బయటకంటూ వెళ్ళాక సిగ్గుపడితే ఎలాగండి? అందుకని సిగ్గులేకుండా ఒకే ఒక బురద గుంతను రకరకాల ఫోజుల్లో ఫోటో తీయడం మొదలు పెట్టాను. అంటే వేరే వేరే aperture ల తోటి,వేరే వేరే ఫోకల్ lengths తోటి రకరకాల ప్రయోగాలు చేసాలెండి. ఇప్పటిదాకా ఇంత మంచి కెమరా ఉన్నా ఫొటో తీసేటప్పుడు, ఆటో లో పెట్టి నొక్కడం,అప్పూడప్పుడు బేసిక్ మోడ్స వాడడం తప్పించి, ఈ ప్రయోగాలెప్పుడూ చెయ్యలేదు మరి. మరి నేను తీసిన అద్భుతమైన ఫోటోలు :))మీరూ చూసి మళ్ళీ నా ఫొటోల జోలికి రాకుండా ఉంటారని ఇక్కడ ఇలా....
ఈ క్రింది అన్ని ఫోటోలకు మీటరింగ్ మోడ్ ఆటో లో వుంచి తీసాను. అలాగే ఫోటో తీసేటప్పుడు ఏఏ పెరామీటర్స్ ఫోటోను ఎలా ప్రభావితం చేస్తాయో చూపే పట్టిక కూడా ఈ క్రింద.
Shutter speed | Aperture value | ISO | Picture number |
1/500 | F 4.0 | 100 | 1 |
1/500 | F 5.6 | 100 | 2 |
1/80 | F 5.6 | 400 | 3 |
1/80 | F 22 | 400 | 4 |
1/1250 | F 4.0 | 200 | 5 |
1/2500 | F 5.6 | 400 | 6 |
Image 1.0
Image 2.0
Image 3.0
Image 4.0
Image 5
Image 6
సరే పైన మిమ్మల్ని హింసించినందుకు ఈ రోజు తీసిన మరికొన్ని ఫొటోలు
మరికొన్ని
ఈ రోజు మా ఊర్లో నెలపొడుపు ( అంటే విదియ ).
మీ దగ్గర SLR camera ఉంటే అప్పుడప్పుడూ ఇలాంటి ప్రయోగాలు చేస్తుండండి. It is really fun.
మీరు హింసించకుండా తీసిన ఫొటోలన్నీ బాగున్నాయి!మీలో ఇంత కళాత్మక హృదయం ఉందని నాకు తెలియదండీ! ఒక బురద గుంటకి ఇన్ని angleslo ఫోటో తీయాలన్న ఆలోచన మీకెలా కలిగింది స్వామీ? (lol)
రిప్లయితొలగించండిమరికొన్ని ఫోటోల్లో మొదటిది చివరది చాలా బావున్నాయి..
రిప్లయితొలగించండినీ మాదిరే మూణ్ణాళ్ళు మురిసాక, నాలుగో నాడు ముసిరిన విసుగుని వదుల్చుకుందామని ఇటొచ్చాను :) మిత్రుడొకరు బహుమతిగా ఇచ్చిన కెమెరా లోని బొమ్మలు నిలదీసాయి మాకు విడుదల ఎప్పుడని.
రిప్లయితొలగించండిశీతువుని ఎదిరిస్తూ లేత చివురుగా పచ్చగా నవ్వుతున్న 'కొమ్మ' బావుంది. ప్రకృతి మార్పు "కొమ్మ" కి సహజం అయినా అది ఆమ్టే సహజంగా అలవడుతుంది అన్నట్లుంది (ఇక్కడ కొమ్మ కి అర్థం స్త్రీ)
హింస కూడా అహింసలా ఉండడం అన్నది ఇప్పుడే చూస్తున్నానండీ..మొత్తానికి అన్ని కోణాలూ చూపించేసారు.
రిప్లయితొలగించండిభాస్కరా భారారె
రిప్లయితొలగించండిఫోటో 'లమ్మా' అని కాంతల పిలచి బురద 'గుంత' లని కానాను కాన్వాసు పై 'కాంతీ' కరించడం లో మీ ఉద్దేశము ఏమి తిరుమలేశా?
చీర్స్
జిలేబి.
