31, డిసెంబర్ 2009, గురువారం

న్యూ ఇయర్ స్వాగతాంజలికి ముందు.

ముందుగా బ్లాగ్ బాంధవులకు హ్యా పీ న్యూ ఇయర్


మరో నూతన దశాబ్దానికి స్వాగతం. సుస్వాగతం. గతించిన కాలం. కాలంలో మొలచిన జ్ఙాపకాలు మనసు పొరల్లో నిక్షిప్తమైనవి ఇంకిపోగా మిగిలినవి గాలి కొదిలేసి మరో నవ దశాబ్దికి స్వాగత తోరణాల అలంకారలతో 2010 కి సుస్వాగతం.

సంవత్స్రరం పాటూ మనం చేసిన పనులు దాని నుంచి అందుకున్న ఫలితాలు, అవి మంచా చెడా అని వేసుకున్న ప్రశ్నలు, ఆ ప్రశ్నలనుంచి ఉదయించిన సమాధానాలు మొదలైనవన్నీ మననం చేసుకొని నవ దశాబ్దికి స్వాగతమాలల ఆహ్వానించేముందు...

2009.. ఈ సంవత్స్రరం ప్రపంచానికి ఏమి ఇచ్చిందో నాకనవసరం. సమాజానికి ఏమిచ్చిందో కూడా నాకనవసరం. మరీ ఇంత స్వార్థమా అంటే, అవును. ఈ రోజు పూర్తిగా నా వ్యక్తిగత విశ్లేషణకు మాత్రమే. కాబట్టి

గడుస్తున్న సంవత్సరానికి చివరి పుట ఈ రోజు. మూడు వందల అరవై నాలుగు రోజుల ఉత్థాన పతనాలను ఈ ఒక్కరోజులో నిక్షిప్తం చేద్దామని చిరు ప్రయత్నం. వ్యక్తిగతం, సాంసారికం, ఉద్యోగం ఈ మూడు పార్శ్వాలున్న జీవితంలో మొదటిగా

ఉద్యోగం : ఇక్కడ సమ్మిళిత స్పందనలనే చెప్పుకోవాలి. ఆర్థికమాంద్యానికి అతలాకుతలమైన నగరాల్లో న్యూయార్క్ ఒకటి. కారణం ఈ సారి ఆర్థికమాంద్యానికి మూలం ఫైనాన్స్ కంపెనీలు. ఫైనాన్స్ మునిగిందంటే దానితో ముడిపడి వున్న ప్రతిదీ మునిగి పోతుంది. మా కంపెనీ అందులో ఒకటి. నేను చేరిన సమయానికి 38-40 మంది వున్న స్టాఫ్ 2008 లో 8౦ దగ్గరకు చేరి, 2009 అక్టోబఋ నాటికి 28 దగ్గర ఆగింది. మూడంచలుగా సాగిన ఈ లేఆఫ్ సునామీ ని తట్టుకొని కొంతలో కొంత బోనస్ చేజిక్కించుకోవడం ఆనందం. అలాగే నా ఇండియా ట్రిప్ సెలవులను [ ౩ వారాలు ] పెద్దమనసుతో పట్టించుకోక పోవడమూ ఆర్థికంగా కొంచెం వుపయోగ పడింది.ఇక పని విషయానికి వస్తే నవంబరు, డిసెంబరు అంత పని నేను ఉద్యోగంలో చేరినప్పటి నుండి కూడా చేసి వుండనేమో ;).

సాంసారికం : ఇది పోయిన సంవత్స్రరంలాగే ఏ ఒడిదుడుకులు లేకుండా చాలా ప్రశాంతంగా సాగింది. కానీ పనులు కూడా కొంచెం ఎక్కువయ్యాయనే చెప్పాలి.అర్థాంగి ఇంటిని నడిపిన తీరు కూడా శ్లాఘనీయం. దరిదాపు నెలరోజులు ఒక్కటి నెట్టుకొచ్చింది [ డ్రైవింగ్ కూడా రాకుండా]. అలాగే ఈ సంవత్సరం రకరకాల వంటలకు ప్రయోగశలగా నన్ను మార్చేసింది ;). దానితో సన్న తాటి మొద్దు లాగా వున్నోడిని పిప్పళ్ళ బస్తాలా తయారయ్యాను.

వ్యక్తిగతం : ఇక ఈ హృదయ స్పందనల చిరు సవ్వడి నా అంతరంగం. ఇది నాలోకం. ఈ లోకంలో విహరించేటప్పుడు నాకు నేనే.. సంసారమున్న సన్యాసిని. ఆనందం ఆస్వాదిస్తూ వ్రాసిన కవితలెన్నో. అంతరంగంలో గూడుకట్టుకున్న గువ్వపిల్లల కబుర్లని అక్షర రూపం ఇవ్వడానికి నేను ఎంచుకున్న మార్గం ఇది. ఈ బ్లాగు ద్వారా ఎన్నో స్నేహాలు. మరెన్నో గుండె లయలు. అలాగే మరెన్నో చర్చలు.

