పాఠకులకు విన్నపము. ఈ టపా లో నిజమైన తెలంగాణా వాదులను నొప్పించే వుద్దేస్యం నాకు ఏమాత్రమూ లేదు. నిన్న చెప్పినట్టు ప్రత్యేక రాష్ట్రమైనా , లేక మూడు ముక్కలైనా నాకు ఆవేదన కానీ ఆనందం కానీ వుండవు. నిజం చెప్పాలంటే చాలా మందికి ఈ విభజన జరిగినా జరగక పోయినా తమ జీవితాలు ఏమాత్రం మారవు. కాబట్టి ఆ ఆలోచన మీ మనసులలో నుంచి తొలగించి ఒక చెత్త హాస్య టపా క్రింద లెక్క కట్టుకొని చదవాలని పిస్తే చదవండి.
భూనభోమండల ఏకచ్చత్ర మహారాజ్ఞి, అండ పిండ బ్రహ్మాండములను ఒక్క చూపున శాసించగల మహిళాధీమతీ మీ దివ్యసముఖమునకు ఈ దీన ఆంధ్రా యువకుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ వ్రాసుకున్న అర్జీ [ఛత్ ఇంకా నేను యువకుడినేంటి, పెళ్ళి కాకముందే తాతనైపోయాను :(]
మా తాతలది మైదుకూరు ( కడప జిల్లా ) అయినందువల్ల, మా నాన్నగారిదీ, నేను పుట్టినదీ, పెరిగినదీ, అక్షరాలు నేర్చినదీ ప్రకాశం జిల్లా అయినందువలననూ,కొండొకచో చించినది నెల్లూరు అయినందువలన,మళ్లీ తెగ చదివి దేశాన్ని ఉద్ధరిద్దామని చదివింది విశాఖపట్టణం,మద్రాసు,ఖరగ్పూర్ ( మిడ్నాపూర్ జిల్లా) అయినందు వలన వీటన్నింటిని అనగా కడప,ప్రకాశం, నెల్లూరు,విశాఖపట్టణం,మిడ్నాపూరు జిల్లాలనూ
మరియూ
ఇంకా మేడంగారు దయతలిస్తే ఈ క్రిందివి కూడా పరిశీలించ వలసినదిగా మనవి
బ్యాచ్లర్ లైఫును సంపూర్ణంగా రుచి చూపించినది బొంబాయి నగరమయినందువలన, ఇంకనూ అక్కడ జుహీచావ్లా ని చూడడానికని రోజూ జుహూబీచ్ లో మాటువేసిన నాకు తోడుగా నిలిచినది అరేబియా సముద్రము అయినందువలన
జీవితంలో అందరూ చేసే తప్పు పెళ్ళి చేసుకోవడం :) ఆ తప్పును నేనూ మనసారా చేసి గిద్ధలూరు కు అమ్ముడు పోవడం చేతనూ..ఈ ఊరు ఇంతకు పూర్వం కర్నూలు జిల్లాలో భాగముగా నున్న చేతనూ
డబ్బాల డబ్బాల సాఫ్ట్వేర్ విద్యార్థులను తయారుచేసే హైదరాబాదులో దివాను కూలీనై ఇంతకు ముందుచెప్పిన అనుభూతులనన్నింటిని వదులుకొనలేక పొట్టకోసం హైదరాబాదునే స్థిరనివాసంగా చేసుకొ్ని వుండటం చేతనూ చాలా అనారోగ్య అస్థవ్యస్థ స్థితిలో వున్నాను. ఈ నా మనో వ్యాధికి విరుగుడు మీరేనివ్వగలరు.
నాకు నా మనోభావాలను అన్నీ ఒకేదగ్గర కలిపి చూసుకోవాలని ఎప్పటినుంచో తీరని కోరిక. ఈ భారతావనిలో ఇన్ని మనో భావాలున్న వ్యక్తి మీకు మరొకరు కనిపించరు కనుక, మనో భావాలు లేని మిగిలిన వారు ఎలాగూ బాగానే వుంటారు కనుక, వారి చాడీల మాటలు పట్టించుకొనక ఈ దీన దయాళ ప్రభు చరణ దాసుని మనోభావాలను మన్నించమని మీ దివ్యచిత్తమునకు చిత్తగించడమైనది.
