22, అక్టోబర్ 2009, గురువారం

నా ప్రేమలేఖ... దానికి నా సఖి సమాధానం


ప్రియ సఖీ వెన్నెలా !

ఎంతకాలమైంది మనము విడిపోయి? ఆ రోజుల్లో ఎన్నెన్ని కబుర్లు చెప్పుకొనే వాళ్ళమో ! మనసులే కాదు, శరీరాలు ఒక్కటే.

నీలోనే నేను, నాలోనే నువ్వు.

పంచ భూతాలూ మనలోనే. విస్పోటన శక్తి, విశ్వాంతరాళ శక్తి! అన్నీ మనలోనే. లోకంలేదు, లోకులూ లేరు, చుట్టూ ఎవరైనా చూస్తారనే బెంగ లేదు. గత జ్ఞాపకాల అలజడిని తట్టుకొనలేక పొంగి పొరలి వచ్చే ఆనందపు అలలను ఎవరో ఒక్కసారి బలవంతంగా పట్టి ఆపిన భావాన. ఏంచేస్తాం? జీవన పోరాటంలో చెరోదారి. మన ఇద్దరి కలయికను ఓర్వలేక దేవుడు ఆడిన నాటకంలో పావులుగా మారాం. సుదూర ప్రాంతాల వాసితులం. విరహ బాధితులం.

నిన్ను చేరుకోవాలని విడిపోయిన నాటినుండి అలుపు సొలుపు లేకుండా తిరుగుతూనే వున్నా. అయినా ఫలితం శూన్యం. అప్పుడప్పుడు ఏదో నలతగా ఉంటే అక్కడక్కడా ఓ క్షణమో,ఓ నిముషమో సేదతీరడం తప్ప నాకు విశ్రాంతి ఏది? ఆ నిమిషానికే నానా అల్లకల్లోలం. ఈ జీవిత పరుగును ఆపడం కష్టమే !

నువ్వు మాత్రం, ఏంచేస్తావులే ! నన్ను చేరాలని కాంతి విహీనమై నా చుట్టూ తిరుగుతూనే వున్నావుగా? సరేగానీ సఖీ ఈ మధ్య మనయోగక్షేమాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఓ వార్తాహరుడిని నీ దగ్గరకు పంపాను. ఏమైంది ? ఎందుకు వున్నపళంగా కోపగించావు? నాపై అలకా? కోపమా ప్రియా! ఈ దీనునిపై కరుణ లేదా? అన్నీ తెలిసిన నువ్వే ఇలా కినుక వహిస్తే ఇక నా గతేంకాను?

కరుణించి ఒక టపానైనా వ్రాయరాదా చెలీ !

నీకు ఏమీ కాలేక పోయిన
నీ భువి.





వెన్నల ప్రత్యుత్తరం.


ఓరి మగడా !
ఎంత చల్లగా ప్రేమలేఖలు వ్రాసుకుంటున్నావురా? నీ జిమ్మడా !? నన్ను దూరంగా నెట్టేసి, హాయిగా పొరల పొరల చొక్కాను తొడుక్కొని, చెట్టు చేమలతో, రాయి రప్పలతో, కొండా కోనలతో, నదీ నదాలతో తనివితీరా జీవితాన్ని అనుభవిస్తూ, నేను లేనని ఏడుపొకటా? నీ మొఖం మండా !? నా శాపమే కానీ నీకు మొఖమెలా మండుతుందిరా? ఏరోజైనా మంట ఎలా వుంటుందో అనుభవించావా? అసలు నీ నుండి విడిపడినప్పుడు నీ లాగే వుండేదాన్ని కదా? మరి ఇప్పుడు? అప్పటి ప్రేయసి ననుకుంటున్నావేమో ! పరువపు అందాలు అన్నీ ఆవిరైపోయాయి.
ఇంకిపోయిన అందాలు, వడలిపోయిన మేను. నా శరీరంలో అసలు నీరు వుందో లేదో నాకే తెలియటం లేదు. నీటి ఛాయ లేని మేని రంగు నాది :(. ఎప్పుడూ త్రుళ్ళి పడుతూ వుండాలని నాకోరికేకానీ జీవించడానికి గాలే లేదు. గాయమైన నా తనువును, మదిని వర్ణించి , నా కష్టాలతో నా ప్రియుని మనసు గాయపెట్టలేను.

ఉంటాను, నీకు ఏమీ కాలేక పోయిన
నీ వెన్నెల






*** అంతా చదివారు కదా?అంతగా అర్థము కాకపోతే ఈ క్రింది ఫాంట్ ను పెద్దగా చేసుకొని మళ్ళీ చదవండి.*****


భువిని Earth గానూ, వెన్నెల ను Moon గానూ అనుకొని చదవండి.
ఇవి విడిపోక ముందు రెండే కలిసే వున్నాయన్న సిద్ధాంత ఆధారంగా! అలాగే చంద్రుని మీద ఉష్ణోగ్రత బేధం చాలా ఏక్కువ.సోలార్ రేడియేషన్ అండ్ సోలార్ విండ్స్ కూడా ఊహకందని విషయాలు!

