ఈ మధ్య ఎక్కడన్నా ఏలు పెడితే చాలు కవితలు కసుక్కున కొరికేస్తున్నాయి. కాదులేండి, ఏలెట్టకన్నా వెతుక్కోనొచ్చి మరీ కొరుకుతున్నాయి.
అవి చదివీ చదివీ చానారోజులకు నాకూ ఒక కవిత రాయాలని బో యిదిగా వుంది. చదివాక బతికే వుంటే ఒక కామెంటుతో గిల్లిపోండి :)
బయట భోరున వర్షం
వర్షానికి చెట్లు తడుస్తున్నాయ్
తడిసి పులకరిస్తున్నాయ్!
ఇంట్లో జోరుగా ఫ్యాను
ఫ్యాన్ గాలికి పేపర్లు లేస్తున్నాయ్
ఒక్కొటొక్కటిగా, నా మనసు పేజీల్లా
పైనుంచి మట్టిపెళ్ళ రాలిపడింది
మనసంతా మరకైపోయింది
ఆకాశం ఎప్పుడు చిల్లుపడుతుందో
నా మనసెప్పుడు కడిగేస్తుందో
వహ్వా వహ్వా వహ్వా చప్పట్లు, ఈలలు, కామెంట్లు.....;)
మరో కవిత చిత్తగించండి.
ఒరే
పిచ్చోడా
ఏందిరా
సన్నాసి
టైం
పదకొండు
ఇక పడకెక్కి
గుఱ్ఱుపెట్టు
బ్రతికే ఉన్నారా? ఇంకా పోలేదా? సరే ఇది చిత్తగించండి మరి భావకవిత్వపు కలికి తురాయి .... :-)
ఇంట్లో నలుగురే
ఇంటికున్న నాలుగు గోడల్లా!!!!
నేనూ నువ్వు
సమాంతర కుడ్యాల్లా!!!!!!!!!!
ఎంత భావమో... ఏంటి నీబొంద అందులో భావమంటారా? మీరు ఊహించుకోవాల మరి. ఎవరి ఊహ ఎంత గొప్పదైతే అంత బాగా అర్థమౌతుంది మరి :)
:))))))))))))))
రిప్లయితొలగించండిబతికే ఉన్నాను, పిచ్చోడని తిట్టినా. ఘట్టి ప్రాణం. ఓ రెండు గిల్లులు.
రిప్లయితొలగించండిఏమైందండీ రామి మీకు...అంతా కులాసనే కదా.
రిప్లయితొలగించండిgud
రిప్లయితొలగించండికెవ్వ్వ్ కెవ్వ్ కెవ్వ్..ఒక్కో కవితకూ కెవ్వు కెవ్వుమని అరవాలని ఉంది.
రిప్లయితొలగించండి>>పైనుంచి మట్టిపెళ్ళ రాలిపడింది
>>మనసంతా మరకైపోయింది
>>ఆకాశం ఎప్పుడు చిల్లుపడుతుందో
>>నా మనసెప్పుడు కడిగేస్తుందో
బాగా కడిగించుకోండి. :))
కెవ్వ్వ్వ్వ్....ఇరగదీసారు
రిప్లయితొలగించండిహహ్హహ్హ్హహ్హ్హహ్హ్హహా!
రిప్లయితొలగించండికవితల మీద జోక్ భలే పేలిందండోయ్!
భేషుగ్గా ఉన్నాయి! ఏం తక్కువ వీటికి?
రిప్లయితొలగించండిఒకటి... కవితే..
రిప్లయితొలగించండిమూ..డూ... ... కవితే...
మరి రెం.. ..డూ... ... ... కవితే..నా...?
చాలా బాగున్నాయ్. నిజంగా.
