6, డిసెంబర్ 2009, ఆదివారం

ఆంధ్ర Vs అమెరికా తెలంగాణా యువకుడు

ఈ మధ్య కవితలని గీకి గీకి తెగ బోర్ కొడుతుంది. ఇట్టా రాస్తుంటే జీవితంలో థ్రిల్ మిస్ అయిపోతున్న ఫీలింగ్ తెగ ఇబ్బంది పెట్టేస్తుంది. అదే గాక ఏబ్లాగు చూసినా కవితలే కవితలు. ఎప్పుడన్నా బొత్తిగా మైండ్ బ్లాంక్ అయితే కవితలు మళ్ళీ వ్రాసుకోవచ్చు గానీ, ఇలాంటి ఆనంద సమయాల్లో ... ఛత్.. కొట్టండి, చంపండి, నరకండి

ఎవడ్రా ఇక్కడ తెలంగాణా తల్లిని తెలుగు తల్లి అన్నది? మా ఏసీఆర్ అన్న అప్పుడేదో నోరుజారిండు కానీ అసలకది తెలంగాణా తండ్రి బొమ్మ. ఆంధ్రోడు కుట్ర చేసి తల్లిని జేసిండు. కాసుకోండి తరిమి తరిమి కొట్టకపోతే నేను తెలంగాణా బిడ్డనే కాదు.

అన్నా నువ్వు ఆంద్రోడివి కాదంటే ! ఆంధ్రప్రదేశ్ లో అందరూ ఆంద్రోల్లనే సదువుకున్నానే.

ఎవడ్రా ఆ సదువు చెప్పిన ఆంద్రోడు? అసలు నీకు రక్త తెలంగాణా చరిత్ర తెలుసా. తెలంగాణా వుద్యమ చరిత తెలుసా. వెనుకబాటు తనం తెలుసా.మాసిపోయిన మా బ్రతుకుల వెతలు తెలుసా.వెలిగి ఆరిన ఓరుగంటి చరిత తెలుసా. నిజాములు తెలుసా, రజాకారులు తెలుసా?

ఇయ్యన్నీ తెల్వదు గానన్న ఒక్కటి మాత్రం తెలుసే. రాజకీయాలు మనకు తెలిసినంత బాగా ఇంగెవ్వరికీ అంత తెల్వదన్న.

ఇవన్నీ జనాలకు తెలియచేయటం కోసం మా కార్యాచరణ ఇది

ఎటియం సెంటర్ల కొల్లగొట్టండ్రా.. ఎవడబ్బ సొమ్మని ఈ డబ్బాల్లో దాచుకున్నారు ఆంద్రోడు.
బస్సుల బంద్ చేయండ్రా ... నడిచిందంటే నలిపి పారేయండి
ఆంద్రోడు అని తెలిస్తే ... నరికి పారేయండి
ఆంధ్రా షాపులు కొల్లగొట్టి మంట పెట్టండిరా
అసలా పదం కనిపిస్తే మంటల్లో మసి చేయండి
చివరిగా తెలంగాణా ఎందుకు? అనే వాళ్ళకి గోరీ కట్టండి.
నేను చెప్పేదే వేదం. నా మాటే మంత్రం. నా బాటే రగతం.


అందుకని నే సెప్తున్నా...

అచ్చమైన తెలంగాణ బిడ్డనిరా
స్వచ్చమైన మనసున్న అన్ననురా

అట్టేగన్నా, అట్టనే చేద్దాం.. కానీ నామాటలు కూడా ఓసారి సూడే


మత్తకోకిల ||
ఎల్లలన్నియు రాజకీయపు ఎత్తులందున క్రుంగినా
ఎల్లప్రొద్దుల కాయకష్టము ఈతిబాధలనీదు నా
పిల్లపాపల రాతమార్చి సుభిక్షతెలుంగుతెలంగణా
తల్లిదాహము దీర్చునాయక తారలెవ్వరు తమ్ముడా!




