2, నవంబర్ 2009, సోమవారం

అమ్మఒడికి జన్మదిన శుభాకాంక్షలు

అమ్మఒడికి జన్మదిన శుభాకాంక్షలు

అమ్మఒడిలో మొగ్గతొడిగిన పూబాలలు
రాను రానూ రాటుదేలిన రణబాలలు

వెన్నపూసిన విచ్చుకత్తుల కుట్రను
తెల్ల గుడ్డ చాటున పేట్రేగిన గూఢచర్యాన్ని
స్వతంత్ర భారతిని నడిపే
అస్వతంత్ర కీలుబొమ్మల్నీ
కీలుబొమ్మల్ని నడిపే కణికులను
కనడానికెన్ని జీవితాలు కావాలి?

పాల బుగ్గల రక్తం పిండి
పెంచుకొన్న వ్యాపారన్నీ
నవ్యత పేరున నాశనం చేసిన
భారతీయతనూ, బాల్య స్మృతులనూ
కనడానికెన్ని జీవితాలు కావాలి?

పేట్రేగిన రెసిడెన్షియల్ల మధ్య
నాశనమైన విద్యా వ్యవస్థనీ
వినాశనమైన విద్యార్థులనీ
విద్యపేరున హింసించే తల్లిదండ్రుల్నీ
ర్యాంకుల నడుమ నడిచే కళాశాలల్నీ
కనడానికెన్ని జీవితాలు కావాలి?


కలము మొనకు కత్తిని కట్టి
జరుగుతున్న నగ్న చరిత్రకు
తన తనువు రక్తానద్ది లిఖించిన
చెరగని రక్తాక్షరపు సాక్షాలవి.

40 కామెంట్‌లు:

  1. అన్నట్టు నా బ్లాగు కూడా గత సంవత్సరం ఈరోజే మొదలైంది.మర్చే పోయాను :(
    పనిలో పనిగా నాకు కూడా శుభాకాంక్షలు. [ నాకు నేనే :)]

    యాదృచ్చికమా లేక దైవసంకల్పమా?

    రిప్లయితొలగించండి
  2. హృదయ స్పందనల చిరుసవ్వడి ఎల్లప్పుడు మాకు వినిపిస్తూ ఉండాలని మనసారా కోరుకుంటూ....
    అమ్మఒడిపై కవిత అద్భుతం.

    రిప్లయితొలగించండి
  3. ప్రియమైన తమ్ముడు రామిరెడ్డి,

    మొత్తం నా బ్లాగుని చిన్నకవితలో చెప్పావు. ఇంతచక్కని నెనరుని మనసారా ఆస్వాదిస్తున్నాను. ౧౯౯౨లో నేనో సూక్తి చదివాను. ’రక్తసంబంధం కంటే భావసంబంధం గొప్పదని!’ ఇంతకంటే ఏం చెప్పను?

    నీబ్లాగుకి కూడా జన్మదిన శుభాకాంక్షలు. మనిద్దరి బ్లాగులు ఒకేరోజు ప్రారంభించబడటం ఖచ్చితంగా యాదృచ్చికం కాదు. దైవ సంకల్పమే!

    రిప్లయితొలగించండి
  4. పుట్టినరోజు శుభాకాంక్షలండి (మీకు కాదు మీ బ్లాగుకి).

    రిప్లయితొలగించండి
  5. బావుంది. మీ ఇద్దరికీ అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. మీ ఇరువురికీ మా శుభాభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. Congrats to both of you.. మళ్ళీ రేపొస్తాను..

    రిప్లయితొలగించండి
  8. పుట్టినరోజు శుభాకా౦క్షలు..మరి మాకు కేకు..చాక్లేట్లు లేవా???

    రిప్లయితొలగించండి
  9. హమ్మ్....మీ దగ్గర నేర్చుకోవలండీ తెలివితేటలు :)దైవ సంకల్పమే ! అందుకోండి అభినందనలు .
    ఈ రోజు స్పెషల్ పులిహోరేన :)

    రిప్లయితొలగించండి
  10. అమ్మ ఒడి, భాస్కర రామిరెడ్డి గారి బ్లాగులకు జన్మదిన శుభాకాంక్షలు.
    psmlakshmi
    4psmlakshmi.blogspot.com
    3psmlakshmi.blogspot.com

    రిప్లయితొలగించండి
  11. బ్లాగు పుట్టినరోజు శుభాకాంక్షలు.ఇహ నుంచైనా అప్పుడోటీ, అప్పుడోటీ టపాలు వచనంలో కూడా రావాలని కోరుకుంటూ శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  12. అమ్మ వొడి నాడే వుదయించిన భాస్కరా
    బ్లాగ్ జన్మ దిన శుభాఖంక్షలు అందుకో సోదరా

    రిప్లయితొలగించండి
  13. భాస్కర రామి రెడ్డి గారు ,
    మీ బ్లాగ్ కి , అమ్మవొడికి జన్మదిన శుభాకాంక్షలండి .

