జో... జో... జో...జో
ఊ... ఊ ... ఊ .. ఊ
వెన్నెలా ఓ వెన్నెలా నన్నిలా వ్రాయనీ (మంద్రస్థాయిలో)
నిండార విరిసిన పండు వెన్నెలా
మాయింట విరసిన విరివెన్నెలా
మాకంటి వెలుగుల వెన్నెలా
జగతికి జోలపాడు మా వెన్నెలా
మదిలోన దాగిన దావాజ్ఞి
మనసంత దహించి వేస్తుంటే
ముఖమున పండు వెన్నెల ఫూయీంచేవు
మనుషుల మారాము చేసి మైమరపించేవు
హరిద్వార మందు నిశిరాత్రుల ఎన్నిగుండెల దహనాన్ని చూసేవు
విరిసిన ప్రేమ తోటలందు ఎన్ని జంటల మురిపించేవు
జలజలా పారు సెలయేటి బాల్యమందు
ఎంత సొగసుగ చిన్నారుల మైమరపించేవు
ఉప్పొంగి పొంగు యవ్వన వడిలోన
మనసంత నిండి ఊయల లూగించేవు
వయసంత ఉడిగిన వానప్రస్థులకు
తోడు నీడై ఊ కొట్టి జోలపాట పాడేవు.
నడిరేయి జాముపొద్దున కాగేటి జంటకు
కథలెన్ని చెప్పి మైమరపించేవు
స్వామి లేని రాత్రుల విరహోత్కంఠితకు
రాగాల మాలికల మైపూత పూసేవు
సంద్రాన మునిగిన సంసార జంటకు
రాతిరంత చల్లని చూపుల సేదదీర్చేవు
జగమేలు చోరశిఖామణులకు
మబ్బుచాటున నక్కి దోబూచులాడేవు.
భువినున్న బాలలకు చేతచిక్కిన మల్లెచెండువు
మనసున్న కన్నియలకు సిగలోన చంద్రవంకవు
భావ కవివరులకు పిలిచిన పలికే వెన్నెలవు.
లెక్కల్లో చుక్కలెన్ని కలిపినా
చుక్కల్లో చందమామవు
అందరాని వెన్నెలమ్మవు
జగతిలోన ప్రగతిబాటకు నిను చూడగ ఎన్ని ఆలోచనలు?
ప్రగతిశీల లోచనునికి అందరాని చందమామవు!
ఉబకనీకు మదిలోని అగ్నిగోళాన్ని
చెదరనీకు ముఖమున మురిపెపు నవ్వుల్ని.
జో... జో... జో...జో
ఊ... ఊ ... ఊ .. ఊ
వెన్నెలా ఓ వెన్నెలా నన్నిలా వ్రాయనీ (మంద్రస్థాయిలో)
umm....నిద్రోయాం...!!
రిప్లయితొలగించండి(ఇలా జోల పాడి అందర్నీ బజ్జో పెట్టేస్తే వ్యాఖ్యలెలా రాయగలమండీ..? :))
జోకొట్టి మనసుని వెన్నెలలో ఊయలలూపితే ఎలాగండి?:)
రిప్లయితొలగించండిభలే సమర్ధులండీ.....వెన్నెలమ్మకే జోల పాటా!:):)
రిప్లయితొలగించండిఇక్కడితో ఆగిపోయారేమి, వెన్నెల కన్నా మీరే ముందు తొంగుండిపోయారా ఏమి? :) పిల్లల్ని, కన్నెల్ని, పడుచు జంటలని, దొరలని, దొంగలనీ, కవులనీ బాగానే చుట్టివచ్చారు కాని .. ఒక ప్రశ్న
రిప్లయితొలగించండిపైనున్న వర్ణనలకు, చివరి ఈ రెండు పంక్తులకు గల లింక్ ఏమిటో...
ఉబకనీకు మదిలోని అగ్నిగోళాన్ని
చెదరనీకు ముఖమున మురిపెపు నవ్వుల్ని.