తెలంగాణా యువకుడు ఆంధ్రాలో

కొట్టండి నాకొడుకుని మా తెలంగాణాకొచ్చి మానోటికాడ కూడు తీసి ఎంజాయ్ చేస్తుండు. నరకండ్రా...

అమెరికాలో తెలంగాణా యువకుడు

కొట్టండి నాకొడుకుని మా అమెరికాకొచ్చి మానోటికాడ కూడు తీసి ఎంజాయ్ చేస్తుండు. నరకండ్రా...

34 కామెంట్‌లు:

  1. నిన్నటినుంచీ వార్తలు చూడాలంటే భయం వేస్తున్నది. ఎందుకు జరుగుతుందో ఏమాశిస్తున్నారో మామూలు ప్రజలు దీనికి ఎంతవరకూ బాధ్యులో, వాళ్ళకి ఎందుకు ఈ శిక్షో అర్ధం కావడం లేదు.ఎటు తేలుతుందో? ఏమిటో? ఆఖరి వాక్యం ...

    రిప్లయితొలగించండి
  2. సునీత గారూ, ఆఖరి వాక్యంలో బూతున్నదని చెప్పదలచుకున్నారా? లేక ఆఖరి వాక్యం అర్థం కాలేదా? బూతు వున్నదనిపిస్తే, ఇదేమీ పెద్ద బూతుమాట కాదులేండి. ఓ సారి గుంపులో ఎలాంటి తిట్లు వినిపిస్తాయో గుర్తు తెచ్చుకోండి.

    రిప్లయితొలగించండి
  3. కవితలు ఆపేసి ఖడ్గం పట్టారా .భా.రా.రె
    పదండి ముందుకు ..కదం తొక్కుతూ ..
    మీ వెనుకే మేము ....జై ఆంద్ర అందామా ?...లేక :)..

    రిప్లయితొలగించండి
  4. చిన్నీ.. నాకు మొన్నమొన్నటిదాకా ఆంధ్ర వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు అని తెలియలేదు. అసలు తెలంగాణా,రాయలసీమ,కోస్తాలు అన్నీ ఆంధ్ర గానే చదువుకున్నాను. హైదరాబాదు వచ్చిన కొత్తల్లో కూడా ఎవరైనా మీరు ఆంధ్రవాళ్ళా అని అడిగితే ఇదేంటబ్బా వీళ్ళది ఆంధ్రకాదా అని ఎంతగా తికమక పడిపోయోవాడినో..

    ఇక జై ఆంధ్రానా లేక జై ఆంధ్రప్రదేశ్ లేక జై తెలంగాణా అని అన్నా నాకు పెద్దగా నష్టమూ లేదు,లాభమూ లేదు. కాకపోతే చదువుకునే అమాయక విద్యార్థులు స్వతహాగా వుండే ఉడుకురక్తాన్ని రాజకీయనాయకులు ఎలా వాడుకుంటున్నారో చూస్తుంటే బాధవేస్తుంది.

    రిప్లయితొలగించండి
  5. హ ఇప్పుడు వాళ్ళు నాశనం చేస్తున్నది తెలంగాణానే అది వాళ్లకి తెలియడం లేదు పాపం....

    ఆ ప్రాంతానికి అన్యాయం జరిగిందంటే అది కొంత నిజమే కావచ్చు కాని ఆ అన్యాయం చేసిన వాళ్ళలో ఎక్కువ మంది తెలగాణ వాళ్ళే ఉన్నారు....
    అయినా ఆంద్ర వాల్లెప్పుడు తెలంగాణ అనే ఒక ప్రతేఎకప్రాంతముంది అనుకోలేదు
    తెలంగాణ వాళ్ళే అలా వాళ్ళని వాళ్ళు ఆంద్ర నుంచి వేరుచేసుకున్నారు...

    www.tholiadugu.blogspot.com

    రిప్లయితొలగించండి
  6. భా.రా.రె.ఎందుకంత కోపం గా అన్నారు? భాస్కర్ గారి పోస్ట్ చదివాను. మీ పోస్ట్ చదివాను.ఇక్కడా టెన్షను గా నే ఉన్నది.నా వాఖ్య తో ఎలాంటి కాంట్రవర్సీ వద్దని అలా వదిలేసాను. నిజమే గదా!ఇక్కడ తెలంగాణా అన్నట్లే అక్కడ అమెరికా వాళ్ళు అంటున్నారు. అంతే!

