19, నవంబర్ 2011, శనివారం

హారం సంక్రాంతి పత్రికా ప్రతికోసం రచనల పోటీలో పాల్గొనండి. బహుమతులను గెలుచుకోండి.

సాహితీవేత్తలకు,పరిశోధనా ప్రియులకు,సాహిత్యాభిలాషులకు,హారం పాఠకులకు ముందుగా నమస్కారములు. ఈ చిన్న వ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశ్యము అంతర్జాలంలో హారం ద్వారా తెలుగులో ఒక పత్రికను తీసుకువస్తే బాగుంటుందన్న ఆలోచనే. ఇది ఒక్కపత్రికే కావచ్చు లేదా ఆ సంచికకు వచ్చే ఆదరణను బట్టి తెలుగువారికి ముఖ్యమైన పండగలప్పుడు ఓ సంచికనో తీసుకు వచ్చే ఆలోచన. కాబట్టి ఇది పండగలకు మాత్రమే వచ్చే పత్రికే. అంటే వార,పక్ష,మాస,త్రైమాసిక పత్రికల విభాగంలోకి రాదు.

హారం ఆవిర్భావం 2009 సంక్రాంతి రోజు. ఈ పుణ్యకాలాన్ని పురష్కరించుకొనే ఈ పత్రికా ప్రతిని కూడా ఈ సంక్రాంతి పర్వదినాలలోనే వెలువరించాలని కోరిక. అప్పుడప్పుడు మాత్రమే వచ్చే పత్రిక కాబట్టి ఇందులో దరిదాపు పదిహేను విభాగాలాకు పోటీలు బహుమతులను ఇవ్వాలనుకుంటున్నాను. గొప్ప గొప్ప బహుమతులు లేకున్నా ప్రధమ,ద్వితీయ బహుమతులుగా మంచి మంచి పుస్తకములను ఇస్తాను.

అన్ని రచనలు డిసెంబరు 31 2011 లోగా పంపాలి. ముందు పంపితే ఇంకా మంచిది.

ముందుగా సాహిత్య విభాగానికి సంబంధించిన అంశము.


అంశము ౧.
==============
ఆంధ్ర మహాభారత,భాగవతముల నాధారంగా చేసుకొని ఇతివృత్తపు కాలము నాటి సామాజిక, సాంఘిక, కుటుంబ అంశములను విస్తృతంగ పరిశోధనా వ్యాసంగా వ్రాయాలి. ఈ వ్యాసం వ్రాసేటప్పుడు ఈ క్రింది నియమాలు తప్పక దృష్టిలో వుంచుకోవాలి.

౧) ఈ పరిశోధనా వ్యాసంలో సాధ్యమైనంత వరకూ భారతములోని అన్ని పర్వాలనూ, భాగవతములోని అన్ని స్కందములను స్పృశిస్తూ సాగాలి. సాంఘిక,సామాజిక,కుటుంబ వ్యవస్థను ప్రతిబింబించని పర్వములను కానీ, స్కందములను గానీ వదిలివేయవచ్చు.

౨) అవసరమైనచోట మూల పద్యములనుదహరిస్తూ,వానికి తాత్పర్యములను చెప్తూ, ఆ పద్యములను ఆధారంగా రచయిత ఆనాటి పరిస్థితులను విస్తృతంగా పదవతరగతి విద్యార్థికి అర్థమగు వచనములో వివరించగలగాలి. వ్యాసము తప్పని సరిగా తెలుగులోనే వుండాలి.

౩) A4 పేజీలో,తెలుగు ఫాంటు 12 పరిమాణముతో టైపు చేసినప్పుడు కనీసము ముప్పై పేజీలకు తగ్గకుండా వుండాలి. గరిష్ట పరిమితి లేదు. అలాగే తప్పక వ్యాసం యూనికోడ్ లో వుండాలి. యూనికోడ్ అంటే తెలియని వారికి మీరు టైపు చేసేవ్యాసము లేఖినిలో కానీ, బరహా సాఫ్ట్ వేర్ వుపయోగించికానీ, హారము ద్వారాకానీ తెలుగులో టైపు చేసి సేవ్ చేసినప్పుడు మీ డాక్యుమెంటు దానంతటదే యూనికోడ్ లో సేవ్ అవుతుంది.