కావున ఇందు మూలముగా ఈ దీనుని ప్రార్థన ఏమిటంటే
కడప,కర్నూలు,నెల్లూరు,ఒంగోలు,విశాఖపట్టణం,మిడ్నాపూర్,బొంబాయి,హైదరాబాదు, అరేబియా సముద్రములను నాకు ధారాదత్తము చేయమని ఆ ప్రభువుల సాక్షిగా తెలుపుకుంటున్నాను. రాజభాషగా తెహింతబెం ను ప్రజలపై రుద్దగలను
తెహింతబెం ( తెలుగు-హిందీ-తమిళ్-బెంగాలీ ).
ఓ నుత్తమ రాణీ, తమకు దేశ దేశములందు గల పలుకుబడి ఈ పరిచారికునకు తెలియనిది కాదు. మీ పలుకుబడి నుపయోగించి అమెరికాను కూడా ఇప్పించగలరేమో చూడమనవి.
చివరిగా మరోమాట... ఎన్ని నెలలు కాపుకాసినా జుహూబీచ్ లో జుహీచావ్లా దర్శన భాగ్యము కలుగలేదు. కావున పైనున్న కుగ్రామములను ధారాదత్తము చేసి నన్ను సామంతరాజుగా నియమించు సమయాన ఈ జుహీరాణి ని కూడా సామంతరాణిని చేయగలరని ఆసతో ఆశిస్తూ
మరో సారి తమ పాద ధూళికి కూడా సరిపడని ఓ పాద దాసుడు
(ఆంధ్రా రాజకీయనాయకుడు)
ఇక ఈ క్రింది పద్యం తెలంగాణా యువతకు అంకితం. రాజకీయ మోసాలకు బలిగాకండి.
మండు గుండెల రాష్ట్ర మంతయు మూడు ముక్కల చీలినా
నిండు కుండిన నీదు కుండను నెవ్వ రైనను నింపునా
మండు టెండల ఎల్ల ప్రొద్దుల మంట బెట్టెడి బాలకా
నిండు పున్నమి నీదు జవ్వని నీట పాలును చేయకే
హి హి హి.. మీ విన్నపమును పరిశీలించి తగు నిర్ణయం అధిష్టాన వర్గమ్ అనగా భూనభోమండల ఏకచ్చత్ర మహారాజ్ఞి ఐన నేను నిర్ణయించి, రాష్ట్ర యువరాజు తో తెలియ చేస్తాము.
రిప్లయితొలగించండి"....ఇంకా మేడంగారు దయతలిస్తే ఈ క్రిందివి కూడా పరిశీలించ వలసినదిగా మనవి.."
రిప్లయితొలగించండిఈ వాక్యపు క్రింది వాక్యాలు రాసాకా మీకు ఇంట్లో భోజనం పెట్టబడిందా...? అని నాకు సందెహమ్ వచ్చేసినాది....:):)
నాయానా భాస్కరా.. మేము ఇప్పటికే కాకినాడ, మద్రాసు,ఖరగ్పూర్ నందు మా చేతిరుమాలులు పరిచితిమి. తెతబెంక మా రాజభాష.. ( తెలుగు తమిళు బెంగాలి కన్నడ)
రిప్లయితొలగించండిచూశారా, చూశారా మీ ఆంద్రోళ్ళ (ఇంతకీ వాళ్లెవరు అడగొద్దు, నాకయితే తెల్వ) బుద్ది పోగొట్టుకోలేదు, చివరాఖరకు "(ఆంధ్రా రాజకీయనాయకుడు)" అని సంతకం పెట్టారు కాని "హైదరాబాద్ రాజకీయనాయకుడు" అని సంతకం పెట్టారా?
రిప్లయితొలగించండితెలుగు-హిందీ-తమిళ్-బెంగాలీ అన్నారు కాని "హైదరాబాదీ" అని ఎక్కడయినా అన్నారా?
ఉండేదేమో హైదరాబాద్ లో సంతాకాలేమో ఆంధ్రా, తెలంగాణా, రాయలసీమ అనా?
అందుకే మా హైదరాబాద్ మాకు గావాలా
జై హైదరాబాద్ (ఓ వంద సార్లు టైపు కొట్టాను అని అనుకోండి, భాషా టైపులో, ఇంతకీ భాషా మా హైదరాబాదోడే మీకు తెలుసా!!)
ఏం పాపం చెన్నైని వదిలేసారు..ఏదయినా ధారాదత్తం చేస్తారు కాని భూనభోమండల ఏకచ్చత్ర మహారాజ్ఞి గారికి అదిమాత్రం వీలవదనా!