44 కామెంట్‌లు:

  1. ఇదెక్కడి అన్యాయం భా.రా.రె, అసలే అందమైన భువిని అందగాడిగాను, చూడ చక్కని చందురూడుని కురూపి భామ గాను చేసేస్తారా? హన్నా పైగా అయ్యగారేమో వలపుపలుకులూను, ఆ అతివేమో ఖంగుమంటూనా.... ఏమిటి సంగతి? ;) మొన్నేమో కొప్పు గోల... ఇప్పుడు ఈ ఘోషాను...

    రిప్లయితొలగించండి
  2. Something is wrong :(..ఇంటింటి రామాయణమంటారా భాస్కర్ గారు
    ఏదో చిక్కుల్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. యావిడతో గెలవలేక ఇక్కడ మొరపెట్టుకుంటున్నారా??

    రిప్లయితొలగించండి
  3. మరి అందుకే అన్నది కొప్పులవెంట పడనేల ముప్పులు మీకేల?
    మరింకెందుకు ఆలస్యం పులిహోర కలిపేయండి...మీకు నేను చెప్పనేల?:)

    రిప్లయితొలగించండి
  4. భా.రా.రె. గారూ !
    మీ ఊహ లేదా కల్పన బాగుంది. మీరేం తగ్గకండి.

    రిప్లయితొలగించండి
  5. ఉషగారూ ఇదేకదా న్యాయం. బిగ్ బ్యాంగ్ కు ముందు విశ్వమెంత? ఆ చిన్ని బిందువులో ఎంత విస్పోటక శక్తి? అప్పటిదాకా కలిసి మెలిసి వున్న పదార్థమంతా చెల్లా చెదురై దిక్కు కొకటి చొప్పున విసిరొ వేయబడితే ! అందులో నుంచి జనించిన ఒక ఊహ. భూమిని ప్రియుని గాను దాని ఉపగ్రహాన్ని ప్రియురాలిగానూ ఊహించుకొని వ్రాసిన ప్రేమలేఖ. ఇప్పుడు చదవండి ప్రియుని లేఖనూ ప్రియురాలి లేఖనూ, అన్నట్టు పైటపాలో వార్తాహరుడు అంటే చంద్రయాన ఉపగ్రహం. వెన్నెలమ్మ పరిశరాల కోపానికే కుప్పకూలి పోయింది కదా !

    ఇక ప్రియురాలి లేఖలో కనిపించేది భూమి వర్ణన.పొరల చొక్కా అంటే వాతావరణ పొరలు. చంద్రుని మీద రేడిఏషన్, ఉష్ణోగ్రతలతో పోల్చుకొని చందమామ భూమి సుఖానికి కుళ్ళుకుంటుంది. :) అదీ సంగతీ. అంతే గానీ మొన్న కొప్పువెంట పడ్డానని ఈరోజు ఇది కూడా ... అనుకుంటే ...అమ్మో మా ఆవిడ చదువుద్ది మళ్ళీ :)

    రిప్లయితొలగించండి
  6. జ్యోతీ గారు..nothing wrong, Thanks for checking. We are very happy and enjoying life.

    పైకామెంట్ చదివారు కదా అదన్నమాట ! :)

    రిప్లయితొలగించండి
  7. పద్మార్పిత గారూ, ఏంటోనండీ

    కొప్పు చూడు కొప్పందం చూడూ
    ముక్కున వున్న ముక్కెర చూడు !

    అని అన్నారు కదా ఎవరో.. ఇవి కనిపిస్తే చాలూ వెంటబడటమే :)

    అయినా పులిహోర కలిపితే వినాలని అంత ఉత్సాహం ఎందుకమ్మా? ఇదుగో ఈ సారి మళ్ళీ పులిహోర అన్నారనుకోండి.. మీకు కూడా కలుపుతాను :)

    రిప్లయితొలగించండి
  8. యస్.ఆర్.రావు గారూ, నా టపాకి మీ వ్యాఖ్య దగ్గరగా వుంది. తగ్గేది లేదండీ... ఆలోచన రావడమే తరువాయి. వ్యాఖ్యకి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  9. నాకే కోప,తాపాలూ లేవండీ .! అయినా ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు ! ఇదెక్కడి గోల !? ఎంత అన్న్యాలం ? ఇదంతా అసత్తెం. ఎవరూ నమ్మొద్దండోయ్ :-0

    రిప్లయితొలగించండి
  10. మేము ఒప్పుకోము...అయిన ఎవరండీ అంత దరిద్రంగా ప్రేమలేఖ రాసేది .....అన్నట్టు మీరు గ్లాసెస్ లేకుండానే రాసారనుకుంటాను .భూదేవి స్త్ర్రీ ...చంద్రుడు పురుషుడు ..మీరేమో ఉల్టా చేసి రాసారు ...భువి (స్త్రీ )ని చూసి ఓర్చుకోలేక వెన్నెల కుళ్ళుకుంటూ రాసిన ప్రత్యుత్తరం ......"ఒసేయ్ ఎంత చల్లగా ప్రేమలేఖలు రాసుకుంటున్నవే "...అంటూ....తిరగ రాయండీ .

