ఎదుట అంతా చీకటి
నిశ్శబ్ద బాహువుల్లో నిదురించే ప్రకృతి
కలతగొన్న మనసులు
అశరీరుని ఒడిలో ఒదిగి వున్నాయ్.
జిగేల్ మన్న చీకటి పురుగులు
నిప్పురవ్వలు పుక్కిలుస్తున్నాయ్
ఎదురుగ ఎదలో అలసిన అబలలు
ఉవ్వెత్తున ఎగసిన భోగిమంటలు
కాలుతున్న కార్చిచ్చు చుట్టూరా
పురివిప్పి నర్తించే మదోన్మత్తులు
వికృతంగా విలాసంగా
వికట్టాట్టహాస నరాధములు.
కింకరుల భీకర గానానికి
కరాళ నృత్య తాండవానికి
చెల్లా చెదురైన పాల పిట్టలు
ఎంతకాలం ఈ కేకలు
ఎంతకాలం ఈ నాట్యం
రేగిన నిప్పు కాల్చి కాల్చి
తనను కాల్చే దాకానా?
అరిచిన అరుపులు
ప్రతిధ్వనుల నినాదమై
నాదశ్వరుడు కన్ను తెరచి
నిజ నాట్యం చేసే దాకానా?
ఎంత కాలం ఈ మిణుకులు?
మరెంతకాలం ఈ చెదలు?
ఉత్పాత తాకిడికి
ఉన్మాదం కరిగే దాకానా?
చిరు కాంతి కాంతిపుంజమై
కళ్ళలోకి దూసుకుపోయేదాకానా?
మనస్సాక్షి ఎదురు తిరిగి
మనిషిని కాల్చుకు తినేదాకానా?
ఖగేశ్వర కరముల
తమ ప్రాణాలు కోల్పోయే దాకానా?
మున్నీటి అగ్ని మస్తిష్కాలను కాల్చి
జీవుని విశ్వంభరలో లీనం చేసే దాకానా?
జిగేల్ మన్న చీకటి పురుగులు
నిప్పురవ్వలు పుక్కిలుస్తున్నాయ్
నిప్పురవ్వల గానుగలో
తమ జీవితం కాలుతుంది.
భాస్కర్ రామి రెడ్డి గారూ,
రిప్లయితొలగించండికవిత్వం రుచి అంతగా తెలియని నా లాంటి వారికి కూడా మీ కవితల్లోని సౌందర్యం స్పష్టంగా గోచరమవుతోంది. లోతైన భావాలతో, అనుభూతి చెందుతూ రాసే మీ అందమైన కవిత్వం కేవలం మీ బ్లాగుకే పరిమితమై పోవడానికి నేనొప్పుకోను.పత్రికల ద్వారా మరింత ప్రాచుర్యం పొందాల్సిందే!
భా.రా.రే.
రిప్లయితొలగించండిమీ అమృతం కురిసిన రాత్రి బాగా నచ్చింది. మీకు చెప్పానుకదా మీ దాంట్లో నేను కామెంట్ పెట్టలేకపోతున్నాను. పాప్ అప్ విండో వచ్చిన దాంట్లో కామెంట్ పెట్టగలుగుతున్నానుకాని, ఇలా టపా కిందనే కామెంట్ బాక్స్ వుంటే అందులో మాత్రం నేను కామెంట్ పెడుతున్నది తీసుకోవటం లేదు. ఆఫ్ కోర్స్ , ఇది నా సమస్య అనుకోండి.
ఇక ఈ కవిత విషయానికి వస్తే, శబ్దాలు భావాన్ని మింగేసాయి అనిపించింది. సారీ ఇలా చెప్తున్నందుకు. ఒక భావావేశం లో రాసినట్లు వున్నారు. నాదశ్వరుడు కరెక్టేనంటారా? నాకెందుకో అనుమానం వచ్చింది.
సుజాత సలహానే నాది కూడా. ఈ సలహా మీకే కాదు నేను మన రాధిక కి, ఉష కి కూడా ఇచ్చాను. పత్రికల్లో వస్తేనే కవిత్వం అని కాదు. ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతారని. అంతే.
