హారానికి తాము వ్యాసాలను వ్రాయగోరుతున్నట్టు అప్పుడప్పుడు మైల్స్ వస్తున్నా ఇన్ని రోజులూ అటువైపు దృష్టిసారించలేదు. దీనికి ఒక్కటే కారణము. ఎలాగూ బ్లాగులున్నాయి కదా, ఎవరికి తోచింది వారు తమబ్లాగులో వ్రాసుకుంటారు కదా. మళ్ళీ ఈ హారంలో వ్యాసాలంటే ఎవరు పంపుతారన్న సంశయమే!!
కానీ హారం మొదలైన క్రొత్తలోనూ అటుపిమ్మట మధ్య మధ్యలోనూ కొంతమంది మైల్స్ ఇచ్చినా సున్నితంగా తిరస్కరించడం జరిగింది. కానీ ఈ వారంలో మళ్ళీ ఇలాగే మరో ఇర్వురు ఇలాంటి మైల్స్ ఇవ్వడంతో ఈ ఆలోచనకు శ్రీకారం చుట్ట దలచాను. అంటే ఇకపై హారంలో పాఠకుల నుంచి వచ్చే వ్యాసాలు కూడా వుంటాయి. ఏవి ప్రచురిస్తాను ఏవి చెయ్యను అన్న నిర్ణయానికి నియమనిబంధనలైతే ఇప్పటికేమీ లేవు కానీ, ఆ నిర్ణయం పూర్తిగా ప్రస్తుతానికి నాదే. ముందుముందు ఏమైనా సంపాదక వర్గమేర్పిడితే తప్ప!!!
అన్నట్లు ఇది పత్రిక అని చెప్పలేను. పత్రికంటే ప్రతి వారానికో పక్షానికో నెలకో విడుదలవ్వాలి కదా. అలాంటి నియమాలేవీ లేని పత్రికనవచ్చేమో.
ఈ సందర్భంగా వచ్చేవారం మొదటి దినాల్లో ముందుగా పోచిరాజు సుబ్బారావు గారి కలం నుంచి జాలువారుతున్న సుభాషిత నీతి శతకము. ఈ శతకము అలతి అలతి తేట తెలుగు పద కంద పద్యములతో అలరారుచున్నది. ఈ శతకాన్ని కొన్ని వారాల పాటు ధారావాహికగా అందిస్తాను. వారి గురించి వివరాలు కూడా ఆ శతకముతో పాటుగానే వుంటాయి. మీమీ అభిప్రాయాలను నేరుగా రచయితకు పంపే వీలుకూడా వుంటుంది.
నేను సంక్రాంతి కి ఓ ఫన్ ఆర్ట్ విత్ జేకే సరి కొత్త ది పంపిస్తానండీ, మీకు ఆమోద యోగ్యమైతే ప్రచురిమ్చుకొండీ, - టపా పేరు
రిప్లయితొలగించండిఓ ఫన్ ఆర్ట్ విత్ జేకే- మెగా సవ్వడి భారారే గారితో బ్లాగ్ముఖీయం !
చీర్స్
జిలేబి.
బాగుంది మంచి ఆలోచన! దిగ్విజయంగా కొనసాగాలని ఆశిస్తూ........
రిప్లయితొలగించండిజిలేబీ పంపించండి... నచ్చితే సైట్ లో పెడతాను.
రిప్లయితొలగించండిరసజ్ఞ, ధన్యవాదాలు
భారారె,
రిప్లయితొలగించండిధన్యవాదములు. ఏప్రిల్ ఒకటో తారీకులోగా పంపిస్తాను. మీ కు సంక్రాంతి సంచికకి ప్రచురణ వీలుగా ఉండును
చీర్స్
జిలేబి.
ఏమయ్యా !!!.ఎందుకు ఏడుస్తావు ? వాళ్ళనే రాసుకొని ...వాళ్ళనే ప్రచురించుకొని...వాళ్ళనే అన్నీ చేసుకో మను....ఏంటి ? కష్టపడి జర్నలిజం చదివావా ...ఎవరికీ వాళ్ళు ఈలా సైట్ లు పెట్టు కొని వ్యాసాలూ ...కధలు అంటూ పోతే ఒక నాటికి జనాలు పేపర్ ను మర్చిపోతారా ?? అలా ఏమి జరగదు లేవయ్యా... ఏంటి ?? అంతా పెద్ద పెద్ద మాటలు వాడకయ్య ...బాబు ..... ఈ బ్లాగులోల్లు కలిసి జర్నలిజం ని నాశనం చేస్తున్నారు అనటం మంచిది కాదయ్యా .....ఆయన ఏదో ఒక మంచి పని చేద్దాం అని ఇలా మొదలు పెట్టారు...అంటే ఇందులో ఎలాంటి దుర్బుది ..."సంపద "కీయం లేదు లేవయ్యా....ఇలా కాదు గాని ఒక పని చేయి నువ్వు జర్నలిజం చదివావుగా ..ఏమైనా అనుభవం ఉందా ?? అంటే ఎక్కడైనా పని చేసావా అని ?? ఇంతకీ నీది ఈ జర్నలిజం ?? ఎల్లో నా ?? ఎరుపా లేకా గ్రీనా ???? ఏంటి ఇవి తెలీదా?? నువ్వు తెలుగోడివేనా, కాదా? ఏవి తెలీకుండా తెలుగు జర్నలిజం ఏంటి ?? పో పో నీగురించి టైం వేస్ట్ చేసాను ....