    రిప్లయితొలగించండి
  11. ఆహా, వెన్నెల రాక భలేగుంది :), ఇంకా రాలేదేం చెప్మా అనుకుంటూ ఉప్మా తినడానికి సిద్ధపడ్డాను. ఈ లోపు వెన్నెల వచ్చేసింది రావటంతో పాటే అన్యాలం అసెత్తం అనుకుంటూ! ఇంకేం భువి మరో ప్రేమలేఖ వ్రాయడానికి సిద్ధం :)

    రిప్లయితొలగించండి
  12. అయ్యో చిన్నీ, నిజమే సుమా అద్దాలు లేక ఈ మధ్య అసలు ఆడా మగా కు తేడా తెలియడం లేదు సుమీ :)
    ......"ఒసేయ్ ఎంత చల్లగా ప్రేమలేఖలు రాసుకుంటున్నవే "... ఇలా వ్రాస్తే అమ్మలక్కలు గగ్గోలు పెడతారాని అలా వ్రాశాను.

    రిప్లయితొలగించండి
  13. అందమైన కవిత చదువుతూ మంచి పులిహోర తింటున్న ఫీలింగ్ లో ఉండగా ఆ సఖి సమాధానం పంటికింద రాయిపడ్డట్టు అయిందండీ :) ఓ టపా వెనక్కెళితే కొప్పుల గొడవ అర్ధమైంది కానీ ఈ పులిహోరేంటండీ ?

    రిప్లయితొలగించండి
  14. హమ్మయ్య!!ముందు టపా వచనంలో చదివేందుకు హాయిగా ఉంది, ఆ తరువాత టపా అర్ధవంతంగా ఉంది.వెన్నెల ప్రత్యుత్తరం
    మాత్తరం గుంటూరు నోరు రేంజిలో ఉంది.వైరుధ్యంగా అలోచించిన తీరు బాగుంది.

    రిప్లయితొలగించండి
  15. పరిమళం గారూ, టపా నచ్చినందుకు ధన్యవాదాలు. ఇక పులిహోర గురించి ఎలా చెప్పాలండీ :) , ఓ సారి పద్మార్పితగారినడిగి చూడండి :)

    రిప్లయితొలగించండి
  16. సునీత గారూ, వచనం మీ కోరికేనండీ! ఇక వెన్నెల ప్రత్యుత్తరం గుంటూరు పోరగాడు వ్రాస్తే అలాగే వుంటది మరి :)

    రిప్లయితొలగించండి
  17. మాకా విషయం తెలిసిందిలేండి. మీకే పరిక్ష + ఆ చివరి కొసమెరుపులు ఇంకా వున్నాయా అని చెక్. :)

    నిజమే కదా ఈ అనంత విశ్వ భూనబోంతరాళలో ఎన్ని మార్పులు ఎన్నెని అనూహ్యమైన చేతనలు.

    గ్రహం == భూమి = ప్రియుడు - బానేవుంది
    ఉపగ్రహం == చంద్రుడు = వార్తా హరుడు : ఓ కే!

    వెన్నెల == ప్రియురాలు అని కదా?

    మరి ఆమె ఉపగ్రహం ఎలా అయింది పైనున్న మీ వివరణ బట్టి.

    ఏమీ లేదు, మీనుండి మరి కాస్త పరిజ్ఞానం రాబడదామని, ప్రదీప్ సావాస కారణంగా వచ్చిన "ఈకలు పీకటం" సాధన చేద్దామని. తనతో అనకండేం, దండెత్తి వస్తాడు, మళ్ళీ మీరు మీరు ఒకటౌతారు, నన్ను చిన్ని భావన వంటి మెతకవార్ని జయించను [వర్బల్ జూడోలో] :)

    రిప్లయితొలగించండి
  18. ఉషాగారూ, వస్తే ఉరుములు మెరుపులే కాసేపు.. కొసమెరుపులసలుండవు.
    ప్రదీప్ సావాసం బాగానే అబ్బిందండీ! కానీ ఈకలు పీకడానికొచ్చి మీరిలా అడ్డంగా బుక్ అవుతారనుకోలేదండి. నా వ్యాఖ్య ఒకసారి మళ్ళీ చదవండి.

    "భూమిని ప్రియుని గాను దాని ఉపగ్రహాన్ని ప్రియురాలిగానూ ఊహించుకొని వ్రాసిన ప్రేమలేఖ. ఇప్పుడు చదవండి ప్రియుని లేఖనూ ప్రియురాలి లేఖనూ, అన్నట్టు పైటపాలో వార్తాహరుడు అంటే చంద్రయాన ఉపగ్రహం. వెన్నెలమ్మ పరిశరాల కోపానికే కుప్పకూలి పోయింది కదా !"

    కాబట్టి , గ్రహం == భూమి = ప్రియుడు - బాగుంది కదా ?
    ఇక మీరన్నట్టు "ఉపగ్రహం == చంద్రుడు = వార్తా హరుడు" ఇక్కడే సగం ఈక మాత్రమే పీకారు.
    అసలు ఈక్వేషన్ ఇది
    వెన్నెలమ్మ=చంద్రుడు=ప్రియురాలు.
    ఇక వార్తాహరుడు మానవనిర్మిత (కృత్రిమ) ఉపగ్రహం. మొన్నమొన్ననే కూలిన చంద్రయాన్ -1 ఉపగ్రహం.

