దరిదాపు ఓ నెల క్రితం భారత ప్రజా ప్రతినిధులు.. మన కష్టాలు. Linking people with politicians అని ఓ పోస్టు వ్రాశాను. చూసే వుంటారు కదా? దానికి పొడిగింపుగా ఈ Article.
పురిటి నొప్పులు తట్టుకోని మొత్తానికి pre-matured బేబీ ని ప్రసవించేశాను. pre-matured బేబీ కాబట్టి ఇంకా సరిగ్గా కళ్ళు కూడా తెరిచి చూడలేదు.నిర్మాణం ఇంకా పూర్తికాలేదు కానీ మన రాజకీయనాయకులు వచ్చి రిబ్బన్ కటింగ్ చేసేదాకా ఊరుకొనే ఓపిక నాకు లేదు కాబట్టి ఐనంత వరకు ముందుగా తెలుగు బ్లాగులోకానికి అంకితమిచ్చేస్తే ఓ పని ఐపోతుంది కదా? పనిలో పనిగా ఒకరిద్దరైనా మనసుపెట్టి Test చేసి నిర్మాణాత్మకమైన సూచనలు కూడా చేసే అవకాశం కూడా వుంటుంది.
url : bharathvoice.com
ప్రస్తుతానికి ఇది తెలుగు బ్లాగులోకానికి మాత్రమే Testing కోసం ఇస్తున్న సైట్...
ఇక సైట్ యొక్క వివరాలలోకి వెళితే ఈ సైట్ లో భారత దేశములో గల రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు, గ్రామాలను చేర్చడం జరిగింది. మన రాష్ట్రానికి ఎన్నికలు దగ్గరలో వున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ వరకూ అన్ని అసెంబ్లీ స్థానాలనూ, వాటికి పోటీ చేసిన అభ్యర్థులను వారికొచ్చిన ఓట్ల వివరాలనూ 1978 వ సంవత్సరం మొదలుకొని 2009 వరకూ చేర్చడం జరిగింది. అన్నీ బాగున్నాయయ్యా ఐతే ఏంటంట అంటే.... విషయం ఇది.
రాష్ట్రంలో ఎన్ని పత్రికలున్నా ఎవరి అవసరాలు వారివి. ఎవరి అభిప్రాయాలు వారివి. వార్తలకూ, విశ్లేషణలకు, వారి అభిప్రాయాలకూ తేడా తెలియకుండా వార్తలు రావడం మనం రోజూ చూస్తూనే వుంటాము. నాలాంటి కామన్ మేన్ కు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియని పరిస్థితి. అందుకోసం ఈ ఇ-జర్నలిజమ్ ప్రజలచేతుల్లో.
ప్రతిరోజూ మన చుట్టూ ఎన్ని అవకతవకలు జరుగుతున్నా ఏమీ చేయలేని పరిస్థితి. ఎన్ని అవినీతి కార్యక్రమాలు, ఎంత మంది లంచగొండులు ఎన్ని కష్టాలు..ఎంతనష్టం?? వీటినన్నింటినీ మనమేదో ఒక్కరోజులో మారుస్తామని కాదు. అసలు మారకపోవచ్చు కూడా!! కానీ మీకు కడుపు మండినప్పుడు మీ ఘోష ను ప్రక్కవాడితో ఎలా చెప్పుకుంటారో అలాగే ఇక్కడకూడా ఓ ముక్క వ్రాసి పడేయండి. దీనివల్ల పెద్ద అద్భుతాలు జరగకపోవచ్చు కానీ ఓ ఎలక్ట్రానిక్ రికార్డు మాత్రం భద్రమైపోతుంది. ఆ తరువాత ఏం జరుగుతుందనేది కాలం నిర్ణయిస్తుంది. ఏమీ చేతకానట్టు కూర్చోవడం కన్నా ఇది నయం కదా?
అలాగే మీరు మెచ్చిన నాయకుడి గూర్చి వ్రాసి పది మందికి తెలిసే టట్లు చేయండి. కారణమేమిటంటే ఈ డాటా ను ప్రాసెస్ చేస్తుంటే నాకు మనరాష్ట్రంలో నున్న అసెంబ్లీ స్థానాలే 30 శాతం దాకా తెలియలేదు. ఇక అభ్యర్థుల సంగతి చెప్పాలా? ఇందులో ఎంతో మంది ఎన్నో సామాజిక ప్రయోజన పనులను చేసే వారుండవచ్చు. వారిగూర్చి పదిమందికి తెలిపే వేదిక ఇది.
ఇందులో మీరు మీకిష్టమైన అభ్యర్థి వివరాలను వ్రాయాలన్నా, Issue వ్రాయాలన్నా, Vote వేయాలన్నా రిజిష్ట్రేషన్ తప్పని సరి. Register అయ్యేటప్పుడు పని చేసే e-mail Id ఇవ్వడం మరువకండి. కారణం email authentication లేనిది మీ రిజిష్ట్రేషన్ చెల్లదు.
ఇలా మరెన్నో .... నేను వ్రాయడం కంటే మీరే వెళ్ళి చూసి మీ అభిప్రాయాలను తప్పక వ్యాఖ్య రూపంలో వ్రాయండి. ఈ వెబ్ సైట్ మరో సంవత్సరం పాటు ఇలా అభిప్రాయసేకరణలను చేస్తూ వాటిని వెబ్ సైట్ లో చేరుస్తూనే వుంటుంది.
Feel free to write your views without any hesitation.
Too much work..tired too much.. c u later.
Excellent work. Tried to register but could not. Had pblm with dob. Pls chk. I think we need to register to like da views published.
రిప్లయితొలగించండిNot able to enter all da 4char in the year. It is accepting only last two chars.
రిప్లయితొలగించండిఅనూ, Try again.. I am able to enter all the 4 digits of the year.
రిప్లయితొలగించండిThanks for testing.