రచనలకు సమయము తక్కువ వుంది కాబట్టి మిగిలిన అంశములనూ ఈరోజే ప్రచురించమని కోరుతున్నారు. కాబట్టి మిగిలిన అంశాలను ఇస్తున్నాను.
మొదటి తొమ్మిది ప్రశ్నలను ఇక్కడ చూడవచ్చు.
http://chiruspandana.blogspot.com/2011/11/2.html
http://chiruspandana.blogspot.com/2011/11/blog-post_19.html
http://chiruspandana.blogspot.com/2011/11/blog-post_21.html
ఇక మిగిలిన ఆరింటిని ఈ క్రింద ఇస్తున్నాను.ఇవి సరదా సరదా గా సాగుతాయి.
౧) రాబోయే రెండు దశాబ్దాలలో ప్రపంచపటంపై భారతదేశం. ఈ అంశపై పద్య / గేయ కవిత.
౨) భారతరాజ్య వ్యవస్థలో బఫూన్ల పాత్ర. హాస్య / వ్యంగ్య ప్రధానమైన రచన. ఈ రచనలో అందరూ భాగస్వాములే. అంటే మీ రచనల్లో ఛీఫ్ పౌరుని దగ్గరనుండి, చీపురు పౌరుని దాకా ఒక్కొక్కరిగానైనా లేదా మూకుమ్మడిగా నైనా భారతదేశాన్ని నడపవచ్చు!!! రచనల్లో దూషణకు చోటులేదు.
౩) ఆంధ్రా అమ్మాయి, తెలంగాణా అబ్బాయిల అమెరికా జీవితం పై ఓ మంచి కథ. మధ్యమధ్యల్లో కవిత/పద్యము కూడా, ఓపికకొద్ది అప్పుడప్పుడు అగచాట్లూ,చీవాట్లూ వేసుకోవచ్చు :)).
౪) శైవ/వైష్ణవ మతఘర్షణల తీవ్రతను, దానినుంచి దైవమొక్కడే అన్నదిశగా ప్రయాణించిన మన సమాజ చరిత్రకు కుంచెద్వారా రంగులద్దండి. ఈ చిత్రలేఖనానికి భావం ప్రధానం. వాటర్/ఆయిల్/పెన్సిల్ ఏ పద్ధతినైనా ఉపయోగించవచ్చు.
౫) మీకు నచ్చిన రచన ఏదైనా పంపవచ్చు. రచన మీ స్వంత రచనయైవుండాలి. మాకు నచ్చిన రచనకు బహుమతి.
౬) ఇది కొద్దిగా మా భుజాలను మేమే చరుచుకోవడానికి ఎన్నుకొన్న ప్రశ్న. అదీ సంగీత ప్రధానమైనది. ప్రశ్న ఏమిటంటే
హారం,హారం పత్రిక పై ఓ పాటను రచించి స్వరపరచి గానం చేసి ఆడియో పంపాలన్న మాట :))
ఇక ఆలస్యమెందుకు? పెన్నుతో యుద్ధానికి బయలుదేరండి.
అన్ని వర్గాల రచయితలను దృష్టిలో వుంచుకున్నాననుకుంటున్నాను. వేటికైనా చోటు దక్కకపోతే మన్నించ మనవి.
బాగుంది. పోటీ అని కాకపోయినా ఏదో ఒక అంశం మీద నేనూ రాయటానికి ప్రయత్నిస్తాను.
రిప్లయితొలగించండికృష్ణప్రియ గారూ, మంచిది. మీరచనకై ఎదురు చూస్తాను.
రిప్లయితొలగించండిలాస్ట్ నుంచి ఫస్ట్ వచ్చే వాళ్ళకి ప్రైజ్ ఇచ్చే ఆలోచన ఏమన్నా ఉంటే చెప్పండి. నేను ట్రై చేసుకుంటాను. నాకెలా గైనా మంచి బహుమతి కావాలి మరి.
రిప్లయితొలగించండిజయ గారు, అప్పుడు మీకు పోటీ మేము :)
రిప్లయితొలగించండిజయ గారూ, మీరు లాస్ట్ నుంచి ఫస్ట్ ఐటమ్ తీసుకొని ఫస్ట్ వచ్చినా ప్రైజ్ గ్యారంటీ... ( కొద్దిగా అతితెలివిలాగుందా? పర్లేదులెండి :)).
రిప్లయితొలగించండిప్రైజ్ దేముంది కానీ వ్రాసి పంపించండి. అదుగో మౌలీ అప్పుడే మీకు పోటీ అంట.
మౌలీ గారూ, మరి పోటీకి సిద్ధపడండి. జయ వ్రాయడానికి సిద్ధమయ్యారు మరి :)
నాదైన వర్గం కానరాలేదు సుమ్మీ! ఒక్క 'నాలుగవ అంశం' పైన కాస్త అవగాహన, అభిప్రాయాలున్నాయి. రామి - మంచి ప్రయత్నం. శుభాభినందనలు.
రిప్లయితొలగించండి