ఈ రోజు 1920 వ సంవత్సరంలో వ్యవసాయం ఏరకంగా చేసేవారో తెలుసుకుందామని ప్రెస్ అకాడమీ లో లభించిన ఒకే ఒక పత్రిక ( అగ్రికల్చర్ మీద ఒక్కపత్రికే కనిపిస్తుంది. మరొకటి అగ్రికల్చర్ ఆర్ట్ మీద వుంది) తిరగవేస్తుంటే ప్రతిపేజీకి అడుగుభాగంలో కొన్ని సామెతల లాంటివి కనిపించాయి. ఈ సామెతలు వ్యవసాయం చేసేవారికి పెద్దగా గొప్పగా అనిపించకపోవచ్చు. ఇప్పటికీ వ్యవసాయదారులు చాలానే వాడుతుంటారు, కానీ ఈ తరం యువతకు తెలియని విషయాలు కొన్ని తెలుస్తాయని పిస్తుంది.
కొద్ది దశాబ్దాల తరువాత వ్యవసాయం అనేది ఎవ్వరికీ తెలియలేదనుకోండి. అప్పుడు ఈ సామెతలు చదివేవారికి మూఢనమ్మకాలుగా అనిపించినా ఆశ్చర్యపడనవసరంలేదు. నిజానికి మన హిందూమతంలో ఉన్న లోపమో లేదా పెద్దవారిని ప్రశ్నించే స్వభావ లేమి లోపమో కానీ చాలా నమ్మకాలుగా చలామణి అవుతున్న వాటికి వివరణలుండవు. నాన్నలను, జేజి నాయనలనడిగినా కానీ "అదంతే బోడిముండ", అధిక ప్రసంగమూ నువ్వూనూ అనే సమాధానము తప్పించి సంతృప్తికరమైన వివరణలుండవు.
అలాగే కొన్ని కొన్ని ఆనాటి కాలానికి సరిపోయేవి. మరికొన్ని సనాతనములు. బహుశా ఈ కాలానికి సరిపడని నమ్మకాలు మూఢనమ్మకాలుగా మార్పుచెందినాయేమో !!! హిందూమతానికున్న గొప్పలక్షణం కూడా తనంతట తాను సమాజానికనుకూలంగా మార్పుచెందడమే కదా.
సరే ఇక నా ప్రసంగాన్నాపి ఆ మాసపత్రికలో ఇచ్చిన కొన్ని సామెతలను చూడండి. ఎంత చక్కనైనవో. వాటి ప్రక్కనే కొన్నింటికి నాకు తోచిన వివరణ కూడా ఇస్తున్నాను
౧) సేద్యానికి పద్దులు పనికిరావు ( నిజంగా పద్దులు వ్రాసేవాళ్ళు సేద్యం చెయ్యలేరు. లెక్కా జమా కట్టుకుంటే సేద్యగాడికి కన్నీరే మిగులుతుంది )
౨) శివరాత్రికి చలి శివశివాయని పోతుంది ( ఇది చాలా మందికి తెలిసినదే. అంటే ఎండాకాలాగమనమన్నమాట )
౩) దుక్కికొద్దీ పంట, బుద్ధికొద్దీ సుఖము ( దుక్కి అంటే భూమిని దున్నడము. భూమి బాగా దున్నితే, అడుగునున్న సారవంతమైన భూమి పైకొచ్చి పంట ఎక్కువ వస్తుంది )
౪) పాటిమీద వ్యవసాయం కూటికైనా రాదు ( హ హా ఇది మాత్రం సూపర్...ఎప్పుడైనా పాటిగడ్డమీద వ్యవాసయం చేస్తే బాగా అనుభవానికొస్తుంది)
౫) ---- యెడల కందైనా కాయదు ( ఇక్కడ ఆ ఖాళీ పదము సరిగా కనిపించడం లేదు)
ఇక్కడనుంచి ఈ క్రిందివాటిలో ఏవైనా అర్థంకాకపోతే అడగండోచ్..