రిప్లయితొలగించండిఅయ్యా !!! రామి రెడ్డి గారు మీరు కానియండి ...శుభమస్తు....అవిఘ్నమస్తు......
జిలేబి సంక్రాంతి ఏప్రిల్ లోనా? రమ్ము ఎక్కువైందా అండి?
రిప్లయితొలగించండిరాఫ్సన్..అర్థం పర్థం లేని కామెంట్ల ఈకలు పీకడానికి నాకు టైము లేదు. థ్యాంక్స్.
రిప్లయితొలగించండిchalaa manchi answer icharu bhaskar gaaru.
రిప్లయితొలగించండివోవ్వ్వో,
రిప్లయితొలగించండిఅప్పుతచ్చు. ఏప్రిల్ లో ఎక్కడండీ సంక్రాంతీ, జనవరీ ఒకటి అని ఉండవలె. ప్రయత్నిస్తాను, ఇక రమ్ము తగ్గించవలె- మోతాదు ఎక్కువైనట్టున్నదేమో ! నెనర్లు
రాఫ్సన్, జిలేబి
రిప్లయితొలగించండిథ్యాంక్స్
భారారె
రిప్లయితొలగించండినా బ్లాగులో నేను హారం లో నాకు నచ్చినవి వ్యాఖ్యలు అని రాసిన మాట వాస్తవం. ఇవ్వేళ ఎందుకో హారం లో ఓన్లీ వ్యాఖ్యలు పబ్లిష్ అవుతున్నాయి. టపాలు సనకలనం కావటం లేదు. హారం హా రమ్ము ? వెన్ కమ్ము బాక్ ?
హ్మ్.. మీ కామెంటు చూసే దాకా నేను ఈ విషయాన్ని గమనించలేదండి. రాత్రికి సరి చేస్తాను.తెలియచేసినందుకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిరామిరెడ్డిగారూ, మీ బ్లోగులో కామెంట్ పెట్టాలంటే నాకేదయినా బ్లోగ్ ఉండి తీరాలా? నేను అనేకసార్లు ప్రయత్నించినా కానీ కొన్నిసార్లే సాధ్యపడుతోంది.
రిప్లయితొలగించండిక్రిష్ణవేణి
కృష్ణవేణీ గారూ, అలా ఏమీ లేదండి? నా బ్లాగులో కామెంట్ వ్రాయడానికి ఎలాంటి బ్లాగూ వుండక్కరలేదండి. బహుశా మీరు నా బ్లాగుకు వచ్చినప్పుడు మీకేదో ప్రాబ్లెమ్ వచ్చి వుండవచ్చు.
రిప్లయితొలగించండిజిలేబీ, పొరపాటు సరిచేసాను. నిన్న రాత్రే ఈ ప్రాబ్లం వచ్చినట్టుంది.
సుబ్బారావు గారి నీతిశతకం కోసం ఎదురుచూస్తున్నాను. ఎప్పటినుండి మొదలు పెడుతున్నారు?
రిప్లయితొలగించండిశంకరయ్య గారూ, వీరు చిన్న చిన్న పదములతో మంచి మంచి పద్యములను వ్రాయటంలో ప్రసిద్ధులనిపిస్తున్నది. వీరి బ్లాగు లింకు ఇక్కడ ఇస్తున్నాను.
రిప్లయితొలగించండిhttp://psraopv.blogspot.com/
ముందుగా హారంలో వ్యాసాలు లా ప్రచురిద్దామనుకున్నాను కానీ, బ్లాగులో ఎలాగూ వున్నాయి కాబట్టి బ్లాగును హారంలో చేరుస్తున్నాను.
భారారె
రిప్లయితొలగించండిహారమును రమ్ము ఎఫెక్ట్ నించి బయటకు లాగినందులకు నెనర్లు.
మరి నా O = BR² టపాలు హుష్ కాకీయం ఐపోయింది హారం లో ? ఏమి ఈ భాస్కరుని మాయ ?
జిలేబి, మాయా మచ్చింద్ర. అలా అయ్యిందా అయ్యో పాపం :))
రిప్లయితొలగించండి