    రిప్లయితొలగించండి
  7. కార్తీక్ నిజమేకదా, మంచిమాట చెప్పరు. ఈ జనాలు ఈ పిచ్చిఆవేశంలో ఏంచేస్తున్నారో కూడా తెలియకుండా వుంది.

    సునీత గారు కోపమెందుకండీ.:) స్మైలీస్ మర్చిపోయాను. పైన వ్యాఖ్యాతలందరూ కూడా ఓ స్మైలీ వేసుకోండి.

    రిప్లయితొలగించండి
  8. నాకు మొన్నమొన్నటిదాకా ఆంధ్ర వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు అని తెలియలేదు. అసలు తెలంగాణా,రాయలసీమ,కోస్తాలు అన్నీ ఆంధ్ర గానే చదువుకున్నాను. హైదరాబాదు వచ్చిన కొత్తల్లో కూడా ఎవరైనా మీరు ఆంధ్రవాళ్ళా అని అడిగితే ఇదేంటబ్బా వీళ్ళది ఆంధ్రకాదా అని ఎంతగా తికమక పడిపోయోవాడినో..

    ఇక జై ఆంధ్రానా లేక జై ఆంధ్రప్రదేశ్ లేక జై తెలంగాణా అని అన్నా నాకు పెద్దగా నష్టమూ లేదు,లాభమూ లేదు. కాకపోతే చదువుకునే అమాయక విద్యార్థులు స్వతహాగా వుండే ఉడుకురక్తాన్ని రాజకీయనాయకులు ఎలా వాడుకుంటున్నారో చూస్తుంటే బాధవేస్తుంది.....This what exactly I feel!

    రిప్లయితొలగించండి
  9. కదుపునిండిన వాళ్ల్లకు అర్ధంకాదు తెలంగాణ వాళ్ల కడుపు మంట.

    రిప్లయితొలగించండి
  10. తెలంగాణా విడిపోతే కోస్తా ఆంధ్రవాళ్ళకి లాభమే. హైదరాబాద్ అభివృద్ధికే ఎక్కువ ఖర్చు పెట్టి కోస్తా ఆంధ్ర అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారు. కొన్నేళ్ళ క్రితం విజయనగరం పట్టణంలో ప్రధాన రోడ్లు కూడా ఇరుకుగా ఉండేవి. రైల్వే జంక్షన్ అయిన ఒక పట్టణంలో కూడా రోడ్లు ఇలా ఉంటే పల్లెటూర్ల రోడ్లు ఎలా ఉంటాయో. సిటీలలో ఉంటే చిన్న పట్టణాలూ, పల్లెటూర్ల జీవితాలు ఎలా అర్థమవుతాయి?

    రిప్లయితొలగించండి
  11. పద్మార్పితా, అవును. నిజంగా నిజం అది. హైదరాబాదుకు వచ్చిన కొత్తల్లో నేను లోతుకుంటలో వుండేవాడిని.అప్పటి అనుభవం అది. తిరిగి అడిగాను కూడా పిచ్చోడిని చూసినట్టు చూసినా వివరంగా చెప్పారు. ఎంతో మంచి స్నేహితులు కూడా. ఇప్పుడు నన్ను ఆంధ్రా వాడని వాళ్ళు సడన్ గా కక్ష పెంచేసుకుంటారా? :) ఏమిటో ఈ అమాయక ప్రజలు/విద్యార్థులు ఎలా పావులుగా మారుతున్నారో.

