11, అక్టోబర్ 2009, ఆదివారం

జలపుష్ప మంగళ హారతి

మరువం ఉష గారి జలపుష్పానికి మంగళ హారతి.

కం |
శ్రీకరమగు తలపుల నీ
చక్కని జలపుష్ప రచన సాగె పలుగతుల్
చిక్కని కథలు కవితలుగ
నీ కరుణయె లేకయె నిదినెటులగు స్వామీ?

తే|
కాలగమనగాడ్పులలోన కరిగిపోయె
మంచితనము, కామందులు మందభాగ్యు
లైరి, రాబందు రాజ్యాన సిరిని వలచి,
మానవతుల రక్షించు అమాత్యులేరి?

తే|
భువిన ప్రజలు చూసిరట ప్రభూ పదియగు
నీదు సుందరయవతారమాధురీ మ
హిమలు, కరుణాకర, కలికాలమున మేము
జేసిన చెడుగెయ్యది నాకు చెప్పుమయ్య !

తే|
పుడమి రక్తపుటేరుల గడ్డగట్ట
క మునుపె, జలరాసుల ధరిత్రి మునుగక ము
నుపె, మనువుగ సాగరజల నురగలు విడి
పరుగు పరుగున రావేల భరత శౌరి!

కం|
మంగళ మయ్య జగన్నాధ
మంగళమగు శ్రీపతికిని మంగళ కైతల్
మంగళ కరమై మాకును
మంగళములు కలుగజేయి మాతంగిపతీ.

15 వ్యాఖ్యలు:

 1. భా.రా.రె. ముందుగా అభివందనాలు తర్వాతే అభినందనలు. నా ప్రయత్నానికి ఇంతగా సహకరించి ఈ పద్య రచనతో సంపూర్ణమ్ చేసినందుకు కృతజ్ఞతలు. అర్థం అయింది. కాకపోతే ..... గణ విభజన చేసి ఇంకా రససిద్ది పొందే స్థాయికి రాలేదు. అందుకే ...

  ;)

  [నిజాయితీగా] భామ, గీమ అంటూ వ్వెవ్వెవ్వే అంటూ వెక్కిరించారుగా :) సో రెండు మాటలు...

  ౧. "ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్" నానుడి గుర్తు చేస్తూ...

  ౨. "నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష" అను రోజులు రానున్నవని కిట్టయ్యని ప్రక్కన కూర్చుండ బెట్టి నరకాసుర వధ గావించిన సత్య మా పూర్వికురాలేనని తెలుపుకుంటూ.... అదీ ఈ దీపావళి సందర్భం కావటం తో మరింత సంబరపడుతూ..

  మళ్ళీ ఓ సారి థాంక్స్.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. బాగుంది మంగళ హారతి...ఉషమ్మ జల పుష్పాభిషేకానికి పూల హారతి, అందించిన అతివలందరికి నీల హారతి, ఏదో రాసి పారేసిన సోగ్గళ్ళకు సిల్లీ హారతి (అది అంతే స్పెషల్ టైప్ హారతి మీ మొగ వాళ్ళందరికి) ... మంగళ హారతెత్తిన భా రా రే గారికి పంచ ముఖ హరతి ( ఇంక స్వర్ణ కమలం లొ సీనే వూహించుకోండి.. ) :-):-):-)

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మంగళహారతులైనవి మరి ప్రసాదాల మాటో?:)

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ప్రసాదాలు భా రా రె గారు పంచుతారా లేక ఉషగారు పంచుతారా? కిట్టయ్య ప్రసాదం కోసం ఎదురుచూస్తూ.....

  ప్రత్యుత్తరంతొలగించు
 5. ప్రసాదాల క్యూలో నేను ఉన్నానండోయ్:)

  ప్రత్యుత్తరంతొలగించు
 6. ఉషగారూ, నెను వెక్కిరించనక్కరలేకుండా మీఅంతట మీరే భామనని ఒప్పుకున్నారుగా :)

  "ముదితల్ నేర్వగరాని విద్య గలదే మనసుపెట్టి నేర్పించినన్".. అదేదో ఆవిద్య త్వరగా నేరిస్తే నీరజాక్షి, జలజాక్షి ,అక్షర లక్షల అక్షింతలతో మరువపు వనజాక్షి గా మారితే మేమూ చదువుతామండి.


  భావన గారూ, నన్ను ఆటపట్టించడమే పనిగా పెట్టుకున్నట్టున్నారే :-)
  ఎదిరించిన సుడిగాలిని జయించానా? ఓడానా ? నల్లమబ్బు చాటున చిరుగాలుల్లో సేదతీరుతున్న జీవితం విజయమే కదా? సుడిగాలిని పిల్లనగ్రోవిలో పొదివి మధుర గాన గాలిని సృష్టించిన నేస్తమే, కొండల దారుల్లో బండరాళ్ళ హోరుకాదది జలపాతాల సవ్వడి అని నేర్పింది. ఈ ఘనత మరెవ్వరికి?


