24, సెప్టెంబర్ 2009, గురువారం
గతిలేని భూమాత...మతిలేని త్రిశూలం
పగలంతా..
భూమత కష్టాన్ని
ఆమె దరిద్రాన్ని
దాశ్యత్వాన్నీ దానవత్వాన్నీ
రాచరిక దాపరికాన్నీ
రాటుదేలిన హృదయాల్నీ
కండలు పిండే కష్టాన్ని
కరుడు గట్టిన కాఠిన్యాన్ని
ఆర్తిగా చూసే అన్నార్తుల్నీ
కన్నీరింకిన పసి మోముల్ని
అంబరాన అశక్తి తో
మూడు కళ్ళు విప్పి మరీ చూస్తున్నాడు
రేయంతా రెండు కనులు మూసినా..
చీకటి బజారులో
భయంలేక తిరిగే రారాజుల్నీ
రక్తపు మడుగుల్లో
అసహాయంగా ఏడ్చే యువరాజుల్నీ
ఆ ఏడుపు జోలపాటగా
నిదురించే రాబందుల్నీ..
కృత్రిమ హరివిల్లు పరదాలక్రింద
నర్తించే నంగనాచి తుంగబుఱ్ఱల్నీ
ముప్పొద్దుల మోసపోయిన మానినిలనూ
మూడోఝామున మూడు నోట్లు లెక్కంచే పడతులనూ
మైకంలో మాయమైన ఆలోచనలతో
మమేకంలో మంటగలిసిన స్నేహబంధాల్నీ
పర్యాలోచన నశించి నిశీధి నీడలో నడిచే భావిపౌరుల్నీ
విరూపాక్షని మూడో కన్ను
మూడు ఝాములా విప్పార చూసింది.
తెల్లవారబోతుండగా సిగలోని అమరాపగ విప్పి
నాలుగు హిమ బిందువులు విదిల్చాడు
గతిలేని భూమాత
అభ్యంగన పునీత యైనది.
మళ్ళీ ఎప్పటి లాగే ...
ఉషోదయాన గాలి పులకింతలు
తన్మయాన తలలూపే తరుణీ లతలు
విరులు విసిరే విరజాజి వీచికలు
కోనేటి రాయుని కీరవాణి రాగాలు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
భూమాతకి అది మామూలేగాండి, ఎన్ని యుగాలదీ దమనకాండ సత్ప్రవర్తనల నడుమ సంఘర్షణ. దానవ సంతతి ధరిత్రికి శిరోభారం, సత్సంగ జనిత సహనం శాంతి తృప్తి ఆత్మశోధనలు - ఈ నాలుగు కలిసి ఇచ్చిన ఉపశమనంతో తేరుకుంటుంది. తన గమనం సాగిస్తుంది. చక్కని భావన, ఇంకా చిక్కని భావాలతో భలే అందించారు. ఈ వ్యాఖ్య వ్రాయగలగటం ఓ సదవకాశం.
రిప్లయితొలగించండిvery nice
రిప్లయితొలగించండిఅర్ధం కష్టంగా తోస్తుంది ఇంకా నాలుగైదుసార్లు చదవలేమో .....ఇదేనేమో నారికేళ పాకం అంటే !
రిప్లయితొలగించండిఉష గారు లెస్స పలికితిరి.
రిప్లయితొలగించండిపవన్ గారూ ధన్యవాదాలు.
చిన్నీ గారూ, ఏంలేదండీ భూమాత ను ఎన్ని దుష్టశక్తులు పీడిస్తున్నా శివుడు కూడా పగలు మూడు కళ్ళతోనూ రాత్రి రెండు కళ్ళ నిద్రపోతూ మూడో కంటితో చూస్తూ కూడా ఏమీ చేయలేక తెల్లవారు జామున తన సిగలోని ఆకాశ గంగనుంచి నాలుగు మంచు బిందువులను భూమిపైన విదిలిస్తాడు.భూమాత వాటితోనే అభ్యంగన స్నానం చేసి ఎప్పటి లాగే తన రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నమైపోతుంది . ఇందులో ఇంకేదో శ్లేష గోచరించినా గోచరించ వచ్చు గాక !