    రిప్లయితొలగించండి
  12. సమతలం గారూ నాకు తెలంగాణా కడుపుమంట తెలియదు కానీ ఇప్పుడు మనం చేస్తున్న దాని ద్వారా ఎవరికి నష్టం ఎవరికి లాభం. అన్నింటిని కాలబెట్టి అంతా సవ్యంగా జరిగి తెలంగాణా గా విడిపోతే సమస్య పరిష్కారమవుతుందని భావిద్దామా చెప్పండి? నాకైతే ఇది మన భవిష్యత్తుకోసం పాటు పడటం కంటే అన్న ఏసిఆర్ లేదా రాజకీయనాయకుల భవిష్యత్తు కోసం మన శాయశక్తులా కృషి చేస్తున్నట్టనిపిస్తుంది. అందుకే చూడండి ఒకే రాష్ట్రంలో నున్న మన మధ్యే ఇన్ని విభేధాలతో కొట్టుకు చస్తుంటే ఇక వేరే దేశంకాని దేశానికి వచ్చి వాళ్ళ వుద్యోగావకాసాలను దెబ్బకొడుతుంటే ఇక్కడ అమెరికా లో వీళ్ళకు ఎంత మండాలి? కానీ ఇక్కడ మనకు మాత్రం మన ప్రతిభను గుర్తించో లేక వీళ్ళకు అవసరం వుంది కాభట్టి అనో సరిపెట్టుకుంటాము కానీ వీళ్ళ కడుపుమంట కానరాదు. లోకరీతి ఇలాగే వుంటుంది :)

    రిప్లయితొలగించండి
  13. ప్రవీణ్ శర్మ అవును. హైదరాబాద్ అభివృద్ధికే ఎక్కువ ఖర్చు పెట్తున్నాము కారణం రాజధాని కాబట్టి. ఇది అభివృద్ధి చెందింది కాబట్టి ప్రభుత్వానికి ఈ నగరం నుంచి వచ్చే ఆదాయం కూడా చాలా చాలా ఎక్కువ. గమనించండి. కారణం ఇక్కడ జరిగే బిజినస్ అది.

    కోస్తాలో, రాయలసీమలో కూడా కరువు ప్రాంతాలు, అభివృద్ధి చెందని ప్రాంతాలు బోలెడు.రోడ్లే కాదు, కరెంట్, స్కూల్స్, మంచినీటి సౌకర్యం,ఆరోగ్య సదుపాయం లేని ఊళ్ళు నాకు బోలేడు తెలుసు. మా ఊరు అందుకు ఒక ఉదాహరణ.

    అంతా బాగానే వుంది కానీ మీ మార్క్ పోనిచ్చుకున్నారు కాదు
    >>సిటీలలో ఉంటే చిన్న పట్టణాలూ, పల్లెటూర్ల జీవితాలు ఎలా అర్థమవుతాయి?
    :-)

    రిప్లయితొలగించండి
  14. గ్లోబలైజేషన్ కాలంలో స్వదేశీ పరిశ్రమలని నిర్లక్ష్యం చేసి ఐ.టి. కంపెనీలకి గేట్లు తెరవడం వల్లే కదా హైదరాబాద్ ఆదాయం అంత ఎక్కువ అయ్యింది. విజయనగరం పట్టణంలోనూ, ఆ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో కూడా జనుప మిల్లులు (jute mills) లాంటి పరిశ్రమలు ఉన్నాయి. మన రాష్ట్రంలో జనుప నార ఎక్కువగా ఉత్పత్తి అయ్యేది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలోనే. ఏలూరు, గుంటూరు జనుప మిల్లులకి కూడా నార ఈ జిల్లాల నుంచే ఎగుమతి అవుతుంది. వనరులు ఉన్నా అభివృద్ధి చెయ్యకపోవడం పాలక వర్గం వాళ్ళ తప్పు కాదా?