నాకు నిద్రొస్తోంది,మళ్ళీ వస్తా.
రిప్లయితొలగించండితృష్ణగారూ కామెంట్ వ్రాసిన తరువాత పడుకోండి. అందరికీ ఎక్కడండీ , మీకు పాడదామంటే కొత్తచుట్టానివయ్యారు :)
రిప్లయితొలగించండిపద్మార్పితగారూ మీ మనసు ఎప్పుడూ వెన్నెలేకదా, ఇక మీకు జోలపాటలతోపనేముందండి :)
సృజన గారూ బహుకాల దర్శనము. వెన్నెలమ్మ ఎప్పుడూ మనకు జోలపాడుతుంది కదా అందుకని వెరైటీ గా వెన్నలమ్మకు జోలపాటన్నమాట. ధన్యవాదాలు.
హమ్మా! ఉషాగారేంటి ఇంకారాలెదనుకొంటున్నా, వచ్చీ రాగానే చిచ్చుబుడ్డిలాంటి ప్రశ్నలేస్తే సమాధానాలుండవు.ఎందుకంటే చిచ్చుబుడ్డి పేలుతుందో లేక పూలుపూస్తుందో చివరి నిమిషందాకా తెలియదు కదా :)
విజయమోహన్ గారూ, పడుకొని రేపురండి :)
ణాక్కూళా నిద్దళొస్తోండి!
రిప్లయితొలగించండిబాగుందండి.
రిప్లయితొలగించండిee song ki evarina music chesi paadithe baguntundi kada :)
రిప్లయితొలగించండిచాలా బాగుందండి,
రిప్లయితొలగించండిలెక్కల్లో చుక్కలెన్ని కలిపినా
చుక్కల్లో చందమామవు
అందరాని వెన్నెలమ్మవు
మంచి భావన.
స్వప్న గారన్నట్లు మ్యూజిక్ చేసి ఆడియో ఫైలుగా పెట్టండి.బాగుంటుంది.
చాలా చక్కటి కొత్తభావాలు. వెన్నెల కబుర్లు ఎన్ని చెప్పినా తీరవండి. ఈ కార్తీక పౌర్ణమికి మాత్రం వెన్నెలమ్మని నిద్రబుచ్చకండేం. వనభోజనాలున్నై. ఇప్పటికే అందరం నిద్ర పోయాం. ఇప్పుడు మీరొక మేలుకొలుపు పాడక తప్పదు.
రిప్లయితొలగించండిసుజాత గారూ, ణస్సి ణిడ్ర వస్సిందా లేక చదువు తుంటే ఆవులింతలు వచ్చి నిద్రవచ్చిందా :)
రిప్లయితొలగించండిసునీత గారు బాగుందంటారు అయుతే :)
స్వప్న, ఆ పనేదో మీరే చేసి మాకూ పంపొచ్చు కదండీ. మీ పేరు చెప్పుకోని వింటాము.
శ్రీనిక గారు, వ్యాఖ్యకు ధన్యవాదాలు. మనం సంగీతం వినడం వరకే. బాణి కట్టి పాడాలంటే మీలాంటి వారు ముందుకు రావాల్సిందే.
జయ గారు, మీకు స్వాగతం. వ్యాఖ్యకు సుస్వాగతం.
మీ బ్లాగులో మీ కవిత చదివాను. ఆ తరువాత కూడా మేలుకొలుపులు నేను కొలవగలనా చెప్పండి? త్వరగా నిద్రలేచి శ్రీ సూర్యనారాయణా మేలుకో అని ఓ పాట వ్రాసేయండి.
అబ్బబ్బబ్బా, భా.రా.రె ఏమి పలాయనమంత్రం చిత్తగించారు? ;) కానీండి మరో అవకాశం కొరకు మాత్రం చూస్తూనేవుంటాను. మా మాష్టారు నాకు నేర్పిన విద్య ఇది.