కెమెరా కంటితో చూస్తే వీధి చివర చెత్తెకుండి కూడా అందంగా కనిపిస్తుందట, మా పిన్ని చెప్తుంటుంది. ఆ లెఖ్కన అమెరికా బురదగుంట ఇంకెంత అందంగా కనపడుతుంది :D
రిప్లయితొలగించండిevening shades are very good భారారె గారు ః)
గురువర్యా !! భారరే గారు,
రిప్లయితొలగించండిఉభయకుశులోపరి...
చాలా రోజులనుంచి {అంటే మీ చేవాట్లు తిన్నపటినుండి ( భావ వ్యక్తీకరణ సరిగ్గా లేదని అన్నారులెండి ఒకసారి )} తెలుగు నేర్చుకోనుటకై మిక్కిలి కష్టించి...శ్రమించినందు వల్ల మీ బ్లాగు లోకి రాలేకపోతిని... వచ్చిరాగానే అన్ని పోస్టులు ఆకలిగా ఉన్న సింహం లాగా చదివితిని....మీరు హారం లో పెట్టిన పోటి అద్భుతముగా ఉన్నది.... మేము తెలుగు నే సరిగా రాయలేని స్థాయి నుండి రచనలు చేసే స్థాయి కి చేరిన తరువాతా పెడితే అత్యద్భుతం గా ఉండేదేమో కదా ( అప్పుడైతే నేను కూడా రాయొచ్చు అనే సదుద్దేశం బహుమతి వస్తుంది అందరిముందు గొప్పలు చెప్పుకోవచ్చు అనే దురుద్దేశం ఉన్నాయ్ లెండి .) ఏది ఏమైనా ఒక విషయం మమ్ములను బాధ పెట్టింది గురువర్యా !! మీకు చెప్పే అంతటివాడిని కాను,అన్యధా భావింపక నా మొర ఆలకించండి..
ఇస్లామిక్, క్రిష్టియన్ మతములతో పోలుస్తూ, హిందూ మత ప్రాశస్త్యాన్ని, దీని ఔన్నత్యాన్ని వివరించాలి. అన్ని మతములు తప్పని సరిగా నేటి సమాజపరిస్థితులను ప్రతిబింబిస్తూ పైన చెప్పిన రీతిలో 10 A4 పేజీలకు తగ్గకుండా రచన సాగాలి.
ఇలా రాయమని చెప్పడం, ప్రేరేపించడం, బహుమతి ప్రకటించడం, వేరే వాళ్ళను తక్కువ చేయౌట కాదండురా?? ( మీ అగ్రహాన్నుండి నన్ను ఆ దేవుడే కాపాడాలి ) అంటే ఏమి లేదు మీ హారం కోసం వచేవాళ్ళు తగ్గరు అంటారా ? కొందరి మనోభావాలు గాయపడవు అంటారా ? "నా మొఖం అందంగా ఉంటుంది" అనుట అందమే కాని "నీతో పూల్చుకుంటే నా మొఖం అందముగా నుండును" !! అనుట ఎంతవరకు సమంజసమందురు? కోపగించుకోకండి మహాశయా !! ఏదో బ్లాగ్లోకం లోకం లో అందరు కలిసి ఉండాలని కులమతాలకు అతీతంగా తెలుగు ను ప్రోత్సహించాలని నా లాంటి వాళ్ళు కష్టపడి తెలుగు నేర్చుకొని వస్తుంటే ఇలాంటి పోటిల వల్ల దూరాలు పెరిగే అవకాసం ఉంది కదా...!! మంచి మనసుతో ఆలోచించండి కోపగించుకోకండి, ఏది తొలగిస్తే మంచిది అని నా అభిప్రాయము .
నేను రాసిన తెలుగు లో మళ్ళి భావవ్యక్తీకరణ లోపాలుంటే ... మీ చీవాట్లకు WELCOME కాని ఇంకో సారి మళ్ళి ప్రయత్నిస్తా కచితంగా మీ మెప్పు పొందుతా...
మీ శిష్యవిధేయుడు,
RAAFSUN
రసజ్ఞ, ఈ స్వాములోరికి శానా కళలున్నాయండి :))
రిప్లయితొలగించండిజ్యోతిర్మయి, నచ్చినందుకు ధన్యవాదాలండి. ఆ Dusk ఫొటోకు ఫోర్ గ్రౌండ్ లో ఫ్రేమ్ రావాలని చాలా రకాలుగా తీసి చూసాను.