    రిప్లయితొలగించండి
  15. ఈ ఉద్యమానికి గల కారణాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. అసలైన ట్విస్టు ఏమిటంటే, గాలి దుమారాన్ని మళ్ళించడానికి, సీ.ఎం. సీటుకోసం రోశయ్యను ఇరుకున పెట్టడానికి జగన్ ఆడిస్తున్న జగన్నాటకం. గొడవల్లో పాల్గొనే వాళ్ళల్లో ఎక్కువమంది రాయలసీమ యువకులు. అందుకే కేవలం ఆంధ్రావాళ్ళ ఆస్తులమీదే దాడులు జరుగుతున్నాయి.

    ఈ నాటకానికి సంబంధించి కే.సి.ఆర్.కు 100 కోట్లు ముట్టాయని అనధికారిక సమాచారం.

    చూస్తూనే ఉండండి, త్వరలో అసలైన ట్విస్టు కోసం "జగన్నాటకం".

    రిప్లయితొలగించండి
  16. ప్రవీణ్ ఆ పలక వర్గాలను ఎన్నుకొనేది మనమే. నేనొక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను పుట్టిన ఊరిలో బ్రతకలేక ఆ వూళ్లో చాలా మంది గుంటూరు జిల్లాకు వలస వచ్చి ఓ కొత్త ఊరు కట్టుకున్నారు. అందరూ కడుపు చేతపట్టుకొని వచ్చినోళ్ళే కాబట్టి అప్పటికింకా ఊరి కట్టుబాటు బాగుండేది. అందరూ ఒకే తాటిపై ఉండి ఎన్నికలు జరిగేటప్పుడు వచ్చిన ప్రజా ప్రతినిధి ద్వారా ముందుగానే తమ ఊరికి కావలసిన సదుపాయాన్ని సమకూరిస్తే గాని ఓట్లు వేసే వాళ్ళు కాదు. అలా కొన్ని పనులు చేపించు కొన్నారు. ఇప్పుడు అది లేదులేండి.అంతా మామూలైపోయింది.

    గ్లోబలైజేషన్ కు నేను వ్యతిరేకిని కాదు. అలా అని కుటీర పరిశ్రమలకూ వ్యతిరేకిని కాదు. దేని మెరిట్స్/ డిమెరిట్స్ దానికున్నాయి. వనరులు వున్నా అభివృద్ధి చేయకపోవడం పాలక వర్గాల తప్పు అనడం కంటే మనచేతకాని తనమేమో.


    అఙ్ఞాత , నిజమో అబద్ధమో నాకు తెలియదు కానీ అదే నేను చెప్తున్నది. రాజకీయ నాయకులకు పావులుగా మారే ముందు ఎవరి వున్నతికి పాల్పడుతున్నామో ఆలోచించలేని దుస్థితిలో వున్నాము.మీరు చెప్పింది కూడా బాగానే వుంది. మూడు రాష్ట్రాలకు అప్పుడు విడివిడిగా మూడు సి.ఎమ్ పోష్టులు, బోలెడు మినిస్టర్ ఖాళీలూ..

    రిప్లయితొలగించండి
  17. నాకు ఈ రంగం గురించి ఆసక్తి, అవగాహన లేదు. ఒక సామాన్యమనిషి తరహా జీవితం గడిపినదాన్ని.

    నేను హైదరబాదులో ఒక సం. అద్దెకు వున్న ఇంటి యజమాని మునెమ్మ గారికి ఐదుగురు ఆడపిల్లలు. నన్ను స్వంత కూతురిలా చూసుకున్నారు. అలాగే అక్కడే దాదాపు యాభై సం. వున్న మా పెద్దమ్మ గారికి వున్న ఏ స్నేహితులూ ఇలా విడదీసి మాట్లాడలేదు. పల్లెపట్టు వారినీ కలిసాము కొన్నిసార్లు. కనుక పదిహేనేళ్ళ క్రితం ఇంత భేధభావాలు లేవు. ఇది నా పరిధి మాత్రమే.


    >> ఈ మధ్య కవితలని గీకి గీకి తెగ బోర్ కొడుతుంది.