౬) చేలో పొత్తు కళ్ళంతో సరి ( అర్థంకాకపోతే అడగండోచ్..చెప్తాను :))
౭) చేనుకు గట్టు ఊరికి కట్టు వుండవలెను
౮) శివరాత్రికి జీడిపిందెలంతేసి ( ఇదేమిటో నాకు తెలియదు )
౯) ఉలవకాని చేలు ఊసరక్షేత్రాలు ( ఇది కూడా సూపరే :))
౧౦) పూచినపూలన్నీ కాయలైతే భూమిలో దాచుటకే చోటుండదు
౧౧) వంటికి తిండిపుష్టి, వరికి దుక్కి పుష్టి
౧౨) నూవు చేలో ఏడు వరిగింజలైనా పండవు
౧౩) మొక్కజొన్న కందెకు మొదలు, పొగాకు కాడ చివర మంచివి
౧౪) నల్లనేలకు నూవులు, గట్టినేలకు కందులు
౧౫) పశువులు నల్లనైతే పాలు నల్లనౌనా
౧౬) అన్నిపైరులకు ఆషాఢము
౧౭) విత్తుటకు శుక్రవారము, కోయుటకు గురువారము ( ఇది ఎందుకో మరి? )
౧౮) కలుపు తీయువానికి కసవే మిగులును
౧౯) కలుపుతీసిన చేను కన్నుల పండువుగనుండును
౨౦) నీడనున్న నీరు, నిలకడ పనికిరాదు
౨౧) ఎరువు చేయునుపకారము బంధువులుకూడా చేయరు ( ఎరువు అంటే పేడ లాంటివండోయ్.. ఇప్పటి యూరియా మందు కాదు )
౨౨) ఎరువు సిద్ధము చేసికొని దున్నవలె
౨౩) ఎరువులేని పొలము, లేగలేని ఆవు ఒక్కటే
౨౪) పల్లమున కేడుదుక్కులు ( ఏడు దుక్కులు ) మెరకకు నాలుగు దుక్కులు
౨౫) పదును పోకుండా దున్నవలెను ( పదును అంటే వర్షం పడిన తరువాత భూమి మెత్తగా వుండి దుక్కి దున్నడానికి అనుకూలంగా వుంటుంది )
౨౬) లోతు దుక్కికి ఎక్కువ పంట
౨౭) వర్షము చూచికొని నాగలి కట్టవలెను ( నాగలి అంటే మనసినిమాల్లో బలరాముడు ఆయుధంగా చూపిస్తారు చూడండి అది :)..కొద్దిగా ఎక్కువైందా? పర్లేదు అడ్జెస్ట్ అయిపోవాలి మరి :)))
౨౮) మూలవర్షము నవధాన్యాలకు చెరుపు ( ఇక్కడ మూలవర్షమంటే మూలకార్తెలో కురిసే వర్షము)
౨౯) విశాఖ వర్షము చీడలకు వృద్ధి
మాష్టారండి మాష్టారండి మరేమో అండి నాకిప్పుడు బోలెడు క్రొత్త సామెతలు తెలిసాయోచ్చ్! బాగుందండి మంచి సేకరణ!
రిప్లయితొలగించండిరసజ్ఞ,ఇంకేం రేపటినుండి వాడేసెయ్యండి.అవతలోడికి అర్థం కాక చచ్చి పోతాడు :))
రిప్లయితొలగించండిశివరాత్రికి జీడిపిందేలేసి -- అంటే మామిడి కాయల గురించేమో :)
రిప్లయితొలగించండిఊసరక్షేత్రాలు -- ఈ సామెత అర్థం కాలేదు. మీరేమో సూపర్ అన్నారు..