ఉషా, బహుకాల దర్శన భాగ్యము. ఆ ఫొటోలెందుకు గుర్తుచేస్తావులేమ్మా :)) అవి విడుదల్లేది లేదు మేము చూసేదీ లేదు ;-)
రిప్లయితొలగించండిసుభా :)). ఎక్కడా?? ఇంకా చాలానే వున్నాయనుకున్నాను కదండీ.
జిలేబీ డబల్ ధమాకా సేల్ టైపులో భాస్కరా భారారే నా :))
రిప్లయితొలగించండినాగార్జునా..హ హ్హ.. అమెరికా రొచ్చు గుంతలకు మనదేశంలో వున్న రొచ్చుగుంతలంత క్రియేటివిటీ వుండదనుకుంటా..అందుకే ఎంత ప్రయత్నించినా బాగా రాలేదు :))
రాఫ్సన్ శిష్యా :)
రిప్లయితొలగించండిమీ కచ్చితమైన ప్రశ్నలకు నాకు తోచిన సమాధానాలు విడివిడిగా ఇస్తున్నాను.. ఇందులో వ్యక్తిగత ద్వేషము లేదు.
౧) "ఇలా రాయమని చెప్పడం, ప్రేరేపించడం, బహుమతి ప్రకటించడం, వేరే వాళ్ళను తక్కువ చేయౌట కాదండురా?" కొందరి మనోభావాలు గాయపడవు అంటారా ?
అవును. అదే భావంతో వ్రాసాను. కానీ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. వేరే "మనుషులను" అనే కంటే, వేరే మతములను అనడం సబబేమో. తప్పకుండా కొందరి మనోభావాలు గాయపడతాయి. అందులో సందేహము లేదు. కానీ ఇలాంటి మనోభావాలు హిందువులకు వుండవు. కాబట్టి హిందువుల మనోభావాలు ఇలాంటివి జరిగినప్పుడు గాయపడవు. కారణం పరమత సహనమేమో.
౨) "నా మొఖం అందంగా ఉంటుంది" అనుట అందమే కాని "నీతో పూల్చుకుంటే నా మొఖం అందముగా నుండును" !! అనుట ఎంతవరకు సమంజసమందురు? "
నా ప్రశ్న ఉద్దేశ్యమూ అదే. వేరే ముఖాలు అసలు చూడకుండా, నా ముఖం గొప్పదని ఎలా చెప్తాము? బహుశా ప్రశ్న చదవడం ద్వారా కనిపించని మరో కోణం ఇక్కడ ఇస్తున్నాను చూడండి. మన మత ఔన్నత్యాన్ని గూర్చి మాట్లాడేటప్పుడు మనము మాత్రమే టముకేసుకుంటే సరిపోదు. వేరే మతముల గురించి తెలుసుకోని టముకేసుకోవాలి. అందుకనే ఆ పోలిక.
ఇక భారతదేశం ప్రధానంగా హిందూ దేశము కాబట్టి ప్రశ్నలో ఇచ్చిన పోలిక. మీరూ మీ వాణి వినిపించాలనుకుంటే, అదే పోలికలతో ఇస్లామ్ మతము ఎలా గొప్పదో వ్రాసి పంపండి. కానీ మిగిలిన రెండుమతములతో,నేటి ప్రజల జీవనానికి దగ్గరగా వుండాలి. పుస్తక పరిజ్ఞానము ఒక్కటే సరిపోదు. అలాంటి వ్యాసాలను తప్పక ప్రచురిస్తాను. అలాగే క్రైస్తవులూ వారి మతాన్ని మిగిలిన రెండు మతాలతో పోలుస్తూ వారి మత ఔన్నత్యాన్ని పంపించవచ్చు. వాటినీ ప్రచురిస్తాను.
౩) ఏదో బ్లాగ్లోకం లోకం లో అందరు కలిసి ఉండాలని కులమతాలకు అతీతంగా తెలుగు ను ప్రోత్సహించాలని నా లాంటి వాళ్ళు కష్టపడి తెలుగు నేర్చుకొని వస్తుంటే ఇలాంటి పోటిల వల్ల దూరాలు పెరిగే అవకాసం ఉంది కదా...!!
