24, జులై 2011, ఆదివారం

Google+ is now Google --

జూలై 12 2011, అప్పటికింకా Google+ hype చాలా ఎక్కువగా వుందనే చెప్పుకోవాలి. చాలా మందికి అసలు ఈ + లో వున్నదేమిటో చూడాలన్న ఉత్సాహం. ఎవరైనా ఆహ్వానిస్తే ఒక్కసారి చూసి జీవితాన్ని ధన్యం చేసుకుందామన్న కోరిక. సరే ఎలాగూ ఈ hype తో పాటుగా హారానికి ప్రచారం చేసుకుంటే !!!. అప్పటికి హారం భారతీయ భాషా బ్లాగులు చూపడం మొదలై సరిగ్గా వారం రోజులు. పురిటినొప్పులు కూడా పూర్తిగా తగ్గలేదు. సరే Google+ ఆహ్వానాన్ని పంపిస్తూ హారం ప్రచారం చేసుకుంటే రెండువైపుల లాభ సాటిగానే వుంటుంది కదా అని ఓ అవిడియా వచ్చింది. అలా ఆహ్వానాలు పంపడం మొదలైంది కానీ ఒక్క గంటఆహ్వానాలు పంపినా ఇరవై ముఫ్ఫై ఆహ్వానాలు దాటి పంపలేకపోయాను. ఊహూ ఇలా లాభం లేదని హాయిగా నిద్రపొయ్యి, రెండో రోజు మా శకుని మామ నడిగితే ఓ తంత్రం చెప్పాడు. ఇంకేముంది.. ఆరోజు మరుసటి రోజుకల్లా అక్షరాలా 4800 మందికి ఆహ్వాన పత్రికలను పంపించాను.

All happies, no troubles

మూడోరోజు.. అబ్బా చాల్లే అనిపించింది కానీ ప్రక్కన friend suggestion చూస్తే బిల్ గేట్స్, సెర్గెబ్రిన్ కనిపించారు. అప్పటికే గూగుల్ లో పనిచేసే చాలా మందికి వృత్తాలు చుట్టేసాను. వీళ్ళను మాత్రం ఎందుకు వదలాలి అని బిల్ గేట్స్, సెర్గెబ్రిన్ ఇద్దరికి వృత్తం చుట్టేసాను.

ఒక రెండురోజులు బిజీ... మూడోరోజు వెళ్ళి చూస్తే ఇంకేముంది అకౌంట్ బ్లాక్ !!!!
ప్చ్, అసలు నేను google+ లో ఏల చేరవలె?
చేరితినిపో ఏల 4800 ఇండియన్స్ కు ఆహ్వానం పంపవలె??
పంపితినిపో ఏల సెర్గెబ్రిన్ కు వృత్తం చుట్టవలె???
చుట్టితినిపో, వారేల హారం పై కన్నువేయవలె???
వేసితిరిపో, అకౌంట్ ఏల బ్లాక్ చేయవలె????
( ఇప్పుడంటే left and right accounts block చేస్తున్నారు కానీ ఈ అకౌంట్ బ్లాక్ చేసేనాటికి అంటే జూలై 15 లేదా 16 నాటికి బ్లాక్ చేసిన అకౌంట్స్ ను వేళ్ళ మీద లెక్కించ వచ్చు )

ఏంటబ్బా అని చూస్తే వాళ్ళ పాలసీలకనుగుణంగా కాక ఒక కమ్యూనిటీని కించ పరస్తూ టపా వ్రాశానట. వార్నీ నాకంత సీనా!!!! అని వాళ్ళ పాలసీలు చదివితే నాకెక్కడా పాలసీ వయలేట్ చేసినట్టు కనిపించలేదు ఇంతకీ నేను వ్రాసింది బాంబేలో జరిగిన బ్లాస్ట్స్ గురించి. (ఆ తరువాత కొద్దిరోజులు వాళ్ళ పాలసీలను మారుస్తూ వచ్చినట్టున్నారు ) సరే అని చెప్పేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే , ఓ నాలుగురోజుల తరువాత బిజినెస్ ప్రొఫైల్స్ కు ఇప్పట్లో అవకాశం లేదు, ఇది కేవలం ఫీల్డ్ ట్రైల్ మాత్రమే అని status update చేసారు. No issues..., Atlast they were able to respond with right answer.