    రిప్లయితొలగించండి
  14. ముందుగా పరుల ఘనత చాటను తమను తాము మరిచిన మా భా.రా.రె. కి మన సాహితీబంధం బలపడటటానికి కారణమైన మీ "హృదయ స్పందనల చిరు సవ్వడి" మరువపు దళాల మంచి గంధపుమాల. మెప్పు కొరకు కాక నచ్చిన రచనలతో మీదైన భావగర్భిత పదునుతో సాగే మీరు, మున్ముందు కూడా మమ్మిలాగే అలరించాలని నా సురాశ [ఇది నా సృష్టి == మంచి కోరిక, దురాశకి కి వ్యతిరేకపదమూను...]

    ఇక అమ్మఒడి గారికీ అభినందనలు. అప్రతిహతంగా సాగాలి ఆ బ్లాగు.

    ఇరువురి బ్లాగులకూ ఆయుష్మాన్ భవ ...

    రిప్లయితొలగించండి
  15. @RK ధన్యవాదాలండి

    చిలమకూరు విజయమోహన్ గారు కవిత నచ్చినందుకు ధన్యవాదాలండి.బ్లాగ్జన్మ దిన శుభాకాంక్షలకు నెనరులు

    ఆదిలక్ష్మి అక్కయ్యా, మీ ప్రేమకు పాత్రుడనయినందుకు సంతోషం.
    ఆ ఒక్కమాట చాలు, ఇంకేం కావాలి.

    రిప్లయితొలగించండి
  16. సిరిసిరిమువ్వ,
    రవి ,
    జ్యోతి గారూ..

    మీ అభినందనలకు ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  17. వేదుల బాలకృష్ణమూర్తి గారూ మీ ఆశిస్సులే మాకు బలం.

    భావన రేపొస్తారా మర్చిపోరు కదా? :)

    సుభద్ర గారూ, మీరు వీరతాళ్ళు ఫ్రీగా స్పాన్సర్ చేస్తానన్నారు కదా.. అందుకే మీకు కేకు..చాక్లేట్లు లేవు మరి:)

    రిప్లయితొలగించండి
  18. చిన్నీ గారు అయినా మీకు నేర్పే తెలివితేటలు నావద్ద ఎక్కడివండీ. మీ అభినందనలు అందుకున్నాం.
    మీరలగలేదు కదా ఇంకా అందుకు నో పులిహోర :)

    లక్ష్మీ గారు ధన్యవాదాలండి

    సునీత గారూ, మీరన్నందుకైనా వచనం వ్రాయడం ప్రాక్టీస్ చేయాలి. ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  19. రవిగారూ అవును ఆ రోజే ఉదయించాను. సోదరుని నుంచి శుభాకాంక్షలు అందుకున్నాను.

    మాలా కుమార్ గారూ మీ ఆశిస్సులకు కృతజ్ఞుడను.

    ఉషా (గారూ?) ఓ సంవత్సర క్రితం ఎవరమెవరమో! కాలం విచిత్రం కదా? ఎన్ని మార్పులు? పేరుకూడా తెలియని దశ నుంచి " మా భారారే " దాకా ప్రయాణం. మీ సురాశ బాగానే వుంది కానీ నాకే సంవత్సరం బ్లాగాము కదా ఇక చాలు అనిపిస్తుంది. వ్యాఖ్యకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  20. భా.రా.రె. "మా .." అన్నది నిజమే కాలం తో వచ్చిన పరిణామం. ఇక సంభాషణ కాస్త ప్రక్కకి మళ్ళుతున్నా ..

    అది అంతర్మధనం కావచ్చు, సాలోచన కావచ్చు కానీ బ్లాగింగ్ కోసం వెచ్చిస్తున్న సమయం, మునుపటి మన జీవితంలోని ఏ భాగాన్ని విభజిస్తుంది, అందువలన ఏ పాళ్ళ సమతుల్యం తప్పింది అన్నది మాత్రం మీరు, నేను మనవంటివారం అంతా పునరాలోచించుకోవాలిసిన అంశమే. ఒక మంచి రోజున మరొక మంచి ఆలోచనకి పునాది వేసారు. థాంక్స్.

    రిప్లయితొలగించండి
  21. అమ్మ ఒడికి, మీ బ్లాగ్ కి కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు.....