ఇలాంటి సదుద్దేశ్యము వుంటే అంతకంటే ఈ నాటి సమాజానికి కావాలసినదేముంది? కార్గిల్ యుద్ధాలు, ఇరాక్ ఆక్రమణలు,ముంబై మారణ హోమాలు, లాహోర్ కసాయి తనాలు, గుజరాత్ రక్తపాతం వుండవు గాక వుండవు.
వీటన్నింటికంటే నాకున్న ఉత్సాహము వేరే! అసలు ఈ మూడు మతములు ఏమి చెబుతున్నాయని? చెప్పే పద్ధతిలో తేడాలేమిటని? మతము చెప్పే ఆచార వ్యవహారాలద్వారా మనుషుల్లో ఇంత వైవిధ్యమెలా ఏర్పడిందని? అంటే ఈ ముగ్గురు వ్యక్తులను తీసుకుంటే, ముగ్గురు వ్యక్తులు ఒకే అంశంపై React అయ్యే తీరు ఎందుకని వేరే వేరేగా ఉంటుందని? మదరసాలు, వేదపాఠశాలలు, క్రిస్టియన్ స్కూల్స్ నేర్పేదేమిటి? ఇక్కడ నేను చదవాలనుకున్నది ప్రాక్టికాలిటీ. ఆ స్కూల్స్ నుంచి బయటకొచ్చే విద్యార్థుల మనస్తత్వాలు. అలాగే ఆ స్కూల్స్ నేర్పే విద్యద్వారా వారికి మానవ సమాజంపై కలుగుతున్న అభిప్రాయాలు.
మీ భావాలను గౌరవిస్తూ ఆ ప్రశ్నను అన్నీ మతముల వారూ, వారి వారి మతముల గొప్పదనాన్ని చాటుకొనేట్టు ప్రశ్న మార్చి ఇస్తాను.ఇది కూడా తప్పుగా ధ్వనిస్తే చెప్పండి. తప్పక ఈ అంశాన్ని తొలగిస్తాను.
౪) "అంటే ఏమి లేదు మీ హారం కోసం వచేవాళ్ళు తగ్గరు అంటారా ?"
రాఫ్సన్.. ఇది మనదేశంలో బాగా అలవాటయిన బ్లాక్ మైలింగ్ రాజకీయాలు. ఇక్కడ నేను C.M, P.M పదవులకు పోటీ చెయ్యటంలేదు కాబట్టి హారం కు ఈ విషయమై చదువరులు తగ్గినా నష్టంలేదు. కోపగించుకోకుండా ఈ క్రింది పారా కూడా చదవండి.
ఇప్పుడు నేను హిందూ మత ఔన్నత్యాన్ని చెప్పమన్నానని మీరు వేరే ఆగ్రిగేటర్స్ కు వెళ్ళవచ్చు. అక్కడా అదే జరిగితే ఏకంగా మన మతానికొక ఆగ్రిగేటర్ పెట్టుకోని దాన్ని మాత్రమే చదవొచ్చు, లేదా ఆ ఆగ్రిగేటర్ వారు విజ్ఞలైతే వారి అభిప్రాయాలను అందరిముందు తొక్కి పట్టవచ్చు. అంటే ఏమిటి జరుగుతుందిక్కడ? ఏమైనా అర్థమైతే మంచిది. అర్థము కాకపోతే మరొక్కసారి ప్రశాంతంగా చదవండి.
Good work.I appreciate ur interest on photography and the way you have used it like me. Keep on taking the snaps.
రిప్లయితొలగించండిరాస్తున్నానే గాని మీతో వాదించాలని కాదు సుమా!! అర్ధంచేసుకోగలరు ......
రిప్లయితొలగించండి>>>>>౧) "ఇలా రాయమని చెప్పడం, ప్రేరేపించడం, బహుమతి ప్రకటించడం, వేరే వాళ్ళను తక్కువ చేయౌట కాదండురా?" కొందరి మనోభావాలు గాయపడవు అంటారా ?<><<<
నా ప్రశ్న కి మీరు ఇచ్హిన సమాధానం
అవును. అదే భావంతో వ్రాసాను. కానీ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. వేరే "మనుషులను" అనే కంటే, వేరే మతములను అనడం సబబేమో<<<<<
భరారే గారు మీ ఉద్దేశమే అది ( వేరేవారి మనోభావాలు గాయపరచడం )ఐతే ఇక నేను చెప్పేదేముంది....అలాగే కానివ్వండి....వేరేవాళ్ళు అలాగే చేస్తున్నారు కదా ఆంటే?? చదువుకొని , సమాజ నడవడిక గురించి తెలియని, ముఖ్యంగా భారతదేశం లో అనాదిగా వస్తున్నా ఆచారలని , భిన్నత్వం లో ఏకత్వాన్ని తెలీని, ఆస్వాదించని వాళ్ళు చేస్తారు, చేసారు, చేస్తున్నారు, కాని ఉన్నత విద్యావంతులైన మీరు కుడా .......నేనేమి చెప్పను ?? ఎంతైనా మీరు గురువు నేను శిష్యుడిని ....