పశువులు నల్లనైతే పాలు నల్లనౌనా
రిప్లయితొలగించండిఎరువు చేయునుపకారము బంధువులుకూడా చేయరు
వర్షము చూచికొని నాగలి కట్టవలెను
ఇవి అమ్మమ్మ ఎక్కువగా ఉపయోగించేదండీ. లేగలేని ఆవు ఎందుకు? అని కూడా అనేది. ఇక్కడున్నవే కాకుండా ఇంకా ఏవో అనేది..నాకు గుర్త్తు లేదు. కాని ఇక్కడ చదువుంటే తెలిసినవి అవి కనిపించాయ్.అసలు వ్యవసాయంలో మగాళ్ళకి అనుభవం ఎక్కువ అంటారు. కానీ నాకైతే మా అమ్మమ్మకున్న అనుభవమే ఎక్కువనుకుంటాను నేను.వంటిల్లు చూసేది కాదు గాని..పొద్దున్నే పొలానికి మాత్రం వెళ్ళిపోయేది.నేను ఎక్కువగా ఆవిడతో గడపడం వల్ల ఇవన్నా తెలిసాయ్ నాకు. ధన్యవాదాలు రెడ్డి గారూ మీకు. మళ్ళీ ఆవిడని ఈ విధంగా గుర్తుచేసుకున్నాను.
కృష్ణప్రియగారూ అది అర్థమైంది కానీ ఆ వాక్యానికి భావమేంటే తెలియడం లేదు. అంటే శివరాత్రికి జీడంత వున్నవి ఉగాదికి మామిడి కాయలౌతాయనా?
రిప్లయితొలగించండిఇక ఉలవకాని చేలు ఊసరక్షేత్రాలు.. (సూపరంటే మరీ సూపరు కాదులెండి పనికిమాలిన చేలని :))
శుభ....అవునండి ఇవి పెద్దవారికి బాగా పరిచయమైనవే. ఇంకో పుస్తకముందికదా..అగ్రికల్చర్ ఆర్ట్ అని అందులోవి కూడా కలిపి ఈ పోస్టు మళ్ళీ అప్డేట్ చేస్తాను.
జీడి పిందె లు ఏర్పడేది శివరాత్రి సమయానికే అనుకుంటా నండి
రిప్లయితొలగించండినాగలి అ౦టే చంద్ర బాబు ని,ఎన్ టి ఆర్ ని వదిలేసి బలరాముడు గుర్తు వచ్చిందా, లేక లౌక్యమా :)
రిప్లయితొలగించండి"వ్యావసాయ సామెతలు" (సం. శ్రీ నేదునూరి గంగాధరం) నుంచి -
రిప్లయితొలగించండిశివరాత్రికి జీడికాయ, ఉగాదికి ఊరుగాయ. (మామిడిపిందెలు)
ఈ పుస్తకము DLIలో ఉంది.
మౌలి, మీ మొదటి కామెంట్... అనుకోవడమేమిటండీ? శివరాత్రికి పిందెలు లేకపోతే ఉగాదికి మామిడి పచ్చడి ఎలా తింటారు? బహుశా అది పూర్తిగా అచ్చుఅయినట్టులేదు. క్రింద శేషతల్పసాయి గారి వ్యాఖ్య చూస్తే పూర్తి సామెత కనిపిస్తుంది.
రిప్లయితొలగించండిఇక మీ రెండో వ్యాఖ్య ,నాకెందుకో నాగలి అనగానే బలరాముడే గుర్తుకొస్తాడు. ఇక మీకు కావాలసిన సమాధానం ఈక్రింద
"నేను వై.యస్.ఆర్ అభిమానిని. కాబట్టి నాకు వీళ్ళు గుర్తుకొచ్చే అవకాశమే లేదు."
