1, సెప్టెంబర్ 2009, మంగళవారం
పడిలేచే లేలేత కిరణం
అలల కడలి ధరిత్రి దరిని చేర
ఆలపించదా రమ్య గమ్య గీతిక
పడిలేచే నురగతరగలే
ఎగసి ఎగసి అలుపులేక
కడలి కడుపులో కరిగేనా
వెను తిరిగి వెన్ను చూపేనా?
లవణ శిలల తాకిడికి
అలల హోరు అరుపులకి
ఇసుక రేణువు దెబ్బలకి
చెరిగేనా కడలిపై అనురాగం
విరిగేనా ఎగసిపడే శోధన కిరణం
కనుచూపు మేర పొలిమేర లేకున్నా
అలసిన తనువు సొమ్మసిల్లి పోతున్నా
ఎగసి పడే భావ తరంగాలు
సుడులు తిరిగే తీక్షణ తలపులు
తనువును స్థిరం చేసి
మనసును లయం చేసి
హృదయాన్ని తట్టి లేపి
కనిపించని అన్వేషితకై
ఆలపించనా అనురాగ రాగాలు
మధించనా సాంకేతిక సాగరాన్ని
నే పడిలేచే లేలేత కిరణమై.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
లేలేత కిరణాల తాకిడికి తెరచుకొనవా ఆ అన్వేషిత హృదయ కవాటాలు???
రిప్లయితొలగించండిబాగుంది ....తీరికలో చిక్కింది .-:)
రిప్లయితొలగించండి"పడిలేచే కడలి తరంగం..ఒడిలో జడిసిన సారంగం...."
రిప్లయితొలగించండి"అందమే ఆనందం" పాటలోని ఈ లైన్ గుర్తు వచ్చిందండి...కవిత చదివితే..బాగుంది.