

    #అక్షయ పాత్ర పాడి ప౦టలతో
    #అక్షయ పాత్ర పాడి ప౦టల ఎకరాలతో ;)

    రిప్లయితొలగించండి
  33. మౌలీ మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు

    సకల సౌభాగ్య కరమై ఖర ఉగాది
    జగతి బాధలెల్ల తీర్చ నరుదెంచె
    మురళి గాన లహరుల లభ్ధిపొందిన
    ఉగాది నిచ్చుగాక సకల సంపదలు

    రిప్లయితొలగించండి
  34. ఔను మౌళి...హారానికి నా హారం

    ఎగురవే ఎగురవే హారమా
    ఖరమ్ములోన ఖండాతారలపైన
    విశ్వవినూధుల విశ్వవిజేతవై

    బ్లాగు బాంధవుల రచనలు సుమ మాలగ జుట్టి
    సకల విభాగ విరించియై
    ఎగురవే ఎగురవే హారమా
    ఖరమ్ములోన ఖండాతారలపైన
    విశ్వవినూధుల విశ్వవిజేతవై

    రచనల మణిహారమై
    రచయితలు రంజిల
    రాగద్వేష నిష్కారివై
    ఎగురవే ఎగురవే హారమా
    ఖరమ్ములోన ఖండాతారలపైన
    విశ్వవినూధుల విశ్వవిజేతవై

    రిప్లయితొలగించండి
  35. రాజేష జి, మీకు కూడా నూతన ఖరనామ ఉగాది శుభాకాంక్షలు.
    ఆఫ్ ది టాపిక్ (?) ఖరములో నైనా MS, EU లో నెగ్గి అక్షయపాత్ర సాధిస్తుందేమో చూద్దాం ;)

    నిండార పాడి పంటల
    ఫల పుష్ప సంపదల
    రైతు బాధల మోయు
    ఖరమై రా, సుభకరా

    రిప్లయితొలగించండి
  36. ఏమిటికి ఈ గానాలు, గమ్మత్తులు? ;) కానుక గా మా బూరుగుపూడి బెల్లం అచ్చులు అందిస్తారా...బుట్టాయగూడెం చింత పండు ఇస్తారా? రాళ్ళగుంట మామిడికాయ పంపుతారా...గరువు మీద వేప రెమ్మలు విరిచి ఇస్తారా? అయితే గియితే మీ కారాల బస్తాలు లోడ్కెక్కిస్తారు గాని. :)

    గగనాలు పోసిన చినుకుల తలంబ్రాలు,
    సెలయేటి కాంతకి ఒడిబియ్యాలు
    ఊట నేలలో ఎదిగిన చెరుకు బెల్లాలు అవుతాయి...

    చివురులు కోయిల సరిపెట్టుకుంటే,
    పిందెలు చిలుకమ్మ చిదిమి వదిలితే,
    మామిడికొమ్మ మళ్ళీ కాయలు కానుకిస్తుంది...

    చింతలెరుగని బతుకుండదని,
    ఈదులాడనంటే ఒడ్డు ఆమడదూరాన్నే ఆగిపోతుందని,
    పులుపు మేళవింపు చింతచెట్టు తన వంతుగా పంపుతుంది...

    కాకమ్మ ఎత్తుకెళ్ళిన పళ్ల లెక్కలడగని,
    గాలిగాడు రాల్చిన ఆకుల అజ పట్టని,
    వేపమ్మ చేదుమందే శాస్త్రమని పువ్వులో పెట్టి చెప్తుంది...

    కారాలు చెపుతాయి ఊరూపేరూ వివరాలు.
    ఆరబోసిన మిరప మిలమిలలే
    ఉగాది నోటికి కారాలు, కంటికి నీరూను...

    ఏడేడు సంద్రాలు ఎన్ని యుగాల కన్నీటి కాలువలో?
    శోకాలు లేనిదే శ్లోకాలు పుట్టవనేమో,
    రవ్వంత ఉప్పు కలపని ఉగాదికి నిండుదనం రాదనే చెప్పాలి.

    గులకరాయంత కష్టానికి ఫలం,
    బండరాయంత సుఖం...
    కష్ట సుఖాల కలబోతల జీవితాలు
    ఉగాదికి ఉగాదికీ నడుమ షడ్రుచుల విస్తర్లు.