కల్పనారెంటాల
చెప్పడం అదే రాయడం మర్చిపోయాను. టైటిల్ నచ్చలే. వాక్యం లా లేదా? మారేదైనా ఆలోచించకూడదూ!
రిప్లయితొలగించండిసుజాత గారూ మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు. ఏదో ఆ నిమిషంలో అలా వచ్చేస్తుందండి. మళ్ళీ కాసేపాగి వ్రాయమన్నా నాకు చేతకాదు. పత్రికా స్థాయిలో వ్రాయాలంటే నా స్వాతంత్ర్యం కోల్పోతానేమో కదా. ఇంతవరకూ అలాంటి ఆలోచన రాలేదండి. కల్పన గారన్నట్టు ఎక్కువమంది పాఠకులకు రీచ్ అవుతుంది కానీ.... ఏదో సాకు చెప్పాలని చూస్తున్నా కానీ ఏమీ గుర్తు రావటం లేదు :-)
రిప్లయితొలగించండికల్పన గారూ అమృతం కురిసిన రాత్రి నచ్చినందుకు ధన్యవాదాలు. కామెంట్ బాక్స్ పాపప్ విండో గా ఓపెన్ అయేట్టు ఓ రెండు రోజుల్లో మారుస్తాను.
రిప్లయితొలగించండిఇక కవిత మీద మీ సద్విమర్శ కు కృతజ్ఙుడిని. ఇలాంటి విమర్శ చేస్తూ సారీ ఎందుకండి? అవును మీరన్నట్టు భావావేశం లోనే వ్రాసాను. అసలు ఎడిటింగ్ లేదు. మనసులో ఏది తోస్తే అది వ్రాసేసాను. బహుశా ఆ కారణం వల్ల చాలా లోపాలు వుండవచ్చు.ఆ సమయానికి గుర్తుకొచ్చిన పదాలు అవి. నాదశ్వరుడు తప్పా , రైటా అని కూడా తెలియదు. నేననుకున్నది మాత్రం నాదం అంటే శబ్దానికి ప్రతీక గానూ, శ్వరుడు అంటే విశిష్టవ్యక్తి/దేవుని [ అధీశ్వరుడు, ఈశ్వరుడు, కవీశ్వరుడు ] గానూ అనే భావంతో వెలుగు చూసిన పదమది. ఈశ్వరుడు అని అనవచ్చు కదా అని అడగవచ్చు కానీ అక్కడ ఆ స్టాంజా లో శబ్దము ప్రధానమైనది. అందుకని ఓంకారుని గా ఆ పదము వచ్చింది. వ్రాసేసాను. తప్పో , రైటో నాకు తెలియదు.
హ్మ్..ఇక కవితకు అసలు పేరు గురించి ఆలోచనే లేదండీ. ఏదో చివరి పాదం తీసి అక్కడ టైపు చేసాను :). మీ వ్యాఖ్య చూసిన తరువాత గానీ నిజమే కదా, అది వాక్యమే కదా అనిపించింది.
పత్రికల గురించి ఆలోచించ గానే ఆఫీస్ పని గుర్తుకొచ్చింది. ఇంక నేనేం వ్రాయగలను చెప్పండి?
ఇంతకీ కవిత కు ఏంపేరు పెడదామంటారు?
భా.రా.రె. నిశ్శబ్దం లోనే హుందా వుంది. అందులో అబలత వుందేమో కానీ అనూహ్యమైన ప్రభంజనమూ దాగుంది. కరాళనృత్యాల, వికృతధ్వనులని అణిచే శక్తి వుంది. అమానుషాన్ని ప్రశ్నించే ఆత్మ వుంది. మనస్సాక్షిని మేల్కొలిపే మానవత్వం వుంది. నిద్రాణమైన నిజాయితీని జాగృతపరిచే జీవముంది. మీ కవితకి ప్రేరణ ఎరిగినదాన్ని కనుక రాగల పరిణామాన్ని వూహిస్తున్నాను. బాగా మనసుకి తాకేలా వ్రాసారు. నెనర్లు.
రిప్లయితొలగించండిప్రతి పంక్తి మీలోని భావాల స్మూర్తి...