    మీకు చెప్పేంత పరిజ్ఞానము నాకెక్కడ వుందండీ? మీరిలగా నా టపాలకు ఈకలు పీకుతూ వుండండి. అలాంటప్పుడే వ్రాసే వాక్యాలు మరొక్కసారి చూసుకొని ఇంప్రూవ్ చేసుకొనే అవకాసం కలుగుతుంది.

    రిప్లయితొలగించండి
  19. yeah I got caught up with current affairs. :) silly me. not there yet to ఈకలు పీకడం. :(

    మహదానందంగా వచ్చి పోతుంటాను. ;)

    రిప్లయితొలగించండి
  20. అమ్మో అమ్మో రెండు రోజులు ఇటు కేసి రాక పోతే చాలా జరిగి పోయినట్లు వున్నాయి కదా. భా రా.రే గారి లేఖ మిస్స్ ఐపోయానే.. బాగుందండీ, అమ్మాయి మంచి గ్రాంధికం లో మొదలు పెట్టి వుత్తరం ఆఖరికి వచ్చే సరికి చల్ల బడి పోయిందే.. మరి వెన్నెల తన నైజం కదా అంటారా? ;-)
    ఉషా అంతే ఉషా మాటల గారడి తో మభ్య పుచ్చటం వీళ్ళకు భూమి పుట్టి నప్పటి నుంచి వుందన్నమాట. ;-)

    పద్మార్పిత.. ఈయన పులిహోర కథ ఏమిటో ఒక సారి చెక్ చేయవలసిందే.. మొన్న చూడు కొప్పు గోల ఇప్పుడు చూడు ప్రేమ లేఖ.. చూడబోతే NJ లో ఇండియా కొట్టు వాడు రోజు ఇంటికి వెళుతు ఈ యనకు చింత పండు పేస్ట్, నిమ్మకాయాల డబ్బా వతను గా ఇచ్చి పోతాడు అనుకుంటా.. ;-)

    రిప్లయితొలగించండి
  21. ఇదిగో అబ్బాయ్! భా.రా.రె, నా కోటా చింతపండు పులిహోర, నిమ్మకాయ నాకు పంపుతూ, మా పద్మార్పితవి కూడా ఇటే వేసేయండి, ఏమనుకోదు మా అమ్మాయి. ;)

    భావన, మనం చాప క్రింద నీరు కదా? :) కాసేపలా కుప్పిగంతులేయనిచ్చి, తరవాత సంగతి చూస్తాం కదా. గారడీకి వశీకరణ, గమ్మత్తుకి ఉమ్మెత్త [ఇది ఫ్లోలో అనేసాలే బంగారం, అర్థాలు వెదక్కు, ఆలీ గారి స్ఫూర్తి :)]

    రిప్లయితొలగించండి
  22. భావనగారూ,అవునండీ అమ్మాయి గుంటూరు గ్రాంధిక భాషలో మాంచి దిట్ట :) అయినా మీరన్నట్టు వెన్నెల మనసు వెన్నపూస కదా !
    అయినా పులిహోరకలపటానికి ఇండియా కొట్టు ( పటేల్ బ్రదర్స్ ) వాడెందుకండీ. చింతపండు, వేరుశనగలు, ఉప్పు మిరపకాయలు, పసువు, నూనే...హ్మ్..ఇంకా ఏమి కావలబ్బా? ఇవన్నీ నాదగ్గర దండిగానే వున్నాయండీ :)

    రిప్లయితొలగించండి
  23. అమ్మాయ్ ఉషా, మీకు కావలంటే పులిహోర కలిపి పెడతాను గానీ... పద్మార్పిత గారిది కావాలంటే కుదరదమ్మాయ్.. ఎవరిది వారికే :)
    అయినా కుప్పిగంతులంటున్నారు, చాపకిందకి నీళ్ళు రడీ చేసారా? ఏంటి కథ?
    గారడీకి వశీకరణ, గమ్మత్తుకి ఉమ్మెత్త ఎంత చదివినా అర్థం కాలేదు. ఆలీ ని కూడా అడిగిచూసాను..లాభంలేదు బంగారూ, నువ్వే చెప్పాలి.