దీనికి తోడు హారం డెవలప్ మెంట్ నాకు ఎనలేని ఆత్మ సంతృప్తినిచ్చింది. మొదట సరదాగా మొదలెట్టి రకరకాల విన్యాసాలు చేసి ఓ తెలుగు సంకలని గా తీర్చి దిద్దడంలో నున్న కృషి బయటకు కనిపించక పోవచ్చు. దీని డెవలప్ మెంట్ లో భాగంగా ప్రియంగా నిద్రలేని రాత్రులు గడిపిన రోజులున్నాయి. తొలిదశలో క్రాలర్, పార్సర్ వ్రాస్తున్న రోజుల్లో. అలాగే సంధుల కోసం ఓ ఇంజన్ ను వ్రాస్తున్న రోజుల్లో కూడా చాలా సందేహాలు. గూగుల్ లో దీని మీద ఉన్న విజ్ఙానం తక్కువ. ఒక చిరు ఉపకరణిగా మొదలైన హారం ఈ సంక్రాంతి కి ఒక సంవత్స్రరం పూర్తిచేసుకుంటుంది. ఈ రోజుకు దినికి వచ్చిన హిట్లు ఐదున్నరలక్షలు.

ఇక పై రెండు పనులతో బందీనైపోయిన నాకు సహజంగానే కాల నియంత్రణ కష్టమైపోయింది. దాంతో ఆఫీస్ లో వర్క్ మీద శ్రద్ధ తగ్గింది. ఇంటి పనుల మీద శ్రద్ధ తగ్గింది. దీనికి తోడు వేరే బ్లాగులు చదవడలంలో వెచ్చిస్తున్న సమయం, కామెంట్ల సమయం ఇవన్నీ కలిసి కట్టుగా నా సమయాన్ని హరించి వేసాయి.

ఇక 2010 లో నాకంటూ ఏవో నిర్ణయాలు తీసుకొని ఆచరణలో పెట్టలేక కుళ్ళిపోవడం ఇష్టం లేదు కనుక ఏవో ఓ రెండు

౧) నో స్మోకింగ్ బోర్డ్ [ ఇది చదివిన వాళ్ళు నవ్వకండి ;)... ఏదో అలా ఇప్పటికి ఐదో రోజు పదో సారి నిర్విఘ్నంగా చేస్తున్నాను ]
౨) నా బ్లాగులో రేపటినుంచి కామెంట్లు వుండవు. అలాగే నా కామెంట్లూ వుండక పోవచ్చు.


ఇవి నేనూ పదిమందితో పబ్లిక్ లో పంచుకోవాలనుకున్నవి. మిగిలినవన్నీ నా 2009 డైరీ పేజీలకు మాత్రమే ... :)

16 కామెంట్‌లు:

  1. మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    "నా బ్లాగులో రేపటినుంచి కామెంట్లు వుండవు"..మీ వ్యాఖ్యల పెట్టె మూసేస్తున్నారా!!

    రిప్లయితొలగించండి
  2. సిరిసిరిమువ్వగారూ,
    మీకు మీకుటుంబానికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    అవునండీ వ్యాఖ్యల పెట్టెను ఛూం..మంత్రం అని మాయ చేస్తాను.

    రిప్లయితొలగించండి
  3. ౨) నా బ్లాగులో రేపటినుంచి కామెంట్లు వుండవు. అలాగే నా కామెంట్లూ వుండక పోవచ్చు.

    అదేమిటీ , నేను కష్టపడి ఈ కామెంట్లు పెట్టడానికి ఒక సులువైన మార్గం కనుక్కోని మరీ వస్తే.....నేనొప్పుకోను. తీవ్రంగా ఖండిస్తున్నాను. (దేనిని ఖండిస్తున్నానో తెలియదు. ఆలోచించుకొని మళ్ళీ వచ్చి చెప్తాను.)

    రిప్లయితొలగించండి
  4. చాల బాగా విశ్లేషణ ..ఆత్మా విమర్శ ...బాగుందండీ .మంచి నిర్ణయం .మరి మాకు మీ టపాచదివాకా ఏమైనా విమర్శించాలి లేక పొగడాలి అనిపిస్తే ఎలా ?