రిప్లయితొలగించండితృష్ణగారి అనుమానమే నాకూ వచ్చింది:)))అయినా ఆ మాజీ నాయికపై మీకంత ఇది ఏమిటండీ?
@కృష్ణ గారు :))
Hahaha!baagundi.
రిప్లయితొలగించండిఅహా! చిన్ననివేదనలో మీ జీవితసారమే చూపించేసారండి ....
రిప్లయితొలగించండిపట్టపురాణి గారేం అంటున్నారండి జూహురాణిగారి గురించి
ఆ ఒక్కటి అడగొద్దు అంటున్నారా !పులిహోర కలపడంలో బిజీగా వున్నారా -:)
:)
రిప్లయితొలగించండిఅటులనే భావన మహారాణీ :), మీ యువరాజా వారి పిలుపునకై ఎదురు చూస్తూ వుంటాను మరి.
రిప్లయితొలగించండిహ హ తృష్ణా గారూ :)మాఆవిడ అచ్చమైన రాయలసీమ బిడ్డ. కాబట్టి ఎన్ని తిట్టినా భోజనము కాడికొచ్చేటప్పటికి కరిగి పోతుందిలెండి :). అయినా మీరు కూడా సందెహమ్ "వచ్చేసినాది" అంటే నాకు కూడా ఏదో మీమీద ఏదో సందేహం వచ్చేసినాది :).ఏవూరు మంది?
మంచుపల్లకీ చేతిరుమాలులిక్కడ జాన్తానై. అమ్మను ప్రసన్నురాలిని చేసుకుంటేనే పని జరిగేది. అయినా మహారాణి కాబట్టి అర్జీలు పెట్టుకున్నాము గానీ లేకపోతే మీ రుమాలు ఇప్పటిదాకా వుండనిచ్చమా ఏంది? సరే మనిద్దరం భాయీ భాయీ ఐపోదాము.. నువ్వే వుంచుకో ఆ అరవపోడు, బెంగాల్ మాత్రం వదిలేదే లేదు.. :). కాకినాడ మాకొద్దు బాసూ, ఏమన్నా తగ్గితే గుంటూరు తీసేసుకుంటాము.
కృష్ణా యమా జోరుమీదొచ్చావు కదా :)అదేంటోనండి హైదరాబాదీ నని చెప్పుకుందామన్నా ఆంధ్ర(ప్రదేశ్)ముందు మనసులోకొచ్చి గానీ హైదరాబాద్ తరువాత రాదు. అలా అని మా భాగ్యనగరాన్ని మీ భాషా కిస్తామనుకోకండి :).కావలంటే నా చేతికి హైదరాబాద్ వచ్చినాక చార్మినార్, గోల్కొండ, ఫలక్ నామా, పహాడీ షరీఫ్ ఎవో ఇలాచిన్న చిన్న ముక్కలు కావాలంటే ఇప్పుడు నేను అర్జీపెట్టుకున్నట్టు అప్పుడు మీరు నాకు పెట్టుకోండి. ఆలోచిద్దాం. అంతేకానీ హన్నా, హైదరాబాదును గుత్తగా ఏలేద్దామనే ;)
రిప్లయితొలగించండిమునా గారూ బహుకాల దర్శనం సార్, మీ నవ్వుకు సంతోషం. ఇంతకీ ఇది వికటాట్టహాసమా ఏమి ? :)
సిరిసిరి మువ్వ గారూ, మీరేంటండి ఎప్పుడో కానీ ఘల్లు ఘల్లు మని అందెల చప్పుడు చేయరు? అమ్మో చెన్నై నడిగి పరిపాలించడం నా వల్ల ఎక్కడ అవుతుంది ? అయ్యోరామ మా జుహీ ఇప్పుడు మాజీ కానీ అప్పట్లో అంటే నేను చదువుకొనేరోజుల్లో ఎన్ని కలలు కన్నానో ;). ఆ జ్ఞాపకాలెక్కడికి పోతాయండి. తుదకు జుహీ వాళ్ళ ఇంటిప్రక్క ఫ్లాట్ బేరానికి కూడా వెళ్ళాను. జేబులో చిల్లిగవ్వ లేకుండా :-) అందుకే సామంతరాణి అయితే ఏంచక్కా బాగుంటుంది కదా.
రిప్లయితొలగించండిసునీత హమ్మయ్య , కోపంపోయి నవ్వేసారా.. అయితే సుభం.