రిప్లయితొలగించండిIts really great...చాలాబాగుంది!
చాలా బాగారాసారండి.
రిప్లయితొలగించండి"కరాళ నృత్య తాండవానికి
రిప్లయితొలగించండిచెల్లా చెదురైన పాల పిట్టలు"
చాలా బాగా చెప్పారు .
Baagundi!
రిప్లయితొలగించండిహ్మ్.. నిప్పు రగిల్చినప్పుడు
రిప్లయితొలగించండికాలక తప్పదు మరి..
ఆలోచన సక్రమం కానిదెప్పుడూ
పతనం తప్పదు..
తను పేర్చిన కాష్టాని కి
తనే బలవ్వక తప్పదు...
మంచి కెప్పుడూ రెండో పక్క వుంటుంది మరి
వుంటుందని మంచి వెనుకంజ వేయదు...
చెడు అయ్యో మంచే అని ఆలోచించదు...
తప్పదు గా మరి పోరాటం
చరిత్ర చెప్పిన అంతిమ విజయం
అందాక ఉష అన్నట్లు మౌనమే భూషణం
అది చేతకాని తనమని
మనదే విజయమని మురిసే
మనసుల తాత్కాలిక విజయం.
ఉష, నిశ్శబ్దం నుంచి మహోన్నత శక్తి పుడుతుందని ఆ శక్తి కంటికి కనిపించదని భలే చెప్పావు. కవిత మనసుకు తాకినందుకు నెనరులు
రిప్లయితొలగించండిపద్మార్పితా ధ్యన్యవాదాలు
శృజన నచ్చినందుకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిచిన్నీ నిజంకాదంటారా :-)
సునీత నచ్చినందుకు ధన్యవాదాలు.
నేను ఏమీ కామెంట్ చెయ్యలేను. పూర్తిగా అర్ధం చేసుకోలేక పోయాను. క్షమించాలి. కాని సమాజంలోనో లేక అంతరాత్మతోనో జరిగే తప్పుని విభేదించినట్టు. ఇంకెంతకాలమని ప్రశ్నించినట్టు అనిపించింది. పదాల ఒరవడి బాగుంది. పాత కాలం నాటి భావావేశం వున్న కవితల ఛాయలు కనపడ్డాయి.
రిప్లయితొలగించండికల్పన, మీ కామెంట్ లో నా పేరు ఇప్పుడే చూసాను, మీ "మన" ప్రయోగం దగ్గర కాస్త మైమరచాను. పత్రికలకి వ్రాయాలంటే వారి స్టాండర్డ్స్ కి సరిపడగా, అంచనాలకి అనుగుణంగా ఇలా కాస్త స్వేఛ్ఛని బంధించాలి కదా. అదొక సంశయం + మనకంత సీన్ లేదన్న సందేహం. :)
రిప్లయితొలగించండిభావనా,చాలా బాగుంది. నిన్న రిప్లై ఇవ్వడానికి ఆలస్యమైపోయింది.
రిప్లయితొలగించండిఉత్థాన పతనాలు
ఆరోహణవరోహణాలు
మంచి చెడూ
మనుషులకు మాత్రమే.
శివగారూ, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు. మీకు బాగానే అర్థం అయింది. ఇది సమాజంలో లేక అంతరాత్మలోనో జరిగే తప్పుని గురించి వ్రాసింది. అలాగే ఇంకెంతకాలమని కూడా ప్రశ్నించాను.
రిప్లయితొలగించండి>>పాత కాలం నాటి భావావేశం వున్న కవితల ఛాయలు కనపడ్డాయి.
అవును మరి ;)
మనం సదివింది పదో తరగతి తెలుగు పుస్తకాలు. అప్పట్లో అంటే లేట్ 80's లో మా తెలుగు పుస్తకాల్లో ఇలాంటి పదాలే వుండేవి :)
ఓకే ఉషా, మీరు కల్పన గారూ చూసుకోండిక. మధ్యలో నాకెందుకొచ్చిన గొడవ :)
రిప్లయితొలగించండికల్పన రెంటాల గారి నుంచి ఇ-మెయిల్ ద్వారా అందుకున్న వ్యాఖ్య. నా బ్లాగులో తనకు కామెంట్ చేయడం కష్టంగా వున్నదని చాలా సార్లు చెప్పారు. ఇకనైనా బద్దకాన్ని వదిలి కామెంట్ విండోను మారుస్తాను.