    రిప్లయితొలగించండి
  24. గుంటూరు గ్రాంధికమా??? ఏందబ్బాయి ఆడ ఇట్లా మాట్లాడుకుంటారా? నాకేమో తెలియకబోయే, నువ్వేమో చెప్పకపోతివి.. సరే ఆంతున పోయి.. ఏంది.... అటు ముందుకు బోయి ఆ గుడి పక్క సందులో మన కోమటి కొట్టుండే తెలుసు కదా... పోయి ఓ సవాసేరు నూనె, మరిన్ని శనగపప్పు అట్లనే చింతపండు కూడా తేరాదా.. ఏందబ్బాయ్ అట్లుండావ్? ఏంది చూస్తున్నావ్? వచ్చి మళ్ళీ గాబు లోకి నీళ్ళు కూడా చేదొద్దు, దిక్కులు చూడకుండా పోయిరా.. ;-) పోయొచ్చి రెండు చెంబులు దిమ్మరించుకొని పులిహార కలపొద్దూ.. పొద్దు గాల పని చేసి వస్తావు మళ్ళీ. తొందర గా బో మరి.. రేపు మాపటేలకు మళ్ళీ నాకు, మన ఉషా లేదు ఆ అమ్మాయి కి పులిహోర పంపొద్దూ..;-)

    రిప్లయితొలగించండి
  25. భావనగారూ, వ్యాఖ్యని కనీసం ఓ ఐదుసార్లు చదువుకోని నవ్వుకోనుంటాను.
    ఐనా ఏందమ్మీ ( సారీ అండి, మిమ్మల్ని అన్న్తట్టు కాకుండా మనూరి భాష అనుకోండి ), మనూరు బందరంటివే మరి గుంటూరు ఏడ్నించి వచ్చింది?అట్టాగే అన్నీ తెత్తాకానీ సవాసేరు ( ఈ పదం విని చాలా రోజలైంది.ఇది చదువగానే సోలెడు, మానిక, తవ్వ, అద్ద, గిద్ద ఇవన్నీ గుర్తుకు వచ్చాయి) నూనెవురి ముక్కులో పెడ్తావు?

    నీ గోలకటి దిక్కులు సూడకుండా ఎట్టాపొయ్యేది?నిన్నేమో కొప్పుకట్టుకోమంటే కట్టుకోపోతివి :) అట్టేగానీ ఏడినీళ్ళు పొయ్యిమీద బెట్టు.మాటేల పులిఓర ఒద్దుగానీ కోడికూర చేత్తాగానీ మినుములు నానై.

    రిప్లయితొలగించండి
  26. అబ్బ ఏదొకటి లేద్దు..చెప్పింది చేయకుండా యక్షప్రశ్నలు ...బందరు పుట్టింది .....గుంటూరు మెట్టి న ఊరు అనుకోరాదు .(గుంటూరు అమ్మాయి అన్నది )

    రిప్లయితొలగించండి
  27. ఓకే చిన్నీ గారూ, మీరు చెప్తే సరే. కానీ మీరంతా కలిసి ఏదో కుట్రపన్నుతున్నట్టనిపిస్తుంది. ఏదో జరగబోతుంది :)

    రిప్లయితొలగించండి
  28. బాగున్నాయి మీ ఊహలు..లేఖలు.
    "కోడికూర చేత్తాగానీ మినుములు నానై".....ఓ గారెలు + కోడి కూరా

    @ఏందమ్మో భావనా మా గుంటూరు మాటలు మాబానే పట్టేసావే! మాతో పెట్టుకోకు బందరు లగెత్తాల!

    రిప్లయితొలగించండి
  29. సిరిసిరిమువ్వ గారూ,
    హమ్మయ్య, ఈ గోదారి జిల్లా,బందరు జిల్లా వాళ్ళతో ఒంటరి పోరు చేస్తుండగా మీరొచ్చారు. నాకు ఇంకేం భయం లేదండి.
    అవును మినుములు నానవేయమన్నది గారెలకే మరి. మాబాగా చెప్పారు "బందరు" లగెత్తాలని :)
    అయినా పోనీలేండి, మెట్టినింటికి వచ్చిన వారు మనకు మరో అమ్మతో సమానము కదా? అన్నీ వదులుకొని మనకోసం మన ఇంటికి వచ్చారు.

    సిరిసిరిమువ్వా మరిమరిరావాలి మాఇంటికి ( టపాలు చదవడానికి ). ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  30. హన్నా హన్నా కాసేపూ ఖాళీ ఇస్తే అసలు వూరుకోవటం లేదు గా.. చిన్ని జిందాబాద్ ఉషా జిందాబాద్.
    ఏందబ్బాయ్ రెడ్డీ ఈ గోల. కోడి చేస్తే మన తూరుపోళ్ళ పిల్ల ఉష వుండలా పంతులు గారి పిలకాయల లెక్క నీసు తిందు గా పులిహోరే చేసెయ్యి, ఇంట్లో అలవాటంటివే అల్గినప్పుడంతా చేసి చేసి బాగా చెయ్యి తిరిగి వుండలా? ఏందమ్మాయ్ సిరిసిరి మువ్వ, అసలా పేరేంది ఆ లోకమేంది మొన్న మీ ఆమ్మ తో నేను అదే అనలే.. ఈ బాపట్ల కు ఈవల అంతా క్రిష్ణ వాళ్ళ తీరు గా వుంటారు పేట అవతలకు పోయి మా ప్రకాశం వాళ్ళను అంటుండావే బందరు తోలతానని ఈ సారి జీడిపప్పు కొసం పేటేపు కు రావూ ఏంది అప్పుడు లగ్గెత్తించనూ అంతా షోకు కాదబ్బా మీ వూరోళ్ళు... ;-)
    బాగా రాసేనా భారారే , సిరిసిరి మువ్వ ఇలానె మాట్లాడుకుంటారు కదా అటు పక్క. మీరూ ఆమ్మ అనే అంటారు కదు పెద్దమ్మ ను.
    చిన్ని ఆపోజిట్ చిన్ని, పుట్టినూరు ప్రకశం మెట్టినది పెరిగింది కూడా పక్కా క్రిష్ణా.. ఇంట్లో కూడా అంతే.. నాన్న ప్రకాశం అమ్మ పక్కా క్రిష్ణా. ఇంక మా అబ్బాయి సంగత్ ఇచూడాలి నాకే వీలుంటే ( అంత అవకాశం వుంటే) ప్రకాసం అమ్మాయిని చెయ్యనూ వాడికి. మా నాన్న కూడ అలానే ఆశపడే వారు చివరకు నాకు మా అక్క కు ఇద్దరకు ఎంచక్క గా క్రిష్ణా జిల్లా వాళ్ళనే తెచ్చారు,