వాయమ్మో.. ఇది చెప్పడానికి కూడా లౌక్యం కావాలనా? :-)
శేషతల్పసాయిగారూ, ఇలాంటి పుస్తకమొకటుందని ఇప్పుడే వింటున్నాను. మీ వ్యాఖ్య చదివాక ఆ సామెత బోధపడింది. సమాచారానికి ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిహమ్మయ్య !!! ఇలా కొంచెం సరదాగా ఉండేవి ....విజ్ఞానాన్ని పంచేవి రాయండి భాస్కర్ రామి రెడ్డి గారు, ఎందుకు ఎప్పుడు ఆ సిగరెట్ల గురించి వాటి గురించి రాసి మీ బ్లాగ్ పాడు చేసుకుంటారు? ఈ లైటర్ ఎక్కడ పెట్టానో కనబడ్ట్లేదు ....ఉండండి మల్లి తర్వాత కామెంటుతా ......
రిప్లయితొలగించండిరాఫ్సన్.. సిగిరెట్ల గురించి రాసినదాంట్లో సమాచారం లేదా????
రిప్లయితొలగించండిఅవును తెలుగు సక్రమంగా వచ్చి కూడా ఈ రకారాలేందివయ్యా?? నాపేరు "భాస్కర" భాస్కర్ కాదు.
అయ్యా క్షమించాలి.....ఏదో టైపు పొరపాటు అనుకుంటా అంటే కాని ఉద్దేశపూరితం కాదని మనవి.....మళ్ళి మళ్ళి ఆ తప్పులు దొర్లకుండా చూసుకొంటాను, ఏదో పాలేరు ని అల్లా అన్నేసి question మార్క్స్ తో గదమాఎస్తే ...భయంవేస్తున్నది ......పొతే ...సిగారేట్లా గురించి మీ బ్లాగ్ లో సమాచారం తో పాటు భయపెట్టే విజ్ఞానం మెండుగా ఉంది ...." భాస్కర రామి రెడ్డి " గారు.
రిప్లయితొలగించండిp s : నా కామెంట్లు సర్వం హాస్యానికే గాని మిమ్మలిని కించపరచడానికి కాదని గమనించ గలరు....
హ్మ్ జీడి పి౦దెలు అ౦టే నా ఉద్దేశ్యం జీడికాయలవి అని ! మీ సామెత లో మామిడి గురించి స్పష్టం గా లేదు అని మాత్రమె (తరువాత Vadapalli గారు సెలవిచ్చారనుకోండి)
రిప్లయితొలగించండిహ హ .సరే బలరామ చంద్రుడినే కానివ్వండి :-)
అబ్బాయ్ భారారె,
రిప్లయితొలగించండి>>>రాఫ్సన్.. సిగిరెట్ల గురించి రాసినదాంట్లో సమాచారం లేదా????
స్కూలు పిల్లల్ని ఇంతలా గదమాయిస్తే, వాళ్ళు జడుసుకు చస్తారు సుమీ !
కొంత గదమాయింపు తగ్గించవలె హెడ్ మాష్టారు గారు,
ఇట్లు జిలేబి.
మోలీ మళ్ళీ అదే మాట బలరామ "చంద్రు" డినే అని..అలా కాదు కానీ బల రాజశేఖరుడనుకుంటానండి :)
రిప్లయితొలగించండిజిలేబీ, గదమాయింపా..ఎక్కడండి?
రాఫ్సన్.. భావ వ్యక్తీకరణలో మీ భాష నాకు మరోలా ధ్వనిస్తుంది కాబట్టి మీరు ఎటువంటి విశేషణాలు లేకుండా వ్రాస్తేనే మీ భావం నాకు మీరనుకున్నట్టు చేరుతుంది. ఇలాంటి సమస్య వేరే ఎవ్వరికీ లేకపోతే నేను తెలుగు అర్థం చేసుకోవడంలో లోపమనుకోవచ్చు. మీ పి.యస్. చూసాక ఇకనుండి మీ వ్యాఖ్యలను అలాగే తీసుకుంటాను. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిhttp://nrahamthulla.blogspot.com/2011/11/blog-post.html చూడండి.
రిప్లయితొలగించండి