చిన్నీ అందుకే మిమ్మల్ని తుంటరి అనేది. పట్టపురాణి పట్టపు రాణే. సామంత రాణి సామంతరాణే :). ఈ టపా పట్టపురాణి నిద్రపోయాక వ్రాసాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక ఎన్ని రకాల పులిహోరలు కలపాల్సి వస్తుందో ఏమో.. ఒక అవిడియా వచ్చింది. చెప్పనా !
రిప్లయితొలగించండి" చిన్ని అనే అమ్మాయి నా పేరు మీద ఈ టపా వ్రాసింది " అని చెప్పేస్తాను.
అప్పుడు మీరు మీరు చూసుకోండి. రాయలసీమ Vs గోదావరి :
@స్రావ్య ఈ నవ్వుకు అర్థం ఏమిటమ్మా? నీ సంగతి చెప్తా అని కాదు కదా ;)
మీరు ఖరఘ్పూర్ జైల్లొనే చదివారా.. బెంగాల్ ఎందుకు అడుగుతున్నారొ నాకు తెలుసులేండి.. రసగుల్లాలు కొసం.. రసగుల్లలాంటి అమ్మాయలకొసం .. హమ్మా ..మీ పట్టపురాణి కి చెప్పాల్సిందే..
రిప్లయితొలగించండిహి హి హి, మంచుపల్లకీ... అవునండి.. అదే జైల్లో చదివాను. మీరూ పోటివస్తున్నారంటే ఇద్దరమూ జైలు పక్షులమే అయితే :)
రిప్లయితొలగించండిఅవును కదూ, చెప్పడం కష్టమే రసగుల్లాలు, అమ్మాయిలు నువ్వా నేనా అన్నట్టు వుంటారు మరి :)
నాకో డౌటు భాస్కరా!!పెళ్లై ఏడేళ్లు దాటిందా? ఏంలేదు. అప్పుడే మొగుళ్లైన మగాళ్లకి అదేదో దిక్కుమాలిన ఈగ కుడుతుందట.అందుకే పట్టపురాణి సడిలేనివేళ సామంతరాణి కబుర్లు చెప్తున్నావు. పులిహోరలు కలపడంలో ఆరితేరినట్టున్నావు!!
రిప్లయితొలగించండిఅబ్బే జ్యోతక్కా తప్పులో కాలేసారు. ఈ కలాపోసన అనేది ఓ ఏడు సంవత్సరాల కోసారి వస్తే ఏ ఈగో కుట్టిందనుకోవచ్చు కానీ , నాకైతే మడిసన్నాక కూసింత కలాపోసన వుండాలన్నట్టు, సౌందర్యం ఎక్కడచూసినా తేనటీగ కుట్టేస్తుంది. అది అమ్మాయే కానక్కరలేదు. చెట్టు, పుట్ట, ఈ ప్రకృతితో సహా. :)
రిప్లయితొలగించండిఇక పులిహోరలేకుండా సంసారం ఏంబాగుంటుంది చెప్పండి? :)
ఆంధ్రావాడు బెంగాల్ లో తిరిగినంతమాత్రాన బెంగాలీవాడు అయిపోడులెండి. నేను ఒరిస్సాలో తిరిగాను కానీ నాకు ఒరియా రాదు. మా అమ్మగారు పుట్టినది ఒరిస్సాలోని గజపతి జిల్లా సియాలి గ్రామం, మా నాన్నగారు పుట్టినది ఆ రాష్ట్రంలోని రాయగడ జిల్లా పిపిలిగూడ గ్రామం. మా అమ్మగారి చిన్నప్పుడే వాళ్ళ నాన్నగారు ఆమెని శ్రీకాకుళం జిల్లాకి తీసుకువచ్చారు. మా నాన్నగారు పెళ్ళైన తరువాత ఆంధ్రాకి వచ్చి వరంగల్ జిల్లాలో బ్యాంక్ ఉద్యోగంలో చేరారు. నాకు వచ్చిన స్థానిక బాష తెలుగు, జాతీయ బాష హిందీ, అంతర్జాతీయ బాష ఇంగ్లిష్ మినహాయిస్తే నేను బహుబాషావేత్తని కాదులెండి. నేను ఎక్కువగా తెలుగు మాట్లాడుతుంటాను కాబట్టి నన్ను తెలుగువాడనే అంటారు. రాయగడలో మా అన్నయ్య ఒరియా, తెలుగు రెండూ మాట్లాడుతాడు ఇంటిలోనూ, బయటా. నిజమైన బైలింగ్యువల్ అంటే అతను. మా వదినకి మాత్రం తెలుగు రాదు. నేను మాట్లాడింది ఆమెకి అర్థం కాదు, ఆమె మాట్లాడింది నాకు అర్థం కాదు. మేమిద్దరం మాట్లాడుకోవలసి వస్తే మా అన్నయ్య దుబాషీగా వ్యవహరించాలి. నాది ఒక డౌట్. తమిళ నాడులో ఇంగ్లిష్ వచ్చినవాళ్ళు కూడా తక్కువే కదా. మీరు తమిళ నాడు వెళ్ళి ఉంటే ఎలా కమ్యూనికేట్ చేసేవారు? బెంగాల్ వాళ్ళకి హిందీ కూడా అర్థమవుతుంది కానీ తమిళ నాడులో మాత్రం అక్కడి జనానికి ఇంగ్లిష్ సరిగా రాదు, హిందీ అంత కంటే రాదు.