    భా.రా.రె. మరదే ఒక వర్గాన్ని రెచ్చగొట్టటమంటే. ఏం, కాస్త ఆంధ్రమాత సేవ చేసుకుని వస్తాను. తెలుగుతెల్లిని సేద తీర్చి వస్తాను అనలేరు? :)

    "కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి వద్దంటే పోదండి ప్రేమ" నాకు కవితల పట్ల. కనుక మీ "కొట్టండి, చంపండి, నరకండి" మీ టపాకే సుమీ!

    రిప్లయితొలగించండి
  18. 1975లో జళగం వెంగళరావు శ్రీకాకుళం జిల్లాలో మధ్య తరగతి పారిశ్రామికవేత్తలకి లోన్లూ, భూములూ ఇప్పించాడు. ఆముదాలవలస, ఎచ్చెర్ల, రణస్థలం మండలాలలో కొత్త ఫాక్టరీలు వచ్చాయి. 1990 తరువాత చాలా ఫాక్టరీలు మూతపడి ఇప్పుడు శిథిలాలు కూడా అయిపోయాయి. గ్లోబలైజేషన్ కాలంలో కార్పరేట్ ఫాక్టరీలకి ఎక్కువ క్రెడిట్ ఇవ్వడం జరుగుతుంది కానీ చిన్న ఫాక్టరీలకి కాదు.

    జగన్ కుట్ర మాట కూడా నిజమే. http://stalin-mao.net/?p=229 మధ్యాహ్నం టి.వి. వార్తలలోనే జగన్, సబిత, వీరప్ప మొయిలీల కుట్ర బయటపడింది. కోస్తా ఆంధ్రవాళ్ళ ఆస్తులు ద్వంసం చేస్తున్నది తెలంగాణా వాళ్ళు అంటే నేను కూడా నమ్మను.

    రిప్లయితొలగించండి
  19. పనిమీద బయటకు వెళ్తున్నా వచ్చి అందరికీ రిప్లై ఇస్తాను.
    ప్రవీణ్ నా బ్లాగు మీ మీద వదిలేసి వెళ్తున్నా . నువ్వుండగా నాకేఇబ్బందీ రాదు. :-)

    రిప్లయితొలగించండి
  20. హిహి హీ..హ హా హా హోహో హో...ఉషా ( అంటే రకరకాలగా నవ్వానన్న మాట ) ఒక్కదెబ్బతో కవి/కవయిత్రి వర్గానికి బద్ధ విరోధినైపోయాను. ఇంతకు అందరూ కలిసొచ్చి కొట్టండి, చంపండి, నరకండి అని దాడిచేస్తారా ఏమి ;)
    "కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి వద్దంటే పోదండి ప్రేమ" అందుకే పాతవాసనలు పోక పైనున్న టపాలో కూడా ఓ రెండులైన్ల కవిత ఓ పద్యము వ్రాసుకున్నా కదా :)

    రిప్లయితొలగించండి
  21. ప్రవీణ్ శర్మ, గ్లోబలైజేషన్/కుటీరపరిశ్రమల టపా కాదు కాబట్టి ఇక్కడ అవి అప్రస్తుతం. ఇక టి.వి. న్యూస్ ల నిజానిజాలు పెరుమాళ్ళకెరుక :)

    రిప్లయితొలగించండి
  22. తెలంగాణా గురిన్చి ఏమో నాకెరుక లేదు కాని
    "అమెరికాలో తెలంగాణా యువకుడు
    కొట్టండి నాకొడుకుని మా అమెరికాకొచ్చి మానోటికాడ కూడు తీసి ఎంజాయ్ చేస్తుండు. నరకండ్రా..."
    హి హి హి ఇది సూపర్. కొంచం అటు ఇటు గా ఇక్కడ తెల్లాళ్ళది కూడా మన మీద అదే ఫీలింగ్ ఏమో..

    రిప్లయితొలగించండి
  23. హా నేను కామెంటి తే కనపడటం లేదు, నీ కామెంట్ అచ్చయ్యింది పో అని మాత్రమ్ చెప్పింది బ్లాగ్. హా ఇది ఆంధ్రా వాళ్ళ కుట్ర నా కామెంట్ ఇన్కో నిమిషం లో కనపడక పోతే నేను హర్తాళ్ చేస్తా..