పొతే నా రెండవ ప్రశ్న
౨) "నా మొఖం అందంగా ఉంటుంది" అనుట అందమే కాని "నీతో పూల్చుకుంటే నా మొఖం అందముగా నుండును" !! అనుట ఎంతవరకు సమంజసమందురు? "
మీరు ఇచ్హిన సమాధానం :
నా ప్రశ్న ఉద్దేశ్యమూ అదే. వేరే ముఖాలు అసలు చూడకుండా, నా ముఖం గొప్పదని ఎలా చెప్తాము?
భరారే గారు మీకు తెలిసే ఉంటుంది అనుభవించే ఉంటారు మన ఇళ్ళల్లో చిన్నప్పుడు " పక్కింటి గోపాల్ ని చూడు నీకంటే ఎంత బాగా చదువుతాడో , ఎంత పద్దతిగా ఉంటాడో " ఆంటే చిన్న పిల్లలు , ఏమి తెలియని వయసులోనే ఇతరులతో పోల్చడాన్ని ఇష్టపడరు కదా...మరి మనం పిల్లల కంటే పిల్లలమేమో కదా? అసలు ఈ పోల్చడం అనేది తర్కం తో చూస్తె పనిచేయాడు ఉదాహరణకి ...మన ముఖం కంటే అందమైన ముఖం చూస్తె మనం పైకి మాత్రం వాడి కంటే నా ముఖమే బాగుంది వాడికి కుడి కన్ను బాలేదనో ముక్కు సరిగా లేదనో అంటాం ఎంత బాగున్నా... మన మనసుని తొక్కిపట్టి ఆత్మవంచన చేసుకుంటాం కదా....ఎవరి ముఖం వాళ్ళకి గోప్పెనండి ...కాని పోల్చుకుంటే నే కొన్ని సార్లు మన ముఖం అందం గా ఉంటుంది కొన్ని సార్లు వేరే వాళ్ళది అందం గా ఉంటుంది. నా ప్రశ్న ఏంటంటే ఒకవేళ మీ ముఖముకన్నా అందమైన ముఖం కనబడిందే అనుకోండి మీరు మీ ముఖం తీసి ఆ ముఖం తగిలించుకుంటారా? కాదు కదా అలాంటప్పుడు మరి పోల్చుకోవడం దేనికి ??? నాదే బాగుంది , నీనే అందగాడిని అనుకుని ఆత్మానందం అన్నా పొందవచ్చు కదా......దీనివల్ల లోక కల్యాణం లోక శాంతి కుడా ఉన్నాయ్ కదా !! మీ ఉద్దేశమే అది ఐనప్పుడు నీను చెప్పి ఎం లాభం లెండి...??
నేను నా వాఖ్యాని ఉల్లాసభరితంగా రాస్తే మీరు ఉద్విగ్నభరితంగా సమాధానం ఇచ్చినట్లున్నారు....
రిప్లయితొలగించండినాకు తెలుసు మీరు ప్రతీ వాళ్ళని సంతృప్తి పరచలేరు, మీ విలువైనా సమయాన్ని నాతొ వాదించటానికి కేటాయించాను లేరు ...కాని మీ కామెంట్ కి నేను సమాధానం ఇవ్వటం ఒక బాధ్యత గా గుర్తించి ఈ కామెంట్ రాస్తున్నానే గాని మీతో వాదించాలని కాదు సుమా!! అర్ధంచేసుకోగలరు ......
పొతే ....