భా.రా.రె. మునుపెప్పెడో విన్న పాట - కోటికి ఒకరే పుడతారు పుణ్యమూర్తులు, వారి కొరకె వస్తారు సూర్యచంద్రులు.." మంచివాళ్ళకి ప్రకృతే తోడు. అని సాగుతుంది. అలాగే శ్లేష బోధపడింది కొంచెంగా :). భూమాతకి ప్రతీకలు వేలల్లోవుండొచ్చు. శివుడు - తపోమూర్తి, వీరభధ్రుడు, ఆనంద తాండవమాడువాడు, లయకారి, విరాగి ఇంకెన్నో లక్షణాలు. అందునుండి వచ్చేసూరీళ్ళు కోట్లు. ఇక మిగిలజీవ గణం కూడా తారాడు కొన్ని మనస్తత్వాలు. అట్టివారు ఇట్టివారు నడయాడునదే ఈ కవితాసీమ. ఇది వూటబావి. చిన్నీ, మీకొకటి నాకొకటీను పులిహోర పార్సిల్ పొద్దుపొద్దున్నే ఇంత బాగా అర్థాలు వెదికినందుకు, చెప్పించినందుకూను. ;)
రిప్లయితొలగించండిJust a jumbled up wording above...
రిప్లయితొలగించండిపాట - కోటికి ఒకరే పుడతారు పుణ్యమూర్తులు, వారి కొరకె వస్తారు సూర్యచంద్రులు.." అని సాగుతుంది. మంచివాళ్ళకి ప్రకృతే తోడు. This is my strong belief.
బాగుంది సోదరా!!
రిప్లయితొలగించండిచాలా బాగుందండి.
రిప్లయితొలగించండిచాల బాగా చెప్పారు ...హమ్మయ్య ఇప్పుడు చదుతుంటే ఓహ్ ...ఇదేనా అర్ధం కానిది అనుకున్న :) ఏంటి ఉషగారికి పులిహోర పంపించేసార !మాకింకా అందలేదు .ఉషాజి థన్క్యునాక్కూడా సిఫారుసు చేసినందుకు .
రిప్లయితొలగించండిభా.రా.రె గారూ మీరీ పద్యాలు మానేసి వచనం రాయడం మొదలుపెట్టండీ, ప్లీజ్ మాలాంటి బద్దకస్తులకు చదివేందుకు వీలుంగా ఉంటుంది.
రిప్లయితొలగించండిఇంత బాగా రాసి దాన్ని విశదీకరించి మరీ చెబుతుంటే......అద్భుతం!
రిప్లయితొలగించండిపులిహోర కలపడమే కాకుండా పార్సిల్ కూడానా......అమోఘం!
ఉషాజీ.. భలే అనువదించారండి. ఎన్ని గాయాలైనా తెల్లవారు ఝామున కురిసే మంచు దుప్పటి తో భూమాత నిత్య యవ్వనియై మళ్ళీ శుభోదయం కోసం ఎదురుచూస్తుంది కదా?
రిప్లయితొలగించండి@భాస్కర్, దారి తప్పి కవితా వనాల్లో తిరుగుతున్నావా? ఇంటికేమైనా ఫోన్ చేయాలేమో చెప్పు :-)
@విజయమోహన్ గారూ, ధన్యవాదాలు. మీ బొమ్మలంత అందంగా ఎప్పుడు వ్రాస్తానో.
@చిన్ని గారూ, నేను పులిహోర పంపడమేమిటండీ.. ఉషగారు చేసి మీకోటి పంపించి, తనకోటి వుంచుకొని నాకు ఒట్టిచేతులు చూపింది చూసారా? ఇది అన్యాయం అధ్యక్షా.. మా తీవ్ర అభ్యంతరాన్ని తెలియచేస్తూ మా ఎమ్.ఎల్.ఎ ల చేత రిజైన్ చేపించాలని యోచిస్తున్నాము ( గోడ దూకక పోతే )
@సునీత గారూ, మీరు నాకంటే బద్దకస్తులులాగున్నారు. నేనేదో టైపు చేయడం తప్పుకుందామనుకుంటే నన్ను ఇరికిద్దామని చూస్తున్నారా?