    -మరువం ఉష

    రిప్లయితొలగించండి
  37. ఉషా ;-)
    సాయంకాలం షడ్రుచల విందే అయితే ;).. కొచెం తీపి, కొంచెం వగరు, కొంచెం చేదు, మరికొంచెం పులుపు, కొంత ఉప్పు...మరింత కారం. మరి మాకు పండేదే అది కదా లోడ్లు లోడ్లు.

    రిప్లయితొలగించండి
  38. భాస్కర రామి రెడ్డి గారు
    భలే సందడి చేసేశారండీ!
    ఉష గారూ !
    చప్పట్లు మీకు!!

    రిప్లయితొలగించండి
  39. సో, ఫోర్ కొట్టాము, ఓ సిక్స్ వేస్తే పోలా? :) ధోనీ ఇంకా గీతాబోధ చేస్తుంటే. ఈ జుగల్బందీ గెలుపు కొట్టేస్తూ... రామీ, ఇక మీ పరుగులు ఆపమని వెక్కిరిస్తూ :)

    బాగుంది మీ ప్రయత్నం నిజానికి.

    ఇకపోతే, అనురాగం అన్న అధరువు లేని మనుగడకి విలువ లేదు. ఆ ప్రాతిపదికన సాగే పయనాన తప్పని షడ్రుచులు జంట గీతాలాపనలు.
    ఆ స్ఫూర్తితో వ్రాసిన ఈ వ్యాఖ్య ప్రతి జంటకీ అంకితమిస్తూ...

    ఉగాది వచ్చిందీమారు
    ఆమనికోయిల పాటగా..
    తలపుల రాగాలు
    రుచులుగా తోస్తుందందుకేనేమో!

    విరహిత కనుల ఎరుపు,
    కొత్త కారానికి దీటు.
    మల్లియని మందారంగా మార్చేను..

    ఉప్పుటేరుగ పొంగే శోకతప్త కనులు,
    సముద్రమంతా పట్టే ఊటబావులు.
    వేదన స్ఫటికాలను కరిగించేను..

    ఎడబాటు తనువున పొగరు,
    ఎదురొచ్చే చెలికానికి వగరు తోడుగ.
    తప్పిదానికి తగు మర్యాద చేసేను..

    వలకాని చిలిపి వాగ్ధాటి,
    ముగ్ధ మురిపానికి సైజోడు.
    బుంగమూతికి పటికబెల్లం హారతిచ్చేను..

    కరుగు కాలాల చేదుకి,
    కరగని కలల విరుగుడు.
    మది ముంగిట రంగవల్లిగ మెరిసేను..

    మురిపాలు కలిపిన కవ్వింతలు,
    చింత పులుపుకి ఎదురంట.
    కలిసిన మనసుల అతిశయం నిత్య ఉగాది..

    రిప్లయితొలగించండి
  40. @మందాకిని గారు, వినమ్రంగా మీ అభినందన స్వీకరిస్తున్నాను. :)

    ఈ సంబరం లో పాలు పంచుకున్న అందరికీ,

    ఈ ఉగాది రాబోవు కాలాలలో మీకు, మీ కుటుంబ సపరివారానికీ సుఖ సంతోషానంద భరితమై మీ జీవితాలలో ఆహ్లాదాన్ని అందించాలని ఆకాంక్షిస్తూ.

    రిప్లయితొలగించండి
  41. ఉష గారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు...అభినందనలు. అసలైన ఉగాదిని జరిపించేసారు. భాస్కర రామిరెడ్డి గారూ, మీకూ ధన్యవాదాలు, ఉగాది ముత్యాల హారం మాకు కానుక సమకూర్చినందుకు. (ముత్యాలు అని ఎందుకన్నానంటే, నాకవే ఎక్కువ ఇష్టం కాబట్టి)

    రిప్లయితొలగించండి
  42. ఉషా, పోర్లు సిక్సర్ తో మ్యాచ్ ని దగ్గరుండి గెలిపించుకున్నారు. ఇంక మేము చేసేదేముంది? :)

    రిప్లయితొలగించండి
  43. మందాకిని గారూ.. నేనింత సందడి చేస్తే నాకు చప్పట్లు లేవా.. వా వ్వాఆఆ
    అంతేనండీ ఎంతైనా మీరు మీరు ఒకటి :)

    రిప్లయితొలగించండి
  44. జయ గారూ మీరెంత మంచోరండి నాకు కూడా ధన్యవాదలు మర్చిపోకుండా చెప్పారు JK.

    Thank you Jaya.

    రిప్లయితొలగించండి

Comment Form