ఇక భారతదేశం ప్రధానంగా హిందూ దేశము కాబట్టి ప్రశ్నలో ఇచ్చిన పోలిక. మీరూ మీ వాణి వినిపించాలనుకుంటే, అదే పోలికలతో ఇస్లామ్ మతము ఎలా గొప్పదో వ్రాసి పంపండి.అలాగే క్రైస్తవులూ వారి మతాన్ని మిగిలిన రెండు మతాలతో పోలుస్తూ వారి మత ఔన్నత్యాన్ని పంపించవచ్చు. వాటినీ ప్రచురిస్తాను.
భరారే గారు మీ పరమత సహనానికి HATSOFF అండి..కాని ఇలా వేరేమతం వాళ్ళని కూడా మీరు కూడా పోల్చుకోండి అనడం పరమత సహనం కాదేమో అని నా అనుమానం....ఇలా పోల్చుకుంటూ పొతే మనుషుల మధ్య సయోధ్య కుదరదు ...మేమంతా మనుషులమే అనే భావన రాదు నేనూ "ఇది " అనే విషశాతం పెరిగిపోతుంది ....దానివల్లే కదా ఈ రోజు ప్రసాంతంగా ఉండే భారతం రావణ కాష్టం అయింది..ఇతరులతో పోల్చుకునే మనస్తత్వం నాకు లేదు లెండి అందుకే నా వాణి అంటూ ప్రత్యేకం గా ఏమి లేదు !!! అందరు కలిసిఉండాలి అనేది నా వాణి , ఎందుకు కలిసి ఉండాలో , ఎలా కలిసి ఉండాలో?? అని ఒక ప్రశ్న పెట్టండి కచితంగా నా వాణి వినిపిస్తా...పొతే భారత దేశం ప్రధానం గా హిందూ దేశం కాబట్టి అన్నారు ...అది మీ ఉద్దేశం అనుకుంటా ...."భారతదేశం లో అధికశాతం హిందువులు కాబట్టి" అంటే బాగుండేదేమో...ఎందుకంటే...భారతదేశం లౌకికదేశం .....నేపాల్ లాగా నో , దుబాయ్ లాగా నో వాటికాన్ లానో మతప్రాతిపదిక మీద నడిచే దేశం కాదు...నొప్పించి ఉంటె క్షమించండి....
>>>>ఇలాంటి సదుద్దేశ్యము వుంటే అంతకంటే ఈ నాటి సమాజానికి కావాలసినదేముంది? కార్గిల్ యుద్ధాలు, ఇరాక్ ఆక్రమణలు,ముంబై మారణ హోమాలు, లాహోర్ కసాయి తనాలు, గుజరాత్ రక్తపాతం వుండవు గాక వుండవు. <<<<
ఇలాంటి సదుద్దేశ్యాలు ఏ నాటి నుండో సమాజం లో ఉన్నాయ్ కాని ఈ నాటి సమాజం లో మరుగున పడిపోయాయి అని నా అభిప్రాయం...మళ్ళి ఆ సదుద్దేశ్యాలు రావాలి అన్నా.... కొంత మంది వల్ల చాలా కష్టంగా ఉందిలెండి..... ఇక మీరు పైన పేర్కొన్న రక్తపాతాలలో చివరిది గుజరాత్ రక్తపాతం ఒక్కటే వర్గపోరాటం మూర్ఖంగా చెప్పుకోవాలి అంటి మత పోరాటం ... మన టాపిక్ కి సంబంధించిన అంశం, మొదటి రెండు, దేశాల మధ్య యౌద్ధాలు,కాని వర్గ యౌద్దాలు కావు . ముంబై మారణ హోమాలు, లాహోర్ కసాయి తనాలు అవి దేశ అంతర్గత బద్రత మీద, ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం చేయడానికి పొరుగు శత్రు దేశాల లేదా స్వదేశీయుల దాడులు దీనిలో కుడా వర్గ పోరాటాలు లేవు. అయినా ఉదహరించడం లో మీ సదుద్దేశం అర్ధం కాలేదు.
మీ భావాలను గౌరవిస్తూ ఆ ప్రశ్నను అన్నీ మతముల వారూ, వారి వారి మతముల గొప్పదనాన్ని చాటుకొనేట్టు ప్రశ్న మార్చి ఇస్తాను.ఇది కూడా తప్పుగా ధ్వనిస్తే చెప్పండి. తప్పక ఈ అంశాన్ని తొలగిస్తాను.