ఋషి, అంతేనండీ నేను కవితలు రాస్తే మీకు నవ్వులాటలాగా వుంది
రిప్లయితొలగించండిబులుసు సుబ్రహ్మణ్యం గారూ, నేను మిమ్మల్ని పిచ్చోడు అని తిట్టితే మీరేమన్నారు? ఒరే సన్నాసి అని కదా :-) పోన్లెండొ ఘట్టి ప్రాణమై బ్రతికిపొయ్యారు :))
వినీలా.. ఏంచెప్పమంటారు వినీలా!! ఏంచెప్పమంటారు!!! :-)
సాయి. ముద్దుగా గుడ్డు అన్నందుకు ధన్యవాదలు
రవి :-) మీకు అరవాలని మాత్రమే అనిపించిందా?? మూర్ఛపోలేదా :)
రిప్లయితొలగించండికడిగించుకోడానికి ఆకాశం చిల్లు పడాల కదా, ఎప్పుడు పడుద్దో ఏమో మరి :)
సౌమ్యా :-) హమ్మయ్య నా కవితలు మీకన్నా నచ్చాయు. ధన్యోస్మి
మందాకిని గారూ, జోకులా..నేనా , కవితల మీదా.. ఎక్కడండి :)
సుజాత గారూ, నా కవితలను మీరు ఇంత ఇదిగా మెచ్చుకుంనందుకు ధన్యవాదాలు. మీ ప్రోత్సాహం ఎప్పుడూ ఇలాగే వుండాలి మరి :-)
గీతిక గారూ,
ఒకటి కవితే
మూడూ కవితే
ఒకటికి మూడుకు మధ్య
చిక్కిపోయిన రెండూ కవితే
మీ ప్రోత్సాహానికి నిజంగా ధన్యవాదాలండి.
అద్దం ముందు కొండ చిన్నగా ఉండును.. మీ కవిత..లు అద్దంలో..కొండలే! చాలా బాగున్నాయి.. . చదివిన వాళ్ళే రాయగలరట.
రిప్లయితొలగించండిkewl...
రిప్లయితొలగించండిమీ కవితలు చదివి...చదివీ...ఈ... బాగా చదివేసి, ఇదన్నమాట ఫలితం:)
రిప్లయితొలగించండితల్లి బిడ్డలపై చూపే కారం.....
ప్రతి స్త్రీ కోరుకునే కారం......
రాజకీయనాయకుడు ఇష్టపడే కారం ....
మనకుండకూడని కారం.....
మీకందరికీ నేనిచ్చే కారం.....
ఇదెలా ఉంది? సమస్యాపూరణం అన్నమాట. మీ లాంటి పండితులే పూరించాలి:)
చిరునవ్వులు, చితిమంటలు,ఎదురుచూపులు,వెన్నముద్దలు,చందమామల రొటీన్ కవితలు మాత్రమే తెలిసిన కవితా లోకాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు మీరు మీ కవితల ద్వారా. మీ స్ఫూర్తి తో నేనూ ఓ కవిత రాసా, చూడండి నా బ్లాగు లో. ఖవిత రాయడమేమిటి అప్పుడే మార్గదర్శకులయిపోయారు చూసార
రిప్లయితొలగించండిజయ గారూ,
మీ కారాల ఘాటు అదిరింది.
@వనజ వనమాలి గారు, ఏంటో నండి మీ అభిమానానికి ఒక చిన్న అద్దమన్నా కొనుక్కోని నా కవితనందులో చూద్దామని వుంది :-).
రిప్లయితొలగించండిఏమైనా మీవ్యాఖ్యకు ధన్యవాదాలు
@krsna, లేదండీ, మాకిక్కడ వేసవి కాలం :P
మాలా కుమార్ గారూ, మీరు నా కవిత చదివి కూడా నవ్వుతూ వుండగలిగారంటే, కవిత చాలా నచ్చిందనుకుంటానండి :-)
రిప్లయితొలగించండిజయగారూ, మీరేంటండి, ఏకంగా నాపై ఇలా పొడుపుకథ వదిలేసారు :) ఎన్నైనా మమకారంతో వ్రాసిన పొడుపు కవిత కదా, బానే వుందండి.ఇక నుంచి మీరు సమస్యాపూరణలు చెయ్యొచ్చేమో ఇలా ఐతే. కాకపోతే ఆ చివర్లో "పండితులు" అని వాడారు కదా, అదేదో అస్సలు అర్థము కావట్లేదు, మీరే కూసింత దయతలచి అర్థము చెప్పాల్సిందిగా డిమాండింగ్ చేస్తున్నాము :)
ఋషి గారూ, మీ టపా, ఖవిత అదుర్స్..ఇంక రెచ్చిపోండి..బోలెడన్ని చప్పట్లు వస్తాయి :)
రిప్లయితొలగించండి