    రిప్లయితొలగించండి
  24. తెలంగాణా వాళ్ళు కోస్తా ఆంధ్ర వాళ్ళ ఆస్తులు ద్వంసం చేస్తారంటే నేను నమ్మను. కె.సి.ఆర్. పూర్వికులు కూడా కోస్తా ఆంధ్ర నుంచి వలస వచ్చిన వాళ్ళే. విజయనగరం రాజులకీ, బొబ్బిలి వెలమ రాజులకీ యుద్ధం జరిగిన తరువాత బొబ్బిలి రాజుల దగ్గర పని చేసిన సైనికులు తెలంగాణాకి వలస వెళ్ళిపోయారు. ఆ సైనికులు కూడా వెలమ దొర కులానికి చెందినవాళ్ళే. వాళ్ళు కలువల, కలువకుంట్ల, ముప్పాళ్ళ లాంటి ఇంటి పేర్లు ఉన్నవాళ్ళు. కె.సి.ఆర్. ఇంటి పేరు కలువకుంట్ల కావడానికి కారణం ఇదే. కె.సి.ఆర్. కులస్తులు శ్రీకాకుళం జిల్లా సోపేరు గ్రామంలో కూడా కనిపించడానికి కారణం ఇదే. తన పూర్వికులు కోస్తా ఆంధ్ర నుంచి వచ్చారని కె.సి.ఆర్. కూడా ఒప్పుకున్నాడు. కె.సి.ఆర్. ఎన్నడూ తన కార్యకర్తలకి కోస్తా ఆంధ్ర వాళ్ళ ఆస్తులు ద్వంసం చెయ్యమని చెప్పడు. చెపితే కె.సి.ఆర్. ఆస్తులు కూడా తగలబడిపోతాయి.

    రిప్లయితొలగించండి
  25. ప్రవీణ్ భలే లాజిక్కులు తీస్తావు గురూ నువ్వు. కేసిఆర్ అట్టా జెప్పిండా..మరయితే ఈ దాడులు ఎవరు చేపిస్తున్నారు. ప్రవీణ్ శర్మగారా? :)

    రిప్లయితొలగించండి
  26. భావనా గట్టిగా నవ్వుతూ మెచ్చుకోకండి, మా బాస్ గాని విన్నాడంటే ఇంతే సంగతులు. :)

    రిప్లయితొలగించండి
  27. స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ సినిమాలో హోమ్ మంత్రి ముఖ్య మంత్రిని కుర్చీ నుంచి కిందకి దింపడానికి వీర దాస్ ముఠా సహాయంతో మత ఘర్షణలు రగిల్చడానికి ప్లాన్ వేస్తాడు. ఇక్కడ జగన్ నిజజీవితంలో చేస్తున్న పని కూడా సినిమాటిక్ స్టైల్ లో ఉంది.

    రిప్లయితొలగించండి
  28. ప్రవీణ్ బొత్తిగా లోక జ్ఞానం లేదోయ్.. సి.యమ్ ను కుర్చీ దింపటానికి ఇన్ని దొమ్మీలు చేయాలా? అది సినిమా బాసూ, ఇది నిజ జీవితం.దొమ్మీలు చేపిస్తే సి.యమ్ పదవి రాదు. ఇంతకంటే వివరణ ఇవ్వలేను.

    రిప్లయితొలగించండి
  29. జగన్ కి సినిమాకీ, నిజజీవితానికీ ఉన్న తేడా తెలియదు. అతను యంగ్ పొలిటిషియన్ కదా. రోశయ్య లాంటి సీనియర్ నాయకుడు దొమ్మీలు చేసేవాళ్ళ కోసం ముఖ్య మంత్రి పదవికి రాజీనామా చేస్తాడంటే నా కంటే పది పదిహేనేళ్ళు చిన్నవాడు కూడా నమ్మడు. నా వయసు 26 ఏళ్ళు.