రిప్లయితొలగించండిమీరే నిర్ణయించండి నా సుధీర్గ వివరణ తరువాత .... ఏది మంచిదో... ఏది ఉంచాలో ??..నా అభిప్రాయాలను గవురవిచ్చినందుకు కృతఙ్ఞతలు ..
ఇప్పుడు నేను హిందూ మత ఔన్నత్యాన్ని చెప్పమన్నానని మీరు వేరే ఆగ్రిగేటర్స్ కు వెళ్ళవచ్చు. అక్కడా అదే జరిగితే ఏకంగా మన మతానికొక ఆగ్రిగేటర్ పెట్టుకోని దాన్ని మాత్రమే చదవొచ్చు, లేదా ఆ ఆగ్రిగేటర్ వారు విజ్ఞలైతే వారి అభిప్రాయాలను అందరిముందు తొక్కి పట్టవచ్చు
మీరే నా పేరు చూసి మీరు నన్ను ఒక వర్గానికి సంబంధించి మాటలాడుతున్నా అనుకోవచు... భారతీయుల మధ్య ద్వేషాన్ని పెంచే ఏ చర్య నైనా ఒక భారతీయుడిగా ఖండించడం నాకు అలవాటు అంతే గాని ఒక మతానికి సపోర్ట్ గా మాట్లాడుతున్న అని మీరు పొరబడుతున్నారు... ఇక అభిప్రాయాలను అందరిముందు తోక్కిపట్టేవాళ్ళు విజ్ఞులు అని మీకు అనిపిస్తే వాళ్ళు విజ్ఞులు అనటం నాకూ అంగీకారమే....కాని నా భారతీయ రక్తమే వాళ్ళను కుసంస్కారులు, కపతులు అంటుంది....నా మనసుని తొక్కిపట్టి నేనుకుడా విజ్ఞుడిని అయిపోతాను..హ హ హ
నా ప్రశ్న :అంటే ఏమి లేదు మీ హారం కోసం వచేవాళ్ళు తగ్గరు అంటారా ?"
మీ సమాధానం: రాఫ్సన్.. ఇది మనదేశంలో బాగా అలవాటయిన బ్లాక్ మైలింగ్ రాజకీయాలు. ఇక్కడ నేను C.M, P.M పదవులకు పోటీ చెయ్యటంలేదు కాబట్టి హారం కు ఈ విషయమై చదువరులు తగ్గినా నష్టంలేదు.
హారం మీది సారూ..నేను సలహాలు మాత్రమె ఇవ్వగలను.బడి తెరిచి విద్యార్ధులు రాకపోయినా పర్లేదు అంతే నేనేమి చెప్పను..? రాజకీయాలు అంటారా ....అవి బ్లాక్మైలింగ్ తోనే లింక్ అయ్యి ఉన్నాయ్ ....ఎందుకంటే....జీవతమే ఒక బ్లాకు మెయిలింగ్ సరిగా ఆలోచిస్తే....మీరు C .m గా నుంచుంటే నా ఓటు మీకే...కచితంగా ..ఎందుకంటే మీలాంటి విద్యావంతుల విశాలా భావాలు కలిగిన రాజకీయ నేతల అవసరం ఎంతైనా దేశానికీ అవసరం.
మీ ప్రియ శిష్యుడు ,
RAAFSUN
ఫోటోస్ బాగున్నాయండి!!
రిప్లయితొలగించండితొలకరి, thanks for the comment
రిప్లయితొలగించండిసునీత, మీకు కూడా ఫొటోలు నచ్చినందుకు థ్యాంక్సులు :)
రాఫ్సన్.. ఇంతింత పెద్ద పెద్ద కామెంట్లు రాస్తే నాకు జవాబులివ్వడం కష్టం సుమీ. రాత్రికో,రేపో వీలు చేసుకొని మీ వ్యాఖ్యకు క్లుప్తంగా స్పందిస్తాను. కానీ వ్రాసిన కామెంట్ ద్వారా నా టోన్ మీకు ఉద్విగ్నభరితంగా అనిపించిందా :-). లేదు సార్, వేళా కోళాలాడితే చెప్పాల్సిన భావమెక్కడ గాలికెగిరి పోతుందని ప్రశాంతంగా వ్రాసిన కామెంట్ అది.
