27, అక్టోబర్ 2009, మంగళవారం

కుదరని మనసు - కదలని చేయి



విరిసిన పుష్పం విసిరిన గాలం
వలచిన ముళ్ళు విరిగిన ముల్లు
అదిరిన తనువు కదలని కాలం
పెరిగిన గాయం రగిలిన కలం
తరగని భావం ఉరికే హృదయం
కుదరని మనసు కదలని చేయి.

13 కామెంట్‌లు:

  1. నువ్వెళ్ళాక..
    చినుకు ఆకును రాల్చనన్న మబ్బేమో
    మరి ఏమయ్యిందో నేస్తం
    మనసు మార్చుకుని
    ఆగక విసిరే వెర్రి గాలిని తోడు తెచ్చుకుని దిమ్మరించి పోయింది..
    ఆగాగి రాలే ఆకేమో అలసి సొలసి పోయానని హేమంతాన్ని తోడెట్టుకుని
    తిరిగి వస్తానని బాస చేసి మరీ వెళ్ళి పోయింది..
    శిశిర మాసపు చలేమో వేల నాలుకుల వణుకులతో
    కంబళీల వెనుకకు తరిమి తరిమి కొడుతోంది...
    నువ్వూ నీ నీడ మరువపు వనానికి దూరం గా
    గులాబి పెట్టే బాధ కు దగ్గరగా వున్నారు..
    ఎవరిని శపించగలం ఏమని ఓదార్చగలం చెప్పు
    విరబూసే వనమే ముల్లు గుచ్చి వెక్కిరిస్తే
    స్వాంతన పరిచే తోటే ముల్లు కొమ్మై దారి కాస్తే...
    అవాంతరాలన్ని దాటి వికసించే మా తూరుపోళ్ళ బుల్లెమ్మ
    తిరిగి తొందర గా కోలుకోవాలని మీ వూరి అన్నవరం స్వామి ని కోరుకుని
    ఆ పైన అంతర్వేది లో మనః స్నానాలు చేసి
    దాక్షారామ శివుడికి మొక్కి
    కార్తిక మాసపు నత్తాలు చేయటం తప్ప..
    త్వర గా వచ్చెయ్యి నేస్తం..
    నువ్వు లేవని బెంగ తో కృంగి ముల్లుని రాల్చేసి
    నీ కోసం మొగ్గల్నే వుంచుతానని
    బాస చేసింది నాతో గులాబీల వనం
    తోటలోని మరువపు కొమ్మేమో విరజాజి ని తోడు తెచ్చుకుని
    నీ కోసం స్వాగత మాలలల్లుతున్నానని కబురెట్టింది నాకు
    వచ్చెయ్యి మరి త్వరగా కోలుకుని మా మధ్యకు..
    సరేనా..

    రిప్లయితొలగించండి
  2. గాయం త్వరగా మాని తన మరువపు ఉషోదయ పరిమళాన్ని మళ్ళీ వెదజల్లాలని కోరుకుంటూ

    రిప్లయితొలగించండి
  3. భా.రా.రె., భవన, నా మనసిలా మీ ఇరువురినీ కలవరిస్తూ ఎవరో నను పిలిచినారని లేపి కూర్చుండబెట్టి ఈ వైపుగా లాక్కొచ్చింది. కళ్ళలో నీళ్ళు వేళ్ళలో సుళ్ళు తిరుగుతున్నట్లుగా వుంది. ధన్యురాలను మీరు పంచే ఈ మమతకి.

    రిప్లయితొలగించండి
  4. ఉషగారు మీకై అభిమానపు మాలలల్లి
    నిండు మనసుతో మమతల ప్రార్ధనలను వల్లి
    ఎదురు చూస్తున్నాము,గాయం త్వరగా మానాలి మీది మరువపు తల్లి!

    రిప్లయితొలగించండి
  5. భాస్కర్ గారు, భావనగారు, మీరు ఇలా కలవర పడి కవితలు రాసేస్తుంటే ఉషగారు ఊరుకోరు ఉత్సాహంతో ఉరకలు వేస్తు కొత్త రచనలతో మనముందుంటారు చూడండి త్వరలో...

    రిప్లయితొలగించండి
  6. భావన గారూ ఎంత చక్కగా వ్రాసారండి. ప్రవాహంలా పరుగిడిన ఆ కవిత మీరే మరొక్కసారి చదువుకొని వుంటారు. నేనైతే చాలాసార్లే చదివాను.
    "ఆగాగి రాలే ఆకేమో అలసి సొలసి పోయానని".. మీ పరిశీలన అమోఘం. ఉష గారు మీ కవిత చదివి రాత్రికి రాత్రి కామెంటు వ్రాసినట్టున్నారు.

    విజయమోహన్ గారూ.. నాకోరికను మీరు వ్యక్త పరిచారు.