ఇంతటితో ఈ వ్యవహారం ముగిసినట్టులేదు, గత కొద్ది రోజులుగా కనిపించిన అకౌంట్ నల్లా పీకేస్తున్నట్టున్నారు. కనిపించిన అకౌంట్ అనడం కన్నా మరీ ఎక్కువగా ఫ్రెండ్స్ కలిగిన అకౌంట్స్ అని చెప్పవచ్చేమో. కానీ గూగుల్ చెప్పే సమాధానం మాత్రం

" we are currently limiting profiles to real people"


what a joke? who is real and who is fake in social media? Do you think people submit their bank a/c numbers, SSNs, passport, Photo etc to google+? I think any social media with this restriction suicides itself and intelligent companies like google must be aware of this fact, but then why are they doing?

Is the dam + bubble exploded with high number of concurrent transactions? who knows, intially I thought it's their policy to ban products, which is fair enough policy, but reading articles like this http://www.zdnet.com/blog/violetblue/google-plus-deleting-accounts-en-masse-no-clear-answers/567?tag=mantle_skin;content gives a surprise to anybody.

Google, now, you are no more +,people started --.

8 కామెంట్‌లు:

  1. ప్చ్, అసలు నేను google+ లో ఏల చేరవలె?
    చేరితినిపో ఏల 4800 ఇండియన్స్ కు ఆహ్వానం పంపవలె??
    :-):):)

    రిప్లయితొలగించండి
  2. @చిన్నీ, నవ్వండి నవ్వండి :-) ఈడ నేనేడుస్తుంటే మీరు నవ్వుతారా :-)

    @సంజు, థ్యాంక్స్

    రిప్లయితొలగించండి
  3. ఎ౦తమ౦ది మీ ప్రొఫైల్ బ్లాక్ చెయ్యమని రిక్వెస్ట్ చేసారో :) పాప౦ గూగుల్ వాడిని అ౦టున్నారు కాని . మొదట్లో నే ఇలా స్పాం చేస్తే వాళ్ల product కి చెడ్డ పేరు వస్తుంది కదా.

    రిప్లయితొలగించండి
  4. మౌలి, అలా అంటారా? అలాగైతే మీరు మొదట్లోనే సంతకం పెట్టేసుంటారేమో కదా :-) JK

    రిప్లయితొలగించండి
  5. హ హ. మీ ఆహ్వాన౦ అకౌ౦ట్ ఉన్నవారికే కదా ప౦పి౦ది. కాబట్టి ఫన్ మిస్ అయ్యాం.

    రిప్లయితొలగించండి
  6. అందరి పరిస్థితి అలాగే ఉంది భాస్కర్ గారూ, గూగుల్+ కోసం తెగ ఎదురు చూసిన యు.కె జనాలు ఇప్పుడు బుద్ధిగా షరా మామూలుగా ఫేస్బుక్ మీద మళ్ళీ పడిపోయా(యాం)రు. ఆర్కుట్కి తమ్ముడులా అలా పడివుంది ప్రస్తుతానికి! :)

    రిప్లయితొలగించండి
  7. @ మౌలి, మరో రెండు రోజులు గూగుల్ వాడు చూసి చూడనట్టు పోతే అందరికీ ఆహ్వాన పత్రికలు అందుండేవి. ప్చ్

    @ అచంగ, అవునా? అసలు ఈ సోషియల్ నెట్ వర్క్ వల్ల నాకు ఒక్కటే వుపయోగం కనిపిస్తుందండి. ఏదైనా మార్కెట్ చేసుకోవాలంటే పదిమందికి త్వరగా తెలుస్తుంది. అంతకుమించి ఇందులో ఒక్క నయాపైసా ఉపయోగము కూడా నాకు కనిపించడం లేదు. బహుశా ఇది నా ఒక్కడి అభిప్రాయమై వుండొచ్చు.

    రిప్లయితొలగించండి

Comment Form