    రిప్లయితొలగించండి
  30. ప్రవీణూ
    >>జగన్ కి సినిమాకీ, నిజజీవితానికీ ఉన్న తేడా తెలియదు. అతను యంగ్ పొలిటిషియన్ కద

    రాజకీయ పరిజ్ఞానం సూన్యమైన మనకే ఇంత పరిజ్ఞానముంటే రాజారెడ్డి పెంపకంలో పెరిగి రాజశేఖర రెడ్డి అనుభావాలను చూసి అసలైన అమాత్యులు ప్రక్కనుండగా ఇంక జగన్ దగ్గర ఎన్ని తెలివితేటలుండాలి?

    రిప్లయితొలగించండి
  31. I studied BA (Political Science, Public Administration & Sociology) in Andhra University. I am not zero knowledged in politics but I don't think that Jagan has enough political knowledge. If so, why did he think that Sonia would give him chief ministership without political experience?

    రిప్లయితొలగించండి
  32. తెలంగాణ ఉద్యమం ఎసియార్ కొరకని మీరంటె, సమైక్యాంధ్ర లగడపాటి, కావూరి.........లాంటి ఇండస్ట్రియలిస్టులు కం దళారి రాజకీయ నాయకుల కొరకు, రామొజి, రామలింగరాజు,_____________ లాంటి బ్రోకర్ల విశాల సామ్రాజ్యం కొరకు కావాలంటాము.
    సరిహద్దుల అవసరం(జిల్లాలు కావచ్చు, రాష్ట్రాలు కావచ్చు, దేశాలు కావచ్చు) ఉంటుంది కొన్ని రకాల రక్షనకు. ఆంధ్రవాళ్లతొ ఏ రంగంలోను తెలంగాణవాళ్లు పోటి పడలేరు. సరిహద్దుల లోపల లెవల్ ప్లే గ్రౌండ్ ఉండాలి. అంధ్ర ప్రదెశ్ లో ఇది లేదు. ఆంధ్ర వాళ్లు ఒక మెట్టు(ఒక జనరేషన్) ముందు ఉన్నారు.
    అంతె తప్ప అంధ్ర ఆంటె ద్వేషం తెలంగాణ వారికి లేదు. కేసియార్ కాని, ఇంకొకరు కాని విద్వేషం రెచ్చగొట్టటం లేదు.
    మేము మీతో పోటి పడలేము. మీతోవుంటె మా అస్తులు కబ్జా అయితాయి. ఇది సహజం.అందుకే వేరుపడదాం అంటున్నారు. సమతలం

    సమతలం

    రిప్లయితొలగించండి
  33. సమతలం గారు, పాలక వర్గం వాళ్ళు నిజాంని పొగుడుతుంటే చెవులున్న చెవిటివాళ్ళలా ఏమీ పట్టించుకోనివాళ్ళు హిందూ భక్తుల్లా ఎలా పోస్ కొడుతున్నారో చూడండి http://chaduvari.blogspot.com/2009/12/blog-post_07.html

    రిప్లయితొలగించండి
  34. Ayya!

    Sadaru Telangana(???) pranthaniki anyaayam jaruguthunte, aa prantha nayakulem chesthunnaru???
    Oka example: Secunderabad, West Marredpally loni Busi Reddy Gudalo vunna Contonment Board Member, P. Venkat Rao dabbulu theasukoni, oka hostel kosam road madhyalo bore vesukune facilty ichchaadu. Idi enti ani okka telangaanaa vaadu adagaledu. ade nenu andhra nunchi vochchi job chesukuntunte adi anyaayam anta.

    P.S.: Sadaru Venkat Rao ki iddaru bharyalu, naluguru pillalu. Kaanee andhra vaalla kaallakinda padi(??????) baadalu paduthunna okka telanganaaa gadidadaki kooda adi kanipinchadu. Ippudu mallee oka Jai Telangaanaa Vesukundaaamaa.....

    రిప్లయితొలగించండి

Comment Form