    రిప్లయితొలగించండి
  5. మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు..
    చిన్నబోతుంది మీ కమెంట్స్ లేకపోతే...అంతా ఉత్తుత్తునే అనేయండీ, హాయిగా నవ్వేసుకుందాం!:)

    రిప్లయితొలగించండి
  6. భా.రా.రె.గారూ !
    వ్యాఖ్యలు మూసివేయడం వలన లాభమేమిటో అనుభవజ్ఞులు మీకే తెలియాలి. కానీ దాని వలన మన మధ్య ఉండే ముఖ్యమైన సమాచార బంధం తెగిపోతుందేమోనని నా అభిప్రాయం. మరోసారి ఆలోచిస్తారు కదూ !
    May your New Year ( 2010 ) be full of Happiness and Sunshine

    SRRao
    sirakadambam

    రిప్లయితొలగించండి
  7. కల్పన గారూ మీకు మీకుటుంబానికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.
    అయ్యో మీకష్టానికి ఫలితంగా చాలా బ్లాగులున్నాయండి.
    >>తీవ్రంగా ఖండిస్తున్నాను. (దేనిని ఖండిస్తున్నానో తెలియదు. ఆలోచించుకొని మళ్ళీ వచ్చి చెప్తాను.)

    నన్ను మాత్రం ఖండించకండి ;)

    రిప్లయితొలగించండి
  8. @చిన్ని
    మీకు మీకుటుంబానికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.
    ఇలాంటి డౌటు వచ్చినందుకు అర్జెంటుగా మీ పీక పిసికేస్తా చిన్ని :) మీకు ఏమైనా వ్రాయాలనిపిస్తే మీ బ్లాగులో వ్రాయండి. చదివి కామ్ గా వెళ్ళిపోతాను :)


    @పద్మార్పిత
    మీకు మీకుటుంబానికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇదెక్కడి ఘోరమండి, కనీసం మొదలు పెట్టకుండానే ఉత్తిత్తిగానేఅని నన్ను కే.సి.ఆర్ ను చేయదలచుకున్నారా?;)

    రిప్లయితొలగించండి
  9. రావు గారూ
    ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక కామెంట్లు మూసివేస్తే సగం కాలం కలిసి వస్తుందండి. కమ్యునికేషన్ కు మైల్ ఐడి వుంచుతాను. మన రచనలు చదివి , నచ్చి మైల్ పంపేవారు బహు తక్కువ గా వుంటారని నమ్మకం.

    రిప్లయితొలగించండి
  10. అన్యాయం కొత్త సమచ్చారంలో నా పీక నోక్కేస్తార ...మేం ఏం పాపం చేసాం ..ఏదో అమాయకంగా అడిగాం ..

    రిప్లయితొలగించండి
  11. మీకు , మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు .

    రిప్లయితొలగించండి
  12. హమ్మయ్య, రోజులో నాకొక పది నిమిషాలు మిగల్చనున్నారన్నమాట. ఎంత మంచివారు మీరు భా.రా.రె. :) మంచి నిర్ణయమా కాదా అన్నది కాలం మీకు తెలుపుతుంది, మీరు మాకు తెలుపండి. రేపుదాకా టైం వుంది కదా మరి నా బ్లాగులో కామెంటండి సార్. కొంపదీసి తూచ్ తూచ్ తాగింది దిగిపోయింది, నేనన్నది మరిచిపోండి అనకండేం? ;) ఇంకా మరేమో, నాతో వాటర్ ఏరోబిక్స్ చేసే ఒకమ్మాయి నేను ఆరేళ్ళలో ఇది తొమ్మిదోసారి మానటం/క్విట్ చేయటం అని చెప్పిన విషయమే మీ మొదటి నిర్ణయం. మీ రెండో నిర్ణయం నా మొదటి నిర్ణయం గా మారిస్తే ఎలా వుంటదంటారు? :)

    రిప్లయితొలగించండి
  13. చిన్నీ అన్నాలం అసెత్తం అంటున్నారు వరంగల్ బ్యాంకు పుటో చూసారా ఏమిటి? ;)

    మాలా కుమార్ గారూ మీకు మీకుటుంబానికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు

    ఉష గారండీ, మీకో పదినిమిషాలు మిగిలిచ్చానంటే నాకూ పదినిమిషాలు మిగిలినట్టే కదా ;). ఓ పది మందికి పది నిమిషాలు మిగిలించానంటే నాకు వంద నిమిషాలు మిగిలినట్టు లెక్క..ఏమంటారు ?
    ఇక ఆ మొదటి నిర్ణయమైతే ఘాఠ్టిగా అనేసుకున్నా, మళ్ళీ మరిచిపోయేదాకా.

    రిప్లయితొలగించండి
  14. బాగుంది. స్మోకింగు మానెయ్యొచ్చు. ఏం పర్లేదు, పట్టు విడవకండి.

    రిప్లయితొలగించండి
  15. @ Mahesh, Thank you.

    @Kottapali, Thanks for your support.

    By reformed lights, the “prior action of God” gives me the determination. This being the case, every moment of creation occurs inevitably as God foreknew it would when he set things in motion by creating the man.

    రిప్లయితొలగించండి

Comment Form