31, డిసెంబర్ 2009, గురువారం
అంతర్ముఖం
కాలం కళ్ళముందు పరిగెడుతుంది
నిన్న, నేడు, రేపు, రూపుమాస్తున్నాయి
నువ్వు, నేనూ, తనూ, అస్థిరత్వ ప్రతీకలం
ఇవి మనిషి చేసే అంక గణాంకాలు
అతనికి మాత్రమే కొలమానాలు.
కాలం మారదు... మనిషీ మారడు
మనసు నిలువదు...మమతా అంతే
గుండె చప్పుడుల పర్వాలవి
రెప్ప రెప్పకీ మారుతుంటాయి
పరోక్షంలో విపక్షం ... సమక్షంలో స్వపక్షం
మనిషి మనిషికీ ఓ రంగు
కళ్ళముందు మరో రంగు
సభ్య సమాజంలో ఓగానం
అంతర్ముఖంలో మరోగానం
మభ్య పెట్టుకొనే మనిషే
పదుగురిలో పెద్దమనిషి
రంగు వొలికినా
గానం గతి తప్పినా
జరుగుతుంది ఓ హత్య
లేదంటే మరో ఆత్మహత్య
అస్థిరమైన కాలం
క్షణమైనా నిలువని మనసు
అవిశ్రాంత భువనంలో
రెప్పపాటు జీవితం
వల్లకాట్లో శరీరం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
బాగా రాశారు
రిప్లయితొలగించండినిజానికి కాలం ఉప్పెనల్లే ముంచేస్తుంది.
రిప్లయితొలగించండిజీవితాన్ని చిటికెలో గతపుగదిలోకి తోసేస్తుంది.
నిన్నా మొన్నా నావనుకున్నా, అచ్చంగా నేడు నాదనుకున్నట్లే.
రేపూ నాది కాదని నాకు తెలిసే లోపే ముగిసిపోతా.
ప్రశ్నలు మదిలోకి, పయనాలు ఎదలోకి
గాయాలు మనసుకి, గమనాలు బతుక్కీ
ఎవరు జొప్పించారో వెదుకులాడుతూ సరిపెడతా.
అన్నిటా నాకు వూపిరిపోసే ప్రేమ కోసం మాత్రం తపిస్తా.
నమ్మకం ఎదుటివారి లోనూ, విశ్వాసం నా ఆత్మలోనూ దర్శిస్తా....
నూతన సంవత్సర శుభాకాంక్షలు నేస్తం
చాలా బావుంది. కృష్ణశాస్త్రి గారు అన్నట్టు
రిప్లయితొలగించండిఆనందమూ నిస్పౄహా అన్నవి
అసలేమీ ఎరుగని జడుడు,
ఏడవలేడు కన్నీరోడవలేడు,
ఆశపడలేడు ,ఆహ్లాదపడలేడు.
అందుకే ఆశే వూపిరిగా..
స్నేహమే ఆలంబనగా..
మనకై తపించే మనిషి కోసం..
కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదాం మనసారా.
నూతన సంవత్సర శుభాకాంక్షలతో(anooradha)
నూతన సంవత్సర శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండివెంకట రమణ గారూ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిఊషగారూ మీ కవిత బాగుంది అని వేరే చెప్పాలా?
అనూగారూ, కవితలో మనిషిని ఆవిష్కరించారు. ధన్యవాదాలు
సునీత గారూ మీకూ మీ కుటుంబానికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.