రిప్లయితొలగించండిప్రవీణ్ శర్మ నువ్వు వుండాల్సినోడివి బాసూ. మూడు భాషలు మాట్లాడతానని చెప్పి మళ్ళీ బహుభాషావేత్తని కాదంటావా? మరి మాసంగతేమి కావాలి? మాకు ఒక్క భాషకూడా సరిగా రాదే. మరి మేమెక్కడ వుండాలి ఇప్పుడు?
రిప్లయితొలగించండిఅయినా తమిళనాడు వెళితే ఏమొంది. నీలాంటోళ్ళు బోలెడు మంది వుంటారు కదా. అందుకని
ఇతు తాన్ బరిల్
ఎన్నకెళ్విగళ్?ఎన్క ఇరిన్త్ వాన్తె? కొరన్కు తంబీ.. పోదా!
అమ్మో! అమ్మో....ఏమిటీ
రిప్లయితొలగించండిఈ తేనెటీగలు కుట్టడాలు!
పులిహోర కలపడాలు:)
ప్రవీణ్ అన్నాయ్.. ఖర్గ్పూర్ లొ మన తెలుగు మంది చాలా వుంతారు.. అందులొ మాగ్జిమం అంతా శ్రీకాకుళం బ్యాచె . ఆ వూళ్ళొ మనకి బెంగాలి నేర్చుకునే అవసరం లేదు.. నువ్వయితే కుమ్మేసేవాడివనుకొ అది వేరే విషయం.. ఎమిటిమద్య బొత్తిగా నల్లపూస అయిపొయావ్..
రిప్లయితొలగించండిభా రా రే గారు ఎమిటండి ఆఖరులొ శర్మగారిని ఎదొ తమిళ్ లొ తిట్టినట్టువున్నారు :-)
ఒరిస్సాలోని రాయగడ, గుణుపురం, పరలాకిమిడి, బరంపురం పట్టణాలలో కూడా ఒరియా రాకపోయినా ఫర్వాలేదు. అక్కడ రిక్షావాళ్ళకి తెలుగు వచ్చు. మనం ఏ వీధికి వెళ్ళాలనుకున్నా తీసుకువెళ్తారు. బెంగళూరులో ఆటోవాళ్ళకి కూడా తెలుగు వచ్చు. అక్కడ కూడా ఏ వీధికి వెళ్ళాలనుకున్నా ఆటోవాళ్ళు తీసుకువెళ్తారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాలలోనే బాష రాకపోతే తిరగలేం.
రిప్లయితొలగించండిపద్మార్పితా ఇకనుంచి పులిహోర అంటే ఏమిటి అని నన్నడిగే వాళ్లందరికి మీరే కేరాఫ్ అడ్రస్. ఇక చూసుకోండి మీకు మైల్సే మైల్స్ :)
రిప్లయితొలగించండిఇక తేనె తియ్యగా వుంటుంది కాబట్టి తేనెటీగలచేత నేనే కుట్టించుకుంటాలే మరి :)
మంచుపల్లకీ గారూ, ప్రవీణ్ శర్మ గారికి ఇలా చెప్తే ఏటొత్తాది? :) ఏదో ప్రేమకొద్ది మా శర్మ గారికి ఓ రెండు మాటలు వ్రాశాను. ముప్పై రోజుల తమిళ భాషా పుస్తకం కొని అప్పుడు నాబ్లాగును తంబి బ్లాగుగా మర్చేస్తాడు చూడండి.