  పద్మార్పిత గారు, ప్రసాదాలు కావాలంటే గుడిలో కాసేపు కూర్చోవాలండీ ;)

  విజయమోహన్ గారూ, ఇద్దరమూ కాదండీ, అర్జునుడు బాణాలు ( ప్రదీప్) సిద్ధం చేసుకుంటుంన్నాడు.  సునీత గారూ ధన్యవాదాలు

  శృజన గారూ ఇ-ప్రసాదం అందరికీ ఒకేసారి అందుతుంది లేండి. క్యూలు గట్రా లేకుండానే :)

  ప్రత్యుత్తరంతొలగించు
 7. భా.రా.రె సరదాగా అండీ. "వులుకులుకుమన్న వులుక వూరికే అంటే వులకదే పలకదే అలక కామోసు" అన్నట్లు అలిగితే చెప్పండి మరి, అమ్మో నాకు కూడా కవితలొచ్చేస్తున్నాయి (తవిక అని నాకు తెలుసు లే :-| ) చూసేరా... మరువపు కొమ్మ పూదోట లోను, పూల రాష్ట్రం లోని రెడ్డి గారితోను (NJ -- Garden State) పరిచయ భాగ్యం తోనో ఏమో.. అదుగో మళ్ళీ ఏడిపిస్తున్నాను అంటారా, చెప్పేను కద హాయి గా నవ్వుకోవటానికే కాని అన్యధా భావించి కోపం తెచ్చుకోరని నమ్మకం తో...
  "సుడిగాలిని పిల్లనగ్రోవిలో పొదివి మధుర గాన గాలిని సృష్టించిన నేస్తమే, కొండల దారుల్లో బండరాళ్ళ హోరుకాదది జలపాతాల సవ్వడి అని నేర్పింది." చాలా మధురం గా చెప్పేరు నేస్తం గురించి...

  ప్రత్యుత్తరంతొలగించు
 8. ;) భావన గారూ కోపమేమి లేదండీ.. మీరెప్పటిలాగే భావగీతాలు పాడవచ్చు :)
  మాలచ్చిమి గురించి ఆమాత్రం పదాలు వ్రాయలేనా ? :)

  ప్రత్యుత్తరంతొలగించు
 9. భావన గారూ, అసలు విషయం.. తవిక అని మీకు కూడా తెలిసిందా? :)

  ప్రత్యుత్తరంతొలగించు
 10. ఆ... ఆ... నేనొప్పుకోను తవిక అని నేనేదో మోడరేట్ గా అనుకుంటే మీరు అలా అనేస్తే ఎలా, ఏదో పేట పక్కూరోళ్ళం ( మా వూరు చిలకలూరిఫేట నర్సరావు పేట మధ్య లో వుంటుంది సో మీది ఏ పేట ఐనా మా వూరి దగ్గరే... ) ఇక్కడ కూడా మీ వూరికి మరీ పక్కూరు కాకపోయిన ఇరుగు పొరుగోళ్ళం.... ఇలా అనేస్తారా నన్ను.... ....
  మా లచ్చిమి ఎవరండి మనలో మన మాట.. ;-)

  ప్రత్యుత్తరంతొలగించు
 11. హహా.. భావన గరూ, పేట పులుసు ఆశ చూపించి మనసులో మాట వినాలనా? హమ్మా...
  అయినా ఇదికూడా తెలియదా మాలచ్చిమి మా లచ్చిమే అనుకోండి. ఏ గొడవలూ వుండవు :)

  ఘల్లు ఘల్లు ఘల్లునా ...
  అలలకు అందునా ఆశించిన ఆకాశం
  కలలు కరగడమే జీవితాన పరమార్ధం

  అయినా
  వలలొ వొదుగునా విహరించే హృదయం?

  ప్రత్యుత్తరంతొలగించు
 12. మీరిక్కడేమో జలపుష్పలకి 'మంగళ హారతి '.....మరో పక్క పుష్పాల సందడి తగ్గలేదాయే ...రెండో విడత హారతి ప్రసాదాలు వున్నాయా ?

  ప్రత్యుత్తరంతొలగించు
 13. చిన్ని ముత్యాలేవని చిన్ని చేప సరోవరంలో ఎన్ని సార్లు వెతికిందో :)
  అదేనండీ, ఉషగారు నన్నిలా సూప్ లో కలిపెస్తారనుకోలేదు. ఏంచేద్దాం. అయినా మంగళ హారతులు రెండోసారి/మూడోసారి ఇస్తారా ? అయినా హారతి వెలుగు కలకాలముండదు కానీ జలపుష్పాలు జీవపరిణామం మాత్రం నిత్యం. ఆ పరిణామం పరిసమాప్తమైతే మనిషి లేడు దేవుడూ లేడు.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. బాస్కరన్నా శాన మంచిగ పద్దేలు కట్టినవుగని
  నువు గట్టిన
  మంగలార్తులు గిదేందన్న నాకు పంపలే?
  అయినభీ కందాలు,తేటగీతిలు శాన మంచిగున్నయ్
  నేను భీ గొంతుకల్పెతోన్ని గంద మంగలారతుల్ల
  సిన్న పిల్లగాన్ని జేసి నన్నుదూరం పెట్టిన్రాయేంది
  నాకెరకలేకుంట మీరంత వూసులాడుకుంటున్నరులే
  నాకు శాన అదిగుంది యేంజెయ్యాల్నో
  అయినా భాస్కరన్నా గా భావనమ్మ
  గట్లంటదేంది నాక్సమఝ్కాకున్నది

  దివ్వెల దీపోత్సవం మీ అందరి జీవితాల
  దివ్యకాంతి నింపాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ...
  ఆశీస్సులనందిస్తూ......మీ యందరి రాఘవేంద్ర
  రండి రండి రండి
  కడలి తరంగాల్లా
  నవ్య భావ వుషోదయాన
  దివ్య కాంతి వీక్షణకై

  ప్రత్యుత్తరంతొలగించు

Comment Form