    రిప్లయితొలగించండి
  22. నేనొచ్చేసా.. క్షమించాలి కూసంత ఆలస్యమైనందుకు కార్తీక సోమవారం అందునా పౌర్ణమి ఆపైన మబ్బుల మధ్యన మెరిపిస్తూ నిండు పున్నమి వెలుగులు మరి కూసంత ఆలస్యమయ్యిందంటే అవ్వదూ...

    కాని వెన్నెల ను ఆస్వాదించినా భాస్కరుడి గురించి రాయక పోతే అలగడూ.. అమ్మో.. అందుకే వచ్చేసా భా.రా.రే ని గూర్చి నా భావన ను అందరితో పంచుకోవటానికి

    నును లేత వెలుగుల మొదలయ్యిన మన భాస్కరుడు తెలుగు సాహిత్య రస గుళికలనందించి, లెక్కల మీద తన మక్కువ ను, తన వెలుగుల వేరొక భాగమయిన చంద్రమ్మ ను కలిపి చంద్ర యానం చేసి... తోటి మనుష్యుల మీద తన మమత ను ఆవేదన గా అందరి తో పంచుకుని, కూసంత వేడెక్కి తెలుగు వెలుగులను, ఆధ్యాత్మికత ను రంగరించి రామ కల్యాణం వినిపించి తిరుమలేశుని వేడుకుని లెక్క ల వడ గాలిని సిద్దం చేసుకుని విసురుతూ...
    అమ్మో ప్రచండ భాస్కరుడు వచ్చేడండోయ్...ఏండకాలాలను రచన లో ఇరికించి అందించి... అంతలోనే తన చల్లటి మమతా కెరటాలను అమ్మ ప్రేమ రూపం లో అందించి... వూసుఫొకల పిల్ల తెమ్మరెల ను వీపించి... ఆషాడాన పాపం తనకు పని లేక విసుగయ్యిందేమో విరహ పాటలను మధించి... రంగులు మారే లోకాలను ఆవిష్కరించి అన్నిటీని కలిపి కలువల హారాలల్లుతూ మల్లెల వయ్యారాన్ని, సంపెంగల సోయగాన్ని, మందారాల ముగ్ధత్వాన్ని, కంకాంబరాల చిలిపి తనాన్ని అన్నిటీని కలిపి కదంబాల హారాలల్లుతూ మనకు బహుమానమిస్తూ.... మమ్మందరిని మరిపించే, మెరిపించి పద్యాల పదాలలో నన్ను వెతుక్కోమని సవాలు విసిరే మన భాస్కరుడి పయనం మొదలయ్యి సవత్సరమయ్యింది అప్పుడే..
    ఈ సంధర్బం గా శుభాకాంక్షలు ఇంకా ఈ రవి తేజము ఎన్నో మంచి కవితా కిరణాలను రాజకీయపు చురుకులను. సరదా ల విసురుల తోరణాలను అన్ని మాకు అందించాలని కోరుకుంటున్నాను..
    కాని అదేమిటో ఒక సవత్సరానికే అలుపొచ్చిందంటే భాస్కరుని కి ఎలా అబ్బా..ప్రయాణం లో ఒక్కో సారి నడక వేగం గా సాగక పోవచ్చు అందమైన భాద్యతలు నడకని పక్క దారి పట్టించొచ్చు... కూసంత నెమ్మది చెయ్యొచ్చు కాని ఆపకూడదు కదా..

    రిప్లయితొలగించండి
  23. నిద్ద్రోతున్నా లొల్లిచేయద్దంటే...
    ఢంకా మోగించి మరీ లేపారుగా...

    స్వతంత్ర భారతిని నడిపే
    అస్వతంత్ర కీలుబొమ్మల్నీ
    కీలుబొమ్మల్ని నడిపే కణికులను
    కనడానికెన్ని జీవితాలు కావాలి?..... అని

    అందుకే చెబుతున్నా

    రాటు తేలినా, గీటుగీసినా
    అమ్మ ప్రేమ ఒక్కటే

    జనజీవనాలు ఎన్నయినా
    భరతమాత జీవితం ఒక్కటే,

    బిడ్డలు ఎందరున్నా
    పాలిచ్చే అమ్మఒడి ఒక్కటే

    జన్మదినములు ఎన్నొచ్చినా
    జన్మించిన మధురక్షణమొక్కటే.