    రిప్లయితొలగించండి
  31. సిరిసిరి మువ్వా పాడు చేసేవోయ్ టెంపో ;-) పర్లేదు లే భ.ర.రే భయపడ్డారు ఎలాను. ఉష చిన్ని నేను కలిసే సరికి అప్పుడె భ.ర.రే కి ఏదొ జరుగుతోందని కూసంత భయం వేసింది. కిందటి పోస్ట్ చూడు.. కొప్పు గోల ఈ సారేమో లేఖ గోల, అందుకే కూసంత చెమకు లేసేము మేము.. ;-)

    రిప్లయితొలగించండి
  32. భ.ర.రే: బందరు జిల్లా నా అదెక్కడమ్మా? ఎర్ర బస్ ఎర్ర బస్ ఎన్నియలో ఎర్రెర్రనిదీ బస్ ఎన్నియలో.. ;-) హి హి హి పళ్ళు నూరుతున్నారా ఈమె కు నన్ను ఏడిపించటం తప్ప వేరే పని లేదనుకుంటా అని. వుత్తుత్తినే ...

    రిప్లయితొలగించండి
  33. అంతే ఉషా.. వీళ్ళు మాటలతో మాయ చేస్తే మనం గమ్మత్తు కు వుమ్మెత్త. హి హి హి ఇదేదో బాగుంది.. ఆలి ని గీలి ని అడిగి లాభం లేదు భా ర.రే ఈ పదం ఉషమ్మ పుట్టించింది ఉషా కు ఒక రెండు వీర తాళ్ళు.

    రిప్లయితొలగించండి
  34. ఓ, ఓ..ఓహో భావన గారూ, మీరు పుట్టింది ప్రకాశం జిల్లాలోనా? ఇంతకీ ఏవూరు?

    సూపర్ స్లాంగ్ భావన గారూ.
    అబ్బే ఉష chicken తినకపోయినా ఇంట్లో లాగించేస్తారు కదా! కబట్టి ఉషకి ప్రత్యేకంగా ఓ వాటర్ మగ్ పార్సెల్ :)

    ఏందీ భయపడ్డానా? ఈ సారి చూడు ముక్కుపుడక మీద వ్రాస్తాను :)
    అన్నట్టు గమ్మత్తు వుమ్మెత్త ఉష తో పాటు మీకూ రెండు వీరతాళ్ళు. ( ప్రకాశం జిల్లాలో పుట్టినందుకు )

    " బందరు జిల్లా " వ్రాసే టప్పుడే అనుకున్నా...దీనిమీద ఏదోఒక కామెంట్ పెడతారని. ఏమీ లేదండీ, మిమ్మల్ని కృష్ణా జిల్లా చిన్నీ గారిని విడదీద్దామని బందరు జిల్లా అని పేరు పెట్టాను :) ( ఎన్నైనా Headquarters అక్కడే కదా అని ఓ జిల్లాను సృష్టించాను )

    రిప్లయితొలగించండి
  35. మా వూరేమో గుంటూరు నుంచి పర్చూరు వయా ఇంకొల్లు బసెక్కి, ఇంకొల్లు లో దిగి ఆటో లో పావులూరు మీదు గా వెళ్ళొచ్చు లేదా గుంటూరు నరసరావు పేట వయా పర్చూరు తిమ్మసముద్రం మీద వెళ్ళే బస్ ఎక్కినా వస్తుందన్నమాట. చిన్ని చాలా చిన్ని పల్లెటూరు. మీ ది కూడా ప్రకాశమేనా?
    సరే ఐతే మరి లేట్ ఎందుకు అప్పి గాడిని పొదగేసిన వాటిలో ఆ ఎర్ర పూల కోడి ని తీసుకు రమ్మంటాను... మీరు సకుటుంబ సపరివార సమేతం గా వచ్చేయ్యండి, ఎలాను ఇదుగో ఇలానే ముక్కు పుడక మీదో కంఠ హారం మీదో రాస్తారు ఎలాను మళ్ళీ పులిహోర కలపక తప్పదు..;-) అది ఉషా కు,పద్మార్పిత కు, చిన్ని కు, సిరిసిరి మువ్వ కు అందరికి పంపించొచ్చు. ;-)
    టాంక్ యూ టాంక్ యూ వీర తాళ్ళకు..
    అబ్బో ఏమి తెలివితేటలండి... చిన్ని... విన్నారా మనని విడదీద్దామని బందరు జిల్లా, మచిలిపట్టణం తాలూకా కనిపెట్టేరు భ.ర.రే. చో చో స్మార్ట్...