రిప్లయితొలగించండి**************
ఉషా, “ మన “ నిజంగా ఫీల్ అయ్యే రాశాను. మనమంతా కవులం లేదా ‘కపులం’.
పత్రికలకు వేరే స్టాండర్డ్స్ ఏమీ లేవు ప్రత్యేకంగా . ఇప్పుడు మీరు రాస్తున్నవి ఇక్కడ పది మందికి నచ్చుతున్నాయి కదా. అక్కడ కూడా నచ్చుతుంది. తప్పక రాయాలి. వంగూరి వారి పోటీలకు మీరు, రాధిక,భా.రా.రే..ఇంకా ఇక్కడ ఎవరెవరు కవులు వున్నారో వారంతా (నువ్వు నాకు నచ్చావు...లో డైలాగ్ తరహాలో) తప్పకుండా మంచి కవితలు రాసి పంపండి. అలాగే పత్రికలకు కూడా. మీకు ఏమైనా ఈ విషయంలో ఎవరికి పంపాలి లాంటి సందేహాలు వుంటే నాకు తెలిసిన విషయాలు నేను చెప్పగలను.
భా.రా.రే. మీ కవితా కదా మీరు ఆలోచిస్తారు లే అని నేను నా మెదడు ని హేపీగా నిద్రపుచ్చేశాను. ఏమైనా అవుడియాలో, వడియాలో తడితే వచ్చి ఇక్కడ చెప్తానులే...
ఉత్పాత తాకిడికి
రిప్లయితొలగించండిఉన్మాదం కరిగే దాకానా?
చిరు కాంతి కాంతిపుంజమై
కళ్ళలోకి దూసుకుపోయేదాకానా?
మనస్సాక్షి ఎదురు తిరిగి
మనిషిని కాల్చుకు తినేదాకానా?
ఉత్పాత తాకిడికి
రిప్లయితొలగించండిఉన్మాదం కరిగే దాకానా?
చిరు కాంతి కాంతిపుంజమై
కళ్ళలోకి దూసుకుపోయేదాకానా?
మనస్సాక్షి ఎదురు తిరిగి
మనిషిని కాల్చుకు తినేదాకానా?
ఉత్పాత తాకిడికి
రిప్లయితొలగించండిఉన్మాదం కరిగే దాకానా?
చిరు కాంతి కాంతిపుంజమై
కళ్ళలోకి దూసుకుపోయేదాకానా?
మనస్సాక్షి ఎదురు తిరిగి
మనిషిని కాల్చుకు తినేదాకానా?
నమస్కారం.పై వాక్యల్లోని మీ "ఎగసిన జీవితం" చదవగానే వాటినే నెమరువేసుకుంటూ వుండిపోయాను. బాధగా అనిపించింది.కదిలించింది.మాటల్లో రాయలేను.
రిప్లయితొలగించండినా అభినందనలు.(అనూరాధ)
చాలా బాగుంది అన్నా.
రిప్లయితొలగించండిఅనూరాధ గారూ, నా కవిత మిమ్మల్ని బాధపెట్టేంతగా నచ్చినందుకు ధన్యవాదాలండి. కానీ మనిషి మనిషికో జీవితం ఆ మనిషి మదిలో ఓ ప్రపంచం కదా... అలాగే వుంటుంది సమాజం.
రిప్లయితొలగించండిచౌడారెడ్డి... నాకు చాలా ఆశ్చర్యంగా వుంది. నీకు నా బ్లాగెలా తెలిసింది? ఊరికి వెళ్ళి వచ్చావా ఈ మధ్య ఏమైనా?
Haaram lo chusanu anna mee blog ee roju. chala bagunnayi mee kavithalu. I will follow now onwards..:) India next month velluthunnanu Anna..!
రిప్లయితొలగించండి