    గ్రహములు ఎన్నున్నా
    స్వయంప్రకాశకుడు భాస్కరుడొక్కడే

    రిప్లయితొలగించండి
  24. కొత్తపాళి గారూ, మీ అభినందనలకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  25. ఊషా మా భారారే అన్నారు కాబట్టి చెబుతా వినుకోండి :) మొన్న ఈ పోష్ట్ వ్రాసిన తరువాత బుద్ధుడు కు జ్ఞానోదయమైనట్టు నా నెత్తిపైన ఓ వెలుగు వెలిగింది . ఆఫీసులో లైట్ ఏమో అని చేస్తే కాదే. సరే విషయానికి వస్తే, ఈ సంవత్సర కాలంలో ఎన్నో స్నేహాలు. జీవితానికి సరిపడా ఆనందం. ఇక కొంచెం ఈ వ్యాపకాన్ని తగ్గించుకొని మారిన ప్రయారిటీస్ ద్రుష్ట్యా కొద్దిగా దారిమార్చి వేరే రూపం ఎత్తాలని నిర్ణయం. ఏ సమపాళ్ళు దెబ్బతిన్నాయో లేక వెర్చువల్ వల్డ్ వెంట పరిగెత్తుతూ కంటి ముందున్న ప్రపంచానికి దూరమవుతున్నామా అనేది, మీరన్నట్టు ఎవరికి వారు నిర్ణయించుకోవలసింది. ఇక నా విషయానికి వస్తే అప్పుడప్పుడు తప్పకుండా హాయ్ చెప్తాను. అవి ప్రస్తుత సంగతులు, మరియు రాబోవు సంగతులు.

    రిప్లయితొలగించండి
  26. భావనగారూ , నిరీక్షణ ఫలించిందన్నమాట. ఎంత ఓపికగా అన్నీ చదివారండీ ! ఇందుకే మిమ్మల్ని అనేది.. మీరు కత్తి, బాకు అనేది :) సరదా విసుర్లు నా ఫీచర్, కాబట్టి బగ్ ను ఫిక్స్ చేసినట్టు చేద్దామన్నా కుదరని పని మరి. పద్యాలు చూస్తే వానాకాల చదువు పద్యాలు., ఇక కవితలూ అంటారా ఏదో ఉష అనే ఒక శాల్తీ :) వ్రాస్తుందని మనమూ రాస్తే పోలేదా అని మొదలెట్టినవి.

    సంవత్సరానికి నేనలసి పోతే జనాలంతా ఎలా బ్రతుకుతారండీ? ఉత్తరాయణం, దక్షిణాయనం లాగా ఆయనాన్ని మారుస్తున్నానంతే. ఇంకొంచెం తీక్షణగా వెలగాలని :) అయినా మీటపాలు చదువడం మరవనండోయ్.

    రిప్లయితొలగించండి
  27. వెన్నెలా లేచీ లేయడంతోటే ఈ చతుర్లు ఏంటండీ? ఎంత బాగా వ్రాసారు కవిత. అయితే ఇప్పటిదాకా నేను మీ ముందు కుప్పిగంతులు వేసానా :)?
    కవితకు ధన్యవాదాలు. కీపిటప్.

    రిప్లయితొలగించండి
  28. ఏంటి?సుభద్ర వీరతాళ్లు ఎప్పుడు? ఎందుకిస్తానంది? పులిహోర కలిపినందుకా?? అబ్బే!!ట్యాంక్ బండ్ నీళ్లలో వేలాడదీయడానికి తాళ్లు ఇస్తానంది.:)

    రిప్లయితొలగించండి
  29. కలము మొనకు కత్తిని కట్టి
    జరుగుతున్న నగ్న చరిత్రకు
    తన తనువు రక్తానద్ది లిఖించిన
    చెరగని రక్తాక్షరపు సాక్షాలవి.

    బాస్కర్ గారూ.. ఆదిలక్ష్మి ని గురించి ఎంత చక్కగా చెప్పారండి. మీకు మీరేసాటి. "తన తనువు రక్తానద్ది లిఖించిన"....... ఎవరికి గలదు అంత ధైర్యము.
    మీ కవితలన్నీ చదువుతాను.

    వెన్నెల గారూ, భాస్కర్ గారికి మీ కవిత చక్కగా సరిపోయింది.

    గ్రహములు ఎన్నున్నా
    స్వయంప్రకాశకుడు భాస్కరుడొక్కడే

    :-|

    రిప్లయితొలగించండి
  30. >> ఇక కవితలూ అంటారా ఏదో ఉష అనే ఒక శాల్తీ :) వ్రాస్తుందని మనమూ రాస్తే పోలేదా అని మొదలెట్టినవి

    This is way too cool, Bhaa.Raa.Re. ;)

    Bhavana,

    As per summarizing his works, you did a commendable job. Kudos to you both on such good exchange of comments.