    ఊష, కామెంటు వ్రాసే అంత ఓపిక ఎక్కడ నుంచి వచ్చింది ?

    సునీత గారూ ధన్యవాదాలు

    పద్మార్పిత గారూ, అవునండోయ్.. ఈ సారి ఉరకలు వేసే ఉత్సాహంతో వస్తారేమో.

    రిప్లయితొలగించండి
  7. ఇద్దరి కవితలూ బాగున్నాయి... ఉష గారూ మీరు త్వరగా రావాల్సిందే..

    రిప్లయితొలగించండి
  8. బాగుందండీ .గులాభి అంతకన్నా భాగుంది ,మనసు పారేసుకున్న.
    @భావన
    మీది భా.రా.రే కన్నా అధ్బుతంగా వుంది .
    @ఉష
    మీరు రెస్ట్ తీసుకోండి ,అన్ని కలిపి ఒక్కసారే చెల్లిద్దురుగాని

    రిప్లయితొలగించండి
  9. భ.రా.రే, మురళి, పద్మార్పిత, చిన్ని.. ధన్య వాదాలు. కవిత (కనీసం కవిత లా రాయటం) నాకు అంత తేలిక కాదు. ఎంతో భావావేశమో, బాధో కలిగితే తప్ప కవిత లా నా భావం రాదు. వెంటనే ఉషా అలా సమాధానం ఇస్తే ఇంకా బాధ వేసింది అనవసరం గా ఇంకా శ్రమ పెట్టేము కదా ఆ అమ్మాయి ని అని. అందుకనే నిన్న మౌనం గా వుండి పోయాను.
    ఉషా నువ్వు చదివినా ఆవేశ పడి సమాధానం ఇవ్వ వద్దు ప్లీజ్ ఇంకా మమ్ములను బాధ పెట్టకు సరేనా..

    రిప్లయితొలగించండి
  10. నన్నిక ఎవరూ ఆపలేరోచ్. నేనొచ్చేసానిక ఎవరూ బాధపడకండని చెప్పేయటానికి.

    నెప్పికి నేను, నాకు నెప్పి దోస్తులం అయిపోయాం. నేను పనిలో పడితే అది ఆదమరుస్తుంది. నాకు తీరిక చిక్కితే దానికి జోరు ఎక్కువౌతుంది. కనుక ఆ కిటుకు తెలిసిన మరుక్షణం నేను దాన్ని ఏమార్చటం నేర్చుకున్నాను.

    అందరికీ మరోసారి కృతజ్ఞతలు!!!!!!

    రిప్లయితొలగించండి
  11. డియర్ భారారె !
    బ్లాగ్లోకానికి ఉషస్సు
    దరి చేరనీయనిక యని
    ఉష వచించిన దాదిగా
    మూల్గిన నా మనమున
    తటిల్లున మెదిలిన
    జలపుష్పాభిషేకం...
    నెమరు వేసిన క్షణాన
    ఎందరెందరో మదిన మెదలిరి ...
    అందున భారారే
    భావస్పూర్తితో .
    నా కనుల ముంగిట..
    అందులకే ..నా
    ఈ పరామర్శ.
    అప్పుడప్పుడు
    పలకరిస్తే పాపం
    కానెకాదని
    నమ్మకం తో .
    మిత్రమా ! క్షేమమా ....
    శ్రేయోభిలాషి ...నూతక్కి

    రిప్లయితొలగించండి
  12. నూతక్కి గారూ, మీ అభిమానానికి ధన్యవాదాలండి. అంతమందిలో నన్ను జ్ఞాపకముంచుకున్నందుకు ఆనందంగా కూడా వుంది. "పలుకరిస్తే పాపమా?" అని చాలా పెద్ద అభాండం వేసారండి. కాలంతో పాటి మనిషీ మారతాడు కదా? మనిషి మారడమంటూ ఏముంది... మన ప్రియారిటీస్ మారతాయి. ఆ ప్రియారిటీస్ మారినప్పుడు సహజంగానే మిగిలినవాటిపై అనాసక్తి ఏర్పడి చూసేవాళ్ళకు వింతలా కనిపిస్తాము అప్పుడప్పుడు. అంతే గానీ మిమ్మల్ని కానీ వేరే ఎంతోమంది మంచిస్నేహితులను కానీ పలుకరించక పోవడానికి [ వ్యాఖ్య వ్రాయక పోవడానికి ] కారణాలంటూ ప్రత్యేకంగా ఏమీలేవు మిత్రమా. మళ్ళీ బ్లాగింగ్ మీద ఆసక్తి కలిగినప్పుడు సహజంగానే ప్రతి పోస్టుకు నేను కామెంటుతో రెడీ :)

    రిప్లయితొలగించండి

Comment Form