రిప్లయితొలగించండిరాఫ్సన్, మీరిచ్చినంత పెద్దగా రిప్లై లు ఇవ్వలేను. కారణమంటూ పెద్దగా ఏమీలేదు.సమయాభావమే. లైనులైనుకూ రిప్లైలిచ్చుకున్నా పేజీలకు పేజీలను నింపడమే తప్ప బ్లాగుల్లో పెద్ద ప్రయోజనాలూ ఏమీ వుండవు. కానీ మీకు గుజరాత్ అల్లర్లు మాత్రమే మతపరమైన అల్లర్లుగా కనిపించి, మిగిలినవి దేశ రక్షణ వైఫల్యాలు గా కనిపిస్తున్నాయి. దానికి కారణభూతాలేమిటో తెలియడం లేదు కాబట్టి ఈ చర్చ ఇంతటితో సమాప్తం.
రిప్లయితొలగించండిమరొక్క విషయం "హారం గురించి". జీవితమే బ్లాక్ మైలింగ్ అయ్యి వుండవచ్చు. కాదనను. కానీ హారం నాకు జీవితము కాదు. అలాగే అది పవిత్ర పాఠశాలా కాదు. అందులో నేను ఉపాధ్యాయుడనూ కాదు :-). కాబట్టి హారం ఎవ్వరూ చూడకపోతే ఏమైతుందో అన్న ఆసక్తి అస్సలు రాకూడదు. ;-) ఏమైద్ది. మూసేస్తాను. నాకు సంవత్సరానికి కొన్ని వందల డాలర్ల మిగులు :-)
అలాగే "మతమంటే మానవత్వమన్న" నమ్మకముతోటి మన లొకిక వ్యవస్థపై గౌరవంతోటి ఆ ప్రశ్న స్థానంలో మరో ప్రశ్న ఇవ్వదలచుకున్నాను.
"మన సమాజంలో పౌరులను తీర్చి దిద్దడంలో భారత లౌకిక వ్యవస్థలోని మతముల పాత్ర పదిపేజీలకు మించకుండా వ్రాయాలి."
సర్వేజనా సుఖినోభవంతు.
ఉష్..అబ్బా.. అసలు ఇకనుండి టపాలను వీక్ డేస్ లో రాయకూడదు :-)
థాంక్స్ ...ఇంకోస్సారి ...థాంక్స్.....మళ్ళిఇంకోస్సారి ..థాంక్స్.....
రిప్లయితొలగించండిగురువుగారు నా అభిప్రాయాన్ని మన్నించి, ప్రశ్న మార్చినందుకు ధన్యుడిని.....:) నిజంగా మీరు నా గురువు సమానులు .
నాకు చిన్నపటినుండి కూలంకషంగా చర్చించడం అలవాటు....అందుకే విశ్లేషణాత్మక వివరణలు...పెద్ద పెద్ద వ్యాసాలునూ.....మీ సమయాన్ని పాడు చేసినందుకు ...క్షమించండి.....
సర్వేజనా సుఖినోభవంతు
మీ శ్రేయోభిలాషి,
RAAFSUN
@భారారె
రిప్లయితొలగించండి>>>ఉష్..అబ్బా.. అసలు ఇకనుండి టపాలను వీక్ డేస్ లో రాయకూడదు :-)
నిజం గానే మీకు డేస్ 'వీక్' గా ఉన్నవేమో ! ఒక మారు జ్యోతిష్యం చూడరాదూ ?
జస్ట్ కిడ్డింగ్! భారతదేశం 'అలౌకిక ' దేశం ! లౌకికానికి ఇక్కడ తావు లేదు !
చీర్స్
జిలేబి.
Rafsun, you don't need to thank me. Thanks to the religious society that I born and brought up.
రిప్లయితొలగించండి@Zilebi, ఈ మధ్య మీ టపాలు, బ్లాగుల్లో కామెంట్లు చూస్తుంటే మీకు మన డాక్టర్ రమణ గారి ట్రీట్మెంట్ అవసరమేమో ననిపిస్తుంది :) JK
ఇక లౌకికం గురించి పండగ సంబరాల్లో వున్న మీకూ మీ అనుయాయులకు చెప్పినా అర్థమయ్యే సూచనలు లేవు మరి :))
@భారారె,
రిప్లయితొలగించండిఎవరా డాక్టర్ రమణా ఏమిటా స్పెషాలిటీ?
cheers
zilebi
http://www.varudhini.tk