౩) రచయిత భావాలు స్వతంత్రమైనవై, పరిశీలించిన గ్రంధములను, వాటి రచయితలను తప్పని సరిగా పేర్కొనాలి.

౪) రచయిత పంపే వ్యాసపు ప్రచురణ హక్కులు హారానికి ఇవ్వాలి. అంటే హారంలో ప్రచురించడానికి మంచివాటిని ఆంగ్లానువాదము చేసి ప్రచురించడానికీ సర్వ హక్కులను హారముకు ఇవ్వవలసి వుంటుంది.


అంశము ౨.
==============
ఇస్లామిక్, క్రిష్టియన్ మతములతో పోలుస్తూ, హిందూ మత ప్రాశస్త్యాన్ని, దీని ఔన్నత్యాన్ని వివరించాలి. అన్ని మతములు తప్పని సరిగా నేటి సమాజపరిస్థితులను ప్రతిబింబిస్తూ పైన చెప్పిన రీతిలో 10 A4 పేజీలకు తగ్గకుండా రచన సాగాలి.


అంశము ౩
=============
పదవ శతాబ్దానికి ముందు పల్లెజీవనాన్ని ప్రతిబింబిస్తూ మనుషుల ఆత్మీయానురాగాలతో పాటు ద్వేషభావాన్ని అంతర్లీనంగా చూపిస్తూ,ఆనాటి పల్లె భాషను ఊహించి, ఓ పదిపేజీల ( సుమారుగా ) చక్కని కథానిక వ్రాయాలి.


మిగిలిన అంశాలను కూడా రేపు ఎల్లుండిలోగా ప్రచురిస్తాను.

8 కామెంట్‌లు:

  1. అయ్య బాబొయ్ , ఇది చిరు సవ్వడి కానే కాదు
    ఇది పీ ఎచ్ డీ కి థీసీస్ లా గున్నది !

    రిప్లయితొలగించండి
  2. జిలేబి గారూ, హ్మ్... నిజమేనేమో!. అడగడానికి కూడా మొఖమాటము పడితే ఎలాగండి. అయినా మన బ్లాగులోకములో నున్న తెలుగు పండితులకు కొదవలేదు కదా. ఇక మూడవ అంశము పూర్తి ఊహాజనితము కదా. ఊహలకు హద్దేముంటుందండి?

    రిప్లయితొలగించండి
  3. నాలుగో అంశం - జ్యోతిష్యం ! ఈ అంశం ఆకర్షినంత వేరే ఎ అంశమూ ఉండదనుకుంటాను. ! మీరు ఆ ఎక్కువగా చదివిన టపాలు (హారం లో ) అనలిటిక్స్ ఉంటె జల్లెడ వేసి చూడండీ , జ్యోతిష్యం మీద రాసిన అన్ని టపాలు సూపెర్ హిట్లు. అంటే , చదువరులూ వాటికి ఎక్కువే, రాసే వారూ సత్తా ఉన్న వారే. అల్ ది బెస్ట్ !

    చీర్స్
    జిలేబి.

    రిప్లయితొలగించండి
  4. జిలేబీ, జ్యోతిష్యము మీద ఇస్తానో లేదో కానీ రాజకీయాల మీద ఒకటుంటుంది. మీలాంటి వారి అనుభవాలన్నీ పూసగ్రుచ్చి చెప్పటానికి :))

    రిప్లయితొలగించండి
  5. బహుమతులమాట పక్కనుంచితే (దురదృష్టవశాత్తూ కన్స్యూమరిజం అలవాటయిపోయి ఏదో ఒకటి ఉచితంగానో, కొసరుగానో ఇస్తే తప్పించి ఏ మంచిపనిలోనూపాల్గొనే అలవాట్లు తప్పిపోయాయి మరి, చిన్నప్పుడు బెల్లం ముక్క ఇస్తేనే గాని అరిటాకుకూడా కొయ్యనని అమ్మని బెదిరించినట్టు) ఇది చాలా చక్కని ప్రయత్నం. మన భాషని, మన సంస్కృతిని కాపాడుకుందికి ఆలోచనాపరులైన తెలుగువాళ్ళందరూ కలిసికట్టుగా (నవ్వొద్దు, ఆరోజు రాకపోదు) చెయ్యవలసిన పని. నేను మిమ్మల్ని మనసారా అభినందిస్తున్నాను.
    NS మూర్తి

    రిప్లయితొలగించండి
  6. nsmurty గారూ,

    నా మనసులో వున్న మాట చెప్పారు. ఈ ప్రయత్నాన్ని మొదలు పెట్టినప్పుడే అనుకున్నాను. ప్రధానంగా పైన ఇచ్చున అంశాలపై రచనలు చేసేవారు డబ్బుకోసం మాత్రమే రచనచేయాలని పూనుకుంటే అది జరగనిపని. వారికున్న ఉత్సాహం ద్వారానే పై ప్రశ్నలపై రచనలు వస్తాయని నానమ్మకం. మరి ఈ బహుమతులెందుకంటారా? మనుము చేసే ప్రయత్నము పదిమంది కనీసము చదివి, వారిద్వారానైనా సరైన వ్యక్తికి సమాచారమందుతుందనే వుద్దేశ్యమే టైటిల్ లో బహుమతుల పదార్థం.

    "మన భాషని, మన సంస్కృతిని కాపాడుకుందికి ఆలోచనాపరులైన తెలుగువాళ్ళందరూ కలిసికట్టుగా (నవ్వొద్దు, ఆరోజు రాకపోదు) చెయ్యవలసిన పని" మీరన్నట్టు జరగాలని ఆశిస్తాను.

    రిప్లయితొలగించండి
  7. భా రా రె గారు, సందర్భం కాకపోయినా మీకు ఒక విన్నపం.
    హారం సైట్ ఓపెన్ చేసినపుడు డిఫాల్ట్‌గా ఇంగ్లీష్ బ్లాగులు దర్శనమిస్తున్నాయి.
    అలా కాకుండా తెలుగు బ్లాగులు డిఫాల్ట్‌గా వచ్చేటట్టు మారిస్తే బాగుంటుందేమో అలోచించండి.

    రిప్లయితొలగించండి
  8. బోనగిరి, ఈ సూచన ఇప్పటికే చాలామంది చేసారు. కానీ ఇప్పటిలో అలా మార్చలేను. అనేక కారణాల్లో ఒక కారణమేమిటంటే, హారం కు సెర్చ్ ఇంజన్స్ ద్వారా వచ్చే పాఠకులకు ఆంగ్లము కాక, మరో భాష తప్పక వస్తుంది అనుకుంటున్నాను. అలాంటప్పుడు తెలుగు హోమ్ పేజి గా కనిపించగానే, తెలుగు రాని వారు సైట్ లో అసలేమి వుందో కూడా చూడకుండా టప్పున మూసి వేసే ప్రమాదము వుంది. అదే ఇంగ్లీష్ హోమ్ పేజిగా వున్నప్పుడు, తెలుగు వచ్చిన వారు తప్పక తెలుగు చూసే అవకాశముంది కాబట్టి తెలుగుకు మేలే జరుగుతుందని నా ఊహ.

    ఇక హారానికి తెలుగు హోమ్ పేజి లేదని హారం చూడని వాళ్ళు ఎలాగూ చూడరు. తెలుగు భాషాభిమానము అంటే తెలుగు హోమ్ పేజిగా వుంచటము కాదని నా అభిప్రాయము.

    రిప్లయితొలగించండి

Comment Form