    రిప్లయితొలగించండి
  36. ఇలా కామెంట్లలో అసందర్భంగా దూరినందుకు ముందుగా క్షమించండి. దయచేసి ఒక్కసారి http://jeevani2009.blogspot.com/2009/10/blog-post_25.html ను సందర్శించండి పేరును సూచించండి ధన్యవాదాలతో, మీ జీవని.

    రిప్లయితొలగించండి
  37. ;) భావనా, భలే నన్ను తలుచుకున్నావా అంతసేపు. ఒకటే పొర మారుతుంటే ఎవరబ్బా అనుకున్నా...

    .. కోడి చేస్తే మన తూరుపోళ్ళ పిల్ల ఉష వుండలా పంతులు గారి పిలకాయల లెక్క నీసు తిందు గా పులిహోరే చేసెయ్యి,

    నిజ్జంగా నిజం. నీసు తినను పులిహోర వదలను [ఇప్పుడే లాగించా కూడా]

    .. "గమ్మత్తు కు వుమ్మెత్త" ఈ పదం ఉషమ్మ పుట్టించింది ఉషా కు ఒక రెండు వీర తాళ్ళు.

    ఈ తాళ్ళ లెక్క ఏమిటబ్బా?

    .. ఉషకి ప్రత్యేకంగా ఓ వాటర్ మగ్ పార్సెల్ :)

    భా.రా.రె. మధ్యలో ఇదెందుకు ఎంటరైందిటా సీన్ లోకి.

    భావన, అవసరమైతే సిరిసిరిమువ్వ గార్ని మనవేపు లాగేస్తా. మనకసలే జనాకర్షణ ఎక్కువ... ;)

    రిప్లయితొలగించండి
  38. అవును ఉషా చాలా సార్లు తలుచుకున్నాను నేను. అయ్యో పొర బోయిందా మరి మాకు పెట్టకుండ పులిహోర ఎందుకు తిన్నావు. సరే లే నేను తట్టేను అనుకుని నెమ్మది గా తల మీద తట్టుకుని పొడుకో..
    వీర తాళ్ళు తెలియదా.. మాయా బజార్ సినిమ చూడు. ఘటోత్గజుడి గోల అది.
    ఏదో పాపం సిరిసిరి మువ్వ గుంటూరని ఫీలింగ్ తోనూ..... ఇంకా ముందు పోస్ట్ లు చూడక భ.ర.రే పక్క పలికి వుండి వుంటుంది మరి ఆలస్యమెందుకు తిప్పెయ్యి మన పక్క కు మరి.

    రిప్లయితొలగించండి
  39. అమ్మో అమ్మో ఇక్కడ పెద్ద ఫైటింగ్ జరుగుతుంది,అసలే నాకు ఫైటింగ్ అంటే చాల ఇష్టం ,మా పూర్వికులు అసలే నాయకురాలు నాగమ్మ కొలువులో వుండి ఎత్తులు జిత్తులు వేసి అమాంతంగా హత్య లు చేసి కృష్ణాజిల్లా పారిపోయివచ్చి ఒక గ్రామమే ఏర్పాటు చేసారు .
    @భావన
    చూడు ఎంత కుట్రో ,మనిద్దర్నీ వేరుచేద్దామని !ఎంతయినా భా.రా.రే కి ఆ తెల్లోళ్ళ భుద్దులు తెగ అబ్బినాయట్లుంది ,బ్రిటిష్ వాడి పొలసీ డివైడ్అండ్ రూల్ పక్కగా అమలు చేస్తున్నారు .మనది పక్క కృష్ణాజిల్లా ,ముత్తాతలు పలనాటి వాళ్ళయిన ..వాళ్ళే కాదనుకుని కృష్ణమ్మఒడిలో కాపురం చేసారు..మీ ఇంటి ఆడపడుచునే :) ఉద్యోగ రీత్యా నెలకోసారయిన మీ ప్రకాశం జిల్లాని చూసుకుంటాను .

    రిప్లయితొలగించండి
  40. @భావన
    "ఎర్ర బస్సు యర్రెర బస్"..సూపర్ ...కొంచెం తగ్గినట్టున్నరేమో జనం కోసం ఊళ్లోకి వెళ్ళినట్టు ఆకాశవాణి చెబుతుంది.