    రిప్లయితొలగించండి
  31. టాంక్ యూ ఉషా. అంత బాగాఏమి రాయలేదు నాకు తెలుసు, బాగా టయర్డ్ గా వుంది ఆ రోజు నువ్వు ఎలా చేస్తావో నాకు తెలియదు కాని నాకు మాత్రం కొంచం నీరసం గానే వుంటుంది డే ఆఖరు అయ్యే సరికి ఒక్కో రోజు, నాకు ఒక్కడికే ...వాడికి డ్రైవర్ వుద్యోగం చేసి తిప్పే సరికి చావుకొస్తోంది, ఇద్దరు పిల్లలతో మీరందరు ఎలా బ్యాలన్స్ చేసుకుంటారో.

    రిప్లయితొలగించండి
  32. జ్యోతి గారూ, భలే చెప్పారే. నాకు ఎంత చించినా అర్థం కాలేదే. :)
    ఇంతకీ హైదరాబాదులో నీళ్ళకు కరువై టాంక్ బండ నీళ్ళుపోసి మాకందరికీ వడ్డించి, మీరు సపరేట్ గా వండుకొని తిన్నారా ఏమి?

    *****************

    విమలగారూ, నా బ్లాగుకు స్వాగతం. కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.
    >>గ్రహములు ఎన్నున్నా
    స్వయంప్రకాశకుడు భాస్కరుడొక్కడే

    ఏదో మీ అభిమానమండి.

    *****************

    ఉష, వున్నమాటంటే అంత చలి ఎందుకమ్మా? :)

    *****************

    భావన, ఎవరన్నా బాగలేదన్నారా? చెప్పండి.. కత్తితో పొడుస్తా :). నాకు నచ్చిందండీ..ఇంతకంటే ఎవరేమి వ్రాయగలరు. మీ అభిమానానికి మరోసారి కృతజ్ఞతలు.
    అందరికీ 24 గంటలే కదండీ. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోక తప్పదు. ఏం చేసినా ఈ 24 గంటలలోపే డాన్స్.
    బ్లాగు కావాలనుకుంటే నిద్రనో లేక ఆఫీసు పనినో లేక మన ఇంటిపనుల్లోనో లేదా మన మిత్రులతో సంబంధాలలోనో..ఎక్కడో ఒకచోట కొద్ది కోత తప్పదు కదా!

    రిప్లయితొలగించండి
  33. అభినందనలు .. శుభాకా౦క్షలు..bhaskar గారూ:)

    రిప్లయితొలగించండి
  34. భావన, అసలు కిటుకు "పెద్ద గీత,చిన్న గీత" గీసుకోవటంలోనే వుంది. ;)

    గాంధారిని గుర్తుచేసుకుంటే 'ఓస్ ఇద్దర్ని పెంచటం ఎంత పని అనిపిస్తుంది.' కాదా చెప్పు?

    ఇక నీరసమంటావా, అది మన నీడ వంటిది, కాసేపు మనకన్నా బారుగా, మరి కాసేపు మనలోకి కుంచించుపోతూను, కనుక దాన్తో కబడ్డీ అంతే!

    ఇక సీమపెద్ద అదే భా.రా.రె. అంత నొక్కి పలికాక 'కత్తితో పొడుస్తా' నని ఇంకెవరు నిన్నేమనగలరుట.... :) నిజంగా నాకు నచ్చింది.

    భా.రా.రె. బాగానే ముదిరారు, భాషని అనువదించే ప్రావీణ్యత కొట్టొచ్చినట్లు కనపడింది. ;)

    మీరన్నట్లే వున్న ఇరవై నాల్గు గంటలు అటూ ఇటూ పంచటం, త్రుంచటం. నిద్ర నాపుకుని, అడగక వచ్చే ఆలోచనలకి, తెచ్చిపెట్టుకున్న తలపులకీ సగం పోగా మిగిలింది ఇక్కడ ధారబోస్తూ, ఆ పై మీరన్న ఆ కోతలు విధిస్తూ.. చివరాఖరుకి 'నా అవసరం తీరిందనుకున్నవీ, నాకు అవసరం లేవనుకున్నవీ నిజం కాదనిపించి, నాకోసమే వ్రాసుకుంటున్నానా అన్న మీమాంసకి గురై ఇదిగో ఇంకా ఆ ఆలోచనలోనే ఇక్కడ ఈ వ్యాఖ్య. ' :) ఇప్పుడు హారంలోంచి జారే/రాలిపడే ముత్యమేదో మరిక... ?

    రిప్లయితొలగించండి

Comment Form