రిప్లయితొలగించండినీలి వనాల మొదలైన పయనం... బాల వనాల నవ్వు ను మెరిపించి,ప్రమదావనాల విరులు కురిపించి, నీలాల సంద్రాన నురగల మెరిపించి, పడుచు గుండెల కోర్కెను రగిలించి అమ్మో ఎన్నెన్ని చేసిన మాయలమ్మ కు జోల పాడి, నిదుర కాగిన గుండెలకు మంటను మిగిల్చి వెన్నెలమ్మ ను ఇలా నిద్ర పుచ్చితే ఎలా చెప్పండి.. అసలే కార్తిక పున్నమి దగ్గరకొచ్చే, చూడండి మీరు తెగ జోకొట్టేరు మబ్బుల పక్కేసుకుని బొజ్జున్నట్లుంది వెన్నెలమ్మ మా వూర్లో.. :-(
రిప్లయితొలగించండిఉషాగారూ పలాయనమా లేక వాయనమా? :) గమ్మత్తుకు వుమ్మెత్త లాగా !
రిప్లయితొలగించండిఇంతకీ మీ గురువుగారు నేర్పింది పలాయనమా లేక తప్పు ఎదుటవారి చేతఎలా చేపించాలనా లేక వాళ్ళే తప్పుచేసే దాకా వేచివుండమనా? :)
భావన గారూ మీరు ఈ జన్మకర్థంకారు.
జలజలా పారే జలపాతానివా?
సలసల కాగే నిప్పుకుంపటివా?
తొణకని అంబోధివా?
పోటెత్తు సాగర అలవా?
మీరు హైలీ టాలెంటెడ్. మై హానెష్ట్ ఒపీనియన్.
ఇక మళ్ళీ జోక్స్, మీవూర్లో మబ్బుల పక్కేసుకొని పడుకోనుంటే, మా వూర్లో నిన్నటిదాకా అలిగి ఒకటే ఏడుపు..ఏడ్చి ఏడ్చి పుట్టింటికెళ్ళి పోయునట్టుంది. అసలు జాడే లేదు :(
అప్పుడు నిద్రపోయి ఇప్పుడు లేచాము ........మరి ఇంతలా జోల పాడితే ఏమైపోవాలి ..-:)
రిప్లయితొలగించండిభా.రా.రె. అది చిదంబర రహస్యం. చెప్పను గాన చెప్పను. :)
రిప్లయితొలగించండిభావన, భా.రా.రె. తో నేనూ ఏకీభవించేది "మీరు హైలీ టాలెంటెడ్. మై హానెష్ట్ ఒపీనియన్."
చిన్నిగారు పౌర్ణానికి లేచారు కదా, మావాటా వంట మాకు పంపండి. మాంచి పచ్చడి మాత్రం వుండాలి సుమా !
రిప్లయితొలగించండిఉష, సరే ఆ రహస్యమేదో చిదంబరాన్నే అడుగుతాను :)
ఉషా, భా. రా. రే నేను అంత టేలంటెడ్ ఏమి కాదు, మీరు రాసినవి చదివినప్పుడు కలిగే కూసంత భావా వేశం, నా అంతటికి నాకు కవిత రాదు మళ్ళీ మీరు గమనించేరో లేదో నా బ్లాగ్ లో కవితలే వుండవు నా వుత్తరాలలో కూడా..
రిప్లయితొలగించండినేనెవరిని అని అడిగారు కదా భా. రా.రే నేను మీ అందరి మదిలే మెదిలే భావన ను..
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి( \
రిప్లయితొలగించండి~ --:()
( /
గుర్..గుర్... నే నిదరోతున్నా......
ష్.. లొల్లి చేయకండ్రీ
భావన గారూ మీరు టాలెంటెడ్ కాదా, నిజమా ! అయితే ఎక్స్ లెంట్ అండీ :)
రిప్లయితొలగించండివెన్నలా.. బొజ్జుంటానని అప్పుడే మేల్కొని ఒక టపా ఒక కవితా విసిరారు కదండీ. గీతల బొమ్మ భలే.