    రిప్లయితొలగించండి
  41. హమ్మో హమ్మో కొద్దిగా పని మీద పొలానికెళ్ళి వచ్చేలోపు ఇంట్లో ఇంత గందరగోళమా? పార్టీ ఫిరాయింపులకు ఏకంగా ఒక పాత్రే నడుంకట్టడమా? దానికి మరో ఇద్దరి మద్దత్తా? ఎన్నైనా కృష్ణాజిల్లావాళ్ళు మహాగడుసరులు. తూ.గో/పా.గో వాళ్ళని రాయబారానికి పంపి వీళ్ళేమో తెరవెనుక మంత్రాంగనమా? పిచ్చి పిల్ల ఎగురుకుంటూ గుంటూరు వెళతానంటుంది. మిర్చీ మెరుపులు చూడాల్సి వస్తుందో ఏమో :)

    అవును భావనగారూ, పుట్టి పెరిగింది చాలావరకు ప్రకాశం జిల్లా. కనిగిరి కి ఓ 20 కి.మీ దూరంలో పక్కా పల్లెటూరు. ఎర్రబస్సెర్రబస్సు ఎన్నియలో :), ఇప్పటికీ ఈపాట పాడుకోవాల్సిందే. ఇప్పటికి కూడా ఆ వూరికి బస్సులేదు. మీరు ఎర్రపూల కోడికూర చేయాలేగానీ ముక్కుపుడక మీద కవిత వ్రాసి,మధ్యలో వున్న ఒక్క స్టేట్ ను గెంతేసి రానూ! వచ్చేటప్పుడు ఎలాగూ పాట్ లక్ తెస్తానులే. ఏముంటుందో అందరికీ తెలిసిందే :)

    ఉషా గారు, హమ్మా, మిత్రద్రోహీ.. నాకే గొయ్యి తీస్తున్నావా ? :) కావాలంటే ఇంకో రెండు వాటర్ మగ్ లు పార్సిల్ చేస్తాలే :). ఇది ఎందుకు వచ్చిందంటే, అసలే అదేదో రన్నింగ్ పెట్టుకున్నావు కదా..అందుకు బీర్ మగ్గులో వాటర్ పోసి పార్సిల్ అన్నమాట :)

    చిన్నీ ఇది కుట్రా? ఉద్యోగ ధర్మమమ్మా :), మీ ముత్తాతలు పలనాడైతే మా ముత్తాతలు రాయలసీమ :)
    మా ఇంటి ఆడపడుచువు కాబట్టి ఏమమ్మో మాజిల్లాకు పోయినప్పుడు మా ఊరి మీద ఓ కన్నేసి వుంచండి. కనిగిరి కి దగ్గర.
    ఏందీ! జనాలకోసం ఊర్లోకి బొయ్యానా! చెప్తా చెప్తా :)

    జీవని గారూ చూసానండీ.. కావలసినన్ని పేర్లు వచ్చినట్టున్నాయి. ఇంక వేరే అవసరం లేదనిపించింది.

    రిప్లయితొలగించండి
  42. భ.రా.రె... ఎంత మాట అనేసేరు..
    "పిచ్చి పిల్ల ఎగురుకుంటూ గుంటూరు వెళతానంటుంది. మిర్చీ మెరుపులు చూడాల్సి వస్తుందో ఏమో" అని
    మనం మమకారాల ముద్దబంతులను పూయించి
    పులపుల్లటి గోంగూర ఎర్రెర్రని పండు మిరపకాయ తో తొక్కి
    వర్ర గా నెయ్య తో కలిపి పక్కన నంజుకు వుల్లిపాయ ముక్కల ను పెడతాము కాని
    మిర్చి మెరుపులు చూపిస్తామా చెప్పండి..
    ఇంకా గోంగుర వెగటని మొహం చిట్లిస్తే తప్ప........,
    మన తూగో/పాగో మంచోళ్ళు
    అలా అనరు మనను
    మరీ కారమేస్తే కొంచం బెల్లం పులుసు పక్కన
    పెట్టుకుని నజుకుని తినేస్తారు .... ;-)
    చిన్ని సూపర్ మీరు ఐతే..... డింగు టంక డింగ్ డింగు టక డింగ్ (డాన్స్ అన్నమాట పల్నాటి ఆడపడుచు అని తెలియగానే) :-)

    రిప్లయితొలగించండి
  43. హమ్మయ్య.. భావన మా గ్రూప్ లో చేరిపోయింది. ఇక నో కాంట్రవర్సీస్..
    అయినా భావన గారూ.. మరీ ఎంత కోపం లేకపోతే ఇంత ప్రేమగా వెక్కిరుస్తారు తూగో/పాగో వాళ్ళని?
    "మరీ కారమేస్తే కొంచం బెల్లం పులుసు పక్కన పెట్టుకుని నజుకుని తినేస్తారు .... ;-) "

    నాక్కూడా ఈ మ్యూజిక్ "డింగు టంక డింగ్ డింగు టక డింగ్ " భలే నచ్చింది. ఈ పాటికి చిన్ని గారు డాన్స్ నేర్చొకొనే పనిలో వుండివుంటారు :)

    రిప్లయితొలగించండి
  44. ఆకస్మిక తనికీకి వచ్చి ప్రోద్దున్నుంచి మా బాస్ డాన్స్ చేయిస్తున్నాడు ఇంకా నేర్చుకునే పనిలేదాయే ,కొంపకి ఇందాకే చేరాను....మీరే చేయండీ భావన మీ పార్టీకి వచ్చినందుకు .

    రిప్లయితొలగించండి

Comment Form