రిప్లయితొలగించండిప్రవీణ్, నీది ప్రశ్నా లేక వివరణా? నాకు అర్థం కాలేదు బహుశా మంచుపల్లకీ గారికి ఏదో చెప్తున్నట్టున్నారు :)
రిప్లయితొలగించండితమిళ నాడులో తెలుగురాని డ్రైవర్ తో మద్రాస్ నుంచి కన్యాకుమారి మీదుగా ఊటీ వరకు టాటా సుమోలో తిరిగాము. కోయంబతూర్ లో ట్రైన్ ఎక్కి శ్రీకాకుళం తిరిగి వచ్చాము. తమిళ డ్రైవర్ మాట్లాడింది ఒక్క ముక్క కూడా మాకు అర్థం కాలేదు. మద్రాస్ లో ఉండే వాళ్ళ బాస్ (ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్) చెప్పిన చోట్లకి మమ్మల్ని తీసుకువెళ్ళాడు. మీరు కూడా తమిళ నాడులో తిరిగి చూడండి. మీరు ఎడ్యుకేషన్ కోసం బెంగాల్ వెళ్ళారు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇంగ్లిష్ వచ్చినవాళ్ళు ఎలాగూ ఉంటారు కనుక అక్కడ బాష ప్రోబ్లం కాదు. ఇంగ్లిష్ రాని వాళ్ళు ఉన్న తమిళ నాడు, కేరళ రాష్ట్రాలలోని టూరిజం రిసార్ట్స్ అయిన పల్లెటూర్లకి వెళ్ళి చూడండి.
రిప్లయితొలగించండిభాస్కర్ గారు: మీ పోస్ట్ బాగా నవ్వించింది (:-. BTW, 3 సంవత్సరాల నుంచి తమిళ తంబిలతో ఉంటున్నా కాని, మీరు తెలుగులో వ్రాసిన తమిళ్ అర్థం కాలేదు ):-?
రిప్లయితొలగించండిప్రవీణ్ అన్నాయ్.. నీ మీదొట్టు.. నాకొక్క ముక్క అర్ధం కాలే..నువ్వు ఎమి చెప్పవొ.. ఎమి చెప్పాలనుకుంటున్నవొ..
రిప్లయితొలగించండిఆర్యా, మీ ఆర్జి బుట్ట దాఖలు చేయడమైనది. అమ్మగారు "ఉత్తమోత్తములు" అని నుతించబడినాక తమరు ఉత్తి "ఉత్తమ" అనడం మనోభావాలను దెబ్బతీసేదిగా వుండటం చేతను, యువతరాన్ని వదిలి ఇంకనూ జుహీచావ్లా వెంట పడటం వలన తమరికి ఆధునిక భావాలు లోపించాయన్న ఆరోపణ వచ్చిన కారణం గాను, మీరన్న ఆ బాష/సల్లో యేదియునూ రాజభాష కాజాలదు కనుక, భాషాప్రవీణులను ప్రంపంచయాత్ర చేయను పంపినాము.
రిప్లయితొలగించండిమీరు ఈసారి లేఖ తో పాటుగా ఏమి జతచేయవలెనో మీకు తంత్రి, టపాల ద్వారా త్వరలో తెలియచేయబడును.
ఉత్తమోత్తమ రాణీవారి పరిచారిక.
ప్రవీణ్, వ్యాఖ్యకు మరోసారి ధన్యవాదాలు.
రిప్లయితొలగించండివీరుభొట్ల గారూ ఇదో సరదా :) అయ్యో నాకు ౩ సంవత్స్రరాల తమిళ్ రాదండి. ఏదో చిన్న చిన్న మాటలు మాత్రమే :) ఇంతకీ వ్రాసిమ్ది కరక్టేనా సార్ :)
మంచుపల్లకీ గారూ ఏదో కొత్తగా విన్నట్టు అడుగుతున్నారేమండీ. మీ రిద్దరే చూసుకోండి ఇంక :)
రిప్లయితొలగించండిఉషా అలా అనిపించిందా రాణి గారికి ;)
అయ్యో ఎక్కడండీ నా అర్జీ మన్నించి ముక్కలు చేయడానికి సిద్ధమైతేనూ ;)
రాణి గారి వయసును దృష్టిలో పెట్టుకొని ఎదో జుహీ రాణి నుదహరించాం గానీ ఇలా యువ పరిచారిక చేతికి నా లేఖ చేరుతుదనుకుంటే కాజల్ అగర్వాల్ కి ఏమాత్రం తగ్గకుండా చూసుకొనేవాడిని కదా :)