తప్పకుండా నండి, వీలుచూసుకొని త్వరలో ...
@పద్మార్పిత గారు ఆహా.. ఓహో అన్నారంట ;) jk
మీ అద్భుతాలు, అమోఘాలుంటేనే ఎప్పుడన్నా ఇలాంటివి వస్తుంటాయండీ.
"ముప్పొద్దుల మోసపోయిన మానినిలనూ
రిప్లయితొలగించండిమూడోఝామున మూడు నోట్లు లెక్కంచే పడతులనూ" ప్రాస కన్నా, భావం కదిలించింది... మళ్ళీ మళ్ళీ చదివాను....
అయ్యో మురళి ప్రాస ఎక్కడుందండీ ! మీకు తెలియదని కాదు కానీ , మళ్ళీ నాకే క్రొత్తగా అనిపించి, నేననుకున్న భావం
రిప్లయితొలగించండిముప్పొద్దుల మోసపోయిన మానినిలనూ
పగటి పూట మూడు ప్రొద్దులు ( ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ), మానము కలిగిన ఆడవారు ( మానిని ) పని చేసే ప్రదేశాల్లో పడే ఇబ్బందులు , ఎలా మోసానికి గురవుతున్నారో వేరే చెప్పాలా . ఈ మోసం అంతా హుందా కలిగిన మహిళల పట్ల మాత్రమే సుమా ...
ఇకరెండో లైను
మూడోఝామున మూడు నోట్లు లెక్కంచే పడతులనూ
రాత్రికి ఘాములు నాలుగు.. ఏం జరిగినా మూడు ఝాముల లోపే.. మూడు నోట్లు అంటే ఇదమిద్ధం అని కాదు. పడతి అందాన్ని బట్టి రేటు. అలాగే ఇక్కడ వీరు మానము లేని వారని అర్థం కాదు. వీరికిదే జీవనాధారం.
నైస్ అండ్ సూపర్
రిప్లయితొలగించండిపవన్, నైస్ అండ్ సూపర్ అన్నారంటే విషయం బోధపడిందన్నమాట :-)
రిప్లయితొలగించండిబాగుందండి భా.రా.రె గారు. దారిద్ర్యం గతిలేనితనం భూమాత ది కాదు. ఆమె అందించే జీవనాధారాలను మన స్వార్ధం కోసం, మన సౌఖ్యం కోసం, నేనే ముందు, నేనే చివరన్న విర్రవీగిపాటుతోను కన్ను మిన్ను కాన రాక భ్రమించే మనది... మనమే చేసుకుంటాము మనమే అనుభవిస్తాము, ఏమిటో బోలెడంత బాధ వేసేసింది మీ కవిత చదవగానే... బాధ పడ్డానని బాధ లేదు లెండి బాధ అనివార్యం ఆ మంట లో ఆ కన్నీళ్ళలో మనం కూడా పునీత మవ్వక పోతే మనకేది మరి జాజుల వీచికలు పున్నాగల పలకరింపులు...
రిప్లయితొలగించండిభావనగారూ , "బాధ పడ్డానని బాధ లేదు లెండి బాధ అనివార్యం ఆ మంట లో ఆ కన్నీళ్ళలో మనం కూడా పునీత మవ్వక పోతే ..."
రిప్లయితొలగించండిఇదుగో ఇలాంటి వాక్యాలకోసమే మీ తదుపరి టపాకై ఎదురుచూస్తుంటే, మీరేమో నెలల గడువు తీసుకుంటున్నారు.
కంటిముందు జరిగే ఘోరాలు జరుగుబాటు చాటున కనిపించినా కనిపించనట్టు నటిస్తుంటాము. అదే జీవితం.