19, నవంబర్ 2011, శనివారం

హారం సంక్రాంతి పత్రికకు రచనల పోటీల కిస్తున్న అంశాలపై రచనలు చేసి, బహుమతులను గెలుచుకొనండి -2

నిన్న ఏమేమి ఇచ్చానో ఈ టపాలో చదవండి.
http://chiruspandana.blogspot.com/2011/11/blog-post_19.html

ఈ రోజు మరో మూడు అంశాలు

౧) మారుతున్న సమాజములో పిల్లల మనస్తత్వాలలో వస్తున్న మార్పులు, వారిని పెంచడములో తల్లి తండ్రుల పాత్ర పై వ్యాసాన్ని వ్రాయాలి. మీ వ్యాసంలో 8 నుంచి 18 సంవత్సరాల పిల్లల మనస్తత్వాలను విశదీకరిస్తూ వారిపై చుట్టూవున్న సమాజం, కుటుంబము ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయో ఉదాహరణలతో వివరిస్తూ వారి పెంపకములో వచ్చే సమస్యలను సామరస్యంగా ఎలా పరిష్కరించాలో వ్రాయాలి. ఎన్ని పేజీలుండాలన్నది రచయిత ఇష్టము.

౨) మహాత్మాగాంధీ హత్యానంతర భారతదేశములో వచ్చిన అన్ని రకముల మార్పులను ( మంచినీ, చెడునూ ) సోదాహరణంగా ఇరవై, ఇఅరవైదు పేజీలకు మించకుండా వ్రాయాలి. ఈ ప్రశ్నకు inspiration, India after gandhi By Ramachandra guha చదవడము ద్వారా వచ్చింది.

౩) కులవృత్తులు కార్పొరేట్ వృత్తులుగా మారుతున్న ఈ తరుణంలో కులవృత్తులపై కథానిక లేదా చిన్న నవల. నిడివి రచయిత ఇష్టం.


పైన పేర్కొన్న అన్ని అంశాలకూ ప్రధమ మరియు ద్వితీయ బహుమతులు కూడా ఉంటాయి. మన బ్లాగర్లే కాకుండా రచనలపై ఇష్టమున్న ఎవరైనా పాల్గొని రచనలు పంపవచ్చు.కాబట్టి మీకు తెలిసిన వారికీ ఈ విషయం చేరవేయండి. పుస్తకములు వద్దు అనుకున్నవారికి డబ్బురూపంగా బహుమితినివ్వడం జరుగుతుంది. ఎంతంటారా? ఆగండి, ఒక్కో ప్రశ్నకొక్కొక్క రేటు మరి :-). పదిహేను ప్రశ్నలయ్యాక వివరాలు చెప్తాను.

4 కామెంట్‌లు:

  1. హాస్య శృంగార రసములకు ఇంకనూ తావు రాలేదా ! ఏమి చేతుము, వేఛి చూడవలె !

    రిప్లయితొలగించండి
  2. ఇంత మంచి ప్రయత్నం చేస్తున్నపుడు నాలాంటి వాళ్లకి ఉడతసాయంచేసే అవకాశం (బహుమతిమొత్తంలో కొంత contribute చెయ్యడానికి) ఇవ్వరాదూ?

    రిప్లయితొలగించండి
  3. మూర్తి గారూ, నేను ముందు చెప్పినట్టు పెద్దపెద్ద బహుమతులనేమీ ఇవ్వలేను. కానీ ఈ పదిహేను అంశాలకు కలిపి మొత్తము Rs 22,500 అనుకున్నాను. మీ సహాయాన్ని తప్పక స్వాగతిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  4. జిలేబి గారూ, హాస్యం, శృంగారం,రాజకీయం అన్నీ వచ్చాయి కదా. మీ సూచనలకు ధన్యవాదాలు.ఇక రచనలు పంపడమే. ఆలశ్యమెందులకు?

    రిప్లయితొలగించండి

Comment Form