12, ఏప్రిల్ 2011, మంగళవారం

ఈ రోజు మీకొక లెక్కల ప్రశ్న. వడపప్పు నవులుతూ, పానకం తాగుతూ చెప్పేయండి.


ముందుగా బ్లాగు పాఠకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు.

మన తెలుగు భాషలో వర్ణమాల, వాటి గుణింతాలు, సంయుక్తాక్షరాలు,ద్విత్వాక్షరాలు మొదలైనవన్ని కలుపుకుంటే ఒక హల్లు నుపయోగుంచుకొని ఎన్ని అక్షరాలను తయారు చేయవచ్చు?

ఉదా : "క" తీసుకుంటే ఈ అక్షరానికి గుణింతం

క,కా, కి, కీ, కు,కూ, కృ,కౄ, కె, కే,కై, కొ,కో,కౌ, కం, కః

ఇంతకీ ఈ వరుసలో తప్పులున్నాయా :-)?

అలాగే ఇంకేమైనా వదిలేసానా? క్ఌ ( క్లు అని చదువుకోవాలన్నమాట :D),క్ౡ వదిలేసినా కదా.

అట్నే , క్త,క్న,క్మ.. ఇలాంటివి.. ఇంకా క్క లాంటివి కూడా కలుపుకొని ఒక హల్లు ద్వారా సాధ్యమయ్యే అక్షరాలెన్ని వుండొచ్చు? ఏదైనా గణిత సూత్రము కనిపెట్టి చెప్పేయండి.

ఆనందో బ్రహ్మ..ఎవరిపిచ్చి వారికానందం ;-)

7 కామెంట్‌లు:

  1. "ఇంతకీ ఈ వరుసలో తప్పులున్నాయా :-)? "...లేవు... నాకు తెలిసి...!!! :))

    రిప్లయితొలగించండి
  2. హమ్మయ్య .. థ్యాంక్యు అజ్ఞాత. భయపదుతూ వ్రాసాను. అలాగే పన్లోపని ఎన్ని అక్షరాలు ఏర్పడగలవో కూడా కనిపెట్టి ఒక సూత్రం చెప్పెయ్యొచ్చు కదా .

    రిప్లయితొలగించండి
  3. క తో సాధ్యమయ్యే అక్షరాలు = మీరు వ్రాసినవి + మీరు వదిలేసినవి
    అమ్మయ్య నేను కూడా ఒక గణిత సూత్రం కనిపెట్టేశాను:):)

    రిప్లయితొలగించండి
  4. సుబ్రహ్మణ్యం గారూ! ఆహా, మీకు సాటి లేదండీ బాబూ!

    రిప్లయితొలగించండి
  5. సుబ్రహ్మణ్యం గారూ , సూపరండీ.. :-)

    మందాకిని గారూ, కదా!!.. సుబ్రహ్మణ్యం గారుఎంత తెలివి మీరి పొయ్యారో చూడండి :-)

    రిప్లయితొలగించండి
  6. సుబ్రహ్మణ్యం గారు తెలివి మీరి, పోయారట. :):)

    అయ్యో పాపం.....

    రిప్లయితొలగించండి
  7. ha ha..సుబ్రహ్మణ్యం gaaru, మీరక్కడా పోయారు, ఇక్కడా పోయారా ? ఎలాగబ్బా :-)

    రిప